వ్యాఖ్యాన శాస్త్రము | What is Biblical Hermeneutics|vyakyanasastramu | Part2|2023

వ్యాఖ్యాన శాస్త్రము

Part-2

What is Biblical Hermeneutics?

పరిశీలనలో మనం కలుసుకొనవలసిన ఆరుగురు మిత్రులు. 

 1. i) ఎవరు? (Who) – మనం చదువుచున్న భాగంలో ఎవరున్నారు? అని పరిశీలించాలి. ఉదా : 1థెస్స. 1వ అధ్యాయం, తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, పౌలు, సిల్వాను, తిమోతి, థెస్సలో నీయ సంఘం, మాసిదోనియ, అకయవారు. మేము, మీరు, మన, మా.
 2. ii)ఏమిటి? ( What) – ఏమి జరిగినది ? ఏమి చెప్పబడినది? ఏ ఆలోచనలు వ్యక్తం చేయబడ్డాయి? ఫలితాలు ఏమిటి? అని ప్రశ్నించాలి. ఉదా : మొదట ఏమిజరిగింది? పౌలు సువార్త ప్రకటించాడు, తరువాత థెస్సలో నీకయులు రక్షించబడ్డారు. వారు మాసిదోనియ, అకయ ప్రాంతాల వారికి తమ విశ్వాసమును వెల్లడి పరిచారు. ఆ ప్రాంతాల వారు కూడా. ప్రభువునందు బలపడ్డారు.
 3. il) ఎక్కడ? (Where) – ఎక్కడ జరిగింది? ఆ పట్టణం ఏ ప్రాంతంలో ఉంది? అనేది ప్రశ్నించాలి (GeogruphicalBackground తెలుసు కోవాలి). ఉదా : థెస్సలోనిక మాసిదోనియా ప్రాంతంలో ఉన్నది. ముఖ్యంగా ఈ విషయాలు, భౌగోళిక పటాలు, డిక్షనరీలనుండి గమనించవలసి యుంటుంది.
 4. iv) ఎప్పుడు? (When) – ఇది ఎప్పుడు జరిగింది? అని ప్రశ్నించాలి. ఉదా : పౌలు ఎప్పుడీ పట్టణానికి వచ్చాడు? పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ పట్టణానికి వచ్చాడు. ఎప్పుడు వ్రాసాడు? అని కూడా అడిగి తెలుసు కోవాలి. ఈ విషయాలకు చరిత్ర మనకు ఉపయోగపడును.
 5. v) -ఎందుకు? (Why) – ఇదెందుకు జరిగింది? ఇలా ఎందుకు మాట్లాడుచున్నాడు? ఉద్దేశ్యం ఏమిటి? ఏమైనా కారణాలున్నాయా? దీని కోసం ఇతర లేఖనాలను కూడా పరిశీలించాలి. ఉదా : అపొ.కా. 17,18 అధ్యాయములు చూడాలి. పౌలు కొంత శ్రమపడి ఈ ప్రాంతంలో పరిచర్య చేసిన తరువాత తిమోతిని పంపించాడు. తిమోతి వెళ్ళివచ్చి వారిని గూర్చి మంచి రిపోర్టునిచ్చాడు. దానిని బట్టి పౌలు మరొక సారి దేవుని స్తుతించి, వారిని బలపరచటానికి ఈ పత్రిక వ్రాసాడు. యేసుక్రీస్తు పునరుత్థానం గూర్చి తెలుపుచు, రెండవ రాకడకు సిద్ధపడుమని వ్రాసాడు.
 6. vi) ఎలా? (How) – ఈ విషయాలను వారెలా చేయగలిగారు? పరిస్థితులను, సంగతులను ఎలా సాధించారు? వాటి సాధన కొరకు ఎలాంటి పద్ధతులను వినియో గించారు? అని ప్రశ్నించాలి. ఉదా : విశ్వాసమును వృద్ధి నొందించుకొనుట ద్వారా వారు సంగతులను సాధించారు.

మనం ప్రశ్నించి తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు : 

i ) మనం తీసుకొన్న లేఖన భాగం ఎలాంటి రూపం (Structure) కలిగియున్నది? అని పరిశీలించాలి. దేవుడు ఏమి చెప్పాడనేది ఎంత ప్రాముఖ్యమో ఆయనెలా చెప్పాడనేది అంతే ప్రాముఖ్యం. ప్రశ్నలు – జవాబుల రూపంలో వ్రాయబడిందా? పద్యరూపంలో వ్రాయబడిందా? గద్యరూపంలో వ్రాయబడిందా? కథా రూపంలో వ్రాయబడిందా? సంభాషణా రూపంలో వ్రాయబడిందా? ఉపమాన రూపంలో వ్రాయబడిందా? ఆజ్ఞ రూపంలో ఇవ్వబడినదా? అనే విషయాలను ఆలోచించి పరిశీలన చేయాలి. ఉదా : యోబు, సామెతలు- పద్యరూపంలోను, హబక్కూకు – సంభాషణ రూపంలోను, మలాకీ – ప్రశ్న, జవాబులు (లేక) Reasoning రూపంలోను, ఫిలేమోను – కథారూపంలోను వ్రాయబడినవి. 

