బ్రెన్ హామిసమ్ !
Branham A False Prophet And False Christ Latest Telugu
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రవక్త! అనేకులకు ఆయన యేసు ప్రభువు కన్నా ఎక్కువ!! ఆయనను ఆరాధించినట్లు మరొకరిని ఆరాధించమన్నట్లు వుంటుంది ఆయన శిష్యుల ప్రవర్తన. ఆయన పేరు విలియమ్ మారియన్ బ్రెన్హామ్, బ్రెన్హమ్ మాములు సేవకుడు కాదు, ఈ యుగానికే ప్రవక్త అని, ప్రకటన గ్రంథములోని ఏడవదూత స్వరమని ప్రకటించాడు. బ్రెన్హమ్ ఏప్రిల్ 6, 1909లో కెంటక్కి ప్రాంతములో జన్మించాడు. చిన్నతనం నుండి దర్శనాలు చూచేవాడు, స్వరాలు వినేవాడు. భవిష్యత్తులో సంభవింపబోయే విషయాలను వాటి ద్వారా తాను తెలుసుకున్నానని చెప్పేవాడు. యౌవ్వనంలో మార్పు పొంది, పరిచర్య ప్రారంభించాడు. మొదట బాప్టిస్ట్ బోధకునిగా మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ కలిసి పని చేసేవాడు. తరువాత పెంటికోస్టల్స్తో పరిచయం అయింది. ఆ సమయంలోనే ఫ్రాంక్లిన్ హాల్ అనే బోధకుని ద్వారా బాగా ప్రభావితం అయ్యాడు. హాల్ “దేవుని ఏడవ సంఘయుగం” అనే బోధల విషయమై బాగా పేరుగాంచాడు. బ్రెన్హామ్ పెంటికోస్టల్స్ నుండి విడిపోయి వేరుగా వున్న “జీసస్ ఓన్లీ” (Jesus only) గుంపులతో చేరి వారి బోధను ఆకళింపు చేసుకున్నాడు.
బ్రెన్హమ్ ఎక్కువగా చదువుకోలేదు. బైబిల్ శిక్షణ పొందలేదు. అయితే అతని పరిచర్యలో అసాధారణమైన స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు జరిగేవి! ప్రభువు యొక్క దూత తన ప్రక్క నిలిచి తనకు సహాయం చేసేవాడని చెప్పేవాడు. అతడే తనకు స్వస్థపరచు వరమును, జ్ఞానవాక్యమును అనుగ్రహించాడని ప్రకటించాడు.
బ్రెన్హామ్ తలపై కనబడే “వెలుగు” (Halo) ను గూర్చి చాలా మంది ఆశ్చర్యపోయి, ఆయన నిజముగా దేవుని ప్రవక్త అని నమ్ముతారు. కొందరు పేరుగాంచిన బోధకులు ఆయనతో కలిసి సహవాసం చేయడం ఆయనకు చాలా గట్టి పట్టునిచ్చింది. బాప్తిస్మమిచ్చు యోహాను తలపైగాని, ఏలీయా తలపై గాని ఎటువంటి వెలుగు కనబడలేదు!
బ్రెన్హామ్ తగ్గింపు గల వ్యక్తిగా, సామాన్యమైన వానిగా వుండేవాడని వినికిడి. కాని అతని బోధలు వాక్యానుసారముగా లేకపోవడమే విషాదకరమైన విషయం.
బ్రెన్హామ్ బోధలు :
దేవుడు తాను పలికినది నిరూపించుకొనుటకై ఒక ప్రవక్తను పంపుతాడని, రెండువేల సంవత్సరాల తరువాత అతడిని పంపుతున్నాడని, పితరులైన ఏలీయా, బాప్తిస్మమిచ్చు యోహాను లాంటి ఒకనిని, సంస్థకు, విద్యకు, మతలోకానికి ఎంతో దూరమైన వానిని, కేవలం దేవుని స్వరం విని “యెహోవా సెలవిచ్చునదేమనగా” (Thus saith the Lord) అని దేవుని పక్షాన పలికే “దేవుని నోటిబూర”గా వుండు వానిని పంపుతున్నాడని, మలాకి 4:5లో ప్రవచనమునకు నెరవేర్పుగా, ప్రవక్తగా వుండుటకు వచ్చింది తానేనని ప్రకటించాడు!
దేవుని స్వభావమును గూర్చి తప్పుగా అంచనా వేసి భోధించాడు. దేవుని చూడగలం – చూడలేము అనే విషయము ప్రస్తావిస్తూ, డ్రామాలో ఒక వ్యక్తి వేరు వేరు వేషాలు ధరించినట్టు దేవుడు కూడా ఆయా యుగాల్లో ముసుకు తగిలించుకొని వేరు వేరు వేషాలు మార్చినట్లు తెలిపాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే దేవుని మూడు పనులు (offices – ఇది Modalism అను అబద్ధబోధ!) అని, యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు ఒకే వ్యక్తి అయితే ఆకారములోనే వ్యత్యాసము వుంది అని చెప్పాడు. ప్రొటెస్టెంట్స్ యొక్క త్రిత్వ సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వారు ముగ్గురు దేవుళ్ళ యందు నమ్మిక యుంచుతారు. అది సత్యం కాదు అని నొక్కి చెప్పాడు. త్రిత్వము సాతాను సంబంధమైనదని అనేవాడు! త్రిత్వమంటే ముగ్గురు దేవుళ్ళు అని క్రైస్తవ సంఘము ఏనాడు అనలేదు. అది వారి నమ్మికకాదు. ఒక దేవునిలో మూడు నిత్యబేధములు ఉన్నాయని తెలుసుకోకుండా తప్పిపోయాడు బ్రెన్హామ్. “దేవుడు నిత్యమైనవాడు. ఆదియందు సృష్టి ఆరంభము కాక మునుపు ఆయన దేవుడైయుండలేదు. దేవుడు అనగా ఆరాధనకు లక్ష్యమైనవాడు. ఆదియందు ఆయన వంటరిగా వున్నాడు. ఆయనను ఆరాధించుటకు ఏమిలేదు. ఆయనలో గుణలక్షణాలు వుండేవి. గుణలక్షణమంటే ఏమిటి ? ఒక తలంపు” అన్నది బ్రెన్హామ్ బోధ! బ్రెన్హమ్ మాటలను ఆధారం చేసుకుంటే “బ్రెన్హమ్ దేవుడు ఆరాధింపబడాలి లేని యెడల ఆయన దేవుడు కాదు” (ఒక మోర్మన్ ఈ మాటలు అన్నాడు) మరి ఆయన ఏంటి? – ఒక తలంపు!
యేసు దేవుడు కాదని, కుమారునికి ఆరంభము వుంటుందని, నిత్యమైనవాడు కాదని, యేసు సృష్టించబడ్డాడని, (యోహాను 1:1)కి వ్యతిరేకంగా యేసు ఆది యందు దేవుడు కాడని బ్రెన్హమ్ వాదించేవాడు. వాక్యముగా మారకముందు అది ఓ తలంపు మరి ఒక తలంపు సృజింపబడాలి అన్నది ఆయన వాదన. ఎంత విపరీతం? ఎన్ని
గొప్ప అద్భుతాలు చేసినా దేవుని గూర్చి సరియైన అవగాహన లేని వ్యక్తి ఏ విధముగా వ బాప్తిస్మమును గూర్చి తండ్రి కుమార పరిశుద్దాత్మ నామములోనికి ఇవ్వబడిన బాప్తిస్మము చెల్లదని, కేవలం యేసు నామములోనే బాప్తిస్మము పొందాలని “జీసస్ ఓన్లీ” (యేసు మాత్రమే) సిద్ధాంతాన్ని బోధించేవాడు. త్రిత్వనామ బాప్తిస్మము పొందిన వారందరు తిరిగి యేసు నామ బాప్తిస్మము పొందాలని ఆదేశించాడు.
జోడియక్ (రాశి చక్రము), ఈజిప్టియన్ పిరిమడ్స్ మరియు వ్రాయబడిన లేఖనం అను మూడు రూపాల్లో దేవుని వాక్యం ఇవ్వబడినదని బ్రెన్హమ్ బోధించేవాడు. పరిశుద్ధ లేఖనాలతో వ్యర్థమైన వాటిని సమానము చేయుట ఎంత ఘోరం!
సంఘ చరిత్రలో ప్రతి సంఘ యుగానికి ఒక ప్రముఖుడు వున్నట్లు వారి వివరాలను, వ్రాయించి పెట్టాడు. ఎఫెసు-పౌలు, స్ముర్న- ఐరేనియస్, పెర్గమ-మార్టిన్, తుయతైర-కొలుంబా, సార్దిస్-లూథర్, ఫిలదెల్ఫియ-వెస్లీ, లవొదకయ-బ్రెన్హమ్!! బైబిల్ చేయని పనిని బ్రెన్హామ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనను గొప్ప భక్తులతో పోల్చుకోవడమే కాక తన సమయంలో తానే అందరినీ మించిన వాడినని చెప్పుకోవడం అతిశయం కాకపోతే ఏంటి?
మరో విపరీత బోధ “సర్ప సంతన” (Serpent seed doctrine) సిద్ధాంతం. హవ్వ పండు తిని పాపం చేయుట కాదు. ఆమె సాతానుతో సంపర్కం కలిగి ఉండుటయే అని బ్రెన్హామ్ తెలిపాడు. ఇది అతని కన్నా ముందు యూనిఫికేషన్ చర్చ్ అధినేత సన్ యూంగ్ మూన్ చేసిన వక్రబోధ! అందుకే ఆదాము ద్వారా హేబెలు, సాతాను ద్వారా కయీను పుట్టారని వాదిస్తాడు. ఒకరు దేవుని సంతానం. ఒకరు సాతాను సంతానం. దీని మూలంగా కయీను సంతానం నరకపాత్రులౌతారు. షేతు సంతానం బ్రెన్హామ్ పరిచర్యకు స్పందిస్తారు. మూడవ గుంపు డినామినేషన్ సంఘాల్లో వున్నారు. వీరు పరలోకము లేక నరకమును ఎంచుకునే స్వీయ చిత్తమును కలిగినవారు. దేవుని సంతానము క్రీస్తు వధువు, వీరు శ్రమల కంటే ముందు ఎత్తబడతారు. డినామినేషన్లలో వున్నవారు మృగసంఖ్య వేసుకుని మహాశ్రమల కాలం గుండా వెళతారు.
స్త్రీలంటే బ్రెన్హమ్కు పడదు. “నేను స్త్రీలను ద్వేషిస్తాను. ఒక తూటాతో వారిని కాల్చి చంపుటకు కూడా వారు అర్హులు కారు” అన్నాడు బ్రెన్హామ్.
నరకము నిత్యమైనది కాదని బ్రెన్హమ్ వాదన. సాతాను పూర్తిగా నిర్మూలమైపోతాడని అంటాడు.
ప్రకటన గ్రంథములోని ఏడు ముద్రలను తానే విప్పానని అంటాడు. కేవలం యేసు క్రీస్తు ప్రభువు తప్పా మరెవరు విప్పలేని వాటి విషయం కూడా ఈ ధోరణి ఏమి సూచిస్తోంది?
బ్రెన్హామ్ ప్రవచనాలు అనేకము నెరవేరినా, అన్ని నెరవేరలేదు! ముఖ్యంగా 1977లో లోకం అంతమైపోతుందని అతడు చెప్పాడు. తనకు యేసు 1933లో ఇచ్చిన దర్శనాల మూలంగా ఇది చెబుతున్నానని పలికాడు. “యేసు వచ్చే సంవత్సరము, మాసము, వారము లేక దినము ఏ మనిషి ఎరుగడని ఆయన చెప్పలేదు” అన్నది ఆయన వాదన. ప్రవక్తను గూర్చి దేవుడేమంటున్నాడో చూడండి (ద్వితీయో 18:22), బ్రెన్హామ్ 1965లో ఘోరమైన కారు ప్రమాదంలో కన్నుమూశాడు. విలియమ్ బ్రెన్హామ్ ప్రభావం అనేకుల మీద బహుబలంగా వుంది.
“ద వాయిస్ ఆఫ్ గాడ్” ప్రచురణలు, బ్రెన్హమ్ వ్రాసిన పుస్తకాలు, ట్రాక్ట్స్ మరియు ఆయన మెసేజ్ టేప్స్ ద్వారా బాగా ప్రచారం జరుగుతోంది. “మిరకల్స్” అనగానే మెలికెలు తిరిగే వారికి, వాక్య వివేచన లేకుండా కేవలం ‘సెన్సెషనల్ సెంటిమెంట్’తో బ్రతికేవారికి దేవుని బోధతో పనేముంది. వారికి ఏదైనా ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా అనిపిస్తే చాలు – ఇట్లే నమ్మేస్తారు దాని వెంట నడిచేస్తారు! విశ్వాసులకు వ్యక్తులు ముఖ్యం కాదు – మొదట వాక్యం ఆ తరువాతే ఎవరైనా. ఆయన యథార్థవంతుడై యుండవచ్చు కాని దేవుని వాక్యమును తప్పి చెప్పడం అంగీకరించలేని విషయం. అద్భుతాలు, సూచకక్రియలు, స్వస్థతలు, ప్రవచనాలు ఎన్ని వున్నా అవి ఒక వ్యక్తి దేవుని సేవకుడని రుజువు చేయలేవు.
“ఆది అపొస్తలుల కన్నా జ్ఞానినని గాని లేక ఆది సంఘ హతసాక్షుల కన్నా పరిశుద్ధుడనని గాని ఏ వ్యక్తి అయిన దావా చేసినల్లెతే జాగ్రత్త. శ్రేష్టమైన పని ఏమిటంటే అక్కడ నుండి లేచి ఆ వ్యక్తి సన్నిధి నుండి వెళ్ళిపోవడమే. నీవు అతనికి సహాయం చేయలేవు. ఖచ్చితంగా అతను నీకు సహాయం చేయలేడు” అని ఏ.డబ్ల్యు. టోజర్ గారు వ్రాశారు. అన్నిటి కన్నా “సత్యం” ముఖ్యం. దేవుని వాక్యమే సత్యం అది కలిగియుండకపోతే అంతా వ్యర్థం (మత్తయి 7:21-23). ఒక వ్యక్తిని వెంబడించడం ఎంత వరకు సమంజసం? అతడు ఎంత గొప్పవాడైన వాక్యమునకు అనుగుణంగా లేనప్పుడు వెంబడించరాదు. లక్షలాది గుడ్డిగా వెళ్ళిపోతున్నారు అంటే కారణం (1 కొరింథీ 3:4) కాదా? దేవుడొక్కడే మన పూర్ణ ఆరాధనకు పాత్రుడు. దేవుని వాక్యం మనకు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. కనువిప్పును కలిగిస్తుంది. నిత్యం మనకున్న కట్లను తెంపుతుంది. ప్రతి ఒక్కరు ప్రభువు వాక్యమును గ్రహించి దానిని గైకొని జీవించాలి. (ద్వితీయో 13:1-3) మనకు హెచ్చరిక సుమా!
Branham Branham Branham Branham Branham Branham Branham Branham Branham
మరిన్ని విషయాల కొరకు .. click here