పండిత రమాభాయి.
Pandit Ramabai Telugu
పండిత రమాభాయి సరస్వతి 1858 ఏప్రిల్ 23 వ తేదీన కర్ణాటక రాష్ట్రములో ఒక నిష్ఠ గలిగిన బ్రాహ్మణ కుటుంబములో జన్మించెను. ఈమె తండ్రి పేరు అనంతశాస్త్రి. బాల్యం నుండియే రమాబాయి తండ్రితో అనేక పుణ్య క్షేత్రములకు వెళ్ళుచుండెడిది. 12 సంవత్సరముల వయస్సులోనే 18,000 శ్లోకములు కంఠోపాఠంగా చెప్పగలిగినందున ఈమెకు కూడా పండితులు ‘పండిత’ అను బిరుదునిచ్చారు. ఈమె 6 సంవత్సరముల పరిధిలో తనకత్యంత ప్రియులైన అయిదుగురు వ్యక్తులను పోగొట్టుకొంది. కరువులో తల్లి, తండ్రి, సహోదరుడు మరణించారు. వివాహమైన 19 మాసాల్లోనే కలరాకు గురియై భర్త మరణించాడు. కన్నకుమార్తె కూడా మరణించింది.
ఆ సమయములో హిందూ మత గ్రంథ సారాంశము బాగుగా ఎరిగి యుండియు మనశ్శాంతి లేనిదై జీవితముపై విరక్తి చెందింది భారత దేశపు స్త్రీల అభ్యన్నతి కొరకు ఏదో చేయాలనే పట్టుదలతో రమాభాయి కొన్ని విద్యార్హతల్ని, సోదరీల ద్వారా క్రీస్తు ప్రేమ అనగా ఎట్టిదో చవి చూచి, భారత దేశపు స్త్రీల శిక్షణను పొందాలనే ఆశతో ఇంగ్లాండ్ వెళ్ళినది. అక్కడ చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ నిశ్చయించుకొని బాప్తిస్మము పొందెను. ఆలాగు ఆమె ఇంగ్లాండ్, అమెరికా దీనావస్థను క్రీస్తు ప్రభువే మార్చగలడని నమ్మి, యేసుని అడుగుజాడలలో నడవాలని దేశములు తిరిగి, మరల భారతదేశము చేరెను. అయితే ఆ తరువాత క్రీస్తు పాపశిక్షను ఆయన భరించెనని తెలుసుకొనెను. ఆయనయందలి విశ్వాసమును ప్రభువు సిలువలో బలియై తన స్థానమును తీసుకొనెనని, తనకు రావలసిన బట్టి క్రీస్తు రక్తముచేత శుద్దీకరించబడి పాపక్షమాపణ, రక్షణ నిశ్చయతలను పొంది శాంతి, సమాధానములు సంపాదించుకొని లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందెను. క్రైస్తవ మతాన్ని ఎరిగాను కాని, ఆ మతానికి జీవనాడియైన క్రీస్తును నేనిప్పుడే రుచి చూస్తున్నాను అనెను.
నెల్సన్ గ్రేగ్సన్ అను బోధకుడు “నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడి యున్నాను” అను విషయమును గూర్చి బొంబాయిలో చేసిన ప్రసంగము ఆమెను మొదట కదలించెను. పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆమెకు కలిగెను. “యేసుక్రీస్తు మూలముగా రక్షించబడితిని” అనుటకు ఎలాంటి సందేహము లేదని ఆమె చెప్పెను.
తన రక్షణ సాక్ష్యము ద్వారా ప్రారంభములోనే 15 మంది ఆత్మీయ పిల్లలను పొందెను. ఒకనాడు ఉదయ కాలము ప్రార్థించుచుండగా పరిశుద్ధా త్మావేశం వలన 125 మందికి రక్షణాశ్రయం ఇవ్వవలసినదిగా ప్రభువుచే ప్రేరేపించ బడినది. ఆమె దేవుని యొద్ద ప్రార్థించి, ఆయన యొద్దనుండి వాగ్దానములను పొందు చుండెడిది. ఈమె జార్