Seavakula Prasangaalu -ఎదుగుదలకు 7 మెట్లు -Pastors Messages Telugu

అంశం : ఎదుగుదలకు 7 మెట్లు.

Pastors Messages Telugu

1.) సంఘమునకు క్రమముగా హాజరుకావాలి.

 (హెబ్రీయులకు) 10:24,25

24.కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,

10:24 రచయిత వ 19-23లో విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికి బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నాడు. 3:13; రోమ్ 14:19; 15:2; 1 కొరింతు 9:24; కొలస్సయి 3:16 కూడా చూడండి.Pastors Messages Telugu

25.ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని(మూలభాషలో-లేపవలెనని) ఆలోచింతము.

10:25 వ 22-25లో చేద్దాం, ఉందాం అని నాలుగు చోట్ల కనిపిస్తున్నది. అవన్నీ కూడా క్రీస్తు ఎవరో ఆయన మనకోసం చేసినదేమిటో అన్నవాటిపై ఆధారపడి ఉన్నాయి. విశ్వాసుల సభలకు వెళ్ళడం ఏ విశ్వాసీ మానుకోకూడదు. ప్రతి ఒక్కరికీ ఇతర విశ్వాసులతో సహవాసం అవసరం. ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి.

2. సంఘములో ఆత్మానుసారంగా నడవాలి.

 (గలతీయులకు) 5:16,17,18,19,20,21,22,23,24,25,26

16.నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

5:16 “ఆత్మకు…నడుచుకోండి”– ఇక్కడినుంచి 6:10 వరకు పౌలు రాసిన అంశమిదే. క్రీస్తులో ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు విశ్వాసులకు శక్తినిచ్చేది దేవుని ఆత్మే. రోమ్ 8:4-14 పోల్చి చూడండి. భ్రష్ట స్వభావం (“శరీర స్వభావం”– వ 13), దాని కోరికలు విశ్వాసుల్లో లేవనడం లేదు పౌలు. ఉన్నాయని స్పష్టంగా సూచిస్తున్నాడు. తరువాతి వచనంలో ఇది మరింత స్పష్టంగా ఉంది. రోమ్ 7:14-25; 1 యోహాను 1:8 కూడా చూడండి. శరీర స్వభావం, దాని ఆశలు మనందరిలో ఉన్నాయి. కానీ దేవుని ఆత్మమూలంగా మనం వాటిని అణగద్రొక్కి జయించగలం.Pastors Messages Telugu

17.శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. Pastors Messages Telugu

5:17 దేవుని ఆత్మకు శరీర స్వభావం పూర్తిగా వ్యతిరేకం. ఈ రెంటి కోరికలు, తలంపులు, గమ్యాలు, లక్షణాలు పూర్తిగా విభిన్నమైనవి (రోమ్ 8:5-8). ఈ లోకంలో మన జీవితం ముగిసేవరకు అవి రెండూ మనలో పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. శరీర స్వభావం – అంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్వభావాన్ని బట్టి మనం ఏమిటో అది – పట్టు వదలదు, చెడ్డవాటిని ఆశించడం మానుకోదు, మంచిగా పవిత్రంగా ఎన్నటికీ మారదు. నిజానికి కాలం గడుస్తున్నకొద్దీ అది మరింత హీనంగా మారిపోతూ ఉంటుంది (ఎఫెసు 4:22). దేవుని ఆత్మ అడుగడుక్కూ, శరీర స్వభావాన్ని ఎదిరిస్తూనే ఉంటాడు. అది కోరేవాటిలో ఒక్కదానికి కూడా లొంగడు.

18.మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.

5:18 “ఆత్మ మిమ్ములను నడిపిస్తూ”– రోమ్ 8:14 చూడండి. దేవుని ఆత్మ విశ్వాసులను మత దాస్యం నుంచి బయటికి తెచ్చాడు. పాపవిముక్తి, రక్షణ కోసం స్వంత ప్రయత్నాలు చెయ్యాలన్న సూత్రం నుంచి విడుదల చేశాడు. ఆయన తిరిగి వారిని అందులోకి తీసుకుపోడు.Pastors Messages Telugu

19.శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

5:19-21 పౌలు వ్యభిచారం పక్కన విగ్రహ పూజను, అసూయ, కలహాల ప్రక్కన త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులను ఉంచి ఒకే జాబితాలోను చేర్చాడని గమనించండి. ఇవన్నీ భ్రష్ట స్వభావంలోనుంచి, మానవ సహజమైన హృదయంలోనుంచి వస్తాయని ఆధ్యాత్మిక వ్యక్తులకు “స్పష్టంగా” తెలుసు. మత్తయి 15:19; మార్కు 7:21-23; రోమ్ 1:29-32; 3:9-18 పోల్చి చూడండి. భ్రష్ట స్వభావ క్రియలన్నిటినీ పౌలు ఇక్కడ చెప్పలేదు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిలో కొన్ని నేరుగా దేవునికి వ్యతిరేకంగా చేసేవి. కొన్ని మనుషులకు విరోధంగా చేసేవి. కొన్ని అవి చేసే వారికే విరోధంగా పని చేసేవి. ఇవన్నీ నాశనం కలిగించేవే. ఇవన్నీ దేవుని కోపానికీ తీర్పుకూ శిక్షకూ తగినవే.

20.విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21.భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

22.అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

5:22-23 ఇవి విశ్వాసుల ఆత్మఫలం కాదు విశ్వాసిలో దేవుని ఆత్మ ఫలింపజేసిన ఫలం. ఇవి స్వంత ప్రయత్నాలవల్ల వచ్చినవి కావు. అలాగని విశ్వాసి చేతులు ముడుచుకుని ఏమీ చెయ్యకుండా కూర్చోవాలని కాదు. పవిత్రాత్మలో జీవించాలి, పవిత్రాత్మప్రకారం నడుచుకోవాలి. అలా కాకుంటే అతని జీవితంలో ఈ ఫలం కనిపించదు. ఫలం అనే మాట కాలక్రమేణా జరుగుతున్న అభివృద్ధిని సూచిస్తున్నది. మత్తయి 13:23 పోల్చి చూడండి. ప్రకృతిలో పండ్లు కాయాలంటే ముందు విత్తనం నాటాలి, మొక్క లేక చెట్టు ఎదగాలి. అప్పుడు పండ్లు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ఫలం కూడా అలాగే. మనం క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు తరచుగా ప్రేమ, ఆనందం, మనశ్శాంతి ఒక్కసారిగా పెల్లుబికాయి. అయితే ఇవి అభివృద్ధి చెంది పరిపక్వమై, ఇతర ఆధ్యాత్మిక సుగుణాలు వీటికి తోడవాలి. సహనం, విశ్వసనీయత, ఇంద్రియ నిగ్రహం కొంతకాలం పాటు ఎదగాలి. 2 పేతురు 1:5-8 పోల్చి చూడండి. తన పిల్లల్లో ప్రతి వ్యక్తికీ ఈ జాబితాలోని ప్రతి లక్షణమూ ఉండాలని దేవుని కోరిక. దేవుని ఆత్మ కార్యం ద్వారా ప్రతిదీ మనకు లభించడం సాధ్యం. పౌలు ప్రేమను మొదటగా చెప్తున్నాడు. అది మంచి లక్షణాలన్నిటిలోకీ గొప్పదని అతనికి తెలుసు – వ 6,14; 1 కొరింతు 13:13.

23.ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

24.క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

5:24 ఎవరో మహనీయులైన పవిత్రుల విషయంలో మాత్రమే గాక క్రీస్తు విశ్వాసులందరి విషయంలోనూ ఇది సత్యమే. 2:20లో విశ్వాసులు క్రీస్తుతో కూడా సిలువ మరణం చెందిన విషయం పౌలు చెప్పాడు. విశ్వాసి తానే స్వయంగా చేసినది ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసులు ఇలా చెయ్యాలి అని పౌలు చెప్పడం లేదు, వారు చేశారని చెప్తున్నాడు. వారు నిజంగా పశ్చాత్తాపపడి క్రీస్తుమీద నమ్మకం ఉంచినప్పుడే ఇలా చేశారు. భ్రష్ట స్వభావ ప్రభావం కింద ఉన్న పాత జీవిత విధానంతో పూర్తి తెగతెంపులను పశ్చాత్తాపం సూచిస్తున్నది. క్రీస్తులో నమ్మకం ఆయన విశ్వాసి స్థానంలో మరణించిన విషయాన్ని అంగీకరిస్తున్నది. అంటే, “సిలువను ఎక్కవలసినది నేను, క్రీస్తు కాదు” అని విశ్వాసి చెప్తున్నట్టన్నమాట. తన భ్రష్ట స్వభావానికి తగిన చోటు సిలువమీదే అని అతడు ఒప్పుకుంటాడు. దాని విషయంలో దేవుని తీర్పుతో ఏకీభవిస్తాడు. తనను పరిత్యజించుకుని తన సిలువను ఎత్తుకుని క్రీస్తును అనుసరిస్తాడు (మత్తయి 10:38-39; 16:24-26. అక్కడి నోట్స్ చూడండి). ఇలా చేసేందుకు అతడు సిద్ధంగా లేకపోతే అతడు నిజ క్రైస్తవుడు కాదు. నిజ విశ్వాసులు ఎలాంటివారో పౌలు ఇక్కడ వర్ణిస్తున్నాడు. వారు తమ భ్రష్ట స్వభావాలను సిలువ వేయకపోయినట్టయితే వారు క్రీస్తుకు చెందినవారు కాదు. అయితే వ 16 నుంచి మొదలై ఈ లేఖ భాగాన్ని బట్టి చూస్తే విశ్వాసులకు తమ భ్రష్ట స్వభావం వల్ల ఇక ఎలాంటి కష్టం ఉండదని మనం భావించుకోకూడదు. కలిగిస్తూనే ఉంటుందని పౌలు స్పష్టం చేశాడు. దేవుని పట్ల, పాపం పట్ల విశ్వాసులకు కలిగిన మనస్తత్వాన్ని బట్టి వారి భ్రష్ట స్వభావాన్ని సిలువ వేశారు. అయితే భ్రష్ట స్వభావం విశ్వాసుల్లో చనిపోయి సమాధి కాలేదు. సిలువ నుంచి దిగివచ్చి మన జీవితాలను తన ఇష్టం వచ్చినట్టు నడిపేందుకు అస్తమానం ప్రయత్నిస్తూ ఉంటుంది (వ 17). అందుకనే మనం ప్రతి రోజూ మన సిలువను ఎత్తుకుని పోతూ ఉండాలని క్రీస్తు చెప్పాడు – లూకా 9:23.

25.మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

5:25 విశ్వాసులందరికీ దేవుని ఆత్మ ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చాడు (యోహాను 3:3-8). ఇది నిజం కాబట్టి పవిత్రాత్మ నడిపించిన చోటికెల్లా ఆయనతో అడుగులో అడుగుగా వెళ్ళాలి. శరీర స్వభావంపై విజయానికీ, దాన్ని దానికి తగిన స్థానంలో, అంటే సిలువపైనే ఉంచడానికీ ఇదే ఏకైక మార్గం.

26.ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

5:26 కొన్ని అనుదిన వ్యవహారాల్లో దేవుని ఆత్మ చూపిన దారిన వెళ్ళడం గురించి పౌలు ఇక్కడ చెప్పుతున్నాడు. అహంకారం, కలహం, అసూయ అంటే పవిత్రాత్మకు అసహ్యం. మనం పవిత్రాత్మలో జీవించేవారమైతే మనం కూడా వీటిని అసహ్యించుకోవాలి. అవి శరీర కార్యాలు.

3. సంఘస్థులు ప్రేమసూత్రం పాటించాలి.

1 కొరింథీ 13

4.) సంఘములో ధారాళంగా ఇవ్వాలి.

 (రెండవ కొరింథీయులకు) 9:5,6,7

5.కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.

9:5 వ 7. ఇవ్వడం విషయంలో విశ్వాసులు తాము ఉంచుకోగలిగినదంతా తమకే ఉంచుకోవాలని కోరరాదు. ఇవ్వక తప్పదు గనుక, ఇవ్వకుండా తప్పించుకునే మార్గం లేదు గనుక ఇవ్వడం అనేది ఉండకూడదు.

6.కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా(మూలభాషలో-దీవెనలతో) విత్తువాడు సమృద్ధిగా (మూలభాషలో-దీవెనలతో) పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.

9:6 సామెత 11:24-25; 19:17; 22:8-9; లూకా 6:38; గలతీ 6:7. ఎలాంటి సందేహానికీ తావులేకుండా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవునికి, ఇతరులకు ఇవ్వాలన్న మనసు కొందరు పేదలకు ఉండదు కాబట్టి లౌకికంగానూ, ఆధ్యాత్మికం గానూ కూడా వారు పేదలుగా ఉన్నారు, పేదలుగానే ఉండిపోతారు.

7.సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

5.) సంఘస్థులు నూతన జీవితం జీవించాలి.

 (ఎఫెసీయులకు) 4:23,24,25,26,27,28,29,30,31,32

23.మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై,

24.నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును(మూలభాషలో-నవీన పురుషుడు) ధరించుకొనవలెను.

“కొత్త మానవుణ్ణి”– అంటే క్రీస్తులో కొత్త జీవిత విధానం. మనం జీవించవలసిన పద్ధతిని యేసే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చూపించాడు. పవిత్రంగా, నీతిన్యాయ సమ్మతంగా మనం జీవించగలిగేలా ఆయన మనలో కొత్త ఆధ్యాత్మిక స్వభావాన్ని సృష్టించాడు (2:5, 10; రోమ్ 8:4).

“ధరించుకోవాలి”– కొలస్సయి 3:10; రోమ్ 13:14; 1 యోహాను 2:6. ధరించుకోవడం అంటే ప్రవర్తనను సూచిస్తున్నది. ఒక విశ్వాసి క్రీస్తులో ఏమిటో దాన్ని బట్టి అతని ప్రవర్తన ఉండాలి. అతడు కొత్త సృష్టి (2 కొరింతు 5:17), ఆ విధంగా ప్రవర్తించాలి. కపట భక్తులైతే లోపల ఒకటి ఉంచుకుని బయటికి వేరే విధంగా కనిపిస్తారు. విశ్వాసుల అంతరంగాల్లో ఆధ్యాత్మికమైనది, వాస్తవమైనది, అద్భుతమైనది ఒకటి ఉంది, వారు జీవించే పద్ధతుల ద్వారా దాన్ని బయటికి ప్రదర్శించాలి.

25.మనము ఒకరికొకరము అవయవములైయున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

వ 15. సత్యం అభివృద్ధి కలిగిస్తుంది. అసత్యం నాశనం చేస్తుంది. క్రైస్తవులు అబద్ధాలాడితే ఒకరితో ఒకరికి నెమ్మది ఉండదు. సత్య స్వరూపి అయిన దేవునితో సమాధానం ఉండదు (కీర్తన 31:5). విశ్వాసుల్లో ఉండే అబద్ధాలు, మోసం అంతా క్రీస్తుకూ ఆయన సంఘానికీ వ్యతిరేకమైన పాపం.

4:25 “విడిచిపెట్టాలి”, “ధరించుకోవాలి” అనే మాటలు వాడడంలో తన ఉద్దేశం ఏమిటో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. సత్యానికీ పవిత్రతకూ మంచితనానికీ వ్యతిరేకమైన ప్రతిదాన్నీ విశ్వాసులు తీసివేసుకోవాలి, వాటికి అనుగుణమైన ప్రతిదాన్నీ ఆచరణలో పెట్టడం ఆరంభించాలి.

26.కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.

4:26 కీర్తన 4:4; మత్తయి 5:22. కోపం వ 31లో చెప్పిన పాపాల్లో మనల్ని పడెయ్యగలదు. విశ్వాసుల హృదయాల్లో ఇది మొలకెత్తిన దినాన్నే దాన్ని పెరికివేయాలి.

27.అపవాదికి(అనగా సాతాను) చోటియ్యకుడి;

4:27 అబద్ధాలు, కోపం, ఇవి రెండూ క్రైస్తవుల మధ్య తగవులు పెట్టేందుకు సైతానుకు సహాయం చేస్తాయి. ఇలాంటి అవకాశాల కోసం సైతాను ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు (2 కొరింతు 2:11; 1 పేతురు 5:8).

28.దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

29.వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.

4:29 “చెడ్డ మాటలు”– 5:4; కొలస్సయి 3:8; మత్తయి 12:36. క్రీస్తు మన హృదయాల్లో ఉంటే బూతులు మాట్లాడేందుకు మనమెలా తెగించగలం? “వినేవారికి ప్రయోజనం” – మనం చెప్పేది, చేసేది ప్రతిదానికీ ఇదే ఉద్దేశమై ఉండాలి.

30.దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

4:30 “దుఃఖపెట్టకండి”– పవిత్రాత్మ ఎలాంటి చలనం, అనుభూతి, చైతన్యం లేని ప్రభావం కాదు. ఆయన ఒక వ్యక్తి (యోహాను 14:16-17). విశ్వాసులు ఆయన్ను ఎలా దుఃఖపెడతారు? పౌలు ఇంతవరకూ చెప్తున్న పాపాల ద్వారా – అబద్ధాలు, కోపం, దొంగతనం, స్వార్థం, బూతులు మొదలైన వాటి మూలంగా దుఃఖపెడతారు. అశుద్ధమైనదేదైనా సరే ఆ మహా పవిత్రుణ్ణి దుఃఖపెడుతుంది. మనం దేవుని ప్రజల్లో ఎవరినైనా అనవసరంగా దుఃఖపెడితే అది కూడా ఆయన్ను దుఃఖపెడుతుంది. యెహె 6:9 కూడా చూడండి.

31.సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. Pastors Messages Telugu

32.ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

4:32 వ 2; రోమ్ 12:10, 17, 19; కొలస్సయి 3:12-13. దేవుడు విశ్వాసులను ఉచితంగా, పూర్తిగా క్షమించాడు. అందువల్ల తమను నొప్పించిన వారిని విశ్వాసులు క్షమించాలి. వారలా చెయ్యకపోతే దేవునినుండి వారికి సమస్య వస్తుంది. వారు ఇతరుల పట్ల చేసినట్టే ఆయన వారికి చేస్తాడు. మత్తయి 6:12, 14, 15; 18:21-35 చూడండి. మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటున్నాం, క్రీస్తును దుఃఖపెడుతున్నాం, సంఘంలో సమస్యలు సృష్టిస్తున్నాం.

6.) సంఘములో ప్రభువు బల్లలో పాలుపొందాలి.

 (మొదటి కొరింథీయులకు) 11:23,24,25,26,27,28,29

23.నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి

11:23 ఇక్కడ పౌలు ప్రభురాత్రి భోజనమంటే ఏమిటో, దాన్నెలా ఆచరించాలో వారికి వివరించడం ఆరంభిస్తున్నాడు. గతంలో ఒకసారి ఈ సత్యాన్ని వారికి అందించాడు గాని వారు దానికి దూరంగా తొలిగిపోయారు. అతడు వారికి అందించినది అతడు యేసుప్రభువునుంచి స్వీకరించాడు. అందువల్ల శుభవార్త పుస్తకాల్లో ఉన్నదానితో ఇది ఏకీభవిస్తున్నది. మత్తయి 26:26-28; మార్కు 14:22-24; లూకా 22:19-22 చూడండి. Pastors Messages Telugu

24.దానిని విరిచియిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

“నా శరీరం”– ప్రభురాత్రి భోజనంలో రొట్టె (వ 28) క్రీస్తు శరీరానికి గుర్తు. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో సూచనల, చిహ్నాల వాడకం గురించి యోహాను 6:53, 63 చూడండి.

“జ్ఞాపకం చేసుకోవడానికి”– ప్రభురాత్రి భోజనం సమయంలో మనం దేవునివైపుకూ మన గతంలోకీ చూచుకోవాలి – మన ఆలోచనలు పైనున్న క్రీస్తుమీద ఉండాలి. చాలా కాలం క్రితం ఈ భూమిపై మరణించడం ద్వారా ఆయన మనకోసం ఏమి చేశాడో తలపోసుకోవాలి. Pastors Messages Telugu

25.ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. Pastors Messages Telugu

11:25 పాత్రలో ద్రాక్షరసం ఉంది. మత్తయి 26:28 ప్రకారం క్రీస్తు రక్తానికి అది చిహ్నం. కొత్త ఒడంబడికను స్థాపించేందుకు ఆ రక్తం కార్చబడింది (అక్కడ నోట్స్ చూడండి). ఇక్కడి మాటలు చూడండి – “ఈ పాత్ర నా రక్తం మూలమైన కొత్త ఒడంబడిక”. ఆ పాత్ర అక్షరాలా కొత్త ఒడంబడిక కాదని స్పష్టమే. పాత్ర అంటే పాత్రే అయితే క్రీస్తు రక్తం మూలమైన కొత్త ఒడంబడికకు అది సూచన. అలానే వ 24లో రొట్టెను క్రీస్తు శరీరంగా చెప్పిన విషయం కూడా ఇలానే అర్థం చేసుకోవాలి. రొట్టె అక్షరాలా క్రీస్తు శరీరం కాదు గాని దానికి సూచన మాత్రమే. రొట్టె తినాలని, పాత్రలోది తాగాలని కూడా పౌలు నేర్పుతున్నాడు. ప్రభురాత్రి భోజనాన్ని సరిగా ఆచరించడమంటే రెండూ చేయాలి.

26.మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Pastors Messages Telugu

11:26 “త్రాగేటప్పుడెల్లా”– ప్రభురాత్రి భోజనాన్ని ఎంత తరచుగా చేయాలో పౌలు ఎక్కడా చెప్పలేదు.

27.కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. Pastors Messages Telugu

11:27 ఈ తీవ్రమైన హెచ్చరికలు పౌలు ఎవరికిస్తున్నాడు? “తగని విధంగా” అంటే ఏమిటి? అందులో పాల్గొనడానికి నేను తగను అని ఎవరైనా అనుకుని కూడా పాల్గొనడం కాదు దీని అర్థం. భ్రష్ట స్వభావం మనలో ఉందని గుర్తించి పాల్గొనడం కాదు. లేక పాపం చేశానని తెలిసి కూడా ఒక మనిషి దానిలో పాల్గొనడం కాదు (రొట్టె ద్రాక్షరసం పుచ్చుకోకముందు ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే చాలు). వ 18-22లో తగని విధం ఒకటి కనిపిస్తున్నది. భయభక్తులు లేకుండా నిర్లక్ష్యంగా పాలుపుచ్చుకోవడం, అందులోని అర్థాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, అది తనకు ఎలా వర్తిస్తుందో గుర్తించకుండా తీసుకోవడమే “తగని విధం” అంటే. పాపంలో జీవిస్తూ ఇందులో పాల్గొనడం కూడా తగని విధమే అని వేరే చెప్పనవసరం లేదు. తగని విధంగా పాల్గొనడం క్రీస్తు రక్తం, శరీరం విషయంలో పాపం చేసినట్టు. అది ఆయన రక్తానికీ శరీరానికీ చిహ్నాలుగా ఉన్నవాటి పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్టు అవుతుంది. అంటే నిజంగా ఆయన రక్తమాంసాలను అవమానించినట్టే. ఇది స్వల్ప పాపం కాదు.

28.కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

11:28 తగిన విధంగా పాల్గొనాలంటే హృదయం, మనస్సు సిద్ధపడి ఉండాలి. అందువల్ల విశ్వాసులు ఇందులో పాల్గొనకముందు తమ బయటి జీవితాలను, అంతరంగ పరిస్థితిని పరిశీలించుకోవాలి. పాపమంతా, అమర్యాదకరమైన ధోరణి అంతా, ఆలోచన లేని ప్రవర్తనంతా విడిచిపెట్టాలి. ప్రభురాత్రి భోజనంలోని అర్థాన్ని, దానిలో పాల్గొనవలసిన కారణాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించామని రూఢి చేసుకోవాలి. Pastors Messages Telugu

29.ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

11:29 “ప్రభు శరీరాన్ని…నిర్ణయించకుండా”– ఇందులో రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి ప్రభురాత్రి భోజనం యొక్క అర్థాన్ని గుర్తించకపోవడం, అది మామూలు భోజనాలవంటిది కాదని గ్రహించకపోవడం (కొరింతువారు ఇక్కడే తప్పటడుగు వేశారు). రెండు, విశ్వాసులందరూ క్రీస్తు శరీరంలో ఉన్నారని గుర్తించకపోవడం (10:17; 12:12-13. కొరింతువారు ఇందులో కూడా తప్పటడుగు వేశారు). Pastors Messages Telugu

7.) సంఘమునందు సిద్దపడి ఉండాలి.

 (మత్తయి సువార్త) 24:44,45,46,47,48,49,50,51

44.మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

24:44 వ 42లో క్రీస్తు “మెళుకువగా ఉండండి” అన్నాడు. ఇక్కడ “సిద్ధంగా ఉండండి” అంటున్నాడు. ఆయన రాకడకు సంబంధించి ఆయన శిష్యులు పాటించవలసిన రెండు విధులు ఇవి. నిజానికి ఇవి రెండూ దాదాపు ఒకటే. 25:13 నోట్ చూడండి. మనకు ఆ సమయం ఖచ్చితంగా తెలియదు కాబట్టి మనం కనిపెట్టుకొని ఉండాలి, అన్ని వేళల్లోనూ ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలి – 25:10; 1 తెస్స 5:6-8; 1 యోహాను 2:28Pastors Messages Telugu

45.యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

24:45 25:21, 23. సంఘాల్లోని కాపరులు, ఉపదేశకుల గురించి ఇక్కడ యేసు మాట్లాడుతున్నాడు. వారు దేవుని ప్రజలకు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాలి (యోహాను 21:15-17). దేవుడు నియమించిన కాలాలూ తేదీల గురించి లెక్కలు వేసుకుంటూ కూర్చోవడం కన్నా ఇది ఎంతో ప్రాముఖ్యం (అపొ కా 1:7). దేవుని ప్రజలను సరిగ్గా పోషించడానికి ఎంతో జ్ఞానం, విశ్వసనీయత అవసరం – 1 కొరింతు 4:2; 2 తిమోతి 2:2; యాకోబు 1:5-6.Pastors Messages Telugu

46.యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

47.అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.Pastors Messages Telugu

24:47 25:21, 23; లూకా 19:17, 19; రోమ్ 8:17; 1 కొరింతు 3:21-23; ప్రకటన 21:7. ఇది క్రీస్తు రెండో రాకడ సమయంలో జరుగుతుంది.

48.అయితే దుష్టుడైన యొక దాసుడునా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని

24:48-51 దేవుని సేవకులమని చెప్పుకుంటూనే దుర్మార్గంగా కపటంగా ఉండే సంఘకాపరులు, ఉపదేశకులు ఉన్నారు. వారి నాశనం తప్పనిసరి (2 పేతురు 2:1-3; యూదా 4,12-15 వచనాలు). Pastors Messages Telugu

49.తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె

50.ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును.

51.అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.


క్రీస్తు జీవిత చరిత్ర కొరకు క్లిక్ చేయండి.. click here 

Leave a comment

error: dont try to copy others subjcet.