 1. ii) మనం తీసుకొన్న లేఖన భాగంలోని స్టోలికలు, వ్యత్యాసములు కూడా పరిశీలించి చూడాలి. ఉదా : అకయవారు ప్రభువునంగీకరించిరి. మాసిదోనియా వారు ప్రభువునంగీకరించిరి. ఇది పోలిక. అపొస్తలులు ప్రభువును పోలినడుచుకొన్న రీతిగానే సంఘస్థులు కూడా ప్రభువును పోలి నడుచుకొనుచున్నారు. ఇది కూడా పోలికే.

విగ్రహములను పూజించువారు, విగ్రహములను విడిచిపెట్టినవారు (1:10). ఇది వ్యత్యాసం. అలాగే- హెబ్రీపత్రికలో యేసుప్రభు శ్రేష్టత్వం గూర్చి తెలియజేస్తూ ఎన్నో పోలికలు, వ్యత్యాసాలను చూపించే విషయాలు వ్రాయబడ్డాయి. పాత నిబంధనలోని లేఖనాలు క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటాయి. వాటి మధ్యలోని పోలికలు వ్యత్యాసాలు గమనించుట ద్వారా కూడా మనమెన్నో గమనించగలం. 

iii) మన అభిప్రాయాన్ని మార్చుకొనుటకు ఇష్టపడాలి. మనం పరిశోధన చేస్తున్నప్పుడు చాల విషయాలు బయటపడతాయి. కొన్ని విషయాల్లో అప్పటికే మనం కలిగియున్న అభిప్రాయాలను మార్చుకొనవలసి వుంటుంది. ముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని చూచేటప్పుడు ముందుగానే కొన్ని అభిప్రాయాలు (Preconceived Ideas) కలిగియుండుట మంచిది కాదు. ఉదా : 1థెస్స 2:14-16 చదివితే, యూదులు దేవుని దాసులను చంపినవారుగాను, దుష్టులుగాను, దేవుని పనికి వ్యతిరేకులు గాను కనబడతారు. కానీ, వాస్తవానికి యూదులు ఎంతో ఉన్నతమైనవారు. వారున్నూ ఎంతో భక్తిపరులు. మరి ఎందుకు అలా చేసారంటే, వారు అతిగా ప్రేమించే తమ మతానికి కలిగే విఘాతమును సహించలేక సువార్తను అడ్డగించారు. ఇక్కడ పౌలు ఉద్దేశ్యం వారి మీద నెపమెయ్యాలని కాదు. తాము యూదులనుండి శ్రమలు పొంది ఎలానడిచారో, ఎలా విశ్వాసాభివృద్ధి సాధించారో తెలియజేస్తూ, మీరు కూడా మావలెనె మీ సొంత దేశస్థుల వలన శ్రమలు పొంది క్రీస్తులో నిలబడ్డారని వారిని బలపరచటానికి పౌలు వ్రాసాడు. కానీ, మనము ముందుగానే యూదుల గూర్చి ప్రతికూల అభిప్రాయము ఏర్పరచుకొని చదివితే ఈ భావమంతా అర్థంకాదు. అందుచేత మనము బైబిలు దగ్గరకు వెళ్ళేటప్పుడు మనము అప్పటికే కొన్ని అభిప్రాయములను ఏర్పరచుకొని వెళ్ళకూడదు. 

2) వ్యాఖ్యానము (Interpretation) – ఇందు Bible విద్యార్థి వహించవలసిన పాత్ర ‘ఒక అభిప్రాయానికి రావటం’ (లేక) ‘నిర్ణయమునకు వచ్చువాడు’ (Decision Maker). దీనిలో మనం వేయవలసిన ప్రశ్నలు – దీని అర్థం ఏమిటి? అవి ఎవరికివ్వబడ్డాయో ఆ విషయాలు ఆనాటి ప్రజలకు ఏ భావాలు కలిగించాయి? ఇది ఏవిధంగా పనిచేస్తుంది? గ్రంథకర్త తెలియజేయాలనుకొంటున్న ముఖ్యమైన ఆలోచన ఏమిటి? మున్నగునవి మనమెంచుకొన్న భాగము యొక్క అర్థాన్ని గ్రహించి, దాని స్పష్టముగా వివరించు ప్రక్రియయే ‘వ్యాఖ్యానం’. గ్రంథకర్త అతని కాలంలో నున్న ప్రజలకు అందించిన విషయాల వెలుగులో దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించవలెను. 

