ప్రసంగ శాస్త్రం
పార్ట్ 2
prasanga-sastram-telugu-pdf-telugu
ప్రసంగీకుని వ్యక్తిత్వానికి సూచనలు:
1. నీవు నీవుగా ఉండు:
నిశ్చింతగా, సహజంగా, ఏఓత్తిడిలేకుండా ఉండు, ఆందోళన పిరికితనాన్ని కల్గిస్తుంది. నీ భయం ప్రజలకు అర్థమైపోతుంది. అందుకే నిశ్చింతగా ఉండు.
2. ఇతరులను అనుకరించాలని ప్రయత్నించకు:
“దేవునికి కేవలం నీవే” కావాలి కాబట్టి ఆయన నిన్ను ఎన్నుకున్నదానికి తగ్గట్టుగా జీవించు. ఉదా:- సౌలు వస్త్రాలు దావీదుకు సరిపడలేదు. 1 సమూ 17:38,39
3. నీ పట్ల నీవు నమ్మకముగా ఉండు.
నమ్మకత్వం, యధార్థత ప్రసంగీకునికి చాలా అవసరం. నీవు దేవుని “వారధివి” ఆయన మానవాళితో మాట్లాడే మైక్ వంటివాడివి. కాబట్టి వేషధారణలేని జీవితాన్ని కలిగియుండు.
4. నీ శ్రోతలు నిన్ను మించి ఎదగరు:
“నీ జీవితం ఏలాగున వుంటుందో అదియే నీ శ్రోతలలో కనబడుతుంది.” నీ మనస్సు ద్వేషిస్తే వారి మనస్సు ద్వేషిస్తుంది. నీ వెప్పుడు నీలాంటి వారినే తయారు చేస్తావు (ఆది 1:12, 21)
5. మనస్ఫూర్తిగా ప్రవర్తించు:
అంటి అంటనట్లుగా ప్రవర్తించువాడు గొప్ప విజయాలను సాధించలేడు.
J. ప్రసంగీకునికి సూచనలు:
1. శ్వాస సరిగా తీసుకోవడం:
నీ ఉపిరితిత్తుల అట్టడుగు భాగం వరకు శ్వాస తీసుకో ఒక్క క్షణం తర్వాత మెల్లగా బైటకు వదులు. సరిగా శ్వాస తీసుకోకపోతే సగం నిండిన టైరుతో బండిని నడిపినట్లుంటుంది.
2. ఉచ్చారణ:
మాటల ‘స్పష్టంగా పలికే కళ ‘మాటలు వినుటకు సులువుగా ఆత్మకు మేలుగా వుండాలి” ఉదా: పిలి, ఫీలి, ఏవేలు, యోవేలు,
3. స్వర స్థాయి:
మనిషి కంఠంలో ఎన్ని స్వరాలున్నాయి. ప్రసంగమంతా ఒకే స్థాయిలో ఉండకూడదు. తారా స్థాయి, క్రింది స్థాయి (శ్రేణిలో) మాట్లాడడం అలవర్చుకో. ఉదా:- ఒకే కూరతో భోజనం.
4. ప్రసంగం యొక్క వేగం:
ఎప్పుడు ఒక్కటేరీతిగా మాట్లాడతారు. ప్రజల ‘నాడి’ నెరిగి ప్రసంగీంచుటకు ప్రయత్నించు విపరీతమైన వేగాన్ని నియంత్రించు.
5. ధ్వని పరిమాణం:
ఈహెచ్చు, తగ్గుల వలన నీవు చెప్పాలనుకున్నది ప్రజలకు స్పష్టముగా అర్థవంతముగా చెప్పవచ్చు. ప్రజలను ఆలోచింపచేయు విషయం దగ్గర కాస్తంత వెసులుబాటు తీసుకో.
6. పునరుశ్చరణ:
అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు మరల, మరల చెప్పుట వలన ప్రజల హృదయాలలో నాటుకొనే చక్కని అవకాశం ఉంది.
7. విరామం:
విశ్రాంతి అంటే నిద్రపోమ్మని కాదు గాని ప్రజల హృదయ స్పందన తెలుసుకునే సమయంలో కొద్ది పాటి వెసులుబాటు.
8. నిన్ను నీవు మర్చిపో.
జంకుగా మాట్లాడవద్దు. జంకితే నాలుక మందమౌతుంది. మాటలురావు. ఉదా: అడవిలో రాజు సింహంవేదికపై నీవే సింహం.
9. మత సంబంధమైన కంఠాన్ని ఉపయోగించకు:
ప్రసంగం నటన కాదు నిజ జీవితం. సహజంగా దయనొందిన జీవితంలో వాడే నీ కంఠాన్నే ప్రసంగంలో ఉపయోగించు.
10. మరీ మెల్లగా మాట్లాడకు:
ప్రజలు పట్టి పట్టి వినాల్సిన పరిస్థితి కలుగ నీయ్యకు. సమయం వర్తమానం వృధా అవుతుంది.
11. మరీ గట్టిగా అరవకు:
ఆరంభము నుండే అరచి అత్యంత కీలకమైన ముగింపు సమయానికి కంఠము లేకుండా చేసుకోకు.
12. స్థాయిలోను, వేగంలోను మార్పులు:
విసుగుపుట్టించే విధంగా గాక నది ప్రవహము వలె స్వర స్థాయిని ఉపయోగించు.
13. ప్రేక్షకులు అంగీకరించేలా చేసుకో:
మొదటిగా వారి బాగోగులు అడిగితెలుసుకో.
14. వస్త్రాధారణ తగిన విధంగా వుండాలి:
చాలి, చాలని, కళ్ళు మిరిమిట్లు గొల్పునట్లు జిగేల్ జిగేల్ మంటు వుండే వస్త్రాల జోలికి పోవద్దు. మర్యాద పూర్వకమైన వస్త్రాధారణ అవలంబించు.
15. సరిగా నిలువబడుట నేర్చుకోవాలి:
వేధికయనునది రాకరాక వచ్చిన అవకాశం మరల రాదు ఇక్కడే చూపిస్తా ప్రతాపం అంటు ఫోజిలివ్వడం మాని ప్రజలను ప్రభావితం చేయు వర్తమానం అందించు.
16. భాష, పదజాలం:
తనకు తెలిసిన ‘భాషలోనే’ మాట్లాడాలి. అంతేగాని ఇంగ్లీష్, హిందీ, గ్రీకు, హెబ్రీ, మళయాళం మరియు తెలియని ఇతర భాషలలో మాట్లడే ప్రయత్నం చేయరాదు. ‘తెలుగు’ భాషలో మాట్లాడుట తెలిసి, ధారళముగా వచ్చికూడా ప్రసంగం మధ్యలో వేరొక భాషలో ప్రాక్టీస్ చెయ్యదలచిన యెడల ప్రజల యెదుట చులకన అయ్యే ప్రమాదం వుంది.
17. చూపు:
వర్తమానికుడు వ్యర్థ, విషపుచూపులను విసర్జించి దైవ దృష్టి కల్గియుండాలి. వర్తమానికుడు ప్రజలవైపు సరిగా చూస్తూ ప్రభోధనాలు అందించాలి. అంతేగాని దిక్కులు చూస్తూ అటు, ఇటు, చూస్తూ కాదు. మన నోటికి మనకన్నులు మంచి ఆత్మీయ సందేశమును అందించగలవు.
18. కన్నులు మూసుకొని ప్రసంగీంచుట:
కన్నులు మూసుకొని ప్రసంగీంచుట సంఘాలలో ప్రత్యేక సందర్భాలలో వుండాలి. బహిరంగ స్థలంలో కన్నులు మూసుకొని ప్రసంగీస్తే ప్రజలపైనో, అతిధులపైనో పడే ప్రమాదం వుంది.
19. నీ కదలికలు సహజంగా, సందర్భానుగుణంగా ఉండాలి.
నీ ప్రవర్తన కూడా ప్రసంగమునకు వన్నెతెస్తోంది. సమయసందర్భానుసారంగా కదలికలు ఉండాలి
20. ముఖ కవళికలు:
బలమైన సందేశము ముఖ కవళికలు ద్వారా ప్రజల యొద్దకు స్పష్టంగా వెళ్తుంది. అతిహావభావాలు ప్రదర్శించినచో తీవ్రమైన, విచారకమైన పరిణామాలకు దారితీయవచ్చును. సందర్భాన్ని బట్టి ముఖకవళికలు వుండనివ్వు.
21. వేధిక
నేధికను అందమైన రీతిలో సాధ్యమైనంత వరకు సిద్ధపరచుము. వెలుతురు సరిగా పడనివ్వాలి. ఇదియే మంచి సమయం మరల రాదు ఇలాంటి తరుణమని ఎగిరేగిరి దూకే ప్రయత్నం చెయ్యకు.
-మైక్ సిస్టమ్ విషయములో జాగ్రత్తవహించు.
-వాయిద్యములు విషయములో జాగ్రత్తవహించు.
– కార్యక్రమ నిర్వహణ విషయములో జాగ్రత్తవహించు.
22. సమయం:
వేధిక పైకి వెళ్ళితే సహజంగా ప్రసంగీకునికి సమయం తెలియదు. అయితే ప్రాంత, ప్రజలు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి.
– ప్రజల సమయం గుర్తించాలి.
– వెనుక వర్తమానికుని సమయం గుర్తించాలి.
– వేధిక సమయం గుర్తించాలి.
– గ్రామ, ప్రాంత, పట్టణ సమయం గుర్తించాలి.
– కన్వీనర్ మనకిచ్చిన సమయం గుర్తించాలి.
23. వినువరుల నాడి కనుగొనడం అవసరం:
ప్రసంగం మధ్యలో ప్రేక్షకులు ముందునుండి, మధ్యలోనుండి మరియు చివరినుండి లేస్తూ, తిరిగుతూ వుంటారు. వీరిని క్రమంలో పెట్టుటకు ఆకర్షించు విషయాలు తెలియజేయాలి. అంతేగాని ‘జోలపాట’ పాడుతున్నట్లు ప్రసంగాన్ని కొనసాగిస్తుండకూడదు.
K. ప్రసంగ మార్గదర్శక సూత్రాలు:
1.తేలికగా వివరించు లేఖన భాగము నెంచుకోవాలి.
2. సమయానికి తగినట్లుగా సిద్ధపరచుకోవాలి.
3. ఆత్మీయ పాఠాలు నేర్చుకున్న సందర్భాలు వాటి నుండిప్రసంగీంచుటకు ఇష్టపడాలి.
4. పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించి ప్రార్థించాలి.
5. వర్తమానికుని ‘పరిధి’ గుర్తించి వ్యవహరించాలి.
6. సందర్భాలకు అనుగుణంగా లేఖనాలు ఎంచుకోవాలి.
7. వినువరులను దృష్టిలో ఉంచుకోవాలి.
8. ప్రార్థనా పూర్వకముగా ఆరంభించాలి.
9. ఎంచుకున్న భాగాన్ని అనేకమార్లు చదివియుండాలి.
10. సరియైన రీతిలో పేపర్లో సమకూర్చుకోవాలి.
11. భక్తుల మంచి పలుకులను చదువుచుండేవారమై యుండాలి.
12. ఆసక్తికరమైన విషయాలను ప్రజల చేత చెప్పిస్తూండాలి, చదివిస్తూండాలి.
13. నవ్వించే సమయంలో నవ్వించాలి.
14. అభినందన మాటలు మరువవద్దు.
15. చివరికి కృతజ్ఞతలు తెలియజేయువారమై యుండాలి.
16. ముగింపు స్పష్టంగా, సూటిగా, తేలికగా మరియు ప్రత్యేకముగా వుండాలి.
L.ప్రసంగ రకములు:
‘ప్రసంగీకుని పరిచర్యకు ఇవియే చక్కని వన్నె తెస్తాయి”. ప్రతి సంఘ కాపరి వీటన్నింటిని గూర్చి మరియు వీటిని ఉపయోగించు విధము తెలుసుకొనుట మంచిది. సంఘ సభ్యులలో ఆధ్యాత్మిక ఆసక్తి మరింత మెరుగుపడును.
1. పాఠ్యభాగ సంబంధ ప్రసంగం:
లేఖనములోని ఒక వాక్యభాగం ఆధారంగా ప్రసంగించే శైలి. వాక్యాన్ని ఎంచి పరిశోధించి, విశ్లేషించి ఆ మాటల భావమును తెలియజేయుట.
ఎ. ఆసక్తి రేకెత్తించును:
చిన్న భాగములోనుండి ఎన్ని సంగతులు, ఎన్ని తలంపులు మరియు నూతన ఆలోచనలు బయలు పరుస్తారయని ప్రజలు ఎంతో ఆతృతతో, ఆశక్తి కలిగి ఉంటారు.
