నూతన యెరూషలేము .
where is heaven | Bible Telugu
“అంతట నేను క్రొత్త ఆకాశమును మును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు- ఇదిగో దేవుని నివాసము మనుష్యు లతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడైయుండును”. (ప్రకటన 21:1-3))
“ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది” (ప్రకటన 21:16). where is heaven | Bible Telugu
ఆ పట్టణము పొడవు 750 కోసులు అనగా 1500 మైళ్ళు లేక 2400 కిలో మీటర్లు! దాని వెడల్పు కూడా 1500 మైళ్ళు, దాని ఎత్తు కూడా 1500 మైళ్ళు! పొడవు 1500 మైళ్ళు, వెడల్పు 1500 మైళ్ళు, ఎత్తు 1500 మైళ్ళు అనగా 1500 × 1500 × 1500 అనగా 22,50,000 చదరపు మైళ్ళ విస్తీర్ణత కలిగి, 1500 మైళ్ళు ఎత్తు గల చతురస్రము! ఒక మైలు దూరము ఒక అంతస్థుగా ఎంచిన, ఒక్కొక్క అంతస్థు 22,50,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన 1500 అంతస్థులు కలిగిన ఆ పట్టణము ఎంత పెద్దదో, విశాలమైనదో ఆలోచించండి!
చచ్చవుకముగా ఉన్న ఈ పట్టణము ఒక్కొక్కవైపు మూడేసి గుమ్మములు కలిగియున్నది. మొత్తం పండ్రెండు గుమ్మములు! ఆ పట్టణ ప్రాకారము నూట నలువది నాలుగు మూరలు అనగా 216 అడుగులు! “ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.
మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము. ఆ పండ్రెండు పునాదుల పైన గొట్టెపిల్ల యొక్క పన్నిద్దరు అపొస్తలుల పేళ్లు కనబడుచున్నవి. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక్క గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీథి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది” (ప్రకటన 21:18-21). where is heaven | Bible Telugu
మొదటిది సూర్యకాంతపు రాయి, అనగా వజ్రము వలె ప్రకాశించే తెలుపు; రెండవది నీలము, అనగా నీలిరంగు; మూడవది యమునా రాయి అనగా ఆకాశ నీలము; నాలుగవది పచ్చ, అనగా ఆకుపచ్చ; అయిదవది వైఢూర్యము, అనగా ఎరుపు తెలుపు; ఆరవది కెంపు, అనగా జ్వాలల ఎరుపు; ఏడవది సువర్ణ రత్నము, అనగా బంగారము రంగు; ఎనిమిడవది గోమేధికము, అనగా సముద్రపు పచ్చ; తొమ్మిదవది పుష్యరాగము, అనగా పారదర్శకమైన ఆకుపచ్చ; పదియవది సువర్ణల శునీయము అనగా నీలము కలిసిన ఎరుపు; పదకొండవది పద్మరాగము, అనగా ఎరుపు; పన్నెండవది సుగంధము అనగా ఊదారంగు!
కన్నులు మిరుమిట్లు గొలిపే వివిధ వర్ణములతో కూడిన ఈ పండ్రెండు అమూల్యమైన రత్నములతో కట్టబడిన ఈ పట్టణము ఎంత అందమైనదో చూడండి! దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములతో కట్టబడినది. ఒక్కొక్క గుమ్మము ఇంచుమించు ఒక మైలు పొడవున్నది. ఆ పండ్రెండు గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి. ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల నామములు ఆ పన్నెండు గుమ్మములపై వ్రాయబడి యున్నవి. where is heaven | Bible Telugu
పట్టణపు రాజవీథి శుద్ద సువర్ణమయమైనది. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును, గొట్టెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దీపము గనుక ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను, చంద్రుడైనను అక్కరలేదు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏ మాత్రమును వేయబడవు.
ఈ అద్భుతమైన పట్టణము యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమని, పెండ్లి కుమార్తెయని, గొఱ్ఱపిల్ల భార్యయని చెప్పబడినది. ఈ నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్దపడి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట యోహాను చూచెను. ఈ పట్టణములో గొట్టెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే ప్రవేశింతురు గాని; నిషిద్దమైన దేదైనను; అసహ్యమైన దానిని, అబద్దమైన దానిని జరిగించు వాడెవడును దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు.
1500 మైళ్ళ ఎత్తు గల ఈ పట్టణమును 1500 అంతస్థులుగా విభాగించినను 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు కలిగిన ఈ కొలతలు ఒక్కొక్క అంతస్థుకు 22,50,000 చదరపు మైళ్ళ విస్తీర్ణత కలిగియుండును. ఇది ఎంత అద్భుతమైన పట్టణము! ఈ 1500 అంతస్థులలో ఒక్కొక్క అంతస్థు దేవుడు లోకములో సృష్టించిన ఒక్కొక్క వాతావరణమును, ఒక్కొక్క సృష్టిని కలిగియున్నది.
ఒక అంతస్థు మంచు కొండలతో హిమాలయ కొండల వంటి వాతావరణము కలిగియుండును. మరొక అంతస్థు చక్కటి ఫసిఫిక్, అట్లాంటిక్ సముద్ర తీరాలను పోలినదై యుండును. మరొక అంతస్థు సహారా ఎడారి వలె ఉండియుండును. మరొక అంతస్థు ఒయాసిస్సుల వలె ఉండును. మరొక అంతస్థు అరణ్యము వలె జంతువులతో, జల ప్రవాహాలతో ఉండును. మరొక అంతస్థు పొలాలు, పశువులు కలిగిన పల్లెటూరి వాతావరణము వలె ఉండును. మరొక అంతస్థు మెక్సికో, టోక్యో వంటి నగరముల వాతావరణము వలె ఉండును. మరొక అంతస్థు ఏంజెల్, నయాగరా జలపాతాలతో కూడిన సుందరమైనదిగా ఉండును. మరొక అంతస్థు రకరకాల జంతువులు, పక్షులతో కూడినదిగాను ఉండును. మరొక అంతస్థు చక్కటి జలచరాలతో నిండినదిగాను, మరొక అంతస్థు ఆకాశ నక్షత్రాలతో కూడినదిగాను ఉండును. దేవుడు లోకమును సృష్టించినప్పుడు ఏమేమి సృష్టించెనో అవన్నీ ఈ పట్టణములో ఉండును. వాటినన్నిటిని ప్రభువు తన బిడ్డల కొరకు సిద్ధపరచెనని చెప్పవచ్చును. where is heaven | Bible Telugu
పరలోక పట్టణము యొక్క కొలతల పట్టీ లెక్కలు వేసి చూస్తే, ఇంచుమించు 1400 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యము కలిగియుండును. అయితే మనం నివసించే భూమి వైశాల్యము 510 మిలియన్ల చదరపు కిలోమీటర్లు మాత్రమే! అందులో భూభాగము కేవలము 149 మిలియన్ల చదరపు కిలోమీటర్లు మాత్రమే! where is heaven | Bible Telugu
అయితే ప్రభువు మన కొరకు నిర్మించిన పరలోక పట్టణపు వైశాల్యము 1400 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యత కలిగినది. నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము త్రోసివేయనన్న ప్రభువు; ఏ ఒక్కడు నశించుటకు ఇష్టము లేక, అంతట అందరు మారుమనస్సు పొందవలెనని ఆశించి; ఈ విశాలమైన పట్టణమును మన కొరకు నిర్మించెను. హల్లెలూయ!where is heaven | Bible Telugu
ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here
Praise THE LORD,