ఎవరి పైన ఆశీర్వాదము – Pastors Messages Telugu

Written by biblesamacharam.com

Published on:

అంశం : ఎవరి పైన ఆశీర్వాదము

Pastors Messages Telugu

మూలవాక్యము :

క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

 (ఎఫెసీయులకు) 1:3

3.మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

1:3 “దేవుడు”– భూమిపై మానవుడుగా జన్మనెత్తాక యేసు తండ్రియైన దేవుణ్ణి తన దేవుడుగా పిలిచాడు – మత్తయి 27:46; యోహాను 20:17. అలా చెయ్యడంలో తాను దేవుణ్ణి కానని ఆయన సూచించడం లేదు. యోహాను 8:24, 58; 20:28-29; మత్తయి 11:27 పోల్చి చూడండి. ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 దగ్గర చూడండి.

“పరమ స్థలాలలో”– ఈ మాట ఈ లేఖలోని మరో మూల పదం – 1:20; 2:6; 3:10; 6:12. ఇది పరలోకంలో దేవుడు నివసించే స్థలం అన్నది స్పష్టమే (1:20), కానీ దీనికింకా అర్థం ఉంది (6:12). దేవుడు పరిపాలించే అదృశ్యమైన ఆత్మల లోకం, సైతాను ఆయన పాలనను వ్యతిరేకిస్తూ ఉన్న లోకం అని కూడా దీనికి అర్థం. అక్కడ దేవుడు అత్యున్నతమైన పరలోకంలో ఉన్నాడు; ఆ ఆత్మల లోకంలో సైతాను, పిశాచాలు అట్టడుగున ఉంటూ విశ్వాసులతో పోరాడుతున్నారు. దేవుని దృష్టిలో భూమి మీద ఉన్న విశ్వాసులు ఇప్పుడే పరమ స్థలాల్లో కూడా ఉన్నారు (2:6), ఎందుకంటే వారి నాయకుడు, ప్రతినిధి అక్కడ ఉన్నాడు (1:22), వారు “ఆయనలో” ఉన్నారు. అదే సమయంలో శరీరంలోనైతే ఇంకా భూమి మీదే ఉండి అదృశ్య లోకంలో ఉన్న దురాత్మలతో పోరాడుతున్నారు.

“ఆధ్యాత్మిక ఆశీస్సులతో”– ఇవి ఆధ్యాత్మిక లోకం దీవెనలు. అంటే మనకు పాపవిముక్తి ఇచ్చి, మనల్ని సంరక్షిస్తూ, ఆధ్యాత్మికమైనవారుగా చేస్తూ, క్రీస్తుకోసం జీవించేలా సామర్థ్యం ఇస్తూ, చివరికి ఆయనతో శాశ్వతంగా ఉండేలా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని కృప సంబంధమైన దీవెనలు. దేవుడు విశ్వాసులను ఇతర విధాలుగా – అంటే శారీరికంగా, మానసికంగా, ఆర్థికంగా – దీవించడని పౌలు ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఇక్కడ అతడు నొక్కి చెప్పేది ఆ సంగతుల గురించి కాదు.

ఈ ఉత్తరంలో దేవుడు విశ్వాసులకు ఇచ్చే కొన్ని ఆధ్యాత్మికమైన దీవెనల గురించి చెప్పాడు – 2:5-6, 10, 13-19, 22; 3:16-17, 20; 4:7, 13, 24; 5:8, 18, 25-27; 6:10-13. “మనలను” అంటే ఎవరో కొద్దిమంది మహనీయుల్ని అని కాదు, విశ్వాసులందరినీ అని అర్థం.

“దీవించాడు”– ఈ మాట భూతకాలంలో ఉంది. దేవుడు ఇంతకుముందే విశ్వాసులకు ఆధ్యాత్మిక దీవెనలన్నీ ఇచ్చాడు. ఇవి క్రీస్తులో ఉన్నాయి. ఇవెక్కడ ఉన్నాయో ఆ క్రీస్తులోనే విశ్వాసులు కూడా ఉన్నారు. దీవెనల గురించి నోట్స్ ఆది 12:1-3; సంఖ్యా 6:22-27; ద్వితీ 28:3-14; కీర్తన 1:1; 119:1; మత్తయి 5:3-12; అపొ కా 3:26; గలతీ 3:9, 14.

1.) యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించును.

 (కీర్తనల గ్రంథము) 115:13

13.పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

115:13 A కీర్తన 112:1; 128:1; లూకా 1:50; ప్రకటన 11:18; 19:5; B కీర్తన 29:11; 128:4-5; C మలాకీ 3:16-17; 4:2; అపొ కా 13:26; 26:22; కొలస్సయి 3:11; ప్రకటన 20:12

2.) శుద్ధ హృదయము కలిగియుండువారు ఆశీర్వదించును.

 (కీర్తనల గ్రంథము) 24:5

5.వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.

24:5 పాపంనుంచి శుద్ధుడైన విశ్వాసి అదంతా తన చేత అయిందని చెప్పుకోడు. తన ముక్తిప్రదాత అయిన దేవుడే దాన్ని జరిగించాడని అతనికి తెలుసు. పాపవిముక్తి, నీతిన్యాయాలు, అన్ని రకాల దీవెనలు ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చినవే – ఎఫెసు 2:8-9.

3.) నీతిమంతులను ఆశీర్వదించును.

(కీర్తనల గ్రంథము) 92:12

12.నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు

92:12-14 బైబిల్లో విశ్వాసులను తరచుగా ఫలభరితమైన ద్రాక్షచెట్లతో ఇతర చెట్లతో పోల్చడం జరిగింది – 1:3; 52:8; ఆది 49:22; యిర్మీయా 17:8; హోషేయ 14:5-6; యోహాను 15:1-5. న్యాయవంతుల గురించిన కొన్ని సత్యాలను ఇక్కడ గమనించండి. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటారు. దేవుని ఇంటిలో నాటబడి ఉన్నారు, అంటే వారి వేర్లు పవిత్రమైన నేలలో పాతుకొని దేవుని సహవాసంలో, పవిత్రమైన వాతావరణంలో పెరుగుతారు. వృద్ధాప్యంలో కూడా వారు ఆధ్యాత్మికంగా చురుకుగా ఫలవంతంగా ఉంటారు. వారిచ్చే సందేశంలోని సారాంశం తమ స్వంత నీతిన్యాయాలు కాదు, దేవునివే.

4.) దేవుని మాట వినినవారిని ఆశీర్వదించును.

 (ద్వితీయోపదేశకాండము) 28:1,2,3,4,5

1.నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.

28:1 “దీవెనలు”– ఆది 12:1-3; సంఖ్యా 6:22-27; కీర్తన 1:1-3; 119:1; మత్తయి 5:3-12; లూకా 11:12; అపొ కా 3:26; గలతీ 3:10; ఎఫెసు 1:3 నోట్స్ చూడండి. మనుషులను దీవించడం, న్యాయం, యుక్తంగా ఉన్నంతకాలం వారిని దీవించడం దేవునికి అతి ప్రియం అయితే “ప్రవర్తిస్తూవుంటే” అనే మాట గమనించండి. ప్రజల విధేయతపై ఈ వాగ్దానం ఆధారపడివుంది.

2.నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.

3.నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు;

28:3-14 తనపట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధాలుగా దీవిస్తానని మాట ఇచ్చాడు. ఈ దీవెనలలో కొన్ని ఇహలోక సంబంధమైనవే. పాత ఒడంబడిక కాలంలో ధనధాన్యాలు ఉండడం దైవాశీర్వాదాలకు గుర్తు అని ప్రజలు అనుకున్నారు. తరచుగా అది నిజంగా గుర్తే గాని ఎల్లప్పుడూ కాదు. క్రొత్త ఒడంబడికలో దేవుడిస్తానన్న దీవెనలు చాలామట్టుకు ఆధ్యాత్మికం, శాశ్వతం (ఎఫెసు 1:3). మత్తయి 5:3-12; లూకా 6:20-26లో యేసుప్రభువు చెప్పిన మాటలతో ద్వితీయోపదేశకాండంలోని ఈ వాక్యభాగాన్ని పోల్చిచూడండి. ఆది 24:35 నోట్ చూడండి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన దీవెనలకంటే ఎంతో శ్రేష్ఠమైనవి, ప్రధానమైనవి. యేసుప్రభువు చెప్పాడు కదా “దరిద్రులారా, మీరు ధన్యులు. దేవుని రాజ్యం మీది” (లూకా 6:20). ఈ కాలంలో జీవిస్తున్న విశ్వాసులు పాత ఒడంబడిక సంప్రదాయాన్ని అనుసరించి సంపదలు ఉండడమే దైవాశీర్వాదాలకు గుర్తు అనుకోవడం ఆత్మవంచనే. ధనికులు చాలామంది (వీరిలో క్రైస్తవులనబడినవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు) వారి అపనమ్మకం, అవిధేయతల మూలంగా దేవుని కోపం క్రింద ఉన్నారు (యోహాను 3:36; యాకోబు 5:1-6). పేదలనేకమందికీ క్రీస్తులో శాశ్వత భాగ్యాలు ఉన్నాయి. ఈజిప్ట్ బానిసత్వంలో, ఎడారి ప్రయాణంలో, కనానులో ఇస్రాయేల్‌వారి విషయాలు నేడు మన ఎదుట ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాలకు సూచనలుగా ఉన్నాయని గుర్తుంచుకోండి.

4.నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;

5.నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.

5.) దేవునికి ఇవ్వటం ద్వారా ఆశీర్వదించును.

 (మలాకీ) 3:10

10.నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“నన్ను పరీక్షించండి”– అపనమ్మకం మూలంగా దేవుణ్ణి పరీక్షించకూడదు (నిర్గమ 17:2; ద్వితీ 6:16; కీర్తన 78:18, 41, 56; 106:14; 1 కొరింతు 10:9). దేవుడిక్కడ మాట్లాడుతున్నది వేరే రకమైన పరీక్ష. తన వాగ్దానాలను నమ్మి, లోబడి ఫలితాలు ఎలా ఉంటాయో చూడమని ఇస్రాయేల్‌తో అంటున్నాడు ఆయన మనందరికీ కూడా ఇలాంటి వాగ్దానమే ఇచ్చాడు – లూకా 6:38. నమ్మిక కలిగి, విధేయులై ధారాళంగా ఇచ్చేవారిని దీవించడమంటే దేవునికి ఎంతో ఇష్టం. మనలో ఇలాంటి లక్షణాలేవీ లేకపోతే ఆయన దీవెనలను మనం ఆశించరాదు.

6.) దేవుని యందు నమ్మికయుంచువారిని ఆశీర్వదించును (నీవు వారిని రక్షించితివి)

 (కీర్తనల గ్రంథము) 22:4

4.మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.

7.) యదార్థవంతుల వంశం ఆశీర్వదింపబడును.

 (కీర్తనల గ్రంథము) 112:2

2.వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు

8.) న్యాయముగా తీర్పు తీర్చువానికి ఆశీర్వాదం వచ్చును.

 (సామెతలు) 24:25

25.న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

9.) విశ్వాస సంబంధులు ఆశీర్వదింపబడును.

 (గలతీయులకు) 3:9

9.కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

3:9 మత నియమాలు, ఆచారాలు పాటించడం ద్వారా, దేవుడిచ్చాడని వారు భావించే శాసనాలకు లోబడి జీవించడానికి ప్రయత్నించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చునని అంతటా మనుషులు అనుకుంటారు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చునని యూదుల గట్టి నమ్మకం. అవి నమ్మకం ద్వారానే గాని స్వప్రయత్నాల మూలంగా రావని పౌలు చెప్తున్నాడు. దీవెనలు, ధన్యత గురించి నోట్స్ ఆది 12:1-3; సంఖ్యా 6:23-27; ద్వితీ 28:3-14; కీర్తన 1:1; 119:1; మత్తయి 5:3-12; అపొ కా 3:26; ఎఫెసు 1:3.

Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu Pastors Messages Telugu


ప్రత్యక్ష గుడారం subjcet కొరకు.. click  here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted