విశ్వసించువాడు – Sevakula Prasangaalu Telugu

Written by biblesamacharam.com

Published on:

అంశం: విశ్వసించువాడు 

Sevakula Prasangaalu Telugu

మూలవాక్యము : ఏలయనగా ఆయన యందు “విశ్వాసముంచు” వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

 (రోమీయులకు) 10:11

11.ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

10:11 యెషయా 28:16. రోమ్ 1:16; 5:5 పోల్చి చూడండి.

1.) విశ్వాసముంచువాడు సిగ్గుపడడు.

 (రోమీయులకు) 10:11

11.ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

2.) విశ్వాసముంచువాడు కలవరపడడు.

 (యెషయా గ్రంథము) 28:16

16.ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

28:16 ఈ రాయి యేసుప్రభువే (1 కొరింతు 3:11; ఎఫెసు 2:20; 1 పేతురు 2:6). దేవుడు సరిక్రొత్తగా మళ్ళీ ఆరంభించి ఒక నూతన నిర్మాణాన్ని కడతాడని ఈ వచనం సూచిస్తూ ఉంది. కట్టి ఉన్న ఒక ఇంటికి మళ్ళీ పునాది వేసి పునాది రాయిని ఎవరూ నిలబెట్టరు. అలాగైతే క్రొత్త ఒడంబడిక సంఘం పూర్తిగా నవనూతనమైనదా? అలా చెప్పలేము. దాన్ని క్రీస్తు రాయబారులనే పునాదిమీదే కాక ప్రవక్తలు అనే పునాదిపై కూడా కట్టడం జరిగింది (ప్రవక్తలు కూడా ఈ పునాదిలో భాగమే – ఎఫెసు 2:20). పునాదిలో ఒక భాగం అంటే ఆ కట్టడం అంతటిలోకీ ఒక ముఖ్యమైన భాగమన్నమాట. సంఘం పూర్తిగా క్రొత్తది కాకపోయినప్పటికీ ఈ యుగంలో మనకు కనిపించే సంఘ నిర్మాణం, పాత ఒడంబడిక గ్రంథంలో ఇస్రాయేల్‌లో కనిపించేదానికి భిన్నమైనది. సంఘం గురించి నోట్ మత్తయి 16:18.

28:16 A ఆది 49:10, 24; కీర్తన 112:7-8; 118:22; యెషయా 8:14-15; 30:18; హబక్కూకు 2:3-4; జెకర్యా 3:9; మత్తయి 21:42; మార్కు 12:10; లూకా 20:17-18; అపొ కా 4:11-12; రోమ్ 9:33; 10:11; 1 కొరింతు 3:11; ఎఫెసు 2:20; 1 పేతురు 2:6-8; B యాకోబు 5:7-8

3.) విశ్వాసముంచువాడు భయపడడు.

 (కీర్తనల గ్రంథము) 56:4

4.దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?

56:4 A కీర్తన 19:7-8; 27:1; 46:1-2; 56:10-11; 118:6; 119:89-90; 138:2; యెషయా 31:3; 41:10; లూకా 12:4-5; రోమ్ 8:31-39; హీబ్రూ 13:6; B కీర్తన 12:6; 119:160; C యోహాను 10:35

4.) విశ్వాసముంచువాడు ధైర్యముగా మాటలాడును.

 (రెండవ కొరింథీయులకు) 4:13

13.కృప యెక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకైయున్నవి.

4:13-14 కీర్తన 116:10. ఇన్ని కష్టాలూ ఆపదలూ అపాయాలూ ఉన్నా పౌలు క్రీస్తు సేవలో కొనసాగేలా చేసినది ఏమిటి? అతడు దేవుణ్ణి నమ్మాడు గనుక మౌనంగా ఉండలేకపోయాడు. ధన్యకరమైన భవిష్యత్తు తనకుందని కూడా అతనికి బాగా తెలుసు. విశ్వాసులు రాబోయే కాలంలో మరణం నుంచి సజీవంగా లేస్తారన్న ఆశాభావం అతడు ఆగకుండా కొనసాగేలా చేసింది (రోమ్ 8:23-25; 1 కొరింతు 15:49-58).

4:13 A కీర్తన 116:10; సామెత 21:28; రోమ్ 1:12; 1 కొరింతు 12:9; 2 కొరింతు 3:12; హీబ్రూ 11:1-40; 2 పేతురు 1:1; B అపొ కా 15:11

5.) విశ్వాసముంచువాడు బ్రతుకును.

 (నహూము) 2:4

4.వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,

6.) విశ్వాసముంచువారు అయనకు పిల్లలు.

 (యోహాను సువార్త) 1:12

12.తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

1:12 బైబిలంతటిలోని గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. మనుషులు సహజంగా దేవుని పిల్లలు కారు. వారు ఆయన పిల్లలుగా కావలసి ఉంది. 3:6; 8:44; ఎఫెసు 2:1-2; మొ।। పోల్చి చూడండి. స్వభావ రీత్యా వారు తమ సృష్టికర్తపై తిరగబడి, దేవునికి వేరైన జీవులు (యిర్మీయా 17:9; ఆది 8:21; యెషయా 24:5; 59:1-2; రోమ్ 3:9-19). దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు, వాక్కు, రక్షకుడు, ముక్తిదాత అయిన యేసుప్రభువును స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలరు. ఆయన్ను స్వీకరించడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం. “నమ్మకం” ఈ శుభవార్తలో అతి ప్రాముఖ్యమైన పదాల్లో ఒకటి. “నమ్మకం అని తర్జుమా చేసిన గ్రీకు పదం రకరకాల ప్రయోగాలు ఈ శుభవార్తలో సుమారు 100 సార్లు కనిపిస్తాయి. బైబిలులో మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు ఈ మాట కన్పించదు. మనం ఆయన్ను నమ్మకం ద్వారానే స్వీకరిస్తాం, నమ్మకం ద్వారానే దేవుని పిల్లలమౌతాం (3:15-16, 36; 5:24; 6:47; అపొ కా 16:31; రోమ్ 10:9; గలతీ 3:26). ఆయన పేరు మీద నమ్మకం ఉంచడమంటే ఆయన పై నమ్మకం ఉంచడమే, బైబిల్లో వెల్లడి అయిన ఆయన గుణశీలాలపై, లక్షణాలపై నమ్మకం ఉంచడమే.

7.) విశ్వాసముంచువాడు నశించడు.

 (యోహాను సువార్త) 3:16

16.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

3:16 యోహాను శుభవార్తకూ, మొత్తం బైబిలంతటికీ ప్రాణం అనదగిన వచనం ఇది. తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషులపట్ల దేవునికి జాలి, కనికరం ఉన్నాయి. మనుషులు మంచివారనీ తన ప్రేమకు యోగ్యులనీ కాదు ఆయన వారిని ప్రేమిస్తున్నది. ఆయన ప్రేమ గలవాడు కాబట్టే ప్రేమిస్తున్నాడు (నిర్గమ 34:6-7; 1 యోహాను 4:8). ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించింది. తన కుమారుణ్ణి ఇచ్చివెయ్యడంద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువు పరచుకున్నాడు. (రోమ్ 5:8; తీతు 3:3-5; 1 యోహాను 3:16; 4:9-10). దేవుని ప్రేమ ఒక్క జాతికే పరిమితం కాదు (చాలామంది యూదులు ఇలా అనుకున్నారు). మానవాళినంతటినీ ఆయన ప్రేమించాడు (2 కొరింతు 5:19; 1 యోహాను 2:2; 1 తిమోతి 2:3-4).

“ఒకే ఒక”– క్రీస్తుకు పోలిక అంటూ ఎవరూ లేరు. ఆయన సాటి లేని వ్యక్తి. దేవుని స్వభావమంతటిలో ఆయన భాగస్వామ్యం గలవాడు (1:18; మత్తయి 3:17; ఫిలిప్పీ 2:6). లోకంకోసం చనిపోవడానికి దేవుడు అనేక మంది కుమారుల్లో ఒకర్ని ఇవ్వలేదు. తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. గొప్పతనంలోనూ, విలువలోను వర్ణనాతీతమైన ఉచిత వరం ఇది (2 కొరింతు 9:15).

యేసుప్రభువును పంపడంలో దేవుని ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా వెల్లడి అయింది. మనుషులు పాపంలో నశించిపోతున్నారు. వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక. శాశ్వత జీవం కేవలం ఎప్పటికీ ఉండే జీవం మాత్రమే కాదు. అది మామూలు జీవానికి భిన్నంగా ఉత్తమంగా ఉన్నది. శాశ్వత జీవమంటే పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది. అది పాపం, మరణం నీడ కూడా లేకుండా దేవునితో సహవాసంలోని జీవం. ఆ జీవాన్ని పొందాలంటే ఒకటే మార్గమని యేసుప్రభువు ఇక్కడ మరోసారి అతి స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనలో నమ్మకముంచడమే ఆ మార్గం (వ 36; 1:12; 5:24; 6:47; 8:24 కూడా చూడండి). శాశ్వతంగా నరకంలో నశించిపోవడానికీ, దేవునితో అనంతకాలం జీవించడానికీ ఉన్న తేడా క్రీస్తులో నమ్మకం ఉంచడంలోనే ఉంది.

8.) విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడడు.

 (యోహాను సువార్త) 3:18

18.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.

3:18 రోమ్ 8:1. క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయనెంత నిర్దోషో, న్యాయవంతుడో దేవుని లెక్కలో వారూ అంతే (రోమ్ 3:24-25; 5:1; ఎఫెసు 1:7; కొలస్సయి 2:13; 1 యోహాను 2:12). అందువల్ల వారికిక శిక్షావిధి లేదు. క్రీస్తును నమ్మనివారి సంగతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. వారి పాపాలకు దేవుడు చూపిన ఏకైక నివారణను వారు నిరాకరిస్తున్నారు. దేవుని అతి శ్రేష్ఠమైన ఉచిత వరాన్ని విసర్జించడం ద్వారా తమ పాపాల జాబితాలో పాపాలను ఇంకా కలుపుతూ, తమ అపనమ్మకం మూలంగా దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నారు (1 యోహాను 5:10). ఇలాంటివారికి శిక్ష విధించడం తప్ప మరేదీ మిగలదు. బైబిలు ఉపదేశంలో నమ్మకానికి ఉన్న ప్రాధాన్యతను మళ్ళీ గమనించండి.

9.) విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు.

 (యోహాను సువార్త) 6:47

47.దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్నవాడు.

6:47 యేసు ఈ విషయాన్ని ఇంకా కొన్ని సార్లు చెప్పాడు (వ 40; 3:15-16; 5:24). నమ్మి ఆనందించండి.

Sevakula Prasangaalu Telugu Sevakula Prasangaalu Telugu  Sevakula Prasangaalu Telugu  Sevakula Prasangaalu Telugu  Sevakula Prasangaalu Telugu  Sevakula Prasangaalu Telugu  Sevakula Prasangaalu Telugu  Sevakula Prasangaalu Telugu 


బైబిల్ ప్రశ్నలు – జవాబుల కొరకు.. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted