ప్రసంగ శాస్త్రం | homiletics-prasanga-sastram-telugu-pastors | encounter 2023

Written by biblesamacharam.com

Updated on:

  ప్రసంగ శాస్త్రం.

రచయిత: యమ్. ప్రసాద్ గారు.

ఆగాపె బైబిల్ స్కూల్ ఉపాధ్యాయులు.

ఉపోద్గాతం.

పరిచయం :  homiletics-prasanga-sastram-telugu

1. ప్రతి క్రైస్తవుడు నడిచే ప్రసంగాలు కావాలి . _సెయింట్ ఫ్రాన్సిస్

2. పరిశుద్ధాత్మ నడిపింపు లేనిచో మౌనంగా ఉండవలెను కానీ సొంత ప్రసంగాలు అందింపరాదు _చార్లెస్పర్జన్.

3.)“ ప్రపంచాన్ని నడిపించేది వేదిక” అనులోకోక్తి కలదు ప్రసంగానికి ప్రజలను చలింప చేయగలిగే అద్భుతమైన శక్తి కలదు.

4.) రక్షణ సువార్తను ప్రకటించుటకు దేవుడు నిర్దేశించిన ఏకైక మార్గము ప్రసంగము అని అపోస్తలుడైన పౌలు చెప్పెను.

5.)  సంఘ పితామహులు కూడా సువార్త ప్రకటనకు ఇదే మార్గమును అనుసరించిరి తెర్తూలియన్,ఐరేనియాన్,క్రిసోస్టొమ్ అనువారు ఈ మార్గమును అవలంబించిరి _క్రిసోస్టొమ్ బిరుదు “గోల్డెన్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్”

 6.) 16 వ శతాబ్ధంలో మార్టిన్ లూథర్ తన గొప్ప ప్రసంగముల ద్వారా సంఘములో ఆశ్చర్యకరమైన పునరుద్ధరణను తీసుకొని వచ్చెను వీటన్నిటిని బట్టి క్రైస్తవ్యంలో ప్రసంగం అన్నది ఎంత కీలకమో అర్థమవుచున్నది.

7.)  క్రైస్తవ్యంలో యేసు క్రీస్తు ప్రప్రధమ గొప్ప ప్రసంగీకుడు. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాటలాడి ఉండలేదు (యోహాను 7:46)

దేవుడు తన జనులకు వివిధ రీతులుగా చక్కని:

ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తాడు:

1.)ప్రవక్తల ద్వారా దేవుడు పాఠాలు పాటలు మనమెరుగుదము

2.) పరిశుద్ధ భక్తుల జీవితాల ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు.

3.) ప్రభువైన ఏసుక్రీస్తు జీవితం ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు.

5.) ప్రకృతిలో జరిగే మార్పుల ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు.

4.) పామరులు, పండితుల జీవితాలు ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు.

6.) ప్రతికూల సంభవాల ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు.

7.) ప్రభుత్వముల ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు

8.) పరిశుద్ధాత్ముని పరలోక ప్రత్యక్షతల ద్వారా దేవుడు నేర్పించే పాఠాలు.

దేవుని పొక్కిసము (గుంట) తరగ నటువంటిది నాకు కావలసినవన్నియు దానిలోనుండి తీసుకొనుచున్నాను.

(10 వేల ప్రార్ధనలకు జవాబు పొందిన గొప్ప సేవకుడు) _ జార్జి ముల్లర్

 

ప్రసంగశాస్త్రమును వ్యాఖ్యాన శాస్త్రమును నేర్చుకొనుటకు

ముందు గుర్తించవలసిన తొమ్మిది విషయాలు

1.)  నేర్చుకోవాలన్న చురుకుదనం తపన చాలా అవసరం.

(ఎజ్రా) 7:10 .ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.

2.) సాఫల్యతను గూర్చిన నమ్మకం అవసరం.

(ఎఫెసీయులకు) 3:4 మీరు దానిని చదివినయెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.  ఇందులో సఫలులు కాగలమనే విశ్వాసం.

3.) దైవిక సత్యము పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండాలి.

2 థెస్స2:9 .నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను,మహత్కార్యములతోను

10.దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును

11.ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,

12.అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.

“మోసం చేయు శక్తి కలదు”

“సత్యము యొక్క శక్తి కలదు”

4.) ప్రయాసపడుటకు ఆసక్తి కలిగి ఉండాలి 2 తిమోతి 2:15,

15.దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను,  సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.

 (మొదటి పేతురు) 3:15

15.నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

5.) స్వార్థ భావాలు లేకుండా అధ్యయనం చేయాలి.

అపోస్తులు కార్యాలు17:11

11.వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుకు కృషి ఉండాలి తద్వారా కృప దొరుకును నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి . నైపుణ్యతలో దీనత్వం ఇమిడి ఉండాలి.

ఉదా:మోషే ,పౌలు

1 కోరింద్ధీ 2:1-5.

1.సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.

2.నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.

3.మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద   నుంటిని.

4.మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని,

5.నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.

గర్వము నుండి దూరంగా ఉండుటకు మనకుఅవసరమైనవి.

1.)  మనమే సమస్త జ్ఞానమునకు ఆధారము కాదు అని సదా మనసులో  ఉండాలి.

2.) సంవత్సరాలు గడిచే కొద్ది మనం వ్యాఖ్యానించే వాక్యభాగాలను బట్టి  దానిని గురించిన మన అభిప్రాయం మారవచ్చు.

3.) నేను కనిపెట్టిన విషయాలు మరెవరు కనిపెట్టలేరు అనే అభిప్రాయం నుండి బయటపడాలి.

{వాక్యాన్ని గౌరవించు వాక్యములో జీవించు}

7.) దేవుని వాక్యం పట్ల గౌరవం ఉండాలి.

(మొదటి థెస్సలొనీకయులకు,) 2:13

13.ఆ హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

(రెండవ తిమోతికి) 3:16,17

16.దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,

17.ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.

8.) దైవిక చిత్తాన్ని జరిగించాలన్న ఆశ నాలో బలంగా ఉండాలి.

మనము నేర్చుకునేది ఎందుకు?

1.) గొప్ప సాహిత్యమనా?

 2.) ఉత్సాహం దొరుకుతుందనా?

 3.) వాదములలో గెలుపు వస్తుందనా?

4.) వాక్యములో తప్పులు వెదకవచ్చుననా?

 5.)మంచి వారమని నిరూపించుకొనుటకా?

కాదు తండ్రి చిత్తం జరగాలి.

 (కీర్తనల గ్రంథము) 40:8

8.నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

9.) దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి.

– దేవుని అడిగి ధారాళముగా జ్ఞానం పొందుకోవాలి

 (యాకోబు) 1:5

5.మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

♦(శాస్త్రుల మాటలకేమి గానీ లేఖనాలు ఏమి చెప్పుచున్నవి మార్టిన్ లూథర్.)

ప్రాథమిక విషయాలు.

♦ ప్రసంగశాస్త్రమును ఆంగ్లంలో హోమిలిటెక్స్ అందురు దీనిని గ్రీకులో హోమిలియో అంటారు.

గ్రీకు పదముల నుండి ఉద్భవించినది దీని అర్థం “అన్యోన్యత గల వారి మధ్య జరిగే సంభాషణ”

♦ ఇది క్రైస్తవ్యంలో నీవు ఇతరులకు తెలియచెప్పాలనుకున్నది ఒక పద్ధతి ప్రకారంగాను వరుస

క్రమంలో తెలియచేయుటయే. ప్రసంగించుట,బోధించుట అనునది దేవుని యొక్క ఉచితమైన వరం.

♦  ప్రసంగ శాస్త్రమునకు శిరస్సువంటి ఓ దివ్య వచనం పవిత్ర గ్రంధమందు

నిక్షిప్తమై ఎంతో ఘనముగా విభజించబడియున్నది.

(రెండవ తిమోతికి) 2:15

15.దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను

(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.

♦ ప్రసంగీకునికి ఈ వచనం ప్రాతిపదికగాను ఎంతో పారదర్శకముగానుఉండను.

– ప్రాథమిక వర్తమానికునికి అత్యంత ఆవశ్యకమైన వచనమిది

ఇందు గమనించదగిన విషయాలు.

1.) దేవుని యెదుట యోగ్యునీగాగాను ఉండవలెను.

వక్తలు, భక్తులు , దైవోక్తులు అందించిరి ఉదా:యోసేపు

2.)సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి.

యిర్మియా,యేషయా.

3.)  సత్య వాక్యమును సరిగా విభజించు వానిగాను ఉండవలెను

– పౌలు ఎజ్రా

4.) ఉత్తమమైన రీతిలో ఉపదేశించువానిగా ఉండాలి.

 – యేసుక్రీస్తు.

5.) దేవుడు చూస్తున్నాడని మెలకువ కలిగి ఉండాలి.          

రచయిత:

 యమ్. ప్రసాద్ గారు

 

4 thoughts on “ప్రసంగ శాస్త్రం | homiletics-prasanga-sastram-telugu-pastors | encounter 2023”

  1. ప్రభువు నామంలో వందనాలు సార్ దీని కొరకు నేను చాలా సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నాను ప్రజలకు ఈ వాక్యం అందించాలి అప్పుడు గాని బైబిల్ మీద అవగాహన వచ్చి దేవుని మీద ఇంకా విశ్వాసం ఉంచుతారు

    Reply

Leave a comment