ఏడుకొండలు – Pastors Messages In Telugu Pdf

Written by biblesamacharam.com

Published on:

ఏడుకొండలు

Pastors Messages In Telugu Pdf

ఏడు కొండలూ అంటే తిరుపతిలోని ఏడుకొండలు అనుకోకండి. అవి బైబిలులోని ఏడుకొండలూ! కొండ మనకు గొప్ప అండ. ఎండ (శ్రమలు) వస్తే, కొండయే మన నీడగా మారుతోంది!

1.) మోరియా కొండ.

 (ఆదికాండము) 22:2

2.అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

22:2 “ఒకే ఒక కొడుకు”– ఇష్మాయేల్ దాసికి పుట్టిన కొడుకు. అబ్రాహాముకూ అతని భార్యకూ పుట్టిన ఏకైక సంతానం ఇస్సాకు. దేవుని ఒడంబడిక, ప్రమాణాలకు సంబంధించిన ఒకే ఒక కొడుకు. బైబిల్లోని ఏకైక నిజ దేవుడు ఇతర దేవుళ్ళకు నరబలి చేయకూడదన్నాడు (లేవీ 18:21; ద్వితీ 18:9-10; 2 రాజులు 17:17). ఎందుకంటే ఇతర దేవుళ్ళు దేవుళ్ళే కాదు. వాళ్ళకు ఏదైనా అర్పించడం, ఎవరికైనా సరే, తగదు. సాటి మనుషుల్ని బలి ఇవ్వడం అంతకన్నా హీనం. భూమిపై ఉన్నవన్నీ, మనుషులందరూ సృష్టికర్త అయిన దేవునికి చెందినవారు (యెహె 18:4), అంతేగాక ఆయన విమోచించినవారు రెండింతలు ఆయన సొత్తు (1:27; కీర్తన 50:10; యెషయా 42:5; యెహె 18:4; నిర్గమ 13:1-2; 19:5; లేవీ 20:26; 1 కొరింతు 6:19-20).

మనుషులంతా దేవుని ఆస్తి గనుక వారితో ఏం చెయ్యడం ఆయనకిష్టమైతే అలా చెయ్యవచ్చు. కావలిస్తే తనకు వారిని హోమబలిగా అర్పించమని కూడా అడిగే హక్కు ఆయనకు ఉంది. ఇస్సాకును అర్పించమని అబ్రాహాముకు చెప్పడం ఇలాంటిదే. దేవుడు న్యాయవంతుడు, పవిత్రుడైన దేవుడని గుర్తుంచుకోండి. తప్పు పని చెయ్యమని అబ్రాహామును ఎన్నటికీ కోరడు (యాకోబు 1:13). నిజానికి వేరొక మనిషిని బలిగా ఇమ్మని ఒక మనిషిని దేవుడు అడగడం బైబిలంతటిలో ఇక్కడ ఒక్క సారే.

ఇందులో దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నట్టు చూడవచ్చు. అబ్రాహాము భక్తి, నిష్ఠ, నమ్మకాలను పరీక్షించాలని; రెండవది లోక పాపాలకోసం తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక గుర్తును చూపడం. ఇది అబ్రాహాముకు పరీక్ష: ఇస్సాకు అబ్రాహాముకు ఏకైక కుమారుడనీ, అతడి వారసుడనీ, దేవుని ఒడంబడిక అతని మూలంగా స్థిరపడుతుందనీ దేవుడు అబ్రాహాముతో చెప్పాడు (15:4; 17:16, 19; 21:12; 22:2). దేవుని మాటకే వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్న దేవుని ఆజ్ఞ ఎదురైతే అబ్రాహాము దేవుని మాటపై ఇంకా నమ్మకం నిలుపుకుంటాడా? దేవుడు ఎలాంటి తప్పిదం చెయ్యడనీ, తన మాటను మీరడనీ నమ్ముతాడా? అబ్రాహాము ఈ పరీక్షకు నిలిచాడు. దేవుడు తననొక పని చెయ్యమన్నాడంటే దాని వెనుక సరైన కారణం తప్పక ఉంటుందనీ, దేవుడు ఏదో ఒక విధంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనీ నమ్మాడు (రోమ్ 4:21). ఇస్సాకును హతం చెయ్యవలసి వచ్చినా, దేవుడు తన మాటను నిలబెట్టుకునేందుకు అతణ్ణి తిరిగి బ్రతికిస్తాడని నమ్మాడు (హీబ్రూ 11:17-19).

ఇదంతా దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఏమి చేశాడో దానికి దృష్టాంతం. ఇస్సాకులాగే యేసు కూడా తండ్రికి ఏకైక కుమారుడు (యోహాను 3:16). ఆయన ఈ లోకానికి వారసుడు (హీబ్రూ 1:2). దేవుడు తన కొత్త ఒడంబడికను ఆయన ద్వారా చేశాడు (హీబ్రూ 9:15). అబ్రాహాముకు మాట ఇచ్చి లోకమంతటికీ దీవెనలు కలుగుతాయని చెప్పినది నెరవేరేది యేసు మూలంగానే (అపొ కా 3:26; గలతీ 3:14; ఎఫెసు 1:3). దేవుడు మానవ జాతిని ప్రేమిస్తూ పాపుల కోసం ఆయన్ను బలి చేశాడు (రోమ్ 5:8; హీబ్రూ 9:28; 1 పేతురు 3:18; 1 యోహాను 4:9). తరువాత తన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు ఆయన యేసును మళ్ళీ బతికించాడు (అపొ కా 2:24, 32-36; 1 కొరింతు 15:3-4). దేవుడు ఇస్సాకును “మోరియా ప్రదేశానికి” తీసుకువెళ్ళమని అబ్రాహాముతో చెప్పాడు. జెరుసలం ఉన్నది ఈ ప్రదేశంలోనే (2 దిన 3:1). యేసుక్రీస్తు సిలువ మరణం చెంది తిరిగి సజీవంగా లేచినది జెరుసలంలోనే గదా.

  • (ఇది దర్శనపు కొండ! దేవుడు అబ్రాహాముకు దర్శనమిచ్చిన స్థలం. ఇక్కడే దావీదు బలిపీఠం కట్టాడు. ఇక్కడే సొలొమోను మందిరం నిర్మించాడు. ఇది దైవ ప్రత్యక్షతా స్థలం! నీ జీవితంలో ప్రత్యక్షతానుభవం ఉందా?)

2.) సీనాయి కొండ.

 (నిర్గమకాండము) 31:18

18.మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.

31:18 A నిర్గమ 32:15-16; ద్వితీ 4:13; 5:22; B నిర్గమ 8:19; 24:12; 2 కొరింతు 3:3; C నిర్గమ 34:28-29; ద్వితీ 9:9-11; లూకా 11:20; D నిర్గమ 24:18; 34:1-4; యిర్మీయా 31:33; మత్తయి 12:28; 2 కొరింతు 3:7-8

  • (ఇది దేవుడు మోషేతో మాటలాడిన కొండ! మీ జీవితంలో దేవుడు మాటలాడు అనుభవమున్నదా?)

3. అరారాతు కొండ.

 (ఆదికాండము) 8:4

4.ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.

8:4 టర్కీ దేశం ఈశాన్య ప్రాంతాన ఉన్న పర్వత పంక్తి అరారాత్. ఈ పంక్తిలో అన్నిటికంటే ఎత్తయిన శిఖరం నిడివి దాదాపు 4,300 మీటర్లు.

  • (ఇది రక్షణ కొండ! ఈ కొండ మీదనే నోవహు కుటుంబ సభ్యులు – 8 మంది రక్షణ పొందారు. మీ కుటుంబం అంతయూ రక్షణ పొందినదా?)

4.) కర్మెలు కొండ.

 (మొదటి రాజులు) 18:19,20,21

19.అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.

20.అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను.

21.ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి-యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.

18:21 నిర్గమ 32:26; యెహో 24:15; 2 రాజులు 17:41; మత్తయి 6:24. ఏది సత్యమో, తాము దేన్ని అనుసరించాలో మనుషులు నిర్ణయించుకోవాలి. జీవితం గురించి అన్ని రకాల దృక్పథాలనూ అభిప్రాయాలనూ అంగీకరించడం అనేది విశాల హృదయంగాను, సహనంగాను అనేకమంది ఎంచుతారు. కొందరు మతాలన్నీ మంచివే, దేవుళ్ళంతా ఒక్కటే అంటారు. ఏలీయాకూ, బైబిల్లోని ఏకైక నిజ సజీవ దేవునికీ ఇది పనికి రాదు. బయల్‌ను పూజించడమంటే నిజ దేవుణ్ణి తిరస్కరించడమే. నిజ దేవుణ్ణి అనుసరించడమంటే బయల్‌ను నెట్టివేయడమే. ఈ రెంటినీ ఆచరించాలన్న ఇస్రాయేల్‌వారి ప్రయత్నం వ్యర్థం. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించదలచు కుంటారో వారు ఇతర దేవుళ్ళందరినీ తిరస్కరించ వలసిందే. యెహో 24:14-15; 2 రాజులు 17:32-33; యెషయా 42:8 కూడా చూడండి.

  • (రెండు తలంపుల మధ్య తడబడిన ఇశ్రాయేలీయులూ, కర్మెలు కొండ దగ్గర ఏలీయాచే, యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. “బయలు” దేవుడు కాదని అర్థమైపోయింది. ఇది “తడబాటు” తొలగించే కొండ!)

5.) హెర్మోను కొండ.

 (కీర్తనల గ్రంథము) 133:3

3.సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

  • (ఇది ఆశీర్వాదపు కొండ! బైబిల్లో హెర్మోను మంచు అని ఉంది. మంచు ఆశీర్వాదమునకు సూచన. పరలోక సంబంధమైన ప్రతీ ఆశీర్వాదం క్రీస్తులో మనకు ఉన్నది)

6.) ఒలీవల కొండ.

 (మార్కు సువార్త) 14:26,32,33,34,35,36

26.అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.

32.వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన-నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి

33.పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరంభించెను

34.అప్పుడాయననా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి

35.కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు

36.నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.

  • (ఇది ప్రార్థన కొండ! శిలువకు ముందు ఆయన ఇక్కడే ప్రార్థించాడు. శ్రమలలో నీవు సోలిపోకుండా ప్రార్థనలో ముందుగానే సిద్ధపడాలి!)

7. కల్వరి కొండ.

 (మత్తయి సువార్త) 27:33

33.వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి

  • (ఇది విమోచన కొండ! ఈ కొండ దగ్గరకు వస్తే పాపములు యేసు రక్తంలో కడుగబడి విమోచింపబడ్డాయి! నీవు విమోచన పొందావా? అనగా, రక్షణ పొందావా?)

దావీదు – నేను కొండల తట్టు నా కన్నులెత్తెదను అన్నాడు. నీవును కొండల తట్టు కన్నులెత్తెదవా? నీకు సహాయం అక్కన్నించే వస్తుంది! 121 కీర్తన చదువుము.

Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf  Pastors Messages In Telugu Pdf


66  పుస్తకాల వివరణ కొరకు.. click here 

Leave a comment