విధేయులై ఉండాలి – Telugu Bible Messages1

Written by biblesamacharam.com

Updated on:

అంశం: విధేయులై ఉండాలి

Telugu Bible Messages

1.) విధేయులై ఉండాలి.

(ఎఫెసీయులకు) 6:5

5.దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.

6:5 “దాసులారా”– పూరాతన ప్రపంచంలో బానిసత్వం సాధారణ విషయమే. రోమ్ సామ్రాజ్యంలో (ఎఫెసు పట్టణం ఆ సామ్రాజ్యంలో భాగమే) మనుషులను పశువుల్లాగా అమ్మడం, కొనడం జరిగేది. ఈ బానిసల్లో చాలామంది యుద్ధాల్లో పట్టుబడ్డవారు, లేక అలాంటివారి సంతానం. కొన్ని నగరాల్లో అయితే స్వతంత్రులకంటే బానిసలే ఎక్కువమంది ఉండేవారు. వీరిలో అనేకమంది క్రైస్తవులయ్యారు. వారేం చెయ్యాలి? తిరగబడి తమ యజమానులనుంచి తప్పించుకోవాలా? కొత్త ఒడంబడిక గ్రంథం అలా చెప్పడం లేదు (1 కొరింతు 7:20-24; కొలస్సయి 3:22; 4:1; 1 తిమోతి 6:1-2; తీతు 2:9-10; 1 పేతురు 2:18-25). బానిసత్వం మంచిదని కొత్త ఒడంబడిక గ్రంథం నేర్పడం లేదు. అప్పట్లో ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే బానిసలకూ యజమానులకూ ఒకరిపట్ల ఒకరు నెరవేర్చవలసిన విధులు ఉన్నాయని చూపుతూ వారి ప్రవర్తనకు తగిన నియమాలను ఇస్తున్నది. ప్రేమ సూత్రానికి బానిసత్వం వ్యతిరేకమనే        (రోమ్ 12:10; 13:8-10; మొ।।), కనుక అది మంచిది కాదనీ క్రైస్తవులు కాలక్రమేణా అర్థం చేసుకుని తమకు వీలైనన్ని దేశాల్లో బానిసత్వాన్ని రద్దు చేశారు. క్రీస్తు శుభవార్త యధేచ్ఛగా వ్యాపించిన చోట బానిసత్వం ఎంతో కాలం నిలవడం అసాధ్యం. బానిసత్వం గురించిన నోట్ నిర్గమ 21:3.

(యాకోబు) 4:10

10.ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

4:10 వ 6; లూకా 1:52; 1 సమూ 2:7-8; కీర్తన 15:1, 3; 50:20; సామెత 10:18; మత్తయి 15:19; 23:12; ఎఫెసు 4:31; కొలస్సయి 3:8.

2.) బలవంతులై ఉండాలి.

(ఎఫెసీయులకు) 6:10

10.తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

6:10 “ప్రభువులో…బలాఢ్యులై ఉండండి”– 1:19-21; 3:16; 1 కొరింతు 16:13; 2 కొరింతు 12:10; ఫిలిప్పీ 4:13; కొలస్సయి 1:29; 1 తిమోతి 1:12; 2 తిమోతి 2:1; హీబ్రూ 11:34; యెహో 1:6-7, 9, 18; కీర్తన 18:32-36; యెషయా 40:30-31; రోమ్ 8:37. విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. వారు దేవుని సైనికులు (1 తిమోతి 6:11; 2 తిమోతి 2:3-4; 4:7). కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన సంపత్తి వారికి ఉండాలి. ఇందుకు వారి శక్తి, చిత్తం, సంకల్ప బలం చాలవు. వారికి దేవుని బలప్రభావాలు అవసరం. వాటికోసం వారు ఆయనవైపే చూడాలి. వాటినిస్తాడని ఆయన్ను నమ్ముకోవాలి (1 యోహాను 5:14-15). ఆయన వాక్కును నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పోరాటంలో మనం బలవంతులమై ఉండేలా సహాయపడేందుకు బైబిలు మొత్తం మనకు అందుబాటులో ఉంది.

3.) మెలకువగా ఉండాలి.

(ఎఫెసీయులకు) 6:18

18.ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

6:18 పౌలు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నాడు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయ విధానాన్నే ఇంకా చూపిస్తున్నాడు. ప్రార్థన లేని స్థితి ఉండడమంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే సైతాను గజగజ వణకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నాడు. ప్రార్థనతో దాన్ని ధరించాలి, ప్రార్థనతో దానితో నిలబడాలి. ప్రార్థన గురించి కీర్తన 66:18; యిర్మీయా 33:3; మత్తయి 6:5-13; 7:7-11; 26:41; మార్కు 11:24-25; లూకా 11:5-13; హీబ్రూ 4:16; 10:19-22; యాకోబు 5:13, 16; 1 పేతురు 4:7.

శుభవార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగివున్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చెయ్యడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి – 2:18; రోమ్ 8:26; యూదా 20. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. “అన్ని” సమయాల్లోనూ “అన్ని” విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలూ ఇతరుల కోసం విజ్ఞాపనలూ చేయాలి, కృతజ్ఞతలూ స్తుతులూ సమర్పించాలి (1 తిమోతి 2:1).

ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోలోపల ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చెయ్యడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది.

4.) దేవునికి లోబడి ఉండాలి.

(యాకోబు) 4:7

7.కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని(సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

5.) ఓపిక కలిగి ఉండాలి.

(యాకోబు) 5:8

8.ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.

5:8 “సమీపంగా”– రోమ్ 13:11-12; ప్రకటన 1:1 నోట్, క్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో క్రొత్త ఒడంబడిక రచయితలెవరికీ తెలియదు. కొన్ని సార్లు వారు ఆయన రాకడ తమ జీవిత కాలంలో ఉంటుందన్న నమ్మకాన్ని (కనీసం ఆశాభావాన్ని) వెలిబుచ్చారు. కానీ యోహాను 21:18-23; 2 తిమోతి 4:6 చూడండి.

6.) సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి.

(మొదటి పేతురు) 1:13

13.కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

1:13 ఈ గొప్ప రక్షణ శుభవార్తను గురించిన వివరాల కోసం దేవదూతలు తహతహలాడుతున్నారు. ఆ రక్షణను పొందిన మనకు అలాంటి కోరిక మరి ఎక్కువగా ఉండాలి కదా. మనకు కొత్త మనసులు కలగాలి (రోమ్ 12:2; ఎఫెసు 4:23-24). ఆ మనసులను దేవుని వాక్కుతో నింపుకోవాలి. దేవుడు మనకు వెల్లడి చేసినదాన్ని మనం ఆలోచించడం, ధ్యానించడం, పఠించడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. కీర్తన 1:2; 119:26-27, 34, 73 మొ।।; ఎఫెసు 1:18; 3:18; ఫిలిప్పీ 1:9-10; కొలస్సయి 1:9.

7.) పరిశుద్ధులై ఉండుడి.

(మొదటి పేతురు) 1:16

16.మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

8.) ప్రేమ గలవారై ఉండుడి.

(మొదటి పేతురు) 4:8

8.ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

4:8 “ప్రేమ”– 1:22; యోహాను 13:34; 15:12, 17; 1 యోహాను 3:11, 18; 4:8. పేతురు దైవ ప్రేమను సూచించే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. 1 కొరింతు 13:1 చూడండి.

9.) సమాధానముగా ఉండుడి.

(మొదటి థెస్సలొనీకయులకు,) 5:13

13.వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.

“సమాధానంగా”– మార్కు 9:50; రోమ్ 12:16; 2 కొరింతు 13:11; ఎఫెసు 4:3; ఫిలిప్పీ 2:2; హీబ్రూ 12:14.

Telugu Bible Messages Telugu Bible Messages Telugu Bible Messages Telugu Bible Messages Telugu Bible Messages Telugu Bible Messages Telugu Bible Messages


ప్రసంగ శాస్త్రం .. click here 

Leave a comment