క్రైస్తవులు మద్యం త్రగవచ్చా?
Can Christians drink alcohol Telugu
ప్రశ్న: ప్రియ సహోదరుడా! ఈ మధ్య క్రైస్తవులలోని ఒక శాఖవారు – మద్యము (సారాయి) తాగవచ్చు అని బోధిస్తున్నారు. తాగుబోతులు కావద్దు అని బైబిలులో రాయబడింది గాని, తాగవద్దు అని లేదుగదా! అంటున్నారు. పార్టీలు చేసుకుంటున్నప్పుడు స్నేహితులతో కలసి “కొంచెం” పుచ్చుకుంటే అది పెద్ద తప్పేమి కాదు అని సమర్థిస్తున్నారు. వారు అంటున్నట్లు మనం అలా చెయ్యొచ్చా?
జవాబు : మత్తు ఎక్కేంత వరకు మాత్రమే మద్యం సేవించడం తప్పు అని, మత్తు ఎక్కక ముందు ఎంతైనా తాగవచ్చు అని ఎక్కడుంది? మద్యము గురించి బైబిలు ఏం చెబుతుందో చూద్దాం రండి! సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో – ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు అని రాయబడివున్నది. ఇంకా సామెతలు 23:31, 32లో – ద్రాక్షారసము (మద్యము) మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును. కట్లపాము వలె కాటువేయును అంటూ లేఖనం తేటపరుస్తోంది.
పై లేఖన భాగము గమనించారా? “త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము” అంటూ వాక్యం చెబుతోంది. దాని వైపే చూడొద్దట. “పిమ్మట” అంటూ అదే భాగంలో మనకు ఓ పదం కనబడుతోంది. పిమ్మట అంటే, దేని పిమ్మట? దానివైపు చూచిన పిమ్మట. ఇంకా వివరంగా చెప్పాలంటే – దానిని తాగిన పిమ్మట అని అర్థం. కొంచెం త్రాగిన పిమ్మటా?… మత్తు వచ్చిన పిమ్మటా? అని అక్కడ రాసిలేదని గమనించండి. Can Christians drink alcohol Telugu
కొన్ని దేశాలలో నియమిత భోజనంతోపాటు ద్రాక్షారసము వడ్డించుట వాస్తవమే. అయితే అది చివరకు ఎక్కడికి నడిపించినదో మనము యెరుగుదుము. అనేక సందర్భాలలో ఏదో “కొంచెమేగా” అంటూ “అడపాదడపా” పుచ్చుకున్నదే అంతులేని వ్యసనంగాను, దురలవాటుగాను మారిపోయిన సంఘటనలున్నాయి.
ప్రమాదకరమైన ప్రారంభములతో బహు జాగ్రత్తగా యుండాలి! మొదట అది కేవలం “నడుచుట” గా ఉంటుంది. తరువాత అది “నిలుచుట”గా యుంటుంది. ఆ తరువాత అంతంలో “కూర్చుండుట”గా మారిపోతుంది. కీర్తన 1:1 ఈ విషయంను గూర్చి చెబుతోంది.
నాకు ఈ బీరు బ్రాంది అలవాటు లేదురా, నేను తాగనురా అంటూ ఒకడు స్నేహితున్ని బతిమాలుతున్నాట్ట. అతడు ఇతణ్ణి బహు బలవంతం చేస్తున్నాడు. కొంచెం, కొంచెం అంటూ వానిని ఒప్పింప జేస్తున్నాడు. సరే, ఇది నీకు తాగడం అలవాటు లేదుగదా! నీకొక ప్లాన్ చెబుతా. థమ్స్ అప్ నీవు తాగుతావు కదా! అందులో కొంచెం పోసుకుని తాగు
[quick_download_button title=”Download” color_bg=”#EE340C” open_new_window=”true” wait=60 msg=”Please wait 60 seconds” url_external=”https://biblesamacharam.com/wp-content/uploads/2024/05/క్రైస్తవులు-మద్యం-త్రగవచ్చా.pdf”]
అన్నాడు. ఈ ఐడియా బావుందే అనుకున్నాడు. అలాగే చేసాడు. తర్వాత అలా… అలా త్రాగడం అలవాటైంది. ఆ తర్వాత నేరుగా బీరును ఎత్తి తాగడం నేర్చుకున్నాడు. ఆ విధంగా త్రాగుబోతు అయ్యాడు. త్రాగడం నేర్పినవాని కంటే ఎక్కువ త్రాగుబోతు అయ్యాడు. థమ్స్ అప్ త్రాగే అలవాటు ఉన్నవాడు అందులో కొంచెం మద్యం కలుపుకున్నాడు. అలా మద్యం కలుపుకున్నవాడు త్రాగేసాడు. ఆ విధంగా త్రాగినవాడు కొంచెం ముందుకెళ్లి నేరుగా ఏమి కలుపకుండానే త్రాగగలిగాడు. ఇంకొంచెం ముందుకువెళ్ళి త్రాగుబోతు అయ్యాడు. తృప్తిలేని పాపము ఒకదానికి ఒకటి ఎలా కూర్చుకున్నదో గ్రహించారా? అడవిని అంటుకున్న అగ్నికి తృప్తి వుండదు. అలాగే పాపానికీ తృప్తి ఉండదు. Can Christians drink alcohol Telugu
తాగవచ్చు కాని మత్తు ఎక్కేంతవరకు తాగొద్దు అని ఎవరు అన్నారు? ఇది సైతాను ఉచ్చు. మోసంతో కూడిన ఆలోచన యిది! పడగొట్టడానికి పక్కా ప్లాన్!
అపొస్తలుడు ఏం చెప్పాడో వినండి అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, నేను దేనిచేతను లోపరచబడనొల్లను; అన్ని విషయములయందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు (1కొరింథీ. 6:12, 10:23). Can Christians drink alcohol Telugu
త్రాగొచ్చుగాని త్రాగుబోతు కావద్దు అని అంటున్నాడంటే దొంగతనములు చెయ్యొచ్చుగాని గజదొంగలం కావద్దు అని అంటున్నాడన్నమాట. దొరలాంటి వాడు వెంటనే గజదొంగ కాలేడు కదా! మొదట చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడితే గాని రాన్రాను ఆ గజదొంగ స్థాయికి చేరలేడు!
త్రాగేవాడు త్రాగుబోతు కావాలన్నా యిదే సూత్రం! ఇది సైతాను కుతంత్రం!!
ప్రసంగ శాస్త్రం కొరకు.. click here