ప్రవచన నెరవేర్పు క్రిస్మస్|Christmas: Prophecy and Fulfillment |2023

Written by biblesamacharam.com

Updated on:

అంశం:- ప్రవచన నెరవేర్పు (క్రిస్మస్)

Christmas: Prophecy and Fulfillment

మూల వాక్యం:

(మత్తయి సువార్త) 5:17)

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.

5:17 ధర్మశాస్త్రం, ప్రవక్తలు అనే మాటలను పాత ఒడంబడిక అంతటినీ ఉద్దేశించి యూదులు ఉపయోగించారు. తన ఉపదేశాలు పాత ఒడంబడికకు అనుగుణంగా ఉన్నాయనీ, దాని శాసనాలు, సాదృశ్యాలు, సూచనలు, అర్పణలు, భవిష్యద్వాక్కులు తననే సూచిస్తున్నాయనీ యేసుప్రభువు చెప్తున్నాడు. అందులోని ఆధ్యాత్మిక సూత్రాలన్నీ, అందులోని నీతిన్యాయాల సంపూర్ణత అంతా ఆయన మూలంగా నెరవేరాయి. అందులో వెల్లడి అయిన దేవుని సంకల్పాన్నంతటినీ సాధించేందుకు ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రం, ప్రవక్తలూ చిత్రీకరించిన, వర్ణించిన, ముందుగా చెప్పిన, వాగ్దానం చేసిన వాటన్నిటి నెరవేర్పూ ఆయనే. యేసుతో కలుపుకుని చూస్తే పాత ఒడంబడిక గ్రంథం లోతైన అర్థాలతో నిండి ఉన్న గంబీరమైన దివ్య పుస్తకం. ఆయన లేకపోతే అది నెరవేరక, చాలా మట్టుకు అర్థరహితంగా మిగిలిపోతుంది. లూకా 24:27, 44; యోహాను 1:45; 5:39, 46; అపొ కా 3:24-26; 13:27; 1 పేతురు 1:10-11 చూడండి. యేసుప్రభువు పాత ఒడంబడిక గ్రంథాన్ని నెరవేర్చిన కొన్ని విధానాలను హీబ్రూవారికి రాసిన లేఖ చూపిస్తున్నది.

5:17 A కీర్తన 40:6-8; యెషయా 42:21; మత్తయి 7:12; లూకా 16:17; రోమ్ 3:31; 8:4; 10:4; గలతీ 3:17-24; 4:4-5; కొలస్సయి 2:16-17; హీబ్రూ 10:3-12; B మత్తయి 3:15; యోహాను 8:5; అపొ కా 6:13; C అపొ కా 18:13; D అపొ కా 21:28

* క్రీస్తు జననం గురించి ఆయన ఏ స్థలంలో,ఏ వంశంలో జన్మిస్తాడో ముందుగానే ప్రవక్తల నోట పలికించాడు దేవుడు క్రీస్తు పుట్టుకలో ఉన్న గొప్పతనం విశిష్టత ఈ లోకంలో జన్మించిన వారిఎవరికి లేదు జన్మించిన వారేవారికి లేదు.జన్మించబోయే వారికిని ఉండదు.

1.) కన్య గర్భమున జన్మించునని.

(యెషయా గ్రంథము) 7:14

కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

7:14 A సామెత 4:26-27; 8:20; యెషయా 30:21; 35:8; యిర్మీయా 6:16; మత్తయి 16:24-25; 22:14; 25:1-12; మార్కు 8:34; లూకా 12:32; 13:23-30; యోహాను 15:18-20; 16:33; అపొ కా 14:22; రోమ్ 9:27-29; 11:5-6; 12:2; ఎఫెసు 2:2-3; 1 తెస్స 3:2-5; 1 పేతురు 3:20-21; B యెషయా 57:14; మత్తయి 20:16; యోహాను 16:2; రోమ్ 9:32

(ఆదికాండము) 3:15

మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

3:15 పాపంలో పడిన మానవుడికి రక్షకుణ్ణి గురించిన మొదటి వాగ్దానం ఇది. ఆయన స్త్రీకి జన్మిస్తాడు. ఇక్కడ పురుషుడనే మాట కనబడడం లేదు. క్రీస్తు కన్యకు జన్మించడం అనే సంగతిని ఇది సూచిస్తున్నదని చాలామంది పండితుల అభిప్రాయం (యెషయా 7:14; మత్తయి 1:22-23; గలతీ 4:5 చూడండి). ఆ రక్షకుడు సైతాను తలను చితక్కొట్టేవాడై ఉంటాడు, అంటే సైతానునూ వాడి పనులనూ నాశనం చేసే వాడవుతాడు (రోమ్ 16:20; హీబ్రూ 2:14; 1 యోహాను 3:8). బైబిలు చివరి పుస్తకంలో సైతాను చివరి పతనం కనిపిస్తుంది (ప్రకటన 20:10). సర్పం రక్షకుడి కాలి మడమపై గాయం చేస్తుందని ఉంది. సైతాను ఆయన్ను వేధించి గాయపరచగలడు గాని నాశనం చేయలేడన్నమాట. రక్షకుడి గాయాలు కూడా మనిషి మేలుకోసమే (యెషయా 53:5; 1 పేతురు 2:24).

నెరవేర్పు:

(మత్తయి సువార్త) 1:21

తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

1:21 A లూకా 1:31; 2:11, 21; యోహాను 1:29; అపొ కా 3:26; 4:12; 5:31; 13:23, 38-39; ఎఫెసు 5:25-27; కొలస్సయి 1:20-23; తీతు 2:14; 1 యోహాను 1:7; 2:1-2; 3:5; ప్రకటన 1:5-6; 7:14; B ఆది 17:19, 21; 18:10; కీర్తన 130:7-8; యెషయా 12:1-2; 45:21-22; యిర్మీయా 23:6; 33:16; దాని 9:24; జెకర్యా 9:9; లూకా 1:13, 35-36; హీబ్రూ 7:25; C 2 రాజులు 4:16-17; యెహె 36:25-29; D న్యాయాధి 13:3

(లూకా సువార్త) 2:7

తన తొలిచూలు కుమారుని కని తో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

2:7 పరలోక మహారాజు అయిన దేవుని కుమారుడు మొదటగా పడుకున్న స్థలం ఇలాంటిది. అది ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయం. అది తండ్రి అయిన దేవుని నిర్ణయం కూడా. మత్తయి 11:29; ఫిలిప్పీ 2:5-8 లో వెల్లడైన యేసు స్వభావాన్ని చూడండి. బేత్‌లెహేం ఒక చిన్న ఊరు. అందులో ఇతర ప్రాంతాలనుండి వచ్చినవారికి ఉండేందుకు సౌకర్యాలు తక్కువ. పైగా జనసంఖ్య మూలంగా అలా వచ్చినవారు చాలామంది. అయితే యేసు జీవిత కాలమంతా తరచుగా ఆయనకు ఎక్కడా స్థలం దొరికేది కాదు – లూకా 4:29; మత్తయి 2:13; 8:20; యోహాను 1:11; 19:15.

2:7 A యెషయా 53:2-3; మత్తయి 1:25; యోహాను 1:14; 2 కొరింతు 8:9; గలతీ 4:4; B మత్తయి 8:20; లూకా 2:11-12; C యెషయా 7:14; D కీర్తన 22:6; మత్తయి 13:55

2.) బెత్లహేములో జన్మించునవి.

(మీకా) 5:2

బేత్లహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

5:2 దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. బేత్‌లెహేం గ్రామం ఉన్న ప్రాంతం ఎఫ్రాతా – రూతు 1:2; 4:11; 1 సమూ 17:12. బేత్‌లెహేం జెరుసలంకు 10 కి.మీ. దక్షిణంగా ఉన్న గ్రామం.

“పరిపాలించబోయేవాడు”– ఇది ఆయన కార్యకలాపాల గురించి చెప్తున్నది. ఈ భవిష్యద్వాక్కు అభిషిక్తుడైన యేసుక్రీస్తును గురించినది. ఆయన ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వమే, మానవుడుగా ఆయన జన్మ స్థలాన్ని తెలియజేస్తున్నది. మత్తయి 2:4-6 చూడండి. దేవుని కుమారుడుగా ఆయన శాశ్వతుడు. ఉత్పత్తి, ఆరంభం అంటూ ఆయనకు లేవు – యెషయా 9:6; కీర్తన 90:2; యోహాను 1:1. మానవ చరిత్ర అంతటిలోనూ ఆయన తన చర్యలు జరిగిస్తూనే ఉన్నాడు.

నెరవేర్పు:

(మత్తయి సువార్త) 2:5

అందుకు వారుయూదయ బేత్లహేములోనే; ఏలయనగాయూదయదేశపు బేత్లహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వరా వ్రాయబడియున్నదనిరి.

2:5-6 క్రీస్తు జన్మానికి 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించబోయే స్థలాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్న ఈ అద్భుతమైన భవిష్యద్వాక్కు మీకా 5:2లో ఉంది. ఓ సంగతి గమనించండి – ఈ మతాధికారులకు, పండితులకు అభిషిక్తుడు వస్తాడనీ ఆయన జన్మస్థానం ఫలానా చోటు అనీ తెలుసు గాని ఆయన్ను చూచేందుకు గానీ ఆయన్ను గౌరవించేందుకూ ఆరాధించేందుకూ గానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మనుషులకు తెలిసినదాన్ని బట్టి వారు దేవుని దృష్టికి అంగీకారం కారు. వారి హృదయ స్థితే అతి ప్రాముఖ్యం.

2:5 A రూతు 1:1; B రూతు 2:4; యోహాను 7:42; C ఆది 35:19; యెహో 19:15; రూతు 1:19; 4:11; 1 సమూ 16:1

(యోహాను సువార్త 7:42

క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.

7:42 వారు అన్నది నిజమే (మీకా 5:2). కానీ యేసు ప్రభువు జన్మించినది అక్కడ అన్న విషయం వారికి తెలియదు (మత్తయి 2:1; లూకా 2:4-7).

7:42 A మీకా 5:2; మత్తయి 2:5; లూకా 2:4, 11; B 1 సమూ 16:1; కీర్తన 132:11; యెషయా 11:1; యిర్మీయా 23:5; మత్తయి 1:1; C 1 సమూ 16:4, 11-13, 18; 17:58; కీర్తన 89:4; యోహాను 7:27

3.) దావీదు వంశములోనుండి జన్మించునని.

(యెషయా గ్రంథము) 11:1

యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

11:1 10:33-34లో ప్రవక్త అష్షూరువారిని ఎత్తయిన చెట్లతో పోలుస్తూ దేవుడు వారిని కూల్చివేస్తాడని చెప్పాడు. ఇక్కడ చిగురు లేక చిన్న కొమ్మ గురించి చెప్తున్నాడు. ఈ అంకురం లేక కొమ్మ 7:14లోనూ 9:6-7లోనూ ఉన్న అభిషిక్తుడు, కుమారుడు, శిశువు తప్ప మరెవరూ కాదు. ఆయన సర్వాతీతుడైన దేవుని అవతారం, ప్రపంచాన్ని భావి కాలంలో పరిపాలించబోతున్నవాడు. యెష్షయి దావీదు తండ్రి. ఈ కొమ్మ పుట్టేది దావీదు వంశంనుండి.

(యిర్మీయా) 23:5

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

23:5 A యెషయా 4:2; 9:7; 11:1-5; 32:1-2; 52:13; 53:2; జెకర్యా 3:8; 6:12-13; లూకా 1:32-33; B యెషయా 40:9-11; 53:10; యిర్మీయా 22:3; 23:6; 30:3, 9; 31:27, 31-38; 33:14-16; దాని 9:24; హోషేయ 3:5; ఆమోసు 9:11; జెకర్యా 9:9; యోహాను 1:45; హీబ్రూ 8:8; ప్రకటన 19:11; C కీర్తన 45:4; 72:1-2; 80:15; యిర్మీయా 22:15, 30; యెహె 17:2-10, 22-24; 34:29; మత్తయి 2:2; యోహాను 1:49

23:5 “కొమ్మ”– బైబిలు ప్రవక్త గ్రంథాలలో అభిషిక్తునికి ఇచ్చిన పేరిది (33:15; యెషయా 11:1; జెకర్యా 3:8; 6:12). మానవావతారంలో ఆయన దావీదు వంశానికి చెందినవాడు (లూకా 1:30-33; రోమ్ 1:5). రాజుగా ఆయన పరిపాలన వర్ణన అనేక పాత ఒడంబడిక లేఖనాల్లో కొద్దిగా కనిపిస్తుంది (ఉదా।। కీర్తన 2:6-9; 45:1-7; 72:5-7; యెషయా 9:6-7; 11:1-9; 32:1-3; జెకర్యా 14:9-21). యెషయా 2:2-4 నోట్స్ చూడండి.

(యెషయా గ్రంథము) 22:22

నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు

22:22 రాజభవన కార్యనిర్వాహకుడుగా ఎల్యాకీము గొప్ప అధికారి అవుతాడు. దావీదు సింహాసనాన్ని పొంది, కేవలం రాజభవనం మీదే కాదు ప్రపంచమంతటి మీదా ఎదురులేని అధికారాన్ని చెలాయించే యేసుప్రభువుకు ఎల్యాకీము సాదృశ్యం (ప్రకటన 3:7; మత్తయి 28:18; యోహాను 17:2).

22:22 A యోబు 12:14; మత్తయి 16:18-19; ప్రకటన 1:18; 3:7; B మత్తయి 18:18-19

(జెకర్యా) 3:8

ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు రప్పింపబోవుచున్నాను.

3:8 A యెషయా 11:1; యిర్మీయా 23:5; జెకర్యా 6:12; B యెషయా 4:2; 20:3; 42:1; 53:2; యిర్మీయా 33:15; C యెషయా 8:18; 49:5; 52:13; 53:11; యెహె 12:11; 17:22-24; 1 కొరింతు 4:9-13; ఫిలిప్పీ 2:6-8; D కీర్తన 71:7; యెషయా 49:3; యెహె 24:24; 34:23-24, 29; 37:24; లూకా 1:78

నెరవేర్పు:

(లూకా సువార్త) 2:4,5

యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.

(అపొస్తలుల కార్యములు) 13:22,23

తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.

4.) యూదుల రాజుగా జన్మించునని.

(సంఖ్యాకాండము) 24:17

ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.

(ఆదికాండము) 49:10

షిలోహు వచ్చువరకు దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు. యేసుక్రీస్తు రాజుగా రాజ్యాధికారం చేయనని ప్రవక్తలు ప్రవచించిరి.

నెరవేర్పు:

(హెబ్రీయులకు) 7:14

మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.

(మత్తయి సువార్త) 27:37

ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

(లూకా సువార్త) 1:33

ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

(మత్తయి సువార్త) 2:2

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

5.) ప్రవక్తగా జన్మించునని.

(ద్వితీయోపదేశకాండము) 18:18,19

వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.

నెరవేర్పు:

(మత్తయి సువార్త) 21:11

జనసమూహముఈయన గలిలయ లోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

(లూకా సువార్త) 7:16

అందరు భయాక్రాంతులైమనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.

(లూకా సువార్త) 24:19)

ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

(అపొస్తలుల కార్యములు) 3:22,23,24

మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.(లేక, విందురు)

ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.

* మనుషులకు దేవుని సందేశము అందించిన వారిలో ప్రాముక్యుడు యేసు.

(హెబ్రీయులకు) 1:1,2

పూర్వం నానాసమయము భాషలో నానా భాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడుఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను.

(యోహాను సువార్త) 7:16

అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

6.) నీతి సూర్యునిగా జన్మించునని.

(మలాకీ) 4:2

అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

(యెషయా గ్రంథము) 60:1

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

నెరవేర్పు:

(లూకా సువార్త) 1:76,77,78

పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.

మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.

(రెండవ పేతురు) 1:19

మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారివేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

(మొదటి యోహాను 2:8

మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.

7.) కుమారునిగా జన్మించునని.

(యెషయా గ్రంథము) 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

నెరవేర్పు:

(మత్తయి సువార్త) 1:21,22

తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

(మత్తయి సువార్త) 4:12,16

యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.

* ఆ శిశువు పెరిగి యూదుల రాజుగా ప్రపంచానికి రాజుగా పరిచయం అయ్యాడు.

(మత్తయి సువార్త) 2:2

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

(మత్తయి సువార్త) 27:11

యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను

(మత్తయి సువార్త) 28:18

అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.


ప్రసంగ శాస్త్రం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి

క్లిక్ హియర్

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted