భక్తుల ప్రార్థనలు|Sevakula Prasangaalu pdf | Telugu Christian Books Pdf

Written by biblesamacharam.com

Updated on:

అంశం : భక్తుల ప్రార్థనలు 

Sevakula Prasangaalu pdf | Telugu Christian Books Pdf

  బైబిలులో భక్తులు చేసిన ప్రార్థనలు వారికి దేవుడిచ్చిన జవాబులు కోకొల్లలుగా నున్నాయి. ప్రారంభమైంది ఎనోషు కాలంలో. అప్పట్నించి దేవునికీ మానవునికీ సంబంధం ఏర్పడింది. 

1.) అబ్రాహాము చేసిన ప్రార్థన.

 (ఆదికాండము) 22:2

2.అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

22:2 “ఒకే ఒక కొడుకు”– ఇష్మాయేల్ దాసికి పుట్టిన కొడుకు. అబ్రాహాముకూ అతని భార్యకూ పుట్టిన ఏకైక సంతానం ఇస్సాకు. దేవుని ఒడంబడిక, ప్రమాణాలకు సంబంధించిన ఒకే ఒక కొడుకు. బైబిల్లోని ఏకైక నిజ దేవుడు ఇతర దేవుళ్ళకు నరబలి చేయకూడదన్నాడు (లేవీ 18:21; ద్వితీ 18:9-10; 2 రాజులు 17:17). ఎందుకంటే ఇతర దేవుళ్ళు దేవుళ్ళే కాదు. వాళ్ళకు ఏదైనా అర్పించడం, ఎవరికైనా సరే, తగదు. సాటి మనుషుల్ని బలి ఇవ్వడం అంతకన్నా హీనం. భూమిపై ఉన్నవన్నీ, మనుషులందరూ సృష్టికర్త అయిన దేవునికి చెందినవారు (యెహె 18:4), అంతేగాక ఆయన విమోచించినవారు రెండింతలు ఆయన సొత్తు (1:27; కీర్తన 50:10; యెషయా 42:5; యెహె 18:4; నిర్గమ 13:1-2; 19:5; లేవీ 20:26; 1 కొరింతు 6:19-20).

మనుషులంతా దేవుని ఆస్తి గనుక వారితో ఏం చెయ్యడం ఆయనకిష్టమైతే అలా చెయ్యవచ్చు. కావలిస్తే తనకు వారిని హోమబలిగా అర్పించమని కూడా అడిగే హక్కు ఆయనకు ఉంది. ఇస్సాకును అర్పించమని అబ్రాహాముకు చెప్పడం ఇలాంటిదే. దేవుడు న్యాయవంతుడు, పవిత్రుడైన దేవుడని గుర్తుంచుకోండి. తప్పు పని చెయ్యమని అబ్రాహామును ఎన్నటికీ కోరడు (యాకోబు 1:13). నిజానికి వేరొక మనిషిని బలిగా ఇమ్మని ఒక మనిషిని దేవుడు అడగడం బైబిలంతటిలో ఇక్కడ ఒక్క సారే.

ఇందులో దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నట్టు చూడవచ్చు. అబ్రాహాము భక్తి, నిష్ఠ, నమ్మకాలను పరీక్షించాలని; రెండవది లోక పాపాలకోసం తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక గుర్తును చూపడం. ఇది అబ్రాహాముకు పరీక్ష: ఇస్సాకు అబ్రాహాముకు ఏకైక కుమారుడనీ, అతడి వారసుడనీ, దేవుని ఒడంబడిక అతని మూలంగా స్థిరపడుతుందనీ దేవుడు అబ్రాహాముతో చెప్పాడు (15:4; 17:16, 19; 21:12; 22:2). దేవుని మాటకే వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్న దేవుని ఆజ్ఞ ఎదురైతే అబ్రాహాము దేవుని మాటపై ఇంకా నమ్మకం నిలుపుకుంటాడా? దేవుడు ఎలాంటి తప్పిదం చెయ్యడనీ, తన మాటను మీరడనీ నమ్ముతాడా? అబ్రాహాము ఈ పరీక్షకు నిలిచాడు. దేవుడు తననొక పని చెయ్యమన్నాడంటే దాని వెనుక సరైన కారణం తప్పక ఉంటుందనీ, దేవుడు ఏదో ఒక విధంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనీ నమ్మాడు (రోమ్ 4:21). ఇస్సాకును హతం చెయ్యవలసి వచ్చినా, దేవుడు తన మాటను నిలబెట్టుకునేందుకు అతణ్ణి తిరిగి బ్రతికిస్తాడని నమ్మాడు (హీబ్రూ 11:17-19).

ఇదంతా దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఏమి చేశాడో దానికి దృష్టాంతం. ఇస్సాకులాగే యేసు కూడా తండ్రికి ఏకైక కుమారుడు (యోహాను 3:16). ఆయన ఈ లోకానికి వారసుడు (హీబ్రూ 1:2). దేవుడు తన కొత్త ఒడంబడికను ఆయన ద్వారా చేశాడు (హీబ్రూ 9:15). అబ్రాహాముకు మాట ఇచ్చి లోకమంతటికీ దీవెనలు కలుగుతాయని చెప్పినది నెరవేరేది యేసు మూలంగానే (అపొ కా 3:26; గలతీ 3:14; ఎఫెసు 1:3). దేవుడు మానవ జాతిని ప్రేమిస్తూ పాపుల కోసం ఆయన్ను బలి చేశాడు (రోమ్ 5:8; హీబ్రూ 9:28; 1 పేతురు 3:18; 1 యోహాను 4:9). తరువాత తన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు ఆయన యేసును మళ్ళీ బతికించాడు (అపొ కా 2:24, 32-36; 1 కొరింతు 15:3-4). దేవుడు ఇస్సాకును “మోరియా ప్రదేశానికి” తీసుకువెళ్ళమని అబ్రాహాముతో చెప్పాడు. జెరుసలం ఉన్నది ఈ ప్రదేశంలోనే (2 దిన 3:1). యేసుక్రీస్తు సిలువ మరణం చెంది తిరిగి సజీవంగా లేచినది జెరుసలంలోనే గదా.

22:2 A యోహాను 3:16; రోమ్ 8:32; హీబ్రూ 11:17; 1 యోహాను 4:9-10; B ఆది 22:16; C ఆది 17:19; D ఆది 22:12; న్యాయాధి 11:31; E ఆది 21:12; న్యాయాధి 11:39; 2 రాజులు 3:27; 2 దిన 3:1; రోమ్ 5:8

(ఇది సమర్పణతో కూడిన ప్రార్థన. బలిపీఠంపై కుమారుని పరుండబెట్టి కత్తి పైకెత్తినప్పుడు యెహోవా దూత పిల్చాడు. అందుకు చిత్తము ప్రభువా అన్నాడు. నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు నాకు భయపడుచున్నావని నాకు తెల్సింది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వాదం రావాలంటే – సమర్పణ కావాలి) 

2.) యాకోబు చేసిన ప్రార్థన.

 (ఆదికాండము) 32:9,10,11,12

9.అప్పుడు యాకోబునా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధు వులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

10.నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

32:10-12 యాకోబుకు తన పాపాలూ తప్పిదాలూ తెలుసు. తన క్షేమానికీ భద్రతకూ కృపే ఆధారమని కొంతవరకు అర్థం చేసుకోగలిగాడు. తన మంచితనం గురించి ఇక్కడ వాదించడం లేదు గాని తనకు మేలు కలుగజేస్తానని (28:13-15) మాట ఇచ్చిన దేవుని వాగ్దానాలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. గతంలో లాగా దేవునితో బేరమాడడం లేదు.

11.నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

12.నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

24.యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

32:24 “తెల్లవారేవరకు”– ఈ పోరాటం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. యాకోబు రాత్రంతా ఇలా కుస్తీపడుతూ ఉండగలగడం అసాధ్యం. ఎలాగైనా దేవదూత యాకోబు యొక్క మనసులో, సంకల్పంలో మార్పు కలిగించాలని వచ్చాడు. ఆయన దృష్టిలో అది మరింత ప్రాముఖ్యమైన సంగతి.

(అన్నకు భయపడి యబ్బోకు రేవు దగ్గర చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థనకు జవాబు పొందాడు. నీపేరేంటి అని అడుగగా, మరియొకసారి నేను ఏశావునని అబద్ధం చెప్పకుండ, నా పేరు యాకోబు అని నిజం చెప్పాడు. అంతే, యాకోబు ఇశ్రాయేలయ్యాడు. కప్పుకుంటే రాదు – ఒప్పుకుంటే వస్తుంది దీవెన!) 

3.) మోషే చేసిన ప్రార్థన.

 (నిర్గమకాండము) 32:32

32.అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాన నెను.

32:32 కీర్తన 69:28; దాని 12:1; మలాకీ 3:16-17; ఫిలిప్పీ 4:3; ప్రకటన 3:5; 20:12, 15; 21:27. ఇస్రాయేల్ ప్రజ గురించి ఇదే విధమైన ప్రగాఢ ప్రేమను రోమ్ 9:1-3లో చూడండి. వాస్తవంగా ఇతరులకు జీవం కలిగేలా వారికోసం చనిపోవడానికి సిద్ధపడినదీ నిజంగా చనిపోయినదీ యేసుక్రీస్తే. క్రీస్తు విశ్వాసులందరిలోనూ ఇలాంటి ప్రేమ ఉండాలి (1 యోహాను 3:16).

(ప్రజలు పాపం చేయగా, మోషే ఆ ప్రజలకూ – దేవునికీ మధ్య నిలిచి వారి పాపం పరిహరింపుము అన్నాడు. లేదు అన్నాడు దేవుడు. అయితే నా పేరు నీ జీవగ్రంథంలో నుంచి తుడిచెయ్ అంటూ ప్రాధేయపడ్డాడు మోషే. ఆ మాటకు దేవుడు చలించిపోయాడు. దీనత్వంతో కూడిన ప్రార్థన యిది)

4.) దావీదు మహారాజు చేసిన ప్రార్థన.

 (కీర్తనల గ్రంథము) 51:1,2,3,4

1.దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము

51:1 తన ఘోర పాపాలకు క్షమాపణ కలిగేందుకు దావీదుకు ఉన్న ఏకైక ఆశాభావం దేవుని కరుణ, అనుగ్రహమే. తాను చేసే ఏ సత్కార్యమూ క్షమాపణ కలిగించడం, తాను అర్పించే ఎలాంటి బలి అయినా సరే తన పాపాన్ని రూపుమాపడం అసాధ్యం (16, 17 వ). అతడి ఆశలన్నీ దేవుడు చూపించే కరుణపైనే. ఆ కరుణ కోసమే అతడు అర్రులు చాస్తున్నాడు (లూకా 18:13 పోల్చిచూడండి).

51:1 A 2 సమూ 11:2—12:13; కీర్తన 4:1; 51:9; 69:16; 106:45; యెషయా 43:25; 44:22; అపొ కా 3:19; ఎఫెసు 1:6-8; కొలస్సయి 2:14; B నిర్గమ 34:6-7; సంఖ్యా 14:18-19; కీర్తన 25:6-7; 40:11; 109:21; 119:124; విలాప 3:32; మీకా 7:18-19; రోమ్ 5:20-21; ఎఫెసు 2:4-7; C కీర్తన 5:7; 69:13; D కీర్తన 77:9; 106:7; 145:9; యెషయా 63:7, 15; దాని 9:9, 18

2.నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.

51:2 తాను చేసినదాన్ని వర్ణించే మూడు పదాలను దావీదు ఇక్కడ వాడాడు. అతిక్రమం, అపరాధం, పాపం. కీర్తన 32:1-2 చూడండి. దేవుని చట్టానికి వ్యతిరేకంగా చేసేది అతిక్రమం. దేవుడు దాన్ని క్షమించాలి, తుడిచివేయాలి. అపరాధాలు, పాపాలు ఒక మనిషిపై పేరుకుని ఉన్న మురికిలాంటివి, అసహ్యకరమైన మచ్చల్లాంటివి. వాటిని కడిగివేయవలసి ఉంది. పశ్చాత్తాపపడి దేవునిపై నమ్మకం ఉంచి ఆయనవైపు తిరిగిన వ్యక్తి విషయంలో ఆయన వీటన్నిటినీ చేస్తాడు (యెషయా 44:22; 43:25; యిర్మీయా 33:8; అపొ కా 3:19-20; 1 యోహాను 1:7, 9).

3.నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.

51:3 ఇది దావీదు తన పాపం బయటపడిందని ఇక గత్యంతరం లేక, హృదయంలో పరితాపం లేకపోయినప్పటికీ ఏదో పై పైన నోటి మాటలతో ఒప్పుకోవడం కాదు. అతని పాపం అస్తమానం అతణ్ణి వేధిస్తూ ఉంది. అతని కళ్ళ ఎదుటే అతని దోషం కొండంత పెద్దగా అనిపించింది. హృదయంలో ఇలాంటి భారాన్ని ఉంచేది దేవుని పవిత్రాత్మే. ఆయన ఎవరినైతే ఈ విధంగా వారి పాపాల విషయంలో బాధపడేలా చేసి ఒప్పిస్తాడో వారందరికీ ఈ కీర్తన ఇచ్చాడు. దీన్ని మనం స్వంతం చేసుకుందాం.

