Bible Telugu Messeages – గర్భఫలము పొందినవారు 1

Written by biblesamacharam.com

Published on:

గర్భఫలము పొందినవారు

Bible Telugu Messeages

1.)  శారా దేవుని వాగ్దానము వలన ఇస్సాకును కనెను.

 (ఆదికాండము) 11:30

30.శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.

11:30 ఆది 15:2-3; 16:1-2; 18:11-12; 21:1-2; 25:21; 29:31; 30:1-2; న్యాయాధి 13:2; 1 సమూ 1:2; కీర్తన 113:9; లూకా 1:7, 36

 (ఆదికాండము) 21:1,2,3,4,5,6,7,8

1.యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.

21:1 “మాటప్రకారమే”– 17:16; తీతు 1:2; హీబ్రూ 6:18.

21:1 A ఆది 17:19; 18:10, 14; రూతు 1:6; 1 సమూ 2:21; కీర్తన 12:6; మత్తయి 24:35; రోమ్ 4:17-20; గలతీ 4:23; తీతు 1:2; B ఆది 17:16, 21; 50:24; నిర్గమ 3:16; 20:5; కీర్తన 106:4; లూకా 1:68; 19:44; గలతీ 4:28; C నిర్గమ 4:31

2.ఎట్లనగా దేవుడు అబ్రాహా ముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.

21:2 A గలతీ 4:22; హీబ్రూ 11:11; B ఆది 17:19, 21; 18:10, 14; లూకా 1:24-25, 36; అపొ కా 7:8; C 2 రాజులు 4:16-17; రోమ్ 9:9

3.అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరుపెట్టెను.

4.మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.

5.అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి నప్పుడు అతడు నూరేండ్లవాడు.

6.అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

7.మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.

8.ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

2.)  రిబ్కా ఇస్సాకు ప్రార్థన వలన ఏశావు, యాకోబులను కనెను.

 (ఆదికాండము) 25:21,22,23,24,25,26

21.ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను.

22.ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమెఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను Bible Telugu Messeages 

23.రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

24.ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.

25.మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.

26.తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ట బడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్లవాడు.

3.) రాహేలు నాకు గర్భఫలము నిమ్ము లేనియెడల నేను చచ్చెదను అని  మొఱ్ఱపెట్టి యోసేపు, బెన్యామీనులను కనెను.

 (ఆదికాండము) 29:31

31.లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

 (ఆదికాండము) 30:1

1.రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతోనాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.

 (ఆదికాండము) 30:21

21.ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.

 (ఆదికాండము) 35:28

28.ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సర ములు.

4)  మానోహ కుటుంబము మా బిడ్డను పెంచుటకు మాకు నేర్పుము అని ప్రార్థించుట వలన మానోహ భార్య సమ్సోనును కనెను.

 (న్యాయాధిపతులు) 13:2,8,24

2.ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

8.అందుకు మానోహనా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్ట బోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయు మని యెహోవాను వేడుకొనగా Bible Telugu Messeages 

24.తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.

4.)  హన్నా నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకిచ్చెదను అని మ్రొక్కు బడి చేసుకొనుట వలన సమూయేలును కనెను, ఆ తరువాత మరో ముగ్గురు కుమాళ్ళను, ఇద్దరు కుమార్తెలను కూడా కనెను.

 (మొదటి సమూయేలు) 1:5,11,20

5.హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.

11.సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,

20.గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని-నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.

 (మొదటి సమూయేలు) 2:21

21.యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగు చుండెను.

5.)  ఎలీసబెతు ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నిందా రహితంగా ఉన్నందున బాప్తిస్మమిచ్చు యోహానును కనెను.

(లూకా సువార్త) 1:5,7,57,58,59,60,61,62,63

5.యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకు డుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.

7.ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)

57.ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

58.అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

59.ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా

60.తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

61.అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

62.వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.Bible Telugu Messeages 

63.అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

👉 అయితే మీకాలు దావీదును తన మనస్సులో హీనపరచినందున మర ణము వరకు పిల్లలను కనకయుండెను.

 (రెండవ సమూయేలు) 6:22

22.ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను.

 (మొదటి దినవృత్తాంతములు) 15:29

29.యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.


All Pdf……...Download

Leave a comment