ఒంటరితనం.
Bible-Messeges-In-Telugu-Prasangalu-Pastors
పదివేల మంది పక్కనున్న నేనూ ఒక ఒంటరి వాడననే భావం ఉంటుంది. కాని దేవుడు ఆ ఒంటరితనంలో తోడై ఎన్నెన్నో విషయాలు చెబుతారు.
1.) నోవహు ఒంటరితనం!
(ఆనాడు లక్షలమంది ప్రజలున్నను ఒకే కుటుంబం దేవుని కొరకు ఒంటరిగా నిలుచుంది. మరణజలాలు దాటి రక్షణ పొందారు. ఒక్కోసారి దేవుడు అంటేనే లోకం నిన్ను ఒంటరిని చెయ్యొచ్చు – డోంట్ వర్రీ)
2.) యాకోబు ఒంటరితనం!
(తన ఒంటరితనమే తన పేరు మార్చింది. ప్రార్థన మారింది. నడక మారింది. మాట మారింది. చూపుమారింది. బ్రతుకే మారిపోయింది. 12 గోత్రాల రాజవంశానికే మూల పురుషుడైనాడు – ఆది 32:24)
3.) కర్మెలుపై ఏలీయా ఒంటరితనం!
(850 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, ఏలీయా మరోవైపు. 850 మంది ఎక్కడ? ఒక్కడు ఎక్కడ? కాని ఆ ఒక్కడితో దేవుడు ఉన్నాడు, గనుక గొప్ప విజయం లభించింది – 1 రాజులు 18:22; నీవు + వందమంది మనుషులు సున్న; నీవు + దేవుడు = విజయం)
4.) యెహోషువ ఒంటరితనం!
(యెహోషువ రాత్రివేళ ఒంటరి స్థితిలోనే దుర్భేధ్యమైన ఎరికోను కూలదోసే విధానాన్ని దేవుని ప్రత్యక్షత వలన పొందాడు – యెహో 5:13 – 6:5; ఒంటరిగా నున్నప్పుడే దైవ ప్రత్యక్షతలు పొందుతాం)
5.) గిద్యోను ఒంటరి తనం!
(మిద్యానీయులు గిద్యోనును భయకంపితుని చేసారు. అందుకే ఒంటరిగా గానుగ చాటున గోధుమలు దుల్ల గొడ్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఇశ్రాయేలీయులను రక్షించుమని పరమునుండి పిలుపు వచ్చింది న్యాయా. 6:11, 12)
6.) దానియేలు ఒంటరి తనం!
(ముమ్మారు ఒంటరిగానే ప్రార్థించాడు. ఒంటరిగానే సింహాల గుహలోకి వెళ్లాడు. అపాయం లేకుండా వీరునిగా బయటకు వచ్చాడు – దానియేలు 6:10, 22)
VII. దావీదు ఒంటరితనం !
(రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటరిగా నున్న పిచ్చుకలాగ ఉన్నాను అన్నాడు. వరద వలె వచ్చిన పరిస్థితులు అతణ్ణి దీనుని చేసాయి. ఆ ఒంటరితనంలోనే కోట్లాది మందికి ఆదరణనిచ్చే కీర్తనలు రాసాడు)
- ఒక దైవజనుడు ఇలా అన్నాడు
ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో! చింతలులేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింతగొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది.
క్రీస్తు జీవిత చరిత్ర నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. క్లిక్ హియర్
praise the lord pastor
sermons are useful to us to learn bible easier tq .and post bible sermons.