4.నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

51:4 బైబిలు ప్రకారం ఏ పాపం చేసినా అది మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా చేసినట్టు. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తులు దేవుని సృష్టిలో భాగం, దేవుని సొత్తు అయిన వారు. అంతేకాక ఆ పాపం ఇతరులపై ప్రభావం చూపుతుంది. వారు కూడా దేవుని సొత్తు. దేవుని సొత్తుకు హాని కలిగించడం దేవునికి వ్యతిరేకంగా నేరం చేయడమే, ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే (41:4; ఆది 9:6; 13:13; 20:6; 39:9; సంఖ్యా 32:23; 2 సమూ 12:9, 13; 1 కొరింతు 8:12). మనుషులకు దేవుడు తీర్పు తీర్చడంలోని ఒక సూత్రం మత్తయి 25:40, 45లో ఉంది. క్రీస్తుకు చెందినవారికి మనుషులు ఏదైనా చేస్తే అది క్రీస్తుకు చేసినట్టే, వారికి చేయవలసిన సహాయం చేయకుంటే అది క్రీస్తుకు చేయకుండా ఉన్నట్టే లెక్క (అపొ కా 9:4-5 పోల్చండి). దేవునికి వ్యతిరేకంగా తాను చేసిన పాపం గురించి దావీదు ఎంత ఆవేదనలో ఉన్నాడో గాని అది అప్పటికి మిగతా విషయాలన్నిటినీ ప్రక్కకు నెట్టేసింది.

(ఎంతో భక్తిగల వాడైనప్పటికీ ఆదమరచి ఆత్మీయ జీవితంలో నిద్రపోయాడు. శోధకుడు వచ్చాడు. పాపంలోకి నెట్టాడు. కూపంలో పడ్డాడు. మచ్చ వచ్చింది. సిగ్గుపడ్డాడు. పశ్చాత్తాపం సల్పాడు. మరల కృపలో నిల్చాడు. పశ్చాత్తాపమే పరమౌషధంగా మారింది) 

5.) ఏలీయా చేసిన ప్రార్ధన.

 (మొదటి రాజులు) 18:36,37,38

36.అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను-యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.

18:36 ఏలీయా నమ్మకంతో చేసిన చిన్న ప్రార్థనకూ కపట ప్రవక్తల దీర్ఘమైన గగ్గోలుతో కూడిన ప్రార్థనలకూ ఉన్న తేడా గమనించండి. మత్తయి 6:7-8 చూడండి.

18:36 A నిర్గమ 3:6; 1 రాజులు 18:29; 2 రాజులు 19:19; B సంఖ్యా 16:28-30; 1 రాజులు 8:43; C నిర్గమ 3:15-16; కీర్తన 83:18; దాని 8:13; 9:21; 12:11; మత్తయి 22:32; యోహాను 11:42; అపొ కా 3:1; ఎఫెసు 1:17; 3:14; D ఆది 26:24; 31:53; 32:9; 46:3; నిర్గమ 29:39-41; 1 సమూ 17:46-47; 1 రాజులు 18:21; 22:28; 2 రాజులు 1:3, 6; 5:15; 1 దిన 29:18; 2 దిన 20:6-7; ఎజ్రా 9:4-5; కీర్తన 67:1-2; 141:2; యెహె 36:23; 39:7; E అపొ కా 10:30

37.యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.

18:37 ఏలీయా మనసులో ఉన్న ఉద్దేశాన్ని గమనించండి – ఏదో కళ్ళు మిరుమిట్లు కొలిపే ప్రదర్శన ఇవ్వాలని కాదు, అందరూ తనను గుర్తించాలనీ కాదు గాని నిజ దేవుడెవరో ప్రజలు తెలుసుకోవాలనే. ఈ అతి ప్రాముఖ్యమైన విషయం బైబిలంతటిలోనూ నొక్కి చెప్పబడింది – నిర్గమ 9:16; యెహో 4:24 మొ।।.

38.అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.

18:37 A దాని 9:17-19; B 1 రాజులు 18:24; యెహె 36:25-27; C ఆది 32:24, 26, 28; 1 రాజులు 18:29, 36; 2 దిన 14:11; 32:19-20; యెషయా 37:17-20; యిర్మీయా 31:18-19; మలాకీ 4:5-6; లూకా 1:16-17; 11:8; D యాకోబు 5:16-17

(ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. యెహోవా దేవుడా?లేకా బయలు దేవుడా? అసలు ఎవరు దేవుడు? ఏలికలు కూడా విశ్వాసంలో గల్లంతు అయ్యారు. ఏలీయా లేచాడు. సవాలు చేసాడు. విశ్వాసంతో ప్రార్థించాడు. అద్భుతాలు చూపించాడు. కన్ఫ్యూజన్ పోయింది యెహోవాయే దేవుడని తేలింది. విశ్వాస ప్రార్థన శక్తి అది) 

6.) దానియేలు చేసిన ప్రార్థన.

 (దానియేలు) 6:10

10.ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.

6:10 దానియేలు తలుపులు మూసుకొని రహస్య ప్రార్థన చేయడం ఆరంభించలేదు. దేవునిపట్ల తనకున్న నమ్మకత్వం వల్లా, ప్రమాదం ఎదురైనప్పుడు అతనిలో కనిపించే ధైర్యం విషయంలో దానియేలు ఆనాటి వారికే గాక, అతని తరువాత తరాలన్నిటికీ గొప్ప మార్గదర్శి. ఒక పని చేయడం సరి అని అతడు అనుకొంటే అందువల్ల కలిగే ఫలితాలను లెక్క చెయ్యకుండా చేసేవాడు.

6:10 A కీర్తన 34:1; 55:17; 95:6; అపొ కా 5:29; ఫిలిప్పీ 4:6; 1 తెస్స 5:17-18; B 1 రాజులు 8:44, 54; కీర్తన 5:7; దాని 6:13; అపొ కా 9:40; హీబ్రూ 13:15; C 1 రాజులు 8:48-50; యోనా 2:4; అపొ కా 10:9; D 1 రాజులు 8:38; E 2 దిన 6:13, 38; ఎజ్రా 9:5; నెహెమ్యా 6:11; కీర్తన 11:1-2; 86:3; మత్తయి 10:28-33; లూకా 12:4-9; 14:26; 22:41; అపొ కా 2:1-2, 15; 3:1; 4:17-19, 29; 5:20, 40-42; 7:60; 20:24, 36; 21:5; ఎఫెసు 3:14; ఫిలిప్పీ 1:14, 20; కొలస్సయి 3:17; హీబ్రూ 4:16; ప్రకటన 2:10, 13

(రాజుకు తప్ప మరి యే దేవునికి ప్రార్థించొద్దు అంటూ కుళ్లుబోతులంతా ఒక శాసనాన్ని తెచ్చారు. ప్రార్థనా పరుల ముందు శాసనాలు సీసపు పెంకులా పగులుతాయని తెలీదు వారికి. దానియేలు మిద్దెనెక్కి ప్రార్థిస్తే గద్దెమీద ఉన్నవాడు గడగడలాడి పోయాడు. జీవంగల దేవుని సేవకుడవైన దానియేలూ అంటూ మరి మరి సాగిలపడ్డాడు) 

VII. మనం చేసే ప్రార్థనలు 

(ప్రార్థన చేస్తాం – జవాబు రాకపోతే అలుగుతాం. అడిగేది ఆయన చిత్తం కాదని తెలిసినా నువ్వే అడ్జస్ట్ అయిపో ప్రభూ అంటాం. రెండు నిమిషాలు ప్రార్థిస్తాం – రెండువేల ఆశీర్వాదాలు అడుగుతాం. పాస్టర్ గారూ ప్రార్థన చెయ్యండి అంటాం – ఫలితం రాకపోతే పాస్టర్లో పవర్ లేదు అంటాం. ఎటుబోయిన మనతో చిక్కే) 

భక్తుని ప్రార్థనకు ప్రప్రథమంగా ప్రతిస్పందించేదే పరలోకం. నరలోకానికి ఈ సూత్రం అర్థమైతే నరకం నుంచి అనేకమంది నరులను రక్షించవచ్చు. 

1 thought on “భక్తుల ప్రార్థనలు|Sevakula Prasangaalu pdf | Telugu Christian Books Pdf”

Leave a comment