దీనిలో ముఖ్యంగా మూడు విషయాలను నేర్చుకోవలసియున్నాము. 

 1. ఉద్దేశ్యము – గ్రంథకర్త ఎందుకు ఈ అంశాన్ని తీసుకొస్తున్నాడు? (లేక) ఈ అంశాన్ని గూర్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? అనే విషయాన్ని మనం మొదటిగా నిర్ణయించవలసియున్నాం. గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యాన్ని మనం గ్రహించవలెను. లేఖనాలు ఊరకనే / ఉద్ధేశ్య రహితముగా వ్రాయబడినవి కావు. అవి అన్నియు ప్రత్యేక ఉద్ధేశ్యములతో వ్రాయబడినవే. (రోమా 15:4; 1కొరింథీ. 10:11). కాబట్టి మనం ఆ భాగము వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కనుగొనవలసియున్నాము. వ్యాఖ్యానికి మొదటి మెట్టు ఈ ఉద్దేశ్యం.

ఉదా :

 1. i) గలతీ పత్రికను పౌలు వ్రాయుటలో గల ఉద్దేశ్యము : పౌలు గలతీయ ప్రాంతములో సువార్త ప్రకటించి, సంఘములు స్థాపించిన తరువాత ఆ ప్రాంతములో కొందరు యూదులు వెళ్ళి ధర్మశాస్త్రము వలననే మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడతాడని, రక్షణ పరిపూర్తికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవసరమనే దురుపదేశమును చేసారు. అందువలన ఆ బోధలను త్రిప్పికొట్టి అక్కడి విశ్వాసులలో ధర్మశాస్త్రము వలనను గాక విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడగలరన్న సత్యాన్ని పునరుద్ఘాటన చేయాలనే ఉద్దేశ్యముతో పౌలు ఈ పత్రికను వ్రాసాడు.
 2. ii) యోహాను తన సువార్తను వ్రాయుటలో గల ఉద్దేశ్యము : యేసు దేవుని కుమారుడైన క్రీస్తు’ అని రోకానికివిశదపరచాలని వ్రాసాడు (యోహా 20:31).-

iii) హెబ్రీ పత్రిక 1,2 అధ్యాయములు చదివితే అక్కడ గ్రంథకర్త మొదట నుండి యేసును, దూతలను పోల్చుచున్నాడు. దేవుడు దూతలద్వారా తన వర్తమానాన్ని ప్రజలకు పంపించాడు. కాని దూతల ద్వారా దేవుడు పంపించిన వర్తమానము కంటే యేసు క్రీస్తు ద్వారా పంపిన వర్తమానము శ్రేష్టమైనది. అనగా యేసుక్రీస్తు అన్ని విధాల దూతల కంటే శ్రేష్టుడు అని చూపించటానికి గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. ఆ ఉద్దేశ్యాన్ని మనము గమనించాలి. 

 1. iv) నిర్గమకాండంలో ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాన్ని మనం పరిశీలిస్తే వారు సుమారు నాలుగు దినాలలో పూర్తి చేయవలసిన కనాను దేశ ప్రయాణాన్ని నలభై సంవత్సరములు సీనాయి అరణ్య ప్రాంతాలలో సంచరించి చేరినట్లు కనబడును. దేవుడు ఎందుకు వారిని అన్నిదినాలపాటు అక్కడక్కడే సంచరింపజేసాడు? అందులకు గల ఉద్దేశ్యాలను మనం గ్రహించాలి.

b.) ముఖ్యమైన ఆలోచన (Key Thought, Theme, Big Idea) – మన మెంచుకొన్న భాగము యొక్క, గ్రంథకర్త యొక్క సారాంశము, ఆలోచన ఏమిటి? అన్న విషయాన్ని ఒక వాక్యరూ సములో పెట్టాలి. అది సాధ్యమైనంత సింపుల్గా ఉండుట ఎంతో అవసరం. ఎంత పెద్ద వాక్యమైతే అంత అయోమయంగా ఉండును. 

ఉదా :

 1. 1 పేతు. 2 వ అధ్యయ నంతటిని చదివినపుడు మనకు కలిగే ముఖ్యమైన ఆలోచన – క్రీస్తు నిమిత్తం విశ్వాసులు విరుద్ధ భావాలు ( శతృధోరణి) కలిగిన ఈ లోకంలో శ్రమ పొందుచు క్రీస్తు మాదిరిని చూపించాలి (19వ).
 2. ii) హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు విశ్వాస వీరులు కనబడతారు. అట్టి వారిలో రాహాబు చేర్చబడినట్లుగా గమనించగలం (31వ). ఎందుకు చేర్చబడినది? అని ఆలోచన చేస్తే దేవున్ని గూర్చి తనకు తెలిసినది కొద్దిపాటే అయినప్పటికీ దేవుని కొరకు కొంత త్యాగం చేయ తెగించెను.
 1. ప్రవాహము (Flow) – గ్రంథకర్త తాను చేరాలనుకొన్న గమ్యాన్ని ఎలా చేరుతున్నాడు? తాను చెప్పదలచుకొన్న దానిని ఎలా చెప్తున్నాడు? తన ముఖ్యాంశాన్ని ఎలా చూపిస్తున్నాడు? వాద ప్రతివాదనల రూపంలోనా? కథారూపంలోనా?, సంభాషణారూపంలోనా?, పాయింట్స్ వారీగానా? (లేక) మాదిరి ద్వారానా? అనే విషయాన్ని గమనించాలి.

ఉదా : ‘ ప్రార్థన’ అనే అంశాన్ని గూర్చి యోహాను ఎలా చెప్తున్నాడు? (లేక) విశ్వాసముగూర్చి యేసు తన శిష్యులకు నేర్పించాలను కొన్నాడు. దాని నెలా నేర్పిస్తున్నాడు? దాని నెలా కొనసాగించాడు? గ్రంథకర్త తన భావాన్ని, తన లక్ష్యాన్ని చదువరులకు, వినువరులకు ఎలా నేర్పిస్తున్నాడు? 

 1. C) సమన్వయము (లేక) సంబద్ధత (Correlation) :

మన మెంచుకొన్న వాక్యభాగం చెప్పేదానికి, మిగిలిన బైబిలంతా చెప్పేదానికి గల సంబంధమేమిటి? అనే విషయం ఇందు చూస్తాము. ఈ విభాగములో బైబిలు విద్యార్థి వహించవలసిన పాత్ర సమన్వయకర్త (Co-ordinator). రెండు (లేక) అంతకంటే ఎక్కువ విషయాలను ఒకదానితో ఒకటి సంబంధ పరచుటయే సమన్వయ ప్రక్రియ. ఇంకోమాటలో చెప్పాలంటే ఇది ‘సంబంధపరిచే ప్రక్రియ’. బైబిలు పఠనములో ఉత్సాహభరితమైన, మనమెక్కువ పొందుకొనే ప్రక్రియ. వివాహానికి ముందు వధూవరులు పొందే ఉత్సాహాని కంటే ఎక్కువైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఈ ప్రక్రియ ఇచ్చును. కేవలం ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తెచ్చి పెట్టుటయే గాక ఎన్నో దీవెనలను తెచ్చిపెట్టేదే ఈ సమన్వయ ప్రక్రియ. 

బైబిలులో నున్నవన్నియు సత్యములే. అవి దైవిక మూలములు. వాటికి ఐక్యత ఉన్నది. కాబట్టి మనమొక సత్యాన్ని పరిశీలించేటప్పుడు మిగిలిన సత్యాలు ఏమి చెప్తున్నాయా అని పరిశీలించటం ఎంతో అవసరం. అయితే ఎలా పరిశీలించాలి. వాక్యాన్ని తరచి చూడాలి. అందుకు కొన్ని సుళువైన మార్గాలు. 

1) క్రాస్ రిఫరెన్సులు cross reference – ఒక మాటగాని, ఒక ఆలోచనగాని, ఒక కథగాని, ఒక వచనంగాని ఇంకోచోట ఎక్కడైనా ఉందేమో అని వెదకాలి. 

ఉదా : హైబ్రీ. 5వ అధ్యాయం చదువుచున్నాము. (6వ వచనము దగ్గరకు వచ్చేసరికి ‘మెల్కీసెదెకు’ కనబడతాడు. ఇంకా అతని గూర్చి ఎక్కడుందో అని చూడాలి. అలా చూస్తే అదే పత్రికలోని పలు అధ్యాయములలో, ఆదికాండం 14:18లో, కీర్తన 110:4 లో కనబడతాడు. 

2) సమాంతర క్రాస్ రిఫరెన్సులు Parallel – ఒకే అర్థాన్ని తెలియజేసే మాట, వాక్యభాగాలు ఎక్కడున్నాయా అని చూడాలి. 

ఉదా : ఎఫెసీ. 5:19; కొల. 3:16,17.” అర్థం: జరిగిన దానిని గూర్చి.

 విత్తునానిని గూర్చిన ఉపమానం (నత్త, 13 మార్కు 4; లూకా 8). 

యేసుక్రీస్తు నీటీ మీద నడవడం (యోహా. 6; మత్త. 14; మార్కు 6) 

3) కరస్పాండింగ్ క్రాస్ రిఫరెన్సులు – ఒకే భావాన్ని కలిగియుండే వాక్య భాగములను చూడాలి

ఉదా : యెష, 52:7ను రోమా 10:13-15తో పోల్చాలి. అలాగే యెష, 61:1ను లూకా 4:16,17తో పోల్చాలి.

యెషయాలో నున్న పూర్తి భాగాన్ని లూకా సువార్తలో యేసుక్రీస్తు వాడినట్లు కనబడదు. ఎందుకంటే, యెషయాలో యేసుక్రీస్తు యొక్క రెండు రాకడలను గూర్చి చెప్పబడినది. కాని లూకాలో చెప్పబడినది యేసు. మొదటి రాకడను గూర్చియే కదా!

4) ఐడియా క్రాస్ రిఫరెన్సులు – ఒకే విధమైన ఆలోచనను చూపించే వాక్య భాగాల కొరకు చూడాలి. ఉదా: 1 పేతు, 1:22, 23ను యోహా. 12:13; 3:5తో సోల్చవలెను. 

5) కాంట్రాస్టింగ్ క్రాస్ రిఫరెన్సులు Contrasting  విభిన్న (లేక) ఒకదానితో ఒకటి విభేదించే అభిప్రాయాలతో ఉండే వాక్యభాగాలను చూపించేవి. 

ఉదా : మత్త. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎదుర్కొన్న శోధనలు కనిపిస్తాయి. ఆయన శోధనలను జయించాడు, యేసుక్రీస్తును పౌలు కడపటి ఆదాముగా అభివర్ణించాడు (1కొరి 15; రోమా 6). అయితే ఆదాము శోధనలకు లోబడ్డాడు (లేక) శోధనలచేత జయించబడ్డాడు. మనము ఈ రెంటిని సమన్వయ పరచాలి. 

మనం కొన్ని సార్లు ఒకే పుస్తకాన్ని చదువుతూ అందులో ఉన విషయాలను ఒకదానితో ఒకటి పోల్చవచ్చు. ఆ పుస్తకము యొక్క విపులమైన విషయ విభజన వలనను, చార్టులు వేసుకొనుట ద్వారాను మనము ఆ పుస్తకమందలి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొనవచ్చు. 

ఉదా : 1) యోనా గ్రంథము. భక్తుడైన యోనా

1వ అధ్యాయంలో దేవుని యొద్దనుండి పరుగిడుచున్నాడు. 

2వ అధ్యాయములో దేవుని యొద్దకు పరుగిడుచున్నాడు.

3వ అధ్యాయములో దేవునితో కలసి పరుగిడుచున్నాడు.

4వ అధ్యాయములో దేవుని కంటే ముందు పరుగిడుచున్నాడు.

2) రోమా 6, 7, 8 అధ్యాయములు మనము చదివితే క్రైస్తవేతరుల స్థితి, క్రైస్తవుల స్థితి ఏమో చక్కగా చూడగలం. క్రైస్తవేతరుడు దేవుని శిక్షావిధి క్రిందనున్నాడు. క్రైస్తవుడు అట్టి తీర్పునుండి తప్పించబడ్డాడు. అతడు పాపము యొక్క శిక్షనుండి తప్పించబడ్డాడు. పాపపు శక్తి నుండి తప్పించబడుతూ ఉన్నాడు. పాపపు వాతావరణము నుండి తప్పింపబడబోవుచున్నాడు. 

 1. D) అన్వయము (Application) :

ఇది నాకేం భావం కలుగజేస్తుంది? నాకెలా వర్తిస్తుంది? అనే విషయాన్ని చర్చించే విభాగం. ఈ అన్వయములో బైబిలు విద్యార్థి యొక్క పాత్ర అమలుపరచేవాడు (implementar) అన్వయం అనేది బైబిలు అధ్యయన మంతటిలో చాలా ప్రాముఖ్యమైన  భాగం. ఓ అనుభవనీయుని మాటలలో అన్వయం కొరవడిన పరిశీలన, వ్యాఖ్యానం మరియు సమన్వయము గర్భస్రావముతో సమానము”. అనగా నిరుపయోగం / వ్యర్థం / శుద్ధ దండగ. 

బైబిలు అనగా దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే దేవుడు (లేక) వాక్యం మననుండి స్పందనను కోరుచున్నది. ఈ స్పందన మరేదో కాదుగాని ప్రత్యక్ష పరచబడిన దేవుని చిత్తానికి విధేయత చూపించుటయే. జీవము కలిగిన ప్రతిదీ స్పందనను ‘కోరును. జీవముగల దేవుని జీవ వాక్యం నుననుండి స్పందన కోరుచున్నది (యాకో 1:22). నేర్చుకోవడం అనేది కష్టతరమైన ప్రక్రియ. అయితే నేర్చుకోవడం కంటే-అన్వయము మరింత కష్టమైనది. మరో మాటలో, అన్వయము కంటే నేర్చుకోవడం చాలా తేలిక. దేవుడు మన యొద్దనుండి స్పందనను కోరుచున్నాడు. మనము సరియైన రీతిలో స్పందించకపోతే మన లక్ష్యాన్ని చేరుకోలేము. దాని కొరకు మనం మనకున్న వనరులన్నీ సమకూర్చి పోరాడవలసియున్నాము. అన్వయము నేర్చుకోవడం కంటే బహు కష్టంగానే ‘మిగిలిపోతే / ఉండిపోతే మన జీవితాలు కూడా ఇతరులనేకుల జీవితాలవలెను ఉండిపోతాయి. – అన్వయము కష్టమైతే అవ్వొచ్చేమోగాని అసాధ్యం మాత్రం కానేకాదు. 

భానోద్రేకాలకు, చిత్తమునకు (Emotions / Peeling and Will) మధ్య ఉన్న తేడాను మనం గమనించాలి. వర్తమానం విన్నప్పుడు భావోద్రేకాలకు ‘లోనై అప్పటికప్పుడే ఒక తీర్మానం తీసుకోవాలని అనుకొంటారు. కాని కొద్ది రోజుల్లో ఆ భావోద్రేకాలు అణగిపోగానే మరల ఆ విషయం మరచిపోతారు. ఇది బలహీనమైన చిత్తం వలన మరియు పాలపొంగులాంటి భావోద్రేకాల వలన సంభవించును, అన్వయములో భావోద్రేకాలకు తావివ్వరాదు. దేవుడు మన భావనలు (feelings) ఎలా ఉన్నాయని చూడాలనుకోడు. ఆయన మనం కార్యానికి ఉపక్రమించే తీరును (Actions) ఎలా ఉందని చూడాలనుకొంటున్నాడు. మత్త 21:28-32లో రెండు రకాల మనస్థత్వాలు భావోద్రేకాలు, చిత్తము) గల వ్యక్తులను చూడగలము. భావోద్రేకాలు, చిత్తము రెండు అవసరమే, అయితే అవి తాత్కాలికమైనవి గాక జీవితాంతం నిలిచి యుండేవిగా జాగ్రత్తపడాలి. 

అన్వయములో గమనించదగిన విషయములు : 

1) జాగ్రత్తగా ఎంచుకోవాలి (Be Selective) – దావీదు పనికొచ్చేవి, అనువైనవి ఐదు నున్నటి గులకరాళ్ళను ఎంచుకొన్నాడు. అలాగే మనము కూడా చేయాలి. మనము చేసిన పరిశీలనంతటిని (Observation) ప్రార్థనా సహాయముతో / ప్రార్థనా పూర్వకముగా మననం చేయాలి. మన పరిశీలనలో ఎన్నో విషయాలుంటాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించిన విధముగా ఒకటి (లేక) రెండు విషయాలను ఎంచుకోవాలి. అంతేగాని, అన్నిటి కొరకు ఆతురపడి తర్వాత అవి అందక ఆందోళన (Frustration) పడటం అవివేకయుతమగును. 

2) ప్రత్యేకముగా ఉండాలి (Be Special ) – “నేను క్రీస్తును పోలి నడుచుకొన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి”, “క్రీస్తుయేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి” అని పౌలు వ్రాసాడంటే ఏమేమి అనుసరించాలి? ఇందు అనుసరించటానికి అనేకమైనవి కలవు గదా! ఇవి సాధారణ (General) గా చెప్పబడ్డాయి. కానీ, ఉదాహరణకు – ప్రత్యేకముగా క్రీస్తు వలె ప్రార్థన చేయండి, క్రీస్తుకు కలిగిన విధేయతా మనస్సును కలిగియుండండి. ఈ విధముగా మనం కొన్ని ప్రత్యేకంగా ఎంచుకొని మన జీవితాలకు అన్వయించుకొని ఆచరణలో పెట్టాలి. 

3) వ్యక్తిగతంగా ఉండాలి (Be Personal) – మేము, ‘మనము’, ‘మా’ ‘మీ’, ‘మీరు’, ‘నీవు’ అనే మాటలు ఉపయోగించటం చాలా తేలికే. గాని ‘నా’, ‘నేను’, ‘నన్ను’ అను మాటలు ఉపయోగించడం జరగాలి. మన అన్వయము ఎప్పుడూ వ్యక్తిగతమైనదిగా ఉండాలి. దీని కొరకై మనము చేయవలసిన విషయాలు నాలుగు. 

 1. a) ఆత్మ సంబంధమైన, నిగూఢమైన విషయాల కొరకు మరియు వాటిని మన జీవితానికి ఎలా అన్వయించాలో ప్రభువుని అడగాలి.
 2. b)మనం చదివిన (లేక) అధ్యయనం చేసిన దానిని ధ్యానించవలెను (నెమరువేయవలెను). ధ్యానించవలసిన విధము – ఇందు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.
 3. i) నేను ఒప్పుకొనవలసిన (లేక) విసర్జించవలసిన పాపమేదైనా ఉన్నదా ?(Sin to confess) 
 1. ii) నేను స్వతంత్రించుకొనవలసిన వాగ్దానమేదైనా ఉన్నదా?/కలదా?(Promise to Claim) 

        iii), దిద్దుకోవలసిన (లేక) మార్చుకోవలసిన అభిప్రాయాలు / మనో వైఖరి ఏమైనా కలవా? (Attitude to Change)

        Iv నేను విధేయత చూపటానికి ఏదైనా ఆజ్ఞ ఇవ్వబడినదా (Command to obey) 

         V నేను అనుసరించటానికి ఏదైనా మాదిరి చూపబడినది (Example to follow) 

 1. vi) నేను దేని కొరకు ప్రార్థించవలసియున్నది? (లేక) దేన్ని బట్టి స్తుతించవలసియున్నది? (Prayer and Praise)

       vii) నేను దిద్దుకోవలసిన / అధిగమించాల్సిన తప్పులు, పొరపాటులు ఏమైనా ఉన్నాయా? (mistakes avoid)

       viii) . నేను విశ్వసించాల్సిన సత్యమేమైనా ఉందా? (trust to believe) 

      9): నేను ఇంకా చేయవలసిన ఇతరత్రా విషయాలేమిటి? (Something else) 

c) మనము చేయవలసినదేమ/అన్వయించుకొనవలసిన దేమిటో వ్రాసి పెట్టుకొనవలయును. మనము వ్రాసి ట్టుకొనవలసిన విషయం –

i) వ్యక్తిగతమైనదిగా

ii)ఆచరణ సాధ్యమైనదిగా (Practical)

III) సాధించగలదిగా / సంభావ్యమైనదిగా (Possible) 

iv) నిరూపించదగినదిగా   ఉండాలి.

ఉదా : i) వ్యక్తిగతముగా – ‘నేను చేయవలసియుంది’ (I need to) 

ii) ఆచరణ సాధ్యమైనదిగా ‘నేను కొంతమందికి సువార్త ప్రకటించవలసియున్నది’(I need to preach to some people). 

iii) సాధించగలదిగా – ‘నేను వందమందికి సువార్త ప్రకటించాలి’(I need to preach to 100 persons) 

iv) నిరూపించదగినదిగా – ‘నేను వందమందికి సువార్తను ఆరు నెలల్లో ప్రకటించాలి’. (I need to preach within6 months).

కంఠస్థము (Memorization) : ఏదైనా ఒక ముఖ్య వచనాన్ని మనము తీసుకొన్న భాగములో నుండి ఎంచుకొని కంఠస్థము చేయవలెను.

వ్యాఖ్యానశాస్త్రం యొక్క ప్రాముఖ్యత : 

1) సముచితమైన (లేక) శుద్ధమైన వ్యాఖ్యానము మనము నమ్మే సిద్ధాంతములకు, ఉపదేశములకు గట్టి పునాదిని ఏర్పర్చును. మనము విశ్వసించేది, మనము బోధించేది మనము అర్థము చేసుకొనే దానిపై ఆధారపడి యుంటుంది. 

2) క్రైస్తవ జీవిత విధానాన్ని అలవర్చుటకు, క్రమపర్చుటకు శుద్ధమైన (లేక) సముచితమైన వ్యాఖ్యానము ఎంతో అవసరము. 

3) సముచితమైన వ్యాఖ్యానము నునలను అవివేక వర్తనము, పొరపాట్లనుండి తప్పించును, మనము ఏదైనా విషయాలను చెప్పే ముందు దేవుడు దానిని గూర్చి ఏమి చెప్తున్నాడో అనేది ఆ శోచించి చూడాలి. అంతేగాని, మన ఊహాగానములతో లేఖనములను చూడరాదు. వివాహం : 

4) సముచితమైన వ్యాఖ్యానము మన విశ్వాసమును కాపాడుకొనుటకు శక్తిమంతులనుగా చేయును. మన విశ్వాసము మీద, మన విశ్వాస ప్రమాణముల మీద దాడి చేసే ప్రతి దానిని ఎదిరించుటకు మనలను శక్తిమంతులనుగా చేస్తుంది. 

5) వ్యాఖ్యాన శాస్త్రము మనకు, బైబిలు గ్రంథకర్తలకు మధ్యనున్న అగాధమును పూరించే వారధి వంటిది. 

గమనిక : నాగరికతా సంస్కృతులను, చరిత్రను, భౌగోళిక శాస్త్రమును, సైన్సును, భాషలను, చదువుట, నేర్చుకొనుట ద్వారా మంచిగా వ్యాఖ్యానము చేయగలము. మంచి వ్యాఖ్యానకర్తలము కాగలము. 

వ్యాఖ్యానకర్త యొక్క యోగ్యతలు : 

a) ఆత్మానుసారుడై యుండాలి (1కొరిం. 2:13, 14). 

శరీర సంబంధి (లేక) ప్రకృతి సంబంధియైన మనుష్యుడు ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించజాలడు. బైబిల్ 3 ఆత్మ సంబంధమైన దృక్పధంతో వ్రాయబడినది కాబట్టి, దేవుని మాటలు ఆత్మయు, జీవమునై యున్నవి కాబట్టి వ్యాఖ్యానించువాడు ఆత్మీయపరుడై యుండవలెను (1కొరింథీ. 3:1-4). 

మానసికంగా ఎదిగినవాడై యుండాలి అనగా అవగాహనాశక్తి కలిగి యుండాలి. మానసికంగా ఓర్పు కలిగియుండాలి. 

c) నేర్పు కలిగియుండాలి –నేర్పు అనేది పుట్టుకతో వచ్చేది కాదు. ఓర్పు గా విషయాలను పరిశీలించుట ద్వారానే నేర్పు వచ్చును. ఇతరుల స్థానంలో మనలను మనము చూచుట ద్వారా కలుగుతుంది. ఇతరుల స్థానంలో మనలను పెట్టుకొని, వారి స్థితిగతులను అర్థం చేసుకోవడం ద్వారా మనము నేర్పు కలిగియుండగలము. మన స్థాయికి తగినవారు, మన అంతస్థుకు తగిన వారితోనే కలసి మెలసి తిరగటం అంతమంచిది కాదు. అందరితోనూ కలవాలి. కొంతమందితోనే ప్రత్యేకంగా కలసియుండుట వలన విడిచిపెట్టబడేవారు ఎంతో బాధపడవచ్చు. వారి బాధ మనకు తెలవాలంటే వారి స్థానంలో మనలను పెట్టుకొని చూడాలి. ఈ విధముగా చేయుట ద్వారానే నేర్పు కలుగుతుంది. 

వ్యాఖ్యాన కర్త యొక్క పనిముట్లు / ఉపకరణాలు (Tools) : 

1) బైబిల్ 2) బైబిల్ నిఘంటువు 3) అకారాది పట్టిక 4) బైబిల్ వ్యాఖ్యానము 5) బైబిల్ చరిత్ర 6) బైబిల్ అట్లాసు 7) తర్జుమా బైబిళ్ళు 8) హెబ్రీ, గ్రీకు బైబిళ్ళు. 

దైవావేశమువలన కలిగిన వాక్యాన్ని ఎలాగున వ్యాఖ్యానించాలి? / వివరించాలి? చేయవలసినవి, చేయకూడనివి. 

1) “గుఱ్ఱం ముందుకి బండిని తీసుకెళ్ళవద్దు”, అన్వయింపజేయుటకు ముందు నివరింపవలెను (గల 5:1). 

2) కృత్రిమముగా / కల్పితాలతో చెప్పి నేరం చేసాననే భావము కలిగియుండక వాక్యమును పూర్వాపర సందర్భాలతో వివరించాలి (గల. 59). 

3) విమర్శనాత్మకముగా వ్యాఖ్యానకర్త ఉండక, రూపకలంకారము / విషయ ప్రస్తావనకు సంబంధించిన చరిత్ర విధానములకు అవకాశమివ్వు.

4) లేఖనాలను సమతలమైనవిగా చేయక వాటియొక్క పురోగమన ప్రత్యక్షతను అర్థం చేసుకో. 

5) క్రమరహిత తీరులో వ్యాఖ్యానించక మాటల యొక్క అర్థాన్ని మరియు వ్యాకరణాన్ని చదివి గ్రహించవలెను (గల. 5:25). 

6) . వ్యాఖ్యానించునప్పుడు దైవావేశం ద్వారా కలిగిన మంచి సంగతులను ఉపేక్షించక, స్పష్టముగా చెప్పబడినవాటి వెలుగులో అస్పష్టమైన వాక్యభాగాన్ని వివరించు. 


వ్యాఖ్యాన శాస్త్రము పార్ట్ 1 కొరకు కింద ఉన్న బటన్ ప్రెస్ చేయండి.

click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.