ఒంటరితనం|Bible-Messeges-In-Telugu-Prasangalu-Pastors1

ఒంటరితనం.

Bible-Messeges-In-Telugu-Prasangalu-Pastors

పదివేల మంది పక్కనున్న నేనూ ఒక ఒంటరి వాడననే భావం ఉంటుంది. కాని దేవుడు ఆ ఒంటరితనంలో తోడై ఎన్నెన్నో విషయాలు చెబుతారు. 

1.) నోవహు ఒంటరితనం!

(ఆనాడు లక్షలమంది ప్రజలున్నను ఒకే కుటుంబం దేవుని కొరకు ఒంటరిగా నిలుచుంది. మరణజలాలు దాటి రక్షణ పొందారు. ఒక్కోసారి దేవుడు అంటేనే లోకం నిన్ను ఒంటరిని చెయ్యొచ్చు – డోంట్ వర్రీ) 

2.) యాకోబు ఒంటరితనం!

(తన ఒంటరితనమే తన పేరు మార్చింది. ప్రార్థన మారింది. నడక మారింది. మాట మారింది. చూపుమారింది. బ్రతుకే మారిపోయింది. 12 గోత్రాల రాజవంశానికే మూల పురుషుడైనాడు – ఆది 32:24) 

3.) కర్మెలుపై ఏలీయా ఒంటరితనం! 

(850 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, ఏలీయా మరోవైపు. 850 మంది ఎక్కడ? ఒక్కడు ఎక్కడ? కాని ఆ ఒక్కడితో దేవుడు ఉన్నాడు, గనుక గొప్ప విజయం లభించింది –                 1 రాజులు 18:22; నీవు + వందమంది మనుషులు సున్న; నీవు + దేవుడు = విజయం) 

4.) యెహోషువ ఒంటరితనం!

(యెహోషువ రాత్రివేళ ఒంటరి స్థితిలోనే దుర్భేధ్యమైన ఎరికోను కూలదోసే విధానాన్ని దేవుని ప్రత్యక్షత వలన పొందాడు – యెహో 5:13 – 6:5; ఒంటరిగా నున్నప్పుడే దైవ ప్రత్యక్షతలు పొందుతాం) 

5.) గిద్యోను ఒంటరి తనం!

(మిద్యానీయులు గిద్యోనును భయకంపితుని చేసారు. అందుకే ఒంటరిగా గానుగ చాటున గోధుమలు దుల్ల గొడ్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఇశ్రాయేలీయులను రక్షించుమని పరమునుండి పిలుపు వచ్చింది న్యాయా. 6:11, 12) 

6.) దానియేలు ఒంటరి తనం!

(ముమ్మారు ఒంటరిగానే ప్రార్థించాడు. ఒంటరిగానే సింహాల గుహలోకి వెళ్లాడు. అపాయం లేకుండా వీరునిగా బయటకు వచ్చాడు – దానియేలు 6:10, 22) 

VII. దావీదు ఒంటరితనం ! 

(రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటరిగా నున్న పిచ్చుకలాగ ఉన్నాను అన్నాడు. వరద వలె వచ్చిన పరిస్థితులు అతణ్ణి దీనుని చేసాయి. ఆ ఒంటరితనంలోనే కోట్లాది మందికి ఆదరణనిచ్చే కీర్తనలు రాసాడు) 

  • ఒక దైవజనుడు ఇలా అన్నాడు 

ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో! చింతలులేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింతగొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది. 


క్రీస్తు జీవిత చరిత్ర నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. క్లిక్ హియర్

1 thought on “ఒంటరితనం|Bible-Messeges-In-Telugu-Prasangalu-Pastors1”

Leave a comment

error: dont try to copy others subjcet.