నిద్రలు – నిజాలు
Seavakula Prasangaalu Telugu
1.) నిద్ర పాపమునకు గుర్తు.
(న్యాయాధిపతులు) 16:19
19.ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీది యేడు జడ లను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.
2.) నిద్ర అవిశ్వాసమునకు గుర్తు.
(రెండవ కొరింథీయులకు) 4:4,5,6
4.దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
4:4 “ఈ యుగ దేవుడు” అంటే సైతాను. యోహాను 12:31; 16:11 పోల్చి చూడండి. వాడు మనుషులు తనను పూజించాలని కోరుతూ పూజలందుకుంటూ ఉన్నాడు కాబట్టీ లోకం యొక్క చీకటి రాజ్యాన్ని ఏలుతున్నాడు (ఎఫెసు 6:12) కాబట్టి సైతానుకు ఈ పేరు పెట్టాడు. సైతాను గురించి నోట్స్ 1 దిన 21:1; మత్తయి 4:1-10; యోహాను 8:44.
5.అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.
4:5 ఆరంభంలో దేవుడు సృష్టించిన వెలుగును (ఆది 1:1-3) విశ్వాసుల హృదయాల్లో దేవుడు ప్రసరింపజేసిన ఆధ్యాత్మిక వెలుగుతో పౌలు పోలుస్తున్నాడు. సత్యం గురించిన జ్ఞానాన్ని వారు గ్రహించేలా దేవుడు వారి మనోనేత్రాలు తెరిచాడు. అంతకుముందు అందరిలాగా వారి మనస్సు కూడా చీకటి, అల్లకల్లోలంతో నిండి ఉంది – ఎఫెసు 1:18; అపొ కా 26:18; యోహాను 8:12; మత్తయి 6:22-23; 11:27; 16:17; 1 కొరింతు 2:11-16 పోల్చి చూడండి. దేవుడిచ్చే ఈ జ్ఞానప్రకాశాలు ఎలాంటివో చూడండి. మనిషి తానే దేవుణ్ణని తెలుసుకోగలడన్న తప్పు సిద్ధాంతంతో ఈ మాటలకు పని లేదు. మనుషులు దేవుడు కాదు, కాలేరు. తాము దేవుణ్ణని అనుకుంటే గనుక భయంకరమైన పొరపాటులో పడిపోయారన్నమాట. దేవుడు నిజమైన జ్ఞానప్రకాశాలను మనుషులకు ఇచ్చి దేవుని మహిమ తమలో కాదు క్రీస్తులోనే ఉందని (హీబ్రూ 1:3) వారు గ్రహించేలా చేస్తాడు. దమస్కు ప్రయాణంలో పౌలుకు ఈ జ్ఞానప్రకాశాల అనుభవం కలిగింది (అపొ కా 9:3-9). మనలో చాలమందికి అంత హఠాత్తుగా, అంత వింతగా ఇది జరగదు. అయితే ప్రతి విశ్వాసికీ ఈ ఆధ్యాత్మికమైన కనుచూపు, వెలుగు కలిగింది; అతడు వెలుగు సంతానమయ్యాడు (యోహాను 12:36; ఎఫెసు 5:8; 1 తెస్స 5:5). Seavakula Prasangaalu Telugu
6.గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
4:6 తన రాయబారి పదవిపై వస్తున్న దాడుల బారినుంచి దాన్ని పౌలు ఈ లేఖలో కాపాడుకోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువగా తన గురించి చెప్పుకున్నాడు. కానీ ఇదంతా కొరింతు విశ్వాసుల కోసమే గాని తనకోసం కాదు (1:12-24 నోట్స్). ముక్తి మార్గంగా అతడు తనను వారికి ప్రకటించుకోలేదు. శుభవార్త అతడు కల్పించిన ఊహ కాదు. తానెవరో గొప్పవాణ్ణని అతడు అనుకోలేదు. క్రీస్తుకోసం ఇతరులకు సేవకుణ్ణని మాత్రమే భావించాడు (1 కొరింతు 3:5-7; 9:19-23). తనకంటే ఎంతో గొప్పవాడైన మరో వ్యక్తిని గురించి, అంటే క్రీస్తును గురించి ప్రకటించే ఆధిక్యత అతనికి కలిగింది. పరలోకానికీ భూమికీ ఒకే ఒక ప్రభువుగా ఆయన్ను పౌలు ప్రకటించాడు. లూకా 2:11; రోమ్ 10:9; 1 కొరింతు 8:6; 12:3; అపొ కా 2:36; ఫిలిప్పీ 2:10-11 పోల్చి చూడండి.
(రోమీయులకు) 11:8,9,10,11,12
8.ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
9.మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంక ముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.
10.వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
11.కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.
12.వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును! Seavakula Prasangaalu Telugu
11:12 పౌలు మాటల్లోని తర్కం స్పష్టంగానే ఉంది. యూదుల పాపంవల్ల శుభవార్తలోని ఐశ్వర్యాలు లోకమంతటికీ అందుబాటులోకి వచ్చాయి. వారి “సమృద్ధి” తప్పకుండా మరింత ఐశ్వర్యవంతమే అవుతుంది. వారికి సమృద్ధి గనుక కలిగితే ఇంకా ఎక్కువ ఐశ్వర్యం అనడం లేదు పౌలు. వారికి భవిష్యత్తులో సమృద్ధి చేకూరుతుందన్న సత్యాన్ని మాత్రమే చెప్తున్నాడు. వారి సమృద్ధి అంటే ఒక జాతిగా వారు పూర్తిగా దేవునివైపుకు తిరగడం, దేవుడు వారిపట్ల తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చడం అన్నమాట (యెషయా 2:1-5; 11:1-9; యిర్మీయా 23:5-8; యెహె 37:21-28; జెకర్యా 14:9, 16, 21). “ఐశ్వర్యం” గురించి 2:4; 10:12; 2 కొరింతు 8:9; ఎఫెసు 1:7, 18; 2:7; 3:8, 16; ఫిలిప్పీ 4:19; కొలస్సయి 1:27. Seavakula Prasangaalu Telugu
3.) నిద్ర ప్రార్ధనలేమిటి హేతువు.
(లూకా సువార్త) 22:46
46.ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
4.) నిద్ర మిశ్రమ జీవితమునకు గుర్తు.
(అపొస్తలుల కార్యములు) 20:7,8,9
7.ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
8.మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
9.అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను. Seavakula Prasangaalu Telugu
5.) నిద్ర దైవ చిత్తమును నిరాకరించుటకు గుర్తు.
(యోనా) 1:6
6.అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.
6.) నిద్ర సిద్ధపాటు లేని జీవితంకు గుర్తు.
(మత్తయి సువార్త) 24:42
42.కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
24:42 వ 36; 25:13; మార్కు 13:37; ఫిలిప్పీ 3:20; 1 తెస్స 5:1-6; తీతు 2:13; హీబ్రూ 9:28; 2 పేతురు 3:12-13; ప్రకటన 3:3.
7.) నిద్ర మరణమునకు గుర్తు.
(మొదటి దినవృత్తాంతములు) 14:13,14,15,16,17
13.ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా
14.దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి
15.కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి యున్నాడని తెలిసికొనుమని సెల విచ్చెను. Seavakula Prasangaalu Telugu
16.దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబి యోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.
17.కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనుల కందరికి కలుగజేసెను.
బైబిల్ – ప్రశ్నలు సమాధానాల కొరకు .. click here