అహజ్యా – The Life History of King Ahaziah in Telugu1

Written by biblesamacharam.com

Published on:

అహజ్యా చరిత్ర. 

The Life History of King Ahaziah in Telugu

 “అహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను” (1 రాజులు 22:51). 

 అహజ్యా అహాబు కుమారుడు. అహజ్యా అనగా ‘యెహోవా స్థిరపరచువాడు’ అని అర్థము. ఇతడు తన తండ్రియైన అహాబు బ్రతికియుండగానే తన తండ్రితో పాటు రాజ్యమేలినట్లు తెలియుచున్నది. తండ్రి మరణించిన తరువాత సంపూర్ణాధికారం పొంది రాజ్యమేలెను. అయితే ఇతడు కేవలము రెండు సంవత్సరములు మాత్రమే పరిపాలించెను (I రాజులు 22:51). 

 ఇతడు తన తండ్రి దుర్మార్గతను అనుసరించి ప్రవర్తించెను. ఇతని తల్లియైన యెజెబెలు గుణములు ఇతనిలో బహు స్పష్టముగా కనబడెను. ఇతడు తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను బట్టి నడచుకొనెను. ఈనాడనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ఏమేమో సంపాదించి పెడుతున్నామని, ఎంతో చక్కటి విద్యాభ్యాసాలు యిప్పిస్తున్నామని తృప్తిపడుచున్నారు గాని; తల్లిదండ్రుల దోషము బిడ్డల ఒడిలో పడునని గుర్తించకున్నారు. తమ దోషములు తమ బిడ్డల మీదకు రాకుండునట్లు పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సరిచేసుకొనకున్నారు. 

 ఈ లోకరీతియైన సకల సంపదలు నీవు నీ బిడ్డల కిచ్చినను; ఆ బిడ్డలు ఆథ్యాత్మికంగా వృద్ధి చెంది, దేవునియందు విశ్వాసముంచునట్లు నీవు చేయనిచో వారు నరకమునకే చేరుదురు. కారణం మనకు శరీరం మాత్రమే కాక, ఆత్మ కూడా ఉన్నది. మన శరీరానికి అన్న వస్త్రములు ఎంత అవసరమో, మన ఆత్మకు దేవునియందలి భక్తి, విశ్వాసము అంతకంటె మరెంతో అవసరము! నీతి కొరకు ఆకలిదప్పులు గల మన ఆత్మ, దేవుడిచ్చు జీవాహారము వలననే తృప్తి చెందును. 

 ఈనాడనేకులు మా బిడ్డలు లోకంలో గొప్పవారవ్వాలని; పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని ఆశిస్తున్నారే గాని; నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని అడిగిన జెబెదయి కుమారుల తల్లివలె లేరు (మత్తయి 20:20,21). 

 అహజ్యా ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన యరొబాము ప్రవర్తన ననుసరించి, బయలు దేవతను పూజించుచు యెహోవాకు కోపము పుట్టించెను. ఇతడు యూదా రాజైన యెహోషాపాతుతో చేరి, ఓఫీరు దేశము నుండి బంగారమును తెప్పించుటకు ప్రయత్నించెను గాని విఫలుడయ్యెను (1 రాజులు 22:48, 49; 11 దిన 20:35-37). 

 మోయాబీయులు ఇతనిపై తిరుగుబాటు చేసిరి. అయినను ఇతడు ఆ విషయమై శ్రద్ధ వహించలేదు. తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయ్యాడు. అతని జీవితంలో ఏది చేసినా ఆశీర్వాదము లేదు. “అతడు చేయునదంతయు సఫలమగును” (కీర్తన 1:3) అన్న మాట ఇతనికెంత మాత్రమును తగదు. 

 దెబ్బ తగిలి, మంచము మీద పడి, రోగియైనప్పుడైనా సృష్టికర్తకు మొఱ్ఱ పెట్టుకొనక; తాను స్వస్థపడుదునో, లేదోనని విచారించుమని ఎక్రోను దేవతయగు బయల్లైబూబు నొద్దకు జోస్యమును తెలుసుకొని రమ్మని తన దూతలను పంపెను. కరుణావాత్సల్యములు కలిగిన దేవుడు కఠినంగా మనలను శిక్షించుట యందు ఆనందించలేక; కష్టాలను అనుమతించి, ఆ కష్టాలలోనైనా మన స్థితిని మనం గ్రహించి, ప్రభువుకు మొరపెట్టి ఆయనకు సమీపస్థులవ్వాలని కోరుకొంటున్నాడు. “మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడ వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలుచేతును” (ప్రకటన 2:21,22) అని ప్రభువు అంటున్నాడు. అయితే ఈ అహజ్యా దెబ్బ తగిలి, మంచము మీద పడి రోగియైనా; దేవునికి మొరపెట్టలేదు సరికదా, దయ్యములను ఆశ్రయించెను. 

 దేవునిచే ప్రేమించబడి, ఏర్పరచబడి, హెచ్చించబడిన ఇశ్రాయేలీయుల రాజు దేవుని మరచుటే గాక; దయ్యముల సహాయము కోరు అధ్వాన్నమైన స్థితికి దిగజారటం ఎంత విచారం! ఈనాడనేకులు దేవునిచేత ఆశీర్వదించబడిన కుటుంబాలలో పుట్టి; అనేక ఆధిక్యతలను, తలాంతులను పొంది; వాటిని లోకము కొరకు, పాపము కొరకు వాడుచున్నారు. 

 రోషము గలిగిన దేవుడు అహజ్యా ప్రవర్తనను సహించలేక తన సేవకుడైన ఏలీయాను పంపి – “నీవెక్కిన మంచము దిగిరాకుండా నిశ్చయముగా చచ్చెదవని” తెలియజేసెను (I1 రాజులు 1:4). అయినను పశ్చాత్తాపపడి, ప్రభువును వేడుకొనని అహజ్యా; తన్ను తాను తగ్గించుకొని ప్రభువువైపు తిరుగనందున ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను (I1 రాజులు 1:17). అతనికి కుమారుడు లేనందున అతని తమ్ముడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. 

Ahaziah Ahaziah Ahaziah Ahaziah Ahaziah Ahaziah Ahaziah Ahaziah Ahaziah Ahaziah


ప్రత్యక్ష గుడారం మెటీరియల్ కొరకు.. Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted