సిలువ విలువ
Siluva Viluva Sevakula Prasangaalu
1.) సిలువపై మన పాపము మోపబడినది.
(మొదటి పేతురు) 2:24
24.మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
2:24 మన స్థానంలో మనకు బదులుగా క్రీస్తు బాధల పాలై మరణించాడన్న స్పష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. 3:18; యెషయా 53:5; మత్తయి 20:28; యోహాను 1:29; 10:11, 14; రోమ్ 3:25; 2 కొరింతు 5:14, 21; హీబ్రూ 9:28 కూడా చూడండి. క్రీస్తు బాధల్లో మరణంలో గల ఉద్దేశం ఇక్కడ రాసి ఉంది. రోమ్ 14:9; 2 కొరింతు 5:15 పోల్చి చూడండి.
2:24 A ద్వితీ 21:22-23; కీర్తన 147:3; యెషయా 53:4-6, 11; మత్తయి 8:17; లూకా 1:74-75; యోహాను 1:29; అపొ కా 5:30; రోమ్ 6:2, 7, 11, 13, 16; 7:6; 2 కొరింతు 6:17; గలతీ 3:13; కొలస్సయి 2:20; 3:3; హీబ్రూ 9:28; యాకోబు 5:16; 1 పేతురు 4:1-2; 1 యోహాను 2:29; 3:7; ప్రకటన 22:2; B నిర్గమ 28:38; లేవీ 16:22; 22:9; సంఖ్యా 18:22; కీర్తన 38:4; మలాకీ 4:2; మత్తయి 5:20; 27:26; లూకా 4:18; యోహాను 19:1; అపొ కా 10:35, 39; 13:29; రోమ్ 6:22; ఎఫెసు 5:9; హీబ్రూ 7:26; 12:13; C ఫిలిప్పీ 1:11
“పాపాల విషయంలో చనిపోయి”– రోమ్ 6:10-14; గలతీ 2:20; 5:24; కొలస్సయి 3:5.
2.) సిలువపై దేవుడు తన ప్రేమను కనపరచెను.
(రోమీయులకు) 5:8
8.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
5:8 యెషయా 53:6; యోహాను 3:16; 15:13; రోమ్ 3:5; 4:25; 5:6, 20; ఎఫెసు 1:6-8; 2:7; 1 తిమోతి 1:16; 1 పేతురు 3:18; 1 యోహాను 3:16; 4:9-10
3.) సిలువపై దేవుని శక్తి బహిర్గతం చేయబడినది.
(మొదటి కొరింథీయులకు) 1:18
18.సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
1:18 A రోమ్ 1:16; 1 కొరింతు 1:21, 23-25; 2:2, 14; 2 కొరింతు 2:15-16; 4:3; 10:4; గలతీ 6:12-14; 1 తెస్స 1:5; 2 తెస్స 2:10; హీబ్రూ 4:12; B కీర్తన 110:2-3; అపొ కా 13:41; 17:18, 32; 1 కొరింతు 3:19; 15:2; C అపొ కా 2:47
4.) సిలువపై మన దుఃఖం తొలగించబడినది.
(యెషయా గ్రంథము) 53:4
4.నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.
53:4 “భరించాడు”– మత్తయి 8:17లో దీని అర్థం ఇతరులను బాగుచేసే ఆయన సేవ అని తెలుస్తున్నది. అలాగైతే మన రోగాలను ఆయన బాగుచేశాడని రాసి ఉండాలి కదా. అంటే కేవలం బాగు చెయ్యడమే కాక మరింకేదో చేశాడని అర్థం కావచ్చు. వాటిని ఒక బరువులా ఆయన అనుభవించాడు. బాధపడుతున్నవారి నొప్పిని ఆయన కూడా చవి చూశాడు. మత్తయి 9:36 చూడండి. జాలి పడడమంటే బాధపడేవారి బాధను పంచుకోవడమని అర్థం. యేసు అనుభవించిన బాధలన్నీ మన ప్రతినిధిగా మనకు బదులుగా అనుభవించాడని గుర్తుంచుకుందాం. ఆయన మన స్థానంలో వాటిని భరించాడు (63:9 చూడండి. 2 కొరింతు 11:28-29లో పౌలు మాటలను పోల్చి చూడండి).
“దేవుడు…బాధించాడని”– క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ధన సమృద్ధి దేవుని అనుగ్రహానికి గుర్తు అని అనేకమంది యూదులు భావించారు. ఈ వచనాలన్నిటిని బట్టి చూస్తే క్రీస్తు పేదరికం, దుఃఖం, బాధలు దేవుడు ఆయనకు విధించిన శిక్షగా వారు అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు.
5.) సిలువద్వారా మనం క్షమాపణ పొందుతున్నాం.
(కొలొస్సయులకు) 1:13,14
13.ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క(మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.
1:13 A యెషయా 9:6-7; 42:1; 53:12; దాని 7:13-14; జెకర్యా 9:9; మత్తయి 3:17; 12:29-30; 25:34; లూకా 13:24; 22:53; యోహాను 5:24; 12:31-32; 17:24; అపొ కా 26:18; రోమ్ 6:17-22; 14:17; 1 కొరింతు 6:9-11; 15:23-25; 2 కొరింతు 4:4; 6:17-18; ఎఫెసు 1:6; 2:3-10; 4:18; 5:8; 6:12; 1 తెస్స 2:12; తీతు 3:3-6; హీబ్రూ 2:14; 1 పేతురు 2:9; 2 పేతురు 1:11; 1 యోహాను 2:8; 3:8, 14; B కీర్తన 2:6-7; యెషయా 49:24-25; మత్తయి 17:5; యోహాను 3:35
14.ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
6.) సిలువద్వారా జాతి, భాషా గోడలు కూలిపోయినవి.
(ఎఫెసీయులకు) 2:13,14,15,16
13.అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
14.ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
15.ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
16.తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
7. ) సిలువద్వారా మనము దేవుని కుటుంబ సభ్యులమైతిమి.
(హెబ్రీయులకు) 11:12
12.అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
11:12 A ఆది 15:5; 22:17; 32:12; యిర్మీయా 33:22; హోషేయ 1:10; B ఆది 26:4; యెషయా 10:22; రోమ్ 4:17-19; C నిర్గమ 32:13; ద్వితీ 1:10; 28:62; యెహో 11:4; న్యాయాధి 7:12; 1 సమూ 12:5; 2 సమూ 17:11; 1 రాజులు 4:20; 1 దిన 27:23; నెహెమ్యా 9:23; యెషయా 48:19; రోమ్ 9:27; ప్రకటన 20:8
All Pdf……..Download