24గురు పెద్దలు – Who are the 24 Elders in Revelation Telugu

Written by biblesamacharam.com

Updated on:

24గురు పెద్దలు  ఎవరు ?

Who are the 24 Elders in Revelation Telugu

 ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో “పరలోకం”ను గూర్చిన వివరణను అపొస్తలుడైన యోహానుకు దేవుడు దర్శనము ద్వారా చూపెను. పరలోకం లో దేవుని సింహాసనం వుంది. దాని చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాలలో ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని వారి తలలపై సువర్ణ కిరీటాలు పెట్టుకొని సర్వలోకనాధుడైన దేవున్ని మిగతా వారితో కలిసి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞలు చెల్లిస్తున్నారు (పరలోకంను గూర్చిన వివరణ ఇదే పుస్తకంలో మరొక చోట తెలియజేయబడి ఉన్నదని గమనించగలరు). పరలోకాన్ని మనకున్న పరిమిత జ్ఞానముతో అపరిమితమైన అద్భుత దేవుని నివాస స్థలాన్ని వర్ణించడం అసాధ్యమే. పరలోకం అంటే మనం వివరించలేని అద్భుతమైన, ఆశ్చర్యమైన మన ఆలోచనకు అందని మహోన్నతమైన దైవసన్నిదది. మర్మాయుక్తమైనది. అనగా అందులో వున్న వాటన్నిటిని వివరించి తెలుసుకోలేము. ఏదో ఒకటి, అర వాటిమీద ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపింపునిస్తాడు. 

 ఇందులో మనం ఆలోచించవలసిన విషయం “ఇరువది నలుగురు పెద్దలు” (24గురు పెద్దలు). వీరు ఎవరు? అని ఆలోచిస్తే మన పితరులు, బైబిల్ పండితులు, వేదాంతులు, సువార్తికులు, పాస్టర్స్ మొదలైన వారిలో ఎక్కువశాతం ఏమని బోధిస్తున్నారంటే – ఈ 24గురు పెద్దలు రెండు గ్రూపులకు ప్రతినిధులుగా వున్నారు అని అందులో మొదటి 12 మంది ఇశ్రాయేలీయుల 12 గోత్రకర్తలు, రెండవ 12 మంది ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులైన 12 మంది అపొస్తలులనియు చెప్పుచూ వస్తున్నారు. 24 నెంబర్ను రెండు భాగాలు (12+12=24 గా విభజించి ఒక పన్నెండు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు ప్రతినిధులనియు, మరొక పన్నెండు యేసుక్రీస్తు శిష్యులైన 12 మంది అపొస్తులులు సంఘానికి ప్రతినిధులుగా ఉన్నారని బోధనలు చేయుచున్నారు. ఇలా బోధించుట సరియైన విధానమేనా? ఏ లేఖన ఆధారాలతో ఈ 24గురు పెద్దలలో 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు అని, 12 మంది అపొస్తలులని బోధించగలుగుతున్నారు? ఒకవేళ లేఖన ఆధారాలు లేకపోయిన వారి 

 ఆలోచనా విధానం సరియైనదేనా? అసలు 24గురు పెద్దలు భూమి నుండి వెళ్ళిన మానవజాతికి ప్రతినిధులేనా? ఆధారం లేనప్పుడు ఈ 24 గురు పెద్దలను ఎవరని అర్థము చేసుకోవాలి? పరలోకంలో వున్న ఈ 24గురు పెద్దలు భూమిమీద నుండి వెళ్ళిన మానవ మాత్రులు మాత్రం నూటికి నూరు శాతం కాదు. ఉపదేశకులు, వ్యాఖ్యాన కర్తలు చెప్పుచున్నట్లుగా 24గురు పెద్దలు, ఇశ్రాయేలీయుల 12మంది గోత్రకర్తలు, మరియు యేసు శిష్యులైన 12 మంది అపొస్తలులు కానేకాదు. అసలు వీరు భూమిమీద జన్మించి, జీవించి, మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిన మానవులు కాదంటే కాదు. ఈ 24గురు పెద్దలను మనుష్యులతో పోల్చుట లేక మనషులే (మనిషి శరీరాలతో ఉన్నవారు) అని చెప్పుట తప్పు. లేఖనాలను ధ్యానం చేయకుండా, సరియైన విధానములో అర్థం చేసుకోకుండా, వ్రాయబడిన సందర్భాలను గమనించకుండా మరి ముఖ్యముగా ప్రార్థనా జీవితం, పరిశుద్దాత్మ నడిపింపు లేకుండా గూఢార్థమైన పరిశుద్ధ లేఖన భాగాలను తప్పుగా బోధిస్తున్నారు. వీటినే అబద్ధ బోధలు అని, బోధించే వారిని అబద్ధ బోధకులు అని బైబిల్ సెలవిస్తోంది. కనుక ఈ 24 గురు పెద్దలు ఎవరై ఉంటారో ఒకింత ఆలోచన చేద్దాం. పరిశుద్దాత్ముడు నడిపించును గాక! 

  1. ఈ 24గురు పెద్దలు ఉన్నది పరలోకంలో. అది దేవుని నిత్య సన్నిధి. దేవుడు ఉన్నప్పటి నుండి పరలోకం ఉంది. పరలోకం తప్ప ఆకాశాలు, భూమి, మానవుడు ఇంకా ఇతరత్రా సృష్టి అంతా తర్వాతే సృష్టించబడింది. అంటే మొదట పరలోకం ఉంది. భూమిగాని, మానవ సృష్టిగాని లేదు. కనుక దేవుడు ఉన్నంత కాలం పరలోకం, పరలోకం ఉన్నంత కాలం దేవుడు ఉంటాడు. దేవున్ని పరలోకాన్ని విడదీసి మాట్లడలేము. ఎందుకంటే పరలోకం నిత్యత్వం నుండే వుంది. అలాంటి పరలోకానికి ఈ 24గురు పెద్దలు ఒకవేళ మనుషులే అయితే వీరు ఎప్పుడు అక్కడకి వెళ్ళారు? అందువలన పరలోకంలో దేవుని సింహాసనము ఎదుట ఉన్న 24గురు పెద్దలు మనుషులే అనటానికి వీలు లేదు. వారు మానవులు కారు. పరలోకంలో ఉ న్న వాళ్ళందరూ వివిధ బాధ్యతలు నిర్వర్తించే దేవదూతలు. దేవునితో ఉంటారు. కోటానుకోట్ల దేవదూతలు నిత్యము దేవున్ని ఆరాధిస్తూ ఉంటారు. వీరి ఆకారాలు కూడా మానవ ఆకారాలకు భిన్నముగా ఉంటాయి. అలాగని ఈ 24గురు పెద్దలు దూతలు అనటానికి కూడ వీలు లేదు (నిర్ధారించి చెప్పలేము).
  2. పరలోకములోనికి ఏ మానవుడు (మహిమ శరీరము) ఎప్పుడు వెళ్ళటానికి వీలు లేదు. యుగాంతమందు, ధవళసింహాసనం తీర్పు తర్వాత సంఘము ఉండబోయేది ఈ పరలోకంలో కాదు. అది పరిశుద్ధ యెరూషలేము పట్టణంలో. దానినే పరలోక పట్టణం అంటారు. కనుక ఇశ్రాయేలీయుల 12 మంది గోత్రకర్తలు, ప్రభువైన యేసు శిష్యులైన 12 మంది అపొస్తలులు పరలోకంలో ఉండటానికి వీలే లేదు.
  3. ఈ 24గురు పెద్దలు 12 మంది ఇశ్రాయేలీయుల 12 గోత్రకర్తలే అయితే ‘దాను’ గోత్రాన్ని దేవుడు అసహ్యించుకున్నాడు (ఆది. 49:17), వారి విగ్రహారాధనను బట్టి దేవుడు వారిని గూర్చి నీవు త్రోవలో సర్పముగా వుంటావు అన్నాడు. మరియు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ప్రతి గోత్రము నుండి 12000 మంది చొప్పున 1,44,000 మంది పరిశుద్ధులను దేవుడు ముద్రించాడు. వారిలో ‘దాను’ గోత్రము లేదని చూడలగలము. మరి పరలోకములో 11 గోత్రాల ప్రతినిధులే ఉ ండాలి కదా! అందుకే 24 గురు పెద్దలు మనుష్యులకు ప్రతినిధులు కారు.
  4. 24గురు పెద్దలలో మరొక 12 మంది ప్రభువైన యేసు శిష్యులైన 12మంది అపొస్తలులు అంటున్నారు. మొదటి పన్నెండు మందిలో అపొస్తలుడైన యూదా ఇస్కరియోతు తను చేసిన తప్పుకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆత్మహత్య చేసుకున్నవాని ఆత్మ పరలోకం వెళుతుందా? సరే అలాకాదు అతని స్థానంలో దేవుడు మత్తీయ (అపొ.కా. 1:23-26) ను ఎన్నుకున్నాడు. మరియు అపొస్తలుడైన పౌలు తాను ప్రభువు చేత పట్టబడి విస్తారమైన సేవ చేయుటకును తనకు అపొస్తలత్వమును ఇచ్చెనని పౌలు సాక్ష్యమిచ్చుచున్నాడు. మరి వీరిరువురిలో పరలోకంలో మత్తీయ ఉంటాడా? పౌలు ఉంటాడా? దేవుడు పక్షపాతి కాడని అపొ.కా. 10:34 లో వ్రాయబడి ఉంది. ఇద్దరికి అనగా మత్తీయకు, పౌలుకు దేవుడే అపొస్తలత్త్వం ఇవ్వగా కాదనగలవాడెవడు? వారిరువురిని దేవుడు సమానంగానే చూడాలి. కనుక మొత్తం అపొస్తలులను లెక్కిస్తే ఇప్పుడు 11+2 = 13 మంది అని మనం అనుకోవాలి. ఒకేవేళ చదువుతున్న నీవు పౌలు అపొస్తలత్వం వేరుగదా అని భావిస్తావేమో! ఆ మాటకొస్తే మత్తీయ కన్న గొప్ప పరిచర్య చేసి, క్రీస్తు తర్వాత రెండవ స్థానములో ఉ న్న గొప్ప భక్తుడు, అపొస్తలుడు అని సాక్ష్యం పొందాడు. మత్తీయ విషయానికొస్తే చీట్లు వేసి తీయుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మత్తీయ పేరును అపొస్తలుడుగా ఎన్నిక చేసాడు. కనుక ఈ ఇద్దరిలో ఎవరు తక్కువకాదు, ఎవరు ఎక్కువ కాదు. కనుక పరలోకంలో ఉన్న 24గురు పెద్దలలో ఒక పన్నెండు అను సంఖ్య, 12 మంది అపొస్తలులు కారని గ్రహించాలి. కనుక ఇదంతా ఆలోచించిన తర్వాత పరలోకంలో ఉన్న 24గురు పెద్దలలో 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రకర్తలకు లెక్క సరిపోవటం లేదు మరియు 12 మంది ప్రభువైన యేసు శిష్యులైన అపొస్తలత్వం పొందిన వారికి ఈ లెక్క సరిపోవటం లేదు. కనుక ఏ విధనముగా ఆలోచించినా ఆ 24 గురు పెద్దలు మానవులకు ప్రతినిధులు కారు అని స్పష్టముగా అర్థము చేసుకోగలరు. 
  1. ఈ 24గురు పెద్దలు పరలోకంలో ఉన్న మరొక రకమైన దేవదూతలు అయి ఉంటారు అని అనుకుందామంటే దేవుడు దేవదూతలకు, సువర్ణ కిరీటాలు, సింహాసనాలు ఇవ్వలేదు. వారు వివిధ రకాల విధులు, సేవలు చేయటానికి మాత్రమే నియమించబడ్డారు. కనుక వీరు దేవదూతలు కూడా కాదు. వీరు దేవదూతలకు దేవుని ప్రజలకు భిన్నముగా ఉన్నారు.
  2. ఏదేను తోటలోని ఆదాము, హవ్వలను మొదలుకొని యుగాంతము వరకు విమోచింపబడిన ఆత్మలు ఎత్తబడి మధ్యాకాశములో క్రీస్తు న్యాయసింహాసనము ఎదుట నిలువబడి ఉంటారు తప్ప, మధ్యాకాశములో ప్రత్యేకమైనవారు ఎవరూ లేరు. ఎవరికి సింహాసనాలు వేయబడవు, కిరీటాలు పెట్టబడవు. ఈ క్రమములో సంఘం క్రీస్తుతో మధ్యాకాశములో ఉంటుంది. అంతే కాని పరలోకంలోనికి ఎవరిని దేవుడు పిలువడు. కాని ఈ 24 గురు పెద్దలు పరలోకంలో ఉన్నారు. సంఘం మధ్యాకాశంలో వుంటుంది. ఏండేండ్ల వివాహమహోత్సవం తర్వాత క్రీస్తు సంఘాన్ని వెంటబెట్టుకొని భూమిమీదికి రెండవసారి వస్తాడు. సంఘం పరలోకానికి వెళ్ళదు. కనుక పరలోకంలో మానవ ఆత్మలు ఎవరూ ఉండరు. కనుక ఈ 24 గురు పెద్దలు మానవులలో నుండి రక్షించబడి వెళ్ళినవారు కారు.
  3. ప్రకటన గ్రంథము 2,3 అధ్యాయాలలో సంఘ చరిత్రను గూర్చి దేవుడు బయలుపరచాడు. ప్రకటన 3:14-21 ప్రకారం ‘లవొదికయ సంఘ’ కాలాన్ని గూర్చి చెప్పి, తర్వాత 4:1 ప్రకారం “ఈ సంగతులు జరిగిన తర్వాత” అను మాటలు వ్రాయబడ్డాయి. భక్తుడైన యోహానుకు దేవుడు పరలోక దర్శనం చూపిస్తూ వ్రాయమన్నాడు. దర్శనం చూసిన యోహాను ‘పరలోకం’ ఎలా ఉందో దానిని వ్రాశాడు.

 అయితే 3:14-21 ప్రకారం లవొదికయ సంఘం గూర్చి చెప్పబడిన తర్వాత మరొక సంఘం గూర్చిన ఏ విషయాలు లేవు. గనుక లవొదకయ సంఘ కాలమే భూమి మీద ) 

 ఆఖరి సంఘ కాలం. లవొదకయ సంఘకాల భవిష్యత్తు ఎంతో మనకు తెలియదు కాని, ప్రకటన 4:1 ప్రకారం – “ఈ సంగతులు జరిగిన తర్వాత” అను మాటలను బట్టి చూస్తే సంఘం ఎత్తబడింది అని అర్థమవుతుంది. కనుక ముందుగా “పరలోకం” ఎలా ఉంటుందో మనం చూడలేము. కనుక భక్తుడైన యోహాను దర్శనం ద్వారా సార్వత్రిక సంఘానికి దేవుడు ప్రకటన గ్రంథము ద్వారా బయలుపరచి మనకు చూపించాడు. ఎందుకంటే సంఘం పరలోకానికి కాదు వెళ్ళేది. 

 సంఘం కొరకు దేవుడు సిద్ధపరచుకున్న పరిశుద్ధ యెరూషలేము పట్టణంలోనికి సంఘం వెళుతుంది. అదే నూతన భూమి. సంఘం గూర్చిన విషయాలు మధ్యాకాశము వరకే ఉన్నాయి. అంతేకాని పరలోకం దాకా ఇంకా వెళ్ళలేదు. మధ్యాకాశములో క్రీస్తే ఇంకా న్యాయ సింహాసనం మీద కూర్చోలేదు, అలాంటప్పుడు సంఘములో ప్రముఖులైనవారు మాత్రం పరలోకంలో సింహాసనాల మీద ఎలా కూర్చుంటారు? గొర్రెపిల్ల పెండ్లి జరుగకముందే, క్రీస్తు సంఘమైన పెండ్లి కుమార్తె సింహాసనాలపై కూర్చొని ఎలా ఉంటుంది? చదువరులు, విజ్ఞులు, బోధకులు, వ్యాఖ్యాన కర్తలు ఆలోచించి పరిశుద్ధాత్ముని శక్తి, నింపుదల చేత, లేఖనాలను ఉపదేశించాలని కోరుకుంటూ దేవున్ని ప్రార్థిస్తున్నాను. 

 కనుక ముగింపులో పరలోకంలో వున్న 24గురు పెద్దలు మానవ ఆత్మలు మాత్రము కాదు గాక కాదు. ‘పరలోకం’ ఎప్పటి నుండి ఉందో అప్పుడే సకల సృష్టికర్తయైన దేవాది దేవుడు ఈ 24గురు పెద్దలను ఒక ప్రత్యేకమైన సృష్టిగా సృష్టించి, తన (దేవుడు) సింహాసనం చుట్టూ వారికి సింహాసనాలు వేసి, సువర్ణ కిరీటాలు ధరింపజేసి, తెల్లని వస్త్రాలను ధరింపజేసి నిత్యము ఆయనను ఆరాధించటానికి నిర్ణయించాడు. ఇదే విషయం 24 గురు పెద్దలను గూర్చి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫోర్ అండ్ ట్వంటీ (Four and Twenty) అని వ్రాయబడి ఉంది. అంటే నాలుగు (4) అంకెగాను, 20 వేరొక సంఖ్యగాను విడివిడిగా వ్రాసి వుంది. అంటే దాని అర్థం రెండు పన్నెండ్లు (12+12) అని భావం కాదు. 

Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu Who are the 24 Elders in Revelation Telugu


ప్రశ్నలు – జవాబులు కొరకు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted