గతానుభవ వేదిక.
Telugu Jesus Best parable
ఫిలిష్తీయ వీరుడైన గొల్యాతును ఎదుర్కోటానికి ఇశ్రాయేలీయులలో ఎవరును లేకపోగా, దావీదు ఆ యుద్ధభూమి యొద్దకు వచ్చి గొల్యాతు దూషణలను విని, కోపోద్రేకుడై వానిమీదికి యుద్ధానికి వెళ్తానని ప్రకటించాడు. ఈ మాట, ఆనోటా ఈనోటా చేరి, చివరికి సౌలు (రాజు) దగ్గరకు వెళ్లిపోయింది.
సౌలు దావీదును పిలిచి చూడగా, బహు ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అంత పెద్ద గొల్యాతును ఎదుర్కోడానికీ, దావీదు అన్నవాడు ఎంత గొప్ప శూరుడో, వీరుడోనని నేను అనుకుంటే, చిన్న బాలుడుగా ఉన్నాడే! వీని బలము ఏపాటిది? వీని యుద్ధ అభ్యాసము ఎంతటిది? గొల్యాతుతో పోరాడి ఇశ్రాయేలీయులకు విజయం తెచ్చేది, ఇచ్చేది ఈ బుడతడా? అనుకుంటూ సౌలు దావీదును తృణీకరించాడు.
సౌలు నేరుగా దావీదుతో – ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడు అంటూ దావీదును ప్రోత్సహించవలసినవాడు నిరుత్సాహపరిచాడు (1సమూ. 17:33). Telugu Jesus Best parable
అందుకు దావీదు యొక్క సంజాయిషీ ఏమిటి? సౌలును దావీదు ఎలా ఒప్పించగలిగాడు? ఇదిగో చూడండి – “మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తికొనిపోవుచుండగా, నేను దానిని తరిమి చంపి దాని నోటినుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.
మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు, సింహము యొక్క బలమునుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడను నన్ను విడిపించునని చెప్పెను” (1సమూ 17:34-37) అంటూ దావీదు సౌలును ఒప్పించాడు.
ప్రియులారా, ఒకసారి ఈ మాటలు ఆలోచించండి!
“సింహము యొక్క బలము నుండియు, ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా” అట!
సింహపు యొక్క బలము నుండియు, ఎలుగుబంటి యొక్క బలము నుండియు దేవుడు దావీదును ఎప్పుడు రక్షించాడు? “గతం”లో రక్షించాడు. సౌలుతో దావీదు మాటలాడుటకు ముందే దావీదు జీవితములో ఈ “అనుభవం” ఉండింది. Telugu Jesus Best parable
దేవుడు దావీదు జీవితంలో ఏ అనుభవమైతే గతంలో ఇచ్చాడో, ఆ అనుభవమే నేడు కొత్త సమస్యను ఎదుర్కోడానికి ధైర్యమును శక్తిని యిచ్చింది.
గతానుభవ వేదిక మీదనుంచి మరొక సవాలుకరమైన సమస్యతో దావీదు పోరాడుతున్నాడు. సింహమును, ఎలుగుబంటిని చంపే శక్తిని యిచ్చిన దేవుని యెదుట ఈ గొల్యాతు ఎంతటివాడు? వాని కండలు, గుండెలు, వాని గాండ్రింపు నేను చూడను. ఇదే, దావీదు చేసిన తీర్మానం.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ జీవితములో దేవుడు ఎన్నో గొప్ప కార్యములూ, అద్భుతాలూ, ఆశ్చర్యకార్యాలూ చేసి ఉండవచ్చు. బహు యిరుకులో నున్నప్పుడు, నిన్ను విశాలమార్గములో ప్రభువువారు ఆశ్చర్యంగా నిలబెట్టి ఉండవచ్చు. విషమించిన ఈ సమస్య రేపు నన్ను ఏంచేయునో అంటూ గాబరా పడిన స్థితిలో మీరుండగా, తెల్లవారే అనుకోని రీతిగా నీ సమస్య సాల్వ్ చేయబడింది. ఇటువంటివి ఎన్నో నీ జీవితములో అనుభవాలుగా ఉండి వుండవచ్చు.
అయితే, ఈ అనుభవాల వేదికపై నించొని, ప్రస్తుతం ఒక కొత్త సమస్య (గొల్యాతు)ను ఏ విధంగా ఎదుర్కొంటున్నావు? దానినెలా చూస్తున్నావు?
దేవుడు నీకిచ్చిన గత అనుభవాలతో, ప్రస్తుత నీ సమస్యను అవలీలగా నీవు ఎదుర్కొనవచ్చు. లేదా కృంగిపోయి సొమ్మసిల్లి నీరసిల్లి భయముతో బదుకును వెళ్లబోసుకోవచ్చు.
గతానుభవం ప్రస్తుతం నీ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది.
ఒకసారి ప్రయోగం ఒకటి జరిగింది. ఓ పెద్ద చేపని పెద్ద నీళ్ల ట్యాంక్ లో వేసారు. ఆ ట్యాంక్ను రెండు భాగాలుగా చేసేటట్టు ఒక గ్లాసు పార్టిషన్ పెట్టారు. ఒక భాగంలో పెద్ద చేపను ఉంచారు. మిగిలిన భాగంలో ఒక చిన్న చేపను వదిలారు. Telugu Jesus Best parable
చిన్న చేపను తినడానికి పెద్ద చేప, ఒక్క దుముకుతో చిన్న చేపమీద అటాక్ చేయబోతుంది. కాని మధ్యలో పెట్టిన గ్లాసు పార్టిషన్ (హద్దు) పెద్ద చేప మూతికి నొప్పిని కలిగిస్తుంది. మళ్లీ యింకోసారి బలంగా ప్రయత్నించింది. గ్లాస్ పార్టిషన్ వల్ల దాని మూతి యింకా నొప్పి పెట్టింది. మళ్లీ మళ్లీ ప్రయత్నించి మూతికి తీవ్రమైన గాయమయింది.
దాంతో పెద్ద చేప, చిన్ని చేపను పట్టాలని చేసే ప్రయత్నం బాధాకరమైనదని నిర్ణయించుకుని పట్టే ప్రయత్నాన్ని వదిలిపెట్టింది.
తరువాత గ్లాసు పార్టిషన్ తీసేసారు. అప్పుడు పెద్ద చేప, చిన్న చేప వరకూ వెళ్తుంది కాని దాన్ని పట్టుకోకుండా తిరిగి వెళ్లిపోతుంది. పెద్ద చేప తనను తానే చిన్న చేప ముందు శక్తిహీనురాలిగా నిర్ణయిం చేసుకొని విరమించుకుంది. చేపయొక్క గతానుభవం తన నిర్ణయాల మీద, తాను ఎదుర్కొనే దానిమీద ప్రభావం చూపింది. Telugu Jesus Best parable
అవును, మన జీవితములోను యిలాంటివే ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. నీకు ఎదురైన అవమానాలూ, నిందలూ, అపజయాలూ, నొప్పి, బాధ, నీ ప్రాణాన్ని ఆయాసపరచిన మనుషులూ ఊరకనే నీ స్నేహితుడు నిన్ను అపార్థం చేసుకోవడమూ… “ఇలాంటి వాటిమీద నీవు నించొని” చూస్తే “గొల్యాతు పిల్ల” కూడా నీకు భీతి పుట్టిస్తుంది.
గత అపజయాలు చూడొద్దు; నాటి విజయాలనూ మరియు ప్రభువు కృపను చూడు!
నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడును మనకు మంచి చేయవు. ఆ మాటలు మనలను ఆదరించలేవు. ఒకవేళ నీ లైఫ్ లో అపజయమే ఎదుంయి ఉండొచ్చు. నీలానే అపజయాలు ఎదుర్కొని అనేకులు పట్టు విడువని ప్రయత్నంగా వారు చేస్తూపోయిన దానిని బట్టి విజయాలు సాధించారు. Telugu Jesus Best parable
అపజయం – ప్రయత్నిస్తే విజయానికి నాంది అవుతోంది!
ప్రశ్నలు – జవాబులు .. click here