అంశం:ఆత్మసంబంధమైన అనుభవములు
Sevakula Prasangaalu Telugu
1.) ఆత్మసంబంధమైన శరీరము.
(మొదటి కొరింథీయులకు) 15:44
44.ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.
2.) ఆత్మసంబంధమైన కృపావరం.
(రోమీయులకు) 1:22
22.వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
1:22 మనుషులు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాం అనుకునేదంతా, జ్ఞానం గురించి వారి ఊహాగానాలంతా దేవునికి వెర్రితనం. 1 కొరింతు 1:18-25; 2:7-8 పోల్చి చూడండి. ముక్తికి నడిపిస్తుందని కొందరు భ్రమపడే జ్ఞానమార్గం విశ్వానికి సృష్టికర్త దృష్టిలో కేవలం తెలివితక్కువతనమే.
1:22 A సామెత 25:14; 26:12; యిర్మీయా 8:8-9; 10:14; రోమ్ 11:25; 1 కొరింతు 1:19-21; B యెషయా 47:10; మత్తయి 6:23; 1 కొరింతు 3:18-19
3.) ఆత్మసంబంధమైన మనుష్యుడు.
(మొదటి కొరింథీయులకు) 3:1
1.సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.
3:1 “ఆధ్యాత్మిక”– దేవుని ఆత్మలేని మనుషులతో పోల్చుకుంటే విశ్వాసులంతా ఆధ్యాత్మిక వ్యక్తులే (2:14-16; రోమ్ 8:5-9) కానీ విశ్వాసుల్లో కూడా కొంతమంది ఇతరులకన్న ఎంతో ఆధ్యాత్మికమైనవారు. దురదృష్టవశాత్తూ అప్పుడప్పుడు కొందరు విశ్వాసులు భ్రష్ట స్వభావాన్ని అనుసరించి నడుచుకునే లోకప్రజల మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. మొత్తం మీద కొరింతు క్రైస్తవులు ఇలాంటివారే. ఆధ్యాత్మికంగా చూస్తే వారింకా చంటిపిల్లల్లాంటివారే. దేవుని లోతైన సంగతులు పౌలు వారికి బోధించడానికి వీల్లేక పోయింది (2:6; హీబ్రూ 5:11-14 పోల్చి చూడండి). 2:14—3:1లో పౌలు మూడు రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. “సహజ సిద్ధమైన” వ్యక్తి – అంటే దేవుని ఆత్మ లేనివాడు; “ఆధ్యాత్మిక వ్యక్తి” – దేవుని ఆత్మ కలిగి ఆత్మ ప్రకారం నడచుకునేవాడు; “శరీర స్వభావాన్ని అనుసరించే వ్యక్తి” – దేవుని ఆత్మ తనలో ఉన్నా తన విధానాలు కొన్నింటిలో దేవుని ఆత్మ లేనట్టు నడుచుకునేవాడు.
4.) ఆత్మసంబంధమైన వివేచన.
(మొదటి కొరింథీయులకు) 2:15
15.ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.
2:15 1 యోహాను 2:20, 27; యోహాను 3:8. దేవుని ఆత్మ మూలంగా ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారిన క్రీస్తువిశ్వాసులు మాత్రమే లోక విషయాలను, మనుషుల నిజ స్థితిని గుర్తించ గలుగుతారు. ఆత్మలేని వారు అలా అర్థం చేసుకోలేరు గనుక అలాంటి విషయాల్లో సరైన అభిప్రాయానికి రాలేరు. సరైన నిర్ణయానికి రాగలగడం ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఇది సహజంగా ఎవరికీ ఉండదు.
5.) ఆత్మసంబంధమైన ఆహారం.
(మొదటి కొరింథీయులకు) 10:3
3.అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;
6.) ఆత్మసంబంధమైన ఆశీర్వాదము.
(ఎఫెసీయులకు) 1:3
3.మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
1:3 “దేవుడు”– భూమిపై మానవుడుగా జన్మనెత్తాక యేసు తండ్రియైన దేవుణ్ణి తన దేవుడుగా పిలిచాడు – మత్తయి 27:46; యోహాను 20:17. అలా చెయ్యడంలో తాను దేవుణ్ణి కానని ఆయన సూచించడం లేదు. యోహాను 8:24, 58; 20:28-29; మత్తయి 11:27 పోల్చి చూడండి. ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 దగ్గర చూడండి.
7.) ఆత్మసంబంధమైన పానీయము.
(మొదటి కొరింథీయులకు) 10:4
4.అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
10:4 నిర్గమ 17:5-6 మన్నాను, నీటిని దేవుని ఆత్మ అద్భుత రీతిగా వారికిచ్చాడు. నీరు పెల్లుబికిన బండ జీవ జలాన్ని ఇచ్చే క్రీస్తుకు సూచనగా సాదృశ్యంగా ఉంది (యోహాను 4:10, 14; 7:38-39; 19:34) పాత ఒడంబడిక గ్రంథంలో ఎక్కడా ఇస్రాయేల్‌వారు ఎడారిలో గుండా ప్రయాణమైపోతూ ఉండగా ఆ బండరాయి వారి వెనకాలే దొర్లుకుంటూ వెళ్ళిందని రాసిలేదు (బహుశా ఆ రాయి నుంచి వెలువడిన నీరు ఒక కాలువ కట్టి వారి వెనకాలే వెళ్ళి ఉండవచ్చు – కీర్తన 105:41). కానీ క్రీస్తు స్వయంగా వారి వెంట వెళ్తూ వారి అవసరతలన్నీ తీర్చాడు. దారివెంట వెళ్తూ, వారిని పోషించిన బండ క్రీస్తేనని పౌలు చెప్తున్నాడు. పాత ఒడంబడిక గ్రంథంలో బండ ఒకే నిజ దేవుడైన యెహోవాకు గుర్తు (ద్వితీ 32:4 నోట్ చూడండి). ఈ విధంగా క్రీస్తే యెహోవా అని పౌలు చెప్తున్నాడు. (ఆది 16:7; నిర్గమ 3:2; 32:34; యోహాను 8:24, 58; 12:41. ఇతర రిఫరెన్సులు లూకా 2:11 నోట్‌లో చూడండి)
Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu
బైబిల్ 66 పుస్తకాల వివరణ .. click here