పెళ్లికి ముందు sex తప్పా – Sex before marriage is wrong – Bible question And Answers Telugu

పెళ్లికి ముందు sex తప్పా?

Sex before marriage is wrong

 ప్రశ్న : నేను అతను కలిసి ఒకరినొకరం గత 3 సం.రాలుగా ప్రేమించుకుంటున్నాం. మొదట్లో అతని ప్రవర్తన బాగానే వుండేది. అతను క్రైస్తవుడు కాడు, కాని నాకోసం అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాడు. తనతో నాకున్న చనువును బట్టి పెళ్ళికి ముందే సెక్స్లో పాల్గొనాలని తొందర చేసేవాడు కాని దేవుని కృపను బట్టి ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఈమధ్య కాలంలో అతనిలో ఎంతో మార్పు వచ్చింది. నిన్నే పెళ్ళి చేసుకొంటాను, నువ్వు లేక బ్రతకలేను అని చెప్పే అతను… ఇప్పుడు మీ కులం వేరు, మా కులం వేరు, మన పెళ్ళికి మా పెద్దలు ఒప్పుకోరేమో? అయినా 5 లక్షలు కట్నం తీసుకొస్తే వారు ఒప్పుకోవచ్చు. వారు ఒప్పుకొన్నప్పటికీ చర్చిలో పెళ్ళికి ఒప్పుకోరు. మా ఆచార ప్రకారమే పెళ్ళి చేసుకోవాలి అని ఈ రీతిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగే రీసెంట్గా నేను తెలుసుకొన్న విషయమేమంటే అతనికి ఇప్పటికే అనేకమంది అమ్మాయిలతో పాపిష్టి సంబంధాలు వున్నాయని. ఇటువంటి పరిస్థితిలో మూడు సం.లు ప్రేమించాను గదా అని అతన్నే పెళ్ళి చేసుకోవాలా? లేక అతన్ని వదిలేయాలా? ఏం చేయాలో నాకు అర్ధం కావడం లేదు? 

జవాబు: ఏ దేవుని కృప అయితే నిన్ను వాడి చేతిలో అపవిత్రం కాకుండా కాపాడిందో అదే కృప ఆ తోడేలు చేతిలో బలి కాకుండా నిన్ను కాపాడిందని తెలియజేస్తూ నిన్ను ఆ మానవ మృగం చేతిలో పడకుండ రక్షించిన ఆ యేసయ్యకు నిండు వందనములు తెలియజేస్తున్నాను. Sex before marriage is wrong

మొదటిగా:- నువ్వు అనుకున్నావు అతడు నిన్ను ప్రేమిస్తున్నాడని. కాని, ఆ ప్రేమ అనే ముసుగులో నిన్ను మోహిస్తున్నాడనే సంగతి గ్రహించలేక పోయావు. పైకి అమర ప్రేమికుడిలా కనిపిస్తూనే అదును చూసి నిన్ను కాటేసే ఘట సర్పమని తెలుసుకోలేకపోయావు. వాడు మూడు సంవత్సరాలు నీతో తిరిగింది నిన్ను మనసారా ప్రేమించి పవిత్రమైన వివాహము చేసుకొని నిన్ను ఏదో ఉద్దరిద్దామని కాదు. ఎప్పుడు నువ్వు వాడి మాయ మాటలకు లొంగి, సర్వస్వం అప్పగిస్తావా! అని వాడు ఎంతో ఓపికతో మూడు సంవత్సరాలు ఎదురు చూసాడు. నిన్ను ఇంప్రెస్ చేయడానికి మందిరానికి కూడా రావడానికి వెనుకాడలేదు కాని నీ తల్లిదండ్రుల ప్రార్థనో లేక దేవునిపట్ల నీకున్న భయభక్తులనుబట్టి వాడి పన్నాగమునకు నువ్వు బలికాకుండా ఆ దేవుని కృప కాపాడింది. ఎప్పుడైతే నువ్వు వాడు పన్నిన వలలో చిక్కవని గ్రహించాడో తెలివిగా నేను మోసగాడిని కానూ… కాకపోతే మా కులం వేరు, మీ కులం వేరు, 5 లక్షల కట్నం అవసరం అవుతుంది. అయినా మా ఆచార ప్రకారమే పెళ్ళి కావాలి…. ఇన్ని కండిషన్స్ పెట్టడానికి గల కారణమేమంటే నిన్ను తెలివిగా వదిలించుకోడానికి, అలా వదిలించుకున్న తర్వాత ఇప్పటికే తన వలలో చిక్కిన ఆ అమ్మాయిలతో నిర్భయంగా తిరగవచ్చునని. Sex before marriage is wrong

 ప్రియ చెల్లీ! నువ్వు ధన్యురాలివి. వాడి మాయ మాటలకు లొంగి నిన్నునీవు ఆ మృగానికి అప్పగించుకొన్నట్లైతే ఈరోజు నీ జీవితం ఎంతో దుర్భర పరిస్థితిలో వుండేది. ప్రేమా దోమా అని చెప్పే మాయగాళ్ళ మాయ మాటలకు లొంగిపోయే వారికి నీ జీవితం ఓ కనువిప్పు కావాలి. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అనే నీ ప్రశ్నకు జవాబు: నిండు నూరేళ్ళు నీ బ్రతుకు బుగ్గిపాలు కాకుండా కాపాడిన దేవునికి నిండు వందనాలు చెల్లించు. ఇకమీదట ఆ మానవ మృగానికి నిన్ను కలవడానికి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా నీ చదువులో లేదా నీ ఉద్యోగములో ఎంత బిజీగా ఉండగలవో అంత బిజీగా వుండు. అలాగే ఆ తోడేలు కాకపోతే మరో తోడేలు తారసపడడం సహజం… మరొక తోడేలుకు చోటివ్వకుండా దేవుని చిత్త ప్రకారం వివాహము చేసుకొని దేవున్ని మహిమ పరిచే జీవితం జీవించమని మనవి చేస్తున్నాను. 

 ఇది చదువుతున్న ప్రియ సహోదరీ, సహోదరుడా! ఈరోజుల్లో స్కూల్లో, కాలేజీల్లో, ఉద్యోగాల్లో ఎక్కడ చూసినా ప్రేమా దోమా అంటూ తిరిగేవారిని మనం తరచుగా చూస్తున్నాము. కానీ ఒక అన్నగా నా సలహా! దయచేసి మీ చదువును, భవిష్యత్తును, తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను, దేవుని చిత్తాన్ని పణంగా పెట్టి కామ కలాపాలు సాగించడానికి నేటి యువత ఎన్నుకొంటున్న ఈ ప్రేమ మాయలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని నా రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నాను. Sex before marriage is wrong

ఎవడైనా నీకూడా పడుతున్నాడా..? 

ప్రియ చెల్లీ! ప్రేమంటూ, నిన్నే ప్రేమిస్తున్నానంటూ, నువ్వు లేకుండా బ్రతకలేనని ఎవడైనా వెంటపడుతున్నాడా? దయచేసి వాడి మాటలు నమ్మమాకు. వాడి ప్రేమకన్నా నీ భవిష్యత్తు, నీ ఆత్మీయత ఎంతో విలువైనది. నీ అంతేగాకుండా నీతో చనువుగా ఉన్నాడని, మంచివాడని, తొందర చేశాడని వివాహం కాకముందే ఎన్నటికీ నీ శరీరాన్ని పర పురుషుడు తాకడానికి అవకాశం ఇవ్వవద్దు. అది దేవుని దృష్టిలో బహు నీఛమైన పాపం. నీ వివాహం పవిత్రంగా ఉండాలి. నిన్ను ఎవరు ఎంతగా తొందరచేసినా నీ శరీరాన్ని మలినం చేసుకోకుండా కాపాడుకుంటానని నేడే తీర్మానం తీసుకో! ఒకవేళ దురదృష్టవశాత్తు ఇప్పటికే నీ జీవితం ఏ పాపిష్టి చేతుల్లోనైనా బంధీ అయిపోయినట్లైతే ప్రభువును క్షమాపణ కోరి నేడే వాడి కబంధ హస్తాల్లోనుండి బయటపడి ఇకనుండైనా బహు జాగ్రత్తగా జీవించుటకు యేసయ్యకు నీ బ్రతుకును అప్పగించుకో! Sex before marriage is wrong


Pdf files download  కోసం .. click here 

Leave a comment

error: dont try to copy others subjcet.