పేతురు చేసిన హెచ్చరికలు – Sevakula Prasangaalu Bible Telugu

Written by biblesamacharam.com

Published on:

పేతురు చేసిన హెచ్చరికలు. 

Sevakula Prasangaalu Bible Telugu

1.) సాతాను మిమ్మును రాజీపడు స్థితిలోనికి తేనీయకండి!

 (మొదటి పేతురు) 1:14,15,16,17

14.నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

1:14 “విధేయతగల పిల్లలై”– వ 2. దేవుడు కోరేది ఇదే – రోమ్ 6:17-18; 2 కొరింతు 2:9; 2 తెస్స 2:8.

15.కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

1:15-16 లేవీ 20:7; యెషయా 6:3; యోహాను 17:17-19; రోమ్ 6:19, 22; 2 కొరింతు 7:1; ఎఫెసు 4:24; హీబ్రూ 12:10, 14. విశ్వాసులందరి గురి ఇదే కావాలి.

16.మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

17.పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైయున్నంతకాలము భయముతో గడుపుడి.

1:17 “పక్షపాతం లేకుండా”– రోమ్ 12:11; ఎఫెసు 6:9; కొలస్సయి 3:25.

2.) లోకపు మంట వద్ద మీరు చలికాచుకొనకుడి!

(మొదటి పేతురు) 2:9,10,11,12

9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

“పవిత్ర జనం”– భూమిపై ఇతరులందరిలోకీ ప్రత్యేకంగా ఉన్న జాతి. నిర్గమ 19:5-6; యోహాను 17:6 పోల్చి చూడండి. పేతురు సంఘాన్ని “నూతన ఇస్రాయేల్” అని గానీ “ఆధ్యాత్మిక ఇస్రాయేల్” అని గానీ పిలవడం లేదు. అతడు యూదుల్లోని విశ్వాసులకు రాస్తున్నాడు. నిజమైన ఇస్రాయేల్ అంటే వారే, క్రీస్తును తిరస్కరించినవారు కాదు. ఇస్రాయేల్ జాతిని దేవుడు ఇకపై పట్టించుకోబోవడం లేదని పేతురు చెప్పడం లేదు (అపొ కా 1:6-7 పోల్చి చూడండి). క్రొత్త ఒడంబడిక గ్రంథం రాసిన వారిలో ఎవరూ సంఘాన్ని కొత్త ఇస్రాయేల్ అని పిలవలేదు. ఇతర ప్రజల్లో విశ్వాసులైనవారిని పాత ఇస్రాయేల్ అనే చెట్టుకు అంటుకట్టడం జరిగింది. రోమ్ 11 అధ్యాయం; ఎఫెసు 2:11-19 చూడండి.

“ఉత్తమ గుణాలు”– ఈ గ్రీకు పదానికి సుశీలత, మంచితనం, ఘన బుద్ధి, పొగడదగినవి అని అర్థం. ఇదే పదాన్ని ఫిలిప్పీ 4:8లో “శ్రేష్ఠమైనవి” అనీ, 2 పేతురు 1:3, 5లో “సుగుణం” అనీ తర్జుమా చేశారు. యూద క్రైస్తవులైనా ఇతర జనాల్లోని క్రైస్తవులైనా ఇప్పుడు విశ్వాసులందరి విద్యుక్త ధర్మం, విశేష అవకాశం ఏకైక నిజ దేవుని శ్రేష్ఠతనూ మంచితనాన్నీ లోకానికి ప్రకటించడమే. మనం మన ఘనత గురించి చూడకూడదు. మన మంచితనం గురించి ప్రకటించుకోకూడదు. ఆయన మంచితనాన్నే చాటాలి (కీర్తన 40:10; 71:16; యెషయా 42:12; 43:7; ఎఫెసు 1:6, 12, 14 పోల్చి చూడండి).

10.ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

2:10 క్రీస్తులో నమ్మకం ఉంచకముందు యూదులు, ఇతర ప్రజలు కూడా దేవుని ఆధ్యాత్మిక ప్రజ కారు. హోషేయ 1:9-10; 2:23; రోమ్ 9:24-26; ఎఫెసు 2:11-12. మనుషులను చీకటిలోనుంచి వెలుగులోకి పిలవడంలో దేవుడు చూపినది కల్తీ లేని కరుణ మాత్రమే (తీతు 3:5).

11.ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

“యుద్ధం”– విశ్వాసులపై యుద్ధంలో (ఎఫెసు 6:11-12) సైతాను వాడే ఆయుధాల్లో పాప సంబంధమైన విషయాలపట్ల ఆశ ఒకటి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని నరికి గాయపరిచే కత్తుల్లాంటివి చెడు కోరికలు. దేవునినుండీ, పవిత్రతనుండీ మన ఆలోచనల్ని మళ్ళించే అగ్నిబాణాల్లాంటివి. వాటికి మనం లొంగిపోవలసిన అవసరం లేదు. వాటికి మన హృదయాల్లో తావియ్యవలసిన అవసరం కూడా లేదు. “విసర్జించండి” అన్న ఆజ్ఞ ఉంది. దేవుని కృప మూలంగా మనం అలా చెయ్యగలమని అర్థం. ప్రతి చెడు తలంపునుంచీ పూర్తిగా విడుదల పొందడమే మన గమ్యంగా పెట్టుకోవాలి.

12.అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. 

“దూషిస్తూ ఉంటే”– క్రీస్తును తిరస్కరించేవారు విశ్వాసులను దూషించాలనీ వారిలో తప్పులు పట్టుకోవాలనీ లేనివాటిని కల్పించాలనీ ఉంటారు. ఇతరులు మనల్ని దూషించడం మనం మరింత మంచిగా ప్రవర్తించాలన్న నిశ్చయాన్ని మనలో కలిగించాలి. ఈ దుర్మార్గత మన మేలుకే పని చేయాలి.

3.) నిద్రమత్తులోనికి జారకుండునట్లు మిమ్మును మీరు జాగ్రత్త వహించుడి.

 (మొదటి పేతురు) 1:13

13.కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

4.) మిమ్మును మీరే పొగడు కొనవద్దు మరియు మీ మీద మీరే ఆధారపడవద్దు!

 (మొదటి పేతురు) 5:5

5.చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.

“గర్విష్ఠులను”– దేవుడు మనల్ని ఎదిరించడం మనకు ఇష్టమా – ఇష్టం ఉంటే ఇదుగో మార్గం. వినయ మనస్కులకు దేవుడిచ్చే కృప మనకు చేరకుండా గర్వం అడ్డుపడుతుంది. క్రైస్తవ జీవితంలో మన అపజయాలకూ నిష్ఫలతకూ మూల కారణాల్లో ఇది ఒకటి.

5.) ప్రయత్నించి మిమ్మును పడద్రోయునని సాతానుని కనిపెట్టుకొని యుండుడి!

 (మొదటి పేతురు) 5:8

8.నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

“మెళకువ”– ఎఫెసు 6:18; 1 తెస్స 5:6. ఆధ్యాత్మికంగా నిద్రపోయేవారినీ ఏమరుపాటుగా ఉండేవారినీ సైతాను వలలో చిక్కించుకోగలడు.

6.) విశ్వాసమందు స్థిరులై సాతానును ఎదిరించుడి!

 (మొదటి పేతురు) 5:9

9.లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి,విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

5:9 “ఎదిరించండి”– ఎఫెసు 6:10-18. విశ్వాసులు క్రీస్తులో గట్టి నమ్మకం కలిగి సైతాన్ను ఎదుర్కోగలిగితే వాడు చేసే ఏ కుతంత్రానికీ, దుష్‌ప్రేరణకూ లొంగవలసిన అవసరం లేదు (1 యోహాను 4:4; 1 కొరింతు 10:13).

7.) మీ విమోచకునితో మీకున్న విశ్వాసమును గూర్చి ఆసక్తితో అడుగువారికి చక్కని సూటియైన సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండుడి!

 (మొదటి పేతురు) 3:15,16

15.నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

3:15 “ప్రభువైన దేవుణ్ణి”– రోమ్ 10:9; 14:9. “ప్రభువు” గురించి నోట్స్ లూకా 2:11; ఫిలిప్పీ 2:10-11. క్రీస్తు అందరికీ అంతటికీ ప్రభువే. అయితే మనం మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా అస్తమానం ఆయన్ను మన హృదయాల్లో ప్రభువుగా చేస్తూ ఉండాలి (క్రీస్తు దేవుడు అయివున్నందువల్లనే ఆయన ప్రభువుగా ఉండగలడు). ఎఫెసు 3:17 పోల్చి చూడండి.

16.అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.

8.) మీరు మీ సహోదరులను నిష్కపటముగా ప్రేమించునట్లు చూచుకొనుడి!

 (మొదటి పేతురు) 1:22

22.మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

1:22 మనం పవిత్రంగా, శుద్ధంగా ఉండగలిగే ఏకైక మార్గం ఇదే. బైబిల్లో వెల్లడి అయిన సత్యానికి లోబడడమే ఆ మార్గం. రోమ్ 6:17-19; యోహాను 8:31-32 పోల్చి చూడండి. ఈ విధంగా శుద్ధం కావడం వల్ల ఫలితం యథార్థమైన ప్రేమ. దేవుని ప్రజలపట్ల మన హృదయాల్లో ప్రేమ లేకపోతే మనం శుద్ధులం కాలేదనీ, రక్షణ, విముక్తి పొందలేదనీ ఖచ్చితంగా నమ్మవచ్చు (1 యోహాను 3:14; యోహాను 13:34).

 (మొదటి పేతురు) 4:8

8.ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

4:8 “ప్రేమ”– 1:22; యోహాను 13:34; 15:12, 17; 1 యోహాను 3:11, 18; 4:8. పేతురు దైవ ప్రేమను సూచించే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. 1 కొరింతు 13:1 చూడండి.

9.) పరుల జోలికి పోవువానిగా ఉండవద్దు!

 (మొదటి పేతురు) 4:15

15.మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

10.) క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల ఆనందించండి!

 (మొదటి పేతురు) 4:14

14.క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

“మహిమా…దేవాత్మ”– దేవుని ఆత్మ పరలోక మహిమనుండి వచ్చి విశ్వాసులను అక్కడికి తోడుకుపోతాడు. ఇప్పుడు ఆయన వారిలో ఉన్నాడు (అపొ కా 1:8; 1 యోహాను 2:20). వారు బాధలను సహించడం, క్రీస్తు కోసం నిందల పాలవడం అంతా ఇందుకు రుజువు.

11.) తిరిగి పడిపోకుండునట్లు మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి.

 (మొదటి పేతురు) 3:15

15.నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

“సిద్ధంగా ఉండండి”– ఎఫెసు 5:15-16. మనం క్రీస్తు విశ్వాసులం అయిన కారణం ఏమిటో, మన ఆశాభావం పరలోకంలో ఎందుకు ఉన్నదో మనకు తెలిసి ఉండాలి. చక్కగా నమ్మించే స్పష్టమైన రీతిలో దీన్ని ఇతరులకు చెప్పగలిగేలా ఉండాలి.


ప్రత్యక్ష గుడారం మెటీరీయల్ కోరలు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted