థామస్ అల్వా ఎడిసన్ సాక్ష్యము|thomas-alva-edison-story-telugu3

Written by biblesamacharam.com

Published on:

థామస్ అల్వా ఎడిసన్ సాక్ష్యము

thomas-alva-edison-story-telugu

ప్రపంచ శాస్త్రజ్ఞులు నూటికి తొంబైఎనిమిది మంది శాస్త్రజ్ఞులు ఆస్తికత్వమును అంగీకరించిన వారే, వీరు 92మంది విజ్ఞాలుసత్యాన్ని అన్వేషించి యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారే ఈయనపేరు Thomas Alva Edison ఇతను ప్రపంచఖ్యాతి గాంచిన గొప్పవిజ్ఞాని క్రీ॥శ 1847సం.ఫిబ్రవరి 11వతేదిన USA లోని Milan నందు జన్మించెను. ఇతని తల్లిదండ్రులైన Samuel Edison, Nancy Edison ఇతనిని అతి గారంబముగా పెంచుచుండిరి, ఇడిసన్ నకు ముందు ముగ్గురు పుట్టి చనిపోయిరి ఇంచేత Samuel Edison గాని Nancy Edison గాని ఇతని బహుజాగ్రత్తగా చూచుకొనేకవారు Edison ఏడుసంవత్సరాలప్పుడు అతన్ని School నకు తీసికెళ్ళారు అయితే అతను పుట్టిన నాటనుండి ఆరోగ్య పరంగా చాలా బలహీనుడు, ఎవరెదన్న చెబుతున్నప్పుడు దానిని అర్దము చేసికొను శక్తి యుండేదికాదు, నవ్వుకొంటు దిక్కులు చూస్తుండేవాడు School లో చేర్చబడిన పిమ్మట, మిగిలిన పిల్లలు హేళన చేస్తుంటే Teacher కూడా వీడు పనికిరాడు తీసికొని వెళ్ళండి చెప్పేసరికి, Edison తల్లిగారైన Nancy Edison అక్కడున్న వారందరితో Chalange చేసి మీ అందరిలో నాకుమారుడు గొప్పవాడుగా రాణించక పోతే నేను దేవుని బిడ్డను కానెకానని సవాలు చేసి కన్నీళ్ళతో తన కుమారుడైన Edison తీసికొనియింటికొచ్చింది. దాంతో బడిమాటే లేదు Edison జీవితంలో. అయితే తనతల్లి ఒడియే బడిగా మార్చబడినది అర్ధము చేసుకొనేశక్తి లేని Edison ను అర్ధము చేసికొన్న తల్లి వానికి తగినట్లు బోధింప ప్రారంభంచింది. దేవుని నామమున చేసిన సవాలు ప్రకారము ఒక్కొక్కసారి కన్నీళ్ళతో ప్రార్థించి అతనికి నేర్పించడమైంది. నిజంగా Nancy Edison గారి కన్నీటి ప్రార్ధన, భక్తితో కూడిన భోదన అతనికి మంచి జ్ఞాపకశక్తిని, grasping power యిచ్చింది ఆపై తల్లిగారు చెప్పుచున్న ప్రతిదిని గ్రహించుట ద్వారా తనకుతానే చదువ శక్తి పొందాడు.

Edison ఆరోగ్యపరంగాను, మానసికము గాను చాలా బలహీనుడు. చిన్ననాటి నుండి విని నిమిత్తము విపరీతమైన ఖర్చౌతుండేది అయితే Samuel Edison గారి సంపాదనము సరిపోయేదికాదు, ఇంచేత 12సంవత్సరాల నుండి railway station లో news papers అమ్ముతూ అందులో వచ్చిన ప్రతి లాభమంతటిని తన తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. క్రమము తప్పకుండా తల్లితండ్రులతో కలిసి church కి వెళ్ళేవాడు దైవజనులు చెప్పేటి ప్రసంగాలను గూర్చి పరిశోదించేవాడు.

ఇతనికి 16సంవత్సరాలప్పుడు telegraphist జాబొరికింది తల్లిదండ్రులు కూడ వీని కెక్కువ pocket money ఇస్తు అతని ప్రోత్సాహపర్చారు. దాంతో సంఘకాపరి, తల్లి Nancy Edison గారి ప్రార్ధన సహయముతో loboratory ప్రారంభించాడు, తల్లి ఒడిలో నేర్చుకొన్న చదువుతో దేవుని పేరట తనలోని స్వయంకృషితో Thomas Alva Edison ప్రపంచానికి చేసిన మేలులు ఎన్నెన్నో. ఒక్కసారి ఊహించుచూడు Edison bulb కనిపెట్టక పోయుంటే ప్రపంచమంతయు గాఢందకారమే అంతమాత్రమే దాదాపు 1000 విజ్ఞాన విధములను కనిపెట్టి ప్రపంచానికి ఉపకారము చేసినవాడు .

1882సం..సెప్టెంబరు 4న New york నగరమందు వేలాదిమంది పట్టుగలిగిన ఒక పెద్ద చిమ్మచీకటి ప్రదేశములో వేలాది ప్రజలు కూడి ప్రపంచవింతను చూచుటకు కూడియుండగా, Thomas Alva Edison ప్రార్థనతో కూడిన ప్రయాస ఫలితంగా switch ఆన్చేసాడు. ఏకాధాటిగా 1000దీపాలు (విద్యుత్) వెలిగాయి దాంతో ప్రపంచము వెలుగుమయమై పోయింది. దీనిని తిలకించిన వారందరూ Edison ప్రశాంసిస్తూ ఆయన్ను ఘనపరచి ఆయనను మాటలాడమన్నప్పుడు Edison నేను పుట్టుకతో ఆరోగ్యపరంగా బలహీనుడను schoolలో చదువుకొనుటకైనను అర్హుడను కానని పంపేశారు. అయితే నా తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు గలవారు. నా తల్లి నా విషయమై బహు శ్రద్ధ కలిగి దేవుని ప్రార్థించి నాకు చదువు నేర్పింది, ఆమె ప్రేమా, దయ, ఓర్పు ప్రార్థనతో కూడిన నేర్పు, ఆమె కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది. ఈరోజు మీ మధ్య గొప్పవ్యక్తిగా నిలువబెట్టింది. యోబు 28:3 వాక్యము నెరవేర్పుగా దేవుడు నా ప్రయత్నమును సఫలము చేసాడు. నా విజయానికి కారణం నాతల్లి కన్నీటి ప్రార్ధనేయని సాక్ష్యమిచ్చాడు Thomas Alva Edison.


మిషనరీ జీవిత చరిత్ర లు కొరకు క్లిక్ చేయండి.

Leave a comment