సువార్త – The Role of the Holy Spirit in Evangelism

Written by biblesamacharam.com

Published on:

సువార్త పరిచార్యలో పరిశుద్దాత్ముని పాత్ర.

The Role of the Holy Spirit in Evangelism

 ఈ విశ్వంలో ఏ కార్యము చేయనుద్దేశించినా దానిని నిర్వహించుటకు లేదా సమర్థవంతముగా చేయుటకు ఏదో ఒక విధమైన శక్తి (Power) అవసరం. ధనమో, బలమో, బలగమో, అధికారమో, సౌరశక్తియో, విద్యుత్ అణుశక్తియో ఇతరత్రా అవసరం. ఇవేవీ లేకుండా పని పూర్తిచేయడం అసాధ్యం. అదే విధంగా సువార్త కూడా శక్తి అవసరం… పైన పేర్కొన్న శక్తులన్నీ వున్నప్పటివీ వాటినన్నింటిని మించిన మరో శక్తి అవసరం అదే పరిశుద్ధాత్మ శక్తి, ఈ శక్తి లేకుండా మన ఏ పరిచర్యలు ఫలవంతం కాజాలవు. యేసు ప్రభువు ఈ శక్తి యొక్క ఆవశ్యకత మరియు పొందుకొనుటను గూర్చి శిష్యులకు లూకా 24:49; అ.కా. 1:8; యోహాను 16:7,8 లలో తెలియజేసెను. శిష్యులకు క్రీస్తును ప్రకటించాలన్న ఆసక్తి వుంది, వర్తమానం వుంది, దర్శనం వుంది. అయినను పరిశుద్ధాత్మ శక్తి కలిగి లేకుండా వారిని ప్రకటనకు వెళ్ళొద్దన్నాడు ప్రభువు. అపోస్తులుల కార్యముల గ్రంథమునకు మరొక పేరు పరిశుద్దాత్మ కార్యములు. సువార్త పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరం. ఆత్మల సంపాదకుడు సమర్ధవంతంగా పనిచేయవలెనన్న, పరిశుద్దాత్మ నింపుదల, శక్తి తప్పక కలిగి యుండవలయును. `సువార్త పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రాముఖ్యతను బట్టి, అనేకులకు దీన్ని గూర్చిన పూర్ణావగాహన లేని కారణం చేత దీనిని గూర్చి వివరంగా తెలియజేయడమైనది. 

పరిశుద్ధాత్మ (శక్తి) నింపుదల అనుభవము (Spirit filled experience) 

  1. పరిశుద్దాత్మ పూర్ణులై (నింపుదల కలిగి ఉండే అనుభవం ఉన్నది. అనే విషయం గ్రహించుట :
  2. పరిశుద్ధాత్మ ఎవరు : ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్ముడు చేసేపని

 త్రితమైన తండ్రి, కుమార, పరిశుద్దాత్మలలోని మూడవ వ్యక్తియే పరిశుద్దాత్మ. ఆయన అనంత జ్ఞానం (బుద్ధి, వివేకములు) (1కొరిం 2:11), భావనలు (భావోద్రేకములు) [రోమా 15:30] మరియు సంకల్ప శక్తి, లేక మనోభీష్టము (Iకొరింథి 12:11) కలిగిన వ్యక్తి. ఆయనకు ఉన్న నామములను పఠించుట ద్వారా పరిశుద్దాత్మ యొక్క స్వరూప స్వభావములను మనం మరి యెక్కువగా తెలిసికొన వచ్చును. దేవుని ఆత్మ (కొరింథి 3:16), జీవమునిచ్చు ఆత్మ (రోమా 8:2), సత్యస్వరూపియైన ఆత్మ (యోహాను 16:13), కృపకు మూలమగు ఆత్మ (మెబ్రీ 10:29), పరిశుద్ధ మైన ఆత్మ (రోమా 1:4)

 ప్రభువైన యేసును మహిమ పరచుట (యోహా 16:13,14) మరియు ప్రపంచ సువార్తీకరణోద్యమంలో సంఘమును ముందుకు నడిపించవలెనను (మత్తయి 9:38) రెండు ప్రముఖమైన ఉద్ధేశ్యములతో పరిశుద్ధాత్మ మన మధ్యకు వచ్చెను. 

పరిశుద్ధాత్మ చేయు కార్యములు :

ఆత్మ యొక్క రెండు ప్రాథమిక కార్యములను గూర్చి బైబిల్ బోధించుచున్నది. 

మొదటిది : ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించి, మారు మనస్సు నొందిన సమయంలో పరిశుద్దాత్ముడు మానవ ఆత్మలోనికి దైవిక జీవమును పంపించును. యోహాను దీనిని “తిరిగి జన్మించుట”, “పై నుండి జన్మించుట” లేక “ఆత్మ మూలముగా జన్మించుట” గా పేర్కొన్నాడు (యోహాను 3:3-8). జీవమును  ప్రసాదించు పరిశుద్ధాత్మ యొక్క ఈ గొప్ప పరిచర్యను గూర్చి ఇంకా యెహెజ్కేలు 36:26, యోహాను 1:13,  6:63; 2కొరిం 3:6, 5:17; ఎఫెసి 2:1; తీతు 3:5; 1 పేతురు 1:23; 1 యోహాను 5:1 మొదలగు చోట్ల పేర్కొనబడింది. ఒక వ్యక్తిని దేవుని రాజ్యములోనికి ప్రవేశింప చేసేది ఈ అనుభవమే. (ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన జీవమును ప్రసాదించు సమయంలో పరిశుద్దాత్మచేయు మరికొన్ని కార్యములు) .  The Role of the Holy Spirit in Evangelism

  1. 1 ఆయన నీలో వసించుటకు వచ్చును; దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైననను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయనవాడు కాడు (రోమా 8:9). 
  2.  పరిశుద్దాత్మ(నీవు) దేవుని బిడ్డవు (కుమారుడవు లేక కుమార్తెవు) అను నిశ్చయతను నీలో కలిగించును: మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చు చున్నాడు (రోమా 8:16). 
  3.  క్రీస్తు శరీరములో నీకు స్థానము కల్పించును ( ప్రవేశము కల్పించును) : ఏలాగు శరీరము ఏకమైయున్నదో, అనేకమైన అవయవములు కలిగియున్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరమూ ఒక్క ఆత్మ యందే బాప్తీస్మము పొందితిమి. మనమందరమూ ఒక ఆత్మను పానము చేసిన వారైతిమి. ( 1 కొరింథీ 12: 12,13).. 
  4.  పాప జీవితమును ఇక మీదట కొనసాగించకుండుటకు అవసరమైన సామర్థ్యమును (శక్తిని) నీకు అనుగ్రహించును : దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు (1 యోహాను 3:9). 
  5.  దైవ వాక్యమును నీకు నేర్పించును : ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును (యోహాను 14:26).

ఆత్మమూలముగా జన్మించుట ఎంత అద్భుతమైన అనుభవమో కదూ! 

రెండవది : ఆధ్యాత్మిక జీవమును ప్రసాదించు కార్యముతో పాటు పరిశుద్ధాత్మ యొక్క రెండవ కార్యమేదనగా  ఒక వ్యక్తిని దైవ సేవకు తగు శక్తివంతునిగా చేయుటకవసరమైన ‘ఆత్మ నింపుదల’ కార్యము. దీనిని గూర్చి  లేఖనములలో పలుచోట్ల పేర్కొనబడినట్లుగా చూడగలము (మత్త 3:11; లూకా 24:49; అపో. 1:8, 2:4, 2:33, 4:8, 4:31, 6:8, 8:14-17, 10:44-47, 19:2-6; గలతీ 3:1-3

  1. 1. శిష్యులు పెంతెకోస్తు దినమున ఆత్మచేత నింపబడిరి. “అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై” (అపో 2:4) “పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను” (అపో. 4:8 అలాగే అపో. 4:31,. 7:35, 11:24, 13:9, 13:52 లను గమనించుడి).
  2. పౌలు వ్రాతలు కూడా క్రైస్తవుడు పరిశుద్ధాత్మచే నింపబడవలెనని ప్రభోదించుచున్నవి. ఎఫెసులో ఉన్న క్రైస్తవులకు (విశ్వాసులకు) వ్రాసిన పత్రికలో వారందరు “దేవుని సంపూర్ణతయందు పూర్ణులు ” కావలెనని ప్రార్థించుచున్నట్లు వ్రాసెను (ఎఫె3:19). ఆ తరువాత అదే పత్రికలో వారు ”ఆత్మ పూర్ణులై ఉండు” అనుభవం పొందవలెనని ఆజ్ఞాపించెను (ఎఫె5:18).
  3. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవము గూర్చి కొంత మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ నాయకులు ఇచ్చిన సాక్ష్యము:

జార్జి ముల్లర్ :- నేను 1825 సం॥ నవంబర్ నెల మొదట్లో యేసు ప్రభువును నమ్మి రక్షింపబడితిని. మొదటి నాలుగు సంవత్సరముల తరువాత 1829 జులై నెలలో బలహీనతయందు ప్రభువు నా జీవితంలో ఒక అద్భుతమైన మంచి అనుభవము ఇచ్చెను. నా హృదయమును, నా జీవితమును సంపూర్ణ స్థాయిలో ప్రభువుకు అప్పగించగలిగితిని. 

ఛార్లెస్ ఫిన్నీ :- నిప్పుల దగ్గర కూర్చొని చలి కాచుకొందునను కొనుచున్న సమయంలో నేను గొప్ప శక్తి వంతమైన అద్భుతమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందితిని. ఆ సమయంలో నా హృదయములో క్రుమ్మరింపబడిన ‘‘అద్భుతమైన ప్రేమ” ను గూర్చి మాటలలో వివరింపనశక్యము. 

జాన్ వెస్లీ : తెల్లవారుజాము 3గం॥ సమయములో మేము ఆసక్తితో ప్రార్థించు చుండగా దేవుని శక్తి గొప్ప సామర్థ్యముతో దిగి వచ్చినప్పుడు అనేక మంది మహానందముతో శబ్దము చేయుటయు, అనేక మంది నేల మీద పడిపోవుటయు జరిగెను. 

డి.ఎల్. మూడీ :- దేవుడు తన ఆత్మతో నన్ను నింపవలెనని ఎల్లప్పుడు కన్నీటితో ప్రార్థన చేయుచుంటిని. అయితే న్యూయార్క్ నగరములో ఒక రోజు – దానిని నేను ఎంతో అద్భుతమైన దినముగా పరిగణించెదను. దేవుడు తనను తాను నాకు ప్రత్యక్షపరచుకొనగా ఆయన ప్రేమను అద్భుతముగా అనుభవించి ఆయన హస్తములలో నే నన్ను భద్రపరచుమని దేవుని వేడుకొంటిని. 

  1. పరిశుద్దాత్మకు ప్రతిగా వాడబడిన వివిధ పదజాలము” ? : శక్తి చేత నింపబడు ఈ అమ్రుభవమునకు లేఖనములలో అనేక పేర్లు (పదములు) వాడబడెను. మత్తయి 3:11; అపో. 1:5, 116లో దీనిని

 ‘‘పరిశుద్దాత్మలో “బాప్తీస్మము” అనియు, అపో. 7:55, 4:8, 4:31, 9:17లో ఇది  “ఆత్మతో నింపబడుట” అని పిలువబడెను. అపో. 8:15,17, 10:47, 19:2లలో పరిశుద్దాత్మను పొందుట” అనియు, లూకా 24:49లో ఇది పైనుండి శక్తి పొందుట”గా పేర్కొనబడెను. అపో. 1:8, 8:16, 10:44, 11:15, 19:6 లలో ఒక విశ్వాసిపై పరిశుద్ధాత్మ “దిగుట” లేక “క్రుమ్మరింపబడుట” అను పదములువాడబడెను (లూకా 1:13; అపో. 2:38, 10:45, 15:8). దీనిని ‘పరిశుద్దాత్మ వరము” గాను, లూకా 24:49; అపో. 1:4, 2:33 లో తండ్రి  యొక్క వాగ్దానము అనియూ, అపో. 2:17, 2:33, 10:45లలో “క్రుమ్మరింపబడుట” గాను పేర్కొనబడెను.  The Role of the Holy Spirit in Evangelism

  1. ఆత్మతో నింపబడుట అనగా అర్థమేమి : పరిశుద్ధాత్మచే నింపబడుట అనగా స్వంత ఆలోచనలు, స్వశక్తిచేత, కాక పరిశుద్దాత్మచే పూర్తిగా నియంత్రించబడుట. ఒక ఆత్మ పూర్ణుడైన క్రైస్తవుడు పరిశుద్దాత్మచే కడుగబడి, నింపబడి, ఆత్మ శక్తితో నడిపించబడును. పరిశుద్ధాత్మ మానవ ఆత్మపై అధికారము కలిగి యజమానిగా వ్యవహరించును.

  నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుట అవసరమని గుర్తించు : 

పరిశుద్ధాత్మతో నింపబడుట యొక్క ఆవశ్యకతకు గల 5 కారణములు. 

A) అంతరంగ పురుషుడు శుద్దీకరింపబడుట కొరకు (పవిత్ర పరచబడుట కొరకు) : 1కొరిం 6:11, అపో. 15:8,9. ఈ లేఖనములు ఆత్మ ద్వారా హృదయ శుద్దీకరణ జరుగుటను గూర్చి తెలుపుచున్నవి.

B) ఒక విశ్వాసి జయ జీవితము జీవింటకు కావలసిన శక్తినను గ్రహించును గనుక : రోమా 8వ అద్యాయము, గలతీ 5:16, 5:25 మొదలైన లేఖన భాగములు ఆత్మ పూర్ణులైన ఒక విశ్వాసి జీవించగల జయ జీవితమును గూర్చి తెలియజేయుచున్నవి. ఈ అద్భుతమైన క్రైస్తవ జయ జీవిత అనుభవమును గూర్చి అనేక మంది క్రైస్తవులకు తెలిసినప్పటికి నీ అధిక సంఖ్యాకులకు తెలియదు. అయితే ఒక ప్రభావవంతమైన (మంచి) ఆత్మల సంపాదకునిగా మారుటకు ఈ జయజీవితము కలిగియుండుట నీకు ఎంతో అవసరము. నీ నోటి మాటల కంటే నీ జీవితమేఇతరులతో ఎక్కువగా మాటలాడును. కనుక ఇతరులను రక్షకుని దగ్గరకు నడిపించగల జీవితము నీవు కలిగియుండవలెను. నీవు క్రీస్తుకు రాయబారివి (2కొరింథి 5:20). నీవు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు (శక్తిని పొందుకొనినప్పుడు) ఈ జయ జీవితమును స్వతంత్రించు కొనెదవు. The Role of the Holy Spirit in Evangelism

.C) సాక్ష్యమిచ్చుటకును మరియు ఆత్మల సంపాదనా సామర్థ్యము కలిగియుండుటకు : సువార్త పరిచర్య కవసరమైన ఆత్మ శక్తిని అనుగ్రహించుటయే పరిశుద్దాత్మ నింపుదల యొక్క మూడవ ఉద్దేశ్యము. లూకా 24:49లో యేసు తన శిష్యులకు ” గొప్ప ఆజ్ఞను” యిస్తూ “ఇదిగో నా తండ్రి వాగ్ధానము మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని” వారితో చెప్పెను. అపో. కా. 1:8లో “పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల ‘ యందంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని” వారితో చెప్పినట్లుగా మనము ( గమనించెదము. నిష్ఫలముగాను, పరాజయ స్థితిలోను ఉన్న క్రైస్తవ జీవితమును శక్తి వంతమైన, ఫలభరితమైన విజయపథములో నడిపింపగలదే ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొను అనుభవము. 

D)ఆత్మ ఫలము ఫలించుట కొరకు : గలతీ 5:22, 23లో ఉన్న “ప్రేమ, సంతోషము, సమాధానము, < దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అను ఆత్మ ఫలము మన జీవితముల ద్వారా బయలు వెడలుట కొరకు. ఈ లక్షణములన్నీ మనలో కనిపించవలెననెడు కోరిక అందరికీ ఉంటుంది కదూ! మన జీవితములు పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండుట ద్వారా ఈ లక్షణములు కలిగి ఉండవలెననునదియే దేవుని చిత్తము. దినమంతయూ ప్రేమ కలిగియుండాలని, ఆనందముగా ఉండాలని, సహనము, ఓపిక కలిగి యుండాలని మనము ప్రయత్నము చేయవచ్చు గాని మానవ యత్నముల ద్వారా నాటిని 1 మనము కలిగియుండలేము. పరిశుద్దాత్మ పూర్ణులముగా మాత్రమే వీటిని పొందుకోగలము. ఆయన మనపై ( నియంత్రణ కలిగి యున్నప్పుడు ఆత్మఫలము దానంతట అదే (Automatically) మనలో కనిపించుట గమనించెదము. మనము ఎంత పరిమాణములో అయితే పరిశుద్దాత్మ స్వాధీనములో ఉండెదమో అంతే పరిమాణములో ఈ లక్షణములు, స్వభావము లేదా ఆత్మఫలము మన జీవితముల నుండి బయలు వెడలును.  The Role of the Holy Spirit in Evangelism

E) ఆత్మ వరములను అనుగ్రహించును గనుక: ఆత్మ పూర్ణులైయుండుటలో గల ఐదవ ఉద్దేశ్యమేదనగా వివిధ రకములైన ఆత్మ వరములను ఉపయోగించుటకు పరిశుద్దాత్ముడు వీలు కల్పించుటయే. రోమా పత్రిక 12వ అధ్యాయము మరియు 1వ కొరింథి 12వ అధ్యాయములోనూ పరిశుద్ధాత్మ దేవుడు 17 వేరు వేరు రీతులలో మనలను తన ఆత్మ వరములతో నింపి దైవ సేవకు సిద్దపరచవలెనని ఆశించుచున్నాడు.

ఆత్మ నింపుదల కొరకు మనము చేయవలసినవి 

సిద్ధపడుటకై కొన్ని మెట్లు :

  1. దేవుని ఆత్మను పరిపూర్ణముగా పొందుకొనుట అనునది అంత తేలికగా తీసుకొను విషయం కాదు. ఒక పాత్రను నింపుటకు ముందుగా దానిని సిద్ధపరచవలెను. కావున సిద్దపడుట కొరకైన 5 మెట్లను పరిశీలించెదము.
  2. పరిశుద్ధాత్మను పొందుకొనుట (పరిశుద్ధాత్మచే నింపబడుట)ఆవశ్యకమని గుర్తించు : దేవుడు ఎల్లప్పుడు మన అవసరతల యందు మనను దర్శిస్తూ ఉంటాడు. ఈ అద్భుతమైన, కృపావంతమైన అనుభవము నీకవసరముని > నీవు గుర్తించిన యెడల ఆయన తన ఆత్మతో నిన్ను తప్పక నింపును.
  3. ఈ అనుభవమును గూర్చిన పూర్తి అవగాహన కలిగియుండుము : ఆత్మ పూర్ణులైయుండుటఅనగా నీ జీవితముపై పరిశుద్దాత్మ యొక్క సంపూర్ణ ఆధిపత్యమును ఒప్పుకొనుట. నీవు నీ ప్రవర్తన అంతటిలోను,ఆయన అధికారమునకు ఒప్పుకొని, ఆయన చెప్పునదంతయూ బేషరతుగా చేయవలెను. (అపో.కా. 5:32).
  4.  ఆత్మ పూర్ణునిగా నీ జీవితములోని ప్రతి విషయముద్వారా ప్రభువైన యేసును మాత్రమే మహిమ పరచునట్లు సిద్దపడవలెను. 
  5.  ఆత్మపూర్ణునిగా నీవు సువార్త పరిచర్య నిమిత్తమై పరిశుద్ధాత్మ హస్తములలో ఒక సాధనముగా మారెదవు. ఆయన కోత యజమానిగా ఈ భువిపైకి ఏతెంచెను (మత్తయి 9:38). ప్రపంచ వ్యాప్తముగా ఆత్మ సంబంధమైన  కోత యొక్క బాధ్యత ఆయనదే. ప్రపంచ సువార్తీకరణ కొరకై నిన్ను నీవు వ్యక్తిగతముగా సంపూర్ణ హృదయముతో ఆయనకు సమర్పించుకొనవలెను వ్యక్తిగతముగా సాక్ష్యమిచ్చుట మరియు ఆత్మల సంపాదనకై నీకున్న డబ్బు ధారాళముగా ఇచ్చుటకు నీ జీవితమును పూర్తిగా అంకితము చేసికొనవలెను. 

A.) ఆత్మ నింపుదలకై దైవసన్నిధిలో కనిపెట్టుట ఆరంభించుము :

1.)  కేవలము అవసరమును గుర్తించి, పూర్తి అవగాహన కలిగియుండుట మాత్రమేగాక ఈ అనుభవమును పొందుకొనుటకు దైవసన్నిధిలో కనిపెట్టవలెను.

2.) నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడెదరు” అని యేసు చెప్పెను (మత్త 5:6).

3.)యేసు “ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్పుకొనవలెను”… ‘తనయందు విశ్వాస ముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను’ (యోహాను 7:37-39) దేవుని ఆత్మను గూర్చిన ఆకలి, దప్పులు నీకున్నవా? నిజమా? అయితే పరిశుద్ధాత్మ బాప్తీస్మము కొరకు సంపూర్ణ హృదయముతో దైవసన్నిధిలో కనిపెట్టుము. 

దేవునితోను మనుష్యులతోను ప్రతి విషయములోను నీ సంబంధమును సరిచేసుకోవలెను . అపో.కా.24:16లో “ఈ విధముగ నేనును దేవుని యెడలను, మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను” అని వ్రాయబడియున్నది. మన జీవితములపై పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి నియంత్రణ కలిగి యుండవలెనంటే మనము దేవుని యెదుటను, ప్రజల యెడలను నిర్దోషమైన మంచి మనస్సాక్షి కలిగి యుండవలెను. దీని కొరకు మన పాపములను, తప్పిదములను గుర్తించుట, పశ్చాత్తాపపడుట, విడిచిపెట్టుట, దేవునితోను, ఇతరులతోను పూర్వపు సంబంధమును ఏర్పరచుకొనుట ఎంతోఅవసరము.

ఒంటరిగా దేవునితో ఎక్కువ సమయము గడుపు. నీ జీవితములో ఆత్మ కార్యమును ఆటంకపరుస్తున్న ప్రతి దానిని బయలుపరచమని దేవుని అడుగు (కీర్తన 139:23,24). సమస్తమును దేవుని హస్తములకు సమర్పించుము. 

ప్రతి దానిని దేవునికి లోబరుచుము (Yield everything to God) పరిశుద్ధాత్మ నింపుదల జీవితమును అనుభవించుటకై నీ (జీవితము) లోని “నా” “నేను” అనే అహం పూర్తిగా చనిపోవలెను. యోహాను 12:24లో “గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు చెప్పెను. ఈ జీవితమునకు సంబంధించిన సమస్తమును అని దీని ద్వారా అర్థముచేసికొనగలము (లూకా 14:33; రోమా పత్రిక 12:1,2). ఎట్టి షరతులు పెట్టకుండా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ స్వాస్థ్యముగా మారిపో. నీకు కలిగిదంతయూ అనగా – నిన్ను, నీ జీవితమును, నీ సమయమును, నీ ధనమును, నీ సమస్త ఆస్థిని, నీ తలాంతులను, నీ కోరికలను, నీ లక్ష్యములను, నీ ఉద్దేశ్యములను సమస్తమును ఆయన చిత్తానుసారముగా ఉపయోగించుకొనమని దేవుని అడుగు. ఈ విధముగా చేయుటవలన నున హృదయమనే పాత్ర పరిశుద్దాత్మ నింపుదలకై సిద్దమవుతుంది.

B) పొందుకొనుటకు రెండు మెట్లు :

నిన్ను నింపమని దేవున్ని అడుగు : లూకా 11:11-13లో “మీలో తండ్రియైన వాడు తన కుమారుడుచేపనడిగిన చేపకు ప్రతిగా పాము నిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై యుండియుమీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్దాత్మను ఎంతో నిశ్చియముగా అనుగ్రహించుననెను”. 

పరిశుద్ధాత్మను పొందుకొనుటకై పై నుదహరింపబడిన విషయములు  (5 మెట్లు) ప్రకారము నీవు సిద్దపడినట్లయితే, పరిపూర్ణముగా తన ఆత్మతో నింపమని దేవుని అడుగుటయే నీ వంతు. 

దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని మర్చిపోవద్దు, మనము ఆశించే దానికంటే తన ఆత్మతో మనలను నింపవలెనని దేవుడు మరి యెక్కువగా ఆశించుచున్నాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించవలెనని ‘ కోరుచున్నాడు కనుక కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను ఎక్కువగా స్తుతించుము. 

విశ్వాసముతో స్వీకరించుము (పొందుకొనుము) : యోహాను 7:37 లో యేసు – “ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను” అని చెప్పి 38, 39 వచనములలో తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి వారికి వివరించెను. మొదట తన యొద్దకు వచ్చి అడగమని ఆయనను ఆహ్వానించిన పిమ్మట “ఇప్పుడు విశ్వాసముద్వారా త్రాగుము (స్వీకరించుము” అని చెప్పుచున్నాడు కనుక ‘ ఆయనను సంపూర్ణముగా నమ్మి అడుగు, విశ్వాసముతో అడుగు, సందేహింపకుండా అడుగు. తరువాత ఆత్మ నీలోనికి వచ్చెనని విశ్వసించు, విశ్వాసముతో ఆయనను స్వీకరించు. పరిశుద్ధాత్మను పరిపూర్ణముగా త్రాగుము.

పరిశుద్ధాత్మను పొందుకొను సమయములో భావోద్వేగముతో కూడిన అనుభూతి నీకు కలుగవచ్చును లేదా కలుగకపోవచ్చును. అపో.కా. 2:4లో “అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి” . అపో. కా. 10:44-46లో ‘ పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని భోద నిన్న వారందరిమీదికి పరిశుద్దాత్మ దిగెను…. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.” మరియు మార్కు 16:17లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు….” అని చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మను పొందుకొను సమయములో అందుకు సూచనగా అన్యభాషలలో (మన మెరుగని మాటలతో) దేవుని మహిమ పరిచెదము. పరిశుద్ధాత్మ మనలోనికి అడుగిడిన (వచ్చిన వెంటనే మన శరీర అవయవములలోని నాలుకనుపయోగించుకొని అన్యభాషలద్వారా (క్రొత్తభాషల) వివరింప శక్యమైన ఉన్నత రీతిలో దేవుని మహిమ పరచును. కనుక నీవు పరిశుద్ధాత్మతో నిండిన వాడపై ప్రభువును స్తుతించు సమయములో నీ నాలుక తడబడుతూ నీవెరుగని క్రొత్త మాటలు ఉచ్చరింప గోరునప్పుడు, భయపడక, నాలుకను బిగబట్టుకొనక స్వేచ్ఛగా ఆ మాటల (అన్యభాషల) ద్వారా ఆత్మతో దేవుని ఆరాధించుము. The Role of the Holy Spirit in Evangelism

పరిశుద్ధాత్మను పొందుకొను సమయములో వివిధ రకములైన కృపావరములు (ఆత్మ వరములు) కూడ నీకనుగ్రహింపబడ వచ్చును. అపో. కా. 19:6లో “పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలలో మాటలాడుటకును, ప్రవచించుటకును మొదలు పెట్టిరి” అని వ్రాయబడినట్లుగా జరుగవచ్చును. 

అయితే అన్నిటికి మించి పరిశుద్దాత్మను పొందితివన్న సంపూర్ణాత్మ నిశ్చయము నీకు కలుగును. పరిశుద్ధాత్మచే పరిపూర్ణుడవైన కారణముగా (ఫలితముగా) రానున్న రోజులలో క్రీస్తును గూర్చి (ఇతరులకు) అనేక మందికి సాక్ష్యమిచ్చి అనేక ఆత్మలను జయించవలెనన్న గొప్ప ఆశ (కోరిక) నీలో కలుగుట గమనించెదవు. సాక్ష్యమిచ్చుటలో ఎంతో స్వేచ్ఛ మరింత ధైర్యము నీకు కలుగును (అపో. 1:8). నీ జీవితములో “ఆత్మ ఫలము” (గలతీ 5:22,23) సమృద్దిగా కనిపించును. నీవు గొప్ప జయజీవితము జీవించెదవు మరియు పరిచర్యలో వివిధ ఆత్మ వరముల ద్వారా దేవుని మహిమ పరిచెదవు. 

ఎంత అద్భుతమైన జీవితమో కదా! దేవునికి స్తోత్రం !! హల్లెలూయ !!! 

IV ఆత్మపూర్ణునిగా కొనసాగుటకై పాటించవలసిన నియమములు :

ఒక విశ్వాసీ పరిశుద్ధాత్మచే నింపబడుట (పరిశుద్ధాత్మ బాప్తీస్మము) ఎంత అవసరమో (ప్రాముఖ్యమో) నింపబడిన తరువాత ఆత్మానుసారముగా జీవించుట (ఆత్మలో నడచుట) అంతే ప్రాముఖ్యమైన విషయము. – ప్రతి క్షణము (క్షణక్షణము) పరిశుద్ధాత్మచే నడిపించబడుట ఎట్లో మనము నేర్చు కొనవలెను. ఆత్మాను సారమైన జీవితము కొనసాగించుటకు కొన్ని నియమములు పాటించవలెను. 

(A) ఇది అనుక్షణము కలిగియుండవలసిన అనుభవమని గుర్తించు: పరిశుద్ధాత్మ నింపుదల అనుభవము జీవితమంతటిలో ఒకసారి పొందుకొంటేనే సరిపోయే అనుభవము కాదు. ఇది అనుక్షణము కొనసా గించవలసిన అనుభవము. ప్రతి సమయమందును జీవితములో నీ సమస్త విషయములలో ఆయనకు లోబడియుండవలెను. మరింత నింపుదలకై, నూతన అభిషేకముకై ఆసక్తితో, విశాల హృదయముతో ఎల్లప్పుడూ కనిపెట్టియుండవలెను. దేవునికి ఎల్లప్పుడు లోబడియుండుట అనగా పరిశుద్ధాత్ముడు ఒక నూతన సత్యమును బయలుపరచునప్పుడెల్ల ( వెంటనే ఆయనకు లోబడి ఆత్మానుసారముగా జీవించుటయే (1 యోహా 1:7) అని గుర్తుంచుకొనవలెను. 

B) ప్రతి దినమును ప్రభువుతో ఆరంభించు: ఒక ఆత్మ పూర్ణుడైన క్రైస్తవునిగా ఉండుట వలన సాతానుతోను, అపవాది శక్తుల (దురాత్మల సమూహము)తో జరిగే యుద్దములో (ఎఫెసీ 6:12,13) నీకు ఎటువంటి మినహాయింపు లభించదు కనుక ప్రతిరోజును దైవసన్నిధితో ఆరంభించుట అవసరము.

మన ప్రభువు యొక్క అలవాటు ఇదే విధంగా ఉండేది (మార్కు 1:35). బైబిల్ లో ఇలా అనేక మంది భక్తులు దీనినే జీవితములో అభ్యాసము చేసిరి. వారిలో యాకోబు (ఆది 28:18). హిజ్కియా (2 దిన. వృత్తా 29:20), యెబు (1:5) మరియు దావీదు (కీర్త 57:8) మొదలైనవారు. 

జాన్ వెస్లీ అను గొప్ప దైవజనుడు ప్రతిదినము రెండు గంటలు ప్రార్థనలో గడిపెడివాడు. ఆయన తెల్లవారు జామున 4 గం.లకు ఆరంభించెడి వాడు. 

దైవజనుడైన జాన్ ఫ్లెచర్ తన గది గోడలన్నింటినీ ప్రార్థనా స్తుతితో మోదుతూ ఉండేవాడు. అనేక సార్లు ఈయన అత్యాసక్తి, పట్టుదలతో రాత్రి అంతా ప్రార్థనలో గడిపెడివాడు. His whole life was a life of  prayer. 

మహా భక్తుడైన మార్టిన్ లూధర్ ఈ విధముగా చెప్పెను : ప్రతి ఉదయము రెండు గంటలు కనుక నేను ప్రార్థనలో గడపలేకపోయినట్లయితే, ఆ రోజంతయూ అన్నిటిలోను సాతానే విజయం పొందును. నేను ప్రతిరోజు ఎంతో పని చేయాలి కనుక కనీసం 3 గం.లు అయినా ప్రార్థనలో గడుపనట్లయితే నేను దానిని పూర్తి చేయలేను. స్కాట్లాండ్ కు చెందిన పరిశుద్ధుడును, గొప్ప ప్రసంగీకుడునైన జాన్వెల్స్ – “ప్రతిరోజు 8 నుండి 10 > గం॥లు అయిన దైవసన్నిధిలో ప్రార్థనలో గడపక పోయినట్లయితే ఆ రోజు నేను ఏమీ సాధించలేను” అన్నాడు. ఆత్మ పూర్ణునిగా నడువవలెననిన దినమంతయూ, ప్రతిదినమూ ఉదయకాలము వాక్య ధ్యానము, ప్రార్థనలలో దైవ సన్నిధిలో గడుపుట యెంతో అవసరము. The Role of the Holy Spirit in Evangelism

(C) దినమంతయూ ప్రభువుతో నడుపుము : 

ప్రతిదినము ప్రభువుతో ఆరంభించుట మాత్రమే కాక రోజంతయూ ప్రభువుతో కలిసి నడువవలెను. దినమంతయూ యేసుతో నడుచుటకై ఈ క్రింది వాటిని చేయుము : 

  1. నీ దృష్టిని యేసుపై సారించు : హెబ్రి 12:2లో “యేసు వైపు చూచుచూ” అని చెప్పబడినట్లుగా > రోజంతయూ అనుక్షణము మన కనుదృష్టిని యేసుపై నిలపవలెను. ప్రతి విషయములోను ఆయననే నీకు మాదిరిగా ఉంచుకొని ఒక ఆప్తమిత్రుని వలె ఆయనతో వ్యవహరించు. క్రైస్తవ ప్రమాణములు, నియమముల ( కొరకై ఇతరుల జీవితములను పరిశీలించి వారిని మాదిరిగా పెట్టుకొనవద్దు. ఇతరుల నోటిమాటలనుబట్టి, చేతలను బట్టి అభ్యంతర పడవద్దు. మనుష్యులను మెప్పించవలెనని కాక అనుక్షణము దేవునినే సంతోషపరచు రీతిలో జీవించు.
  2. పూర్తిగా దేవునిపై అనుకొని, సంపూర్ణ సమాధానముతో యుండుము : గలతీ 2:20. ఆయనలోనిలిచియుండు.
  3. నీ అధికారమును ఉపయోగించుము (అభ్యాసము చేయుము) : మనము ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము (ఎఫెసి 6:12). యేసు తన మరణము ద్వారా అపవాదిని ఓడించాడు (హెబ్రీ 2:14,15).

విజయము నీదే. దేవుని కుమారుడు కుమార్తెగా నీకున్న అధికారమును ఉపయోగించు. అన్నివేళలా దేవుని సర్వాంగ కవచమును ధరించుకో (ఎఫెసీ 6:10-18). అపవాదిని ఎదిరించు (యాకోబు 4:7). దేవుని లేఖనములను వానికి చూపించు (లూకా 4:3-13). వానితో సంభాషించి వానిని గద్దించు (మత్తయి 16:23). యేసు నామమును” ఉపయోగించు (లూకా 10:17 -20). The Role of the Holy Spirit in Evangelism

4.. పరిశుద్దాత్మ చేతిలో ఒక సాధనముగా మారుము: యోహాను 7:37-39లో యేసు పరిశుద్ధాత్మను గూర్చి ఉదహరించెను. మరియు 38వ వచనములో “విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును” అని చెప్పెను. ఇక్కడ యేసు ఆత్మ పూర్ణుడైన క్రైస్తవున్ని ప్రవహించే నదితో పోల్చెను. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము మన అవసరముల నిమిత్తము మాత్రమే కాక మన ద్వారా ఆయన ఇతరుల జీవితములలోనికి కూడ ప్రవహించు నిమిత్తమై ఆత్మతో మనలను నింపెను. కనుక అనుక్షణము ఆయనకే అందుబాటులో ఉండుము. పరిశుద్ధాత్మ యొక్క చల్లని, మెల్లని స్వరమునకు తగురీతిలో వెంటనే స్పందిస్తూ, పూర్తి విధేయతతో ఆయన వెళ్ళమన్న ప్రతిచోటికి వెళ్ళి, చెప్పిన ప్రతిదీ చేయుము. ఆత్మఫలము నీలో ( నీ జీవితములో) స్పష్టముగా కనిపించునట్లు (ప్రత్యక్షపరచబడుటకై) ఆయనకు లోబడియుండుము. ఆత్మ వరములను ఉపయోగిస్తూ ఎల్లప్పుడు దేవుని మహిమపరచు. ఎప్పుడూ ( ఎట్టి పరిస్థితులలోను) పరిశుధ్ధాత్మను దుఖఃపరచకుము (ఎఫెసి 4:30). 

నీ జీవితములో, నీ జీవితము ద్వారా జరుగు ఆయన కార్యములను ఆటంకపరచునట్టి ఏ పనినీ, ఎన్నడును చేయవద్దు. తోటి క్రైస్తవులను (విశ్వాసులను) విమర్శించుట, న్యాయము తీర్చుట, నిందించుట లేక వారిని గూర్చి ఇతరులయొద్ద ప్రతికూలముగా మాట్లాడుటగాని చేయవద్దు….,  The Role of the Holy Spirit in Evangelism

అదే విధముగా ఎన్నడూ పరిశుద్ధాత్మను ఆర్పకుము. 1థెస్స5 19లో “ఆత్మను ఆర్పకుడి” అని చెప్పబడెను. “లేదు, కాదు” “నేను చెయ్యను” (No) అని దయచేసి ఆయనతో ఎన్నడూ అనవద్దు! దినమంతయూ నీవు ప్రభువుతో నడచునప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ప్రేరణకు లోబడుము. ఆయన మెల్లని స్వరము యొక్క గుసగుసలకు అనుకూలముగా స్పందించుము. అయితే ఆయన తన వాక్యానుసారముగా మాత్రమే మాట్లాడునని జ్ఞాపకముంచుకొనుము                (1 యోహాను 4:1). 

D) ప్రతి దినమును ప్రభువుతోనే ముంగించుము :-

ప్రతి దినము యొక్క ముగింపులో ప్రార్థనా సమయము కలిగియుండుటకు అలవాటు చేసికొనుము. నీ హృదయమును పరిశోధించమనియు, రోజంతటిలో దేవుని చిత్తానికి ప్రతికూలముగా చేసిన ప్రతి దానిని చూపించమని (బయలు పరచమని ప్రభువును అడుగు. ప్రభువు చూపించు వాటిని వెంటనే సరిచేసి కొనుటకు ప్రయత్నించుము. దేవుని యెడలను, మనుష్యుల యెడలను, మంచి మనస్సాక్షి కలిగియున్నాననెడి నిశ్చయత నీకు కలుగు వరకు ఆ దినము పూర్తి అయినట్లుగా భావించకుము. The Role of the Holy Spirit in Evangelism


బైబిల్ ప్రశ్నలు – జవాబులు .. click here 

Leave a comment