బి. దృష్టి మళ్లనివ్వదు:
వాక్యమును చదివే సమయములోనే ప్రజల మనస్సులను, ఆకట్టుకొనేట్టుగా వుండాలి. మరొక వాక్యమును చూపించకుండా దానినే వివరిస్తుంటే ప్రజల దృష్టి మరలలేదు.
సి. ధైర్యము పెంచుతుంది:
ఎక్కువగా అధికారయుతముగా మాట్లాడుటకు అవకాశం ఇందులో వుంటుంది. అధికారముతో మాట్లాడే కొలది ధైర్యము మరింత పెరుగుతుంది.
డి. మనస్సులో నిలిచిపోతుంది:
ఈ సందేశము మరచుటకు వీలుపడదు. ఎల్లప్పుడు ఇది నిలిచియుంటుంది. ఫలింపజేస్తోంది.
2. ఆంశ ప్రధాన ప్రసంగం:
ఈ విధానములో ప్రసంగీకుడు ఒకే ఒక ప్రత్యేక అంశమును గూర్చి బోధించాలని తలంచుట. ఉదా:- పరిశుద్ధముగా జీవించుట, నీతిమంతుడుగా తీర్చిందిద్దబడుట, దేవునిరాజ్యం, తీర్పు ఈలాంటి విధానంలో సాధ్యమైనంత వరకు అంశమును బలపరచే వాక్యములనే ఎంపిక చేసుకోవాలి.
3. వివరణాత్మక ప్రసంగం:
ఈ పద్ధతి ద్వారా ఒక భాగాన్నిగాని, ఒక అధ్యాయాన్నిగాని, ఒక పుస్తకమునుగాని, దాని అర్థాన్ని, అంతర్లీనంగా మరుగునవున్న సత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం. దైవ సంకల్పమును తెలియజేయు పద్దతి (అ.కా20:27).
4. సాదృశ్య సంబంధమైన ప్రసంగం:
ఈ విధానంలో బైబిల్లో ముంగుర్తులుగా ఉన్న పలు విషయాలను వెలికితీసి సత్యాలను వివరించి చెప్పడం. భవిష్యత్ కాలంలో జరగబోతున్న సంగతులను గూర్చి ప్రవచనాత్మకమైన వాక్యములను ఆధారముగా చేసుకొని వాటి గూర్చి భోదించుట.
ఎ. ఉపయోగపడు సూత్రాలు:-
i)సుళువైన సాదృశ్యాలను ఉపయోగించు వివరణ, అన్వయం స్పష్టంగా ఉండే సాదృశ్యాలనుఎంచుకోండి.
ii)సత్యాన్ని సరిగా వివరించుటకు విశాలమైన దృక్పదం అవసరం.
iii) సంకుచితంగా ఉండవద్దు. సొంత ఊహగానాలు ఎంత మాత్రము తగవు.
iv) దిద్దుబాటును అంగీకరించుటకు ఇష్టపడు. నీకన్న ఆత్మీయులు నీలోపాల్నిఎత్తి చూపితే సరిచూసుకొని సరిచేసుకో.
5. జీవిత చరిత్ర ప్రసంగం:
బైబిల్లో అనేక మంది వ్యక్తుల జీవితాలను గూర్చి నేర్చుకుంటూ వారి యొక్క మంచి నడవడిని మన ఆత్మీయ జీవితములో ఎన్నిక చేసుకొనుట.
6. విశ్లేషణాత్మక ప్రసంగం:-
ఈ ప్రసంగంలో మనము ఎన్నుకున్న అంశాన్ని చాలా ‘వివరముగా’ చదివి దానిలో దాగిన ఆసక్తికరమైన సత్యాలను వెలికితీయుటయే.
7. ఉపమానరీతి ప్రసంగం:
బైబిలు నందు ఉపమాన రీతిగా వ్రాయబడిన విషయాలు చాలా చక్కగా వున్నాయి. ఎక్కువగా ఒక విషయాన్ని గూర్చి చెప్పుచూ దానిలోఉన్న ఆత్మీయ సత్యమును తెలియజేయుట. సమానముగా నున్న రెండు విషయములను పోల్చి వివరించడము. ఈ ప్రసంగములో ఒక సత్యమును మరొక దానితో పోల్చి చెప్పడము.
రచయిత
యమ్. ప్రసాద్ గారు
ప్రసంగ శాస్త్రం పార్ట్ 1 కొరకు క్లిక్ చేయండి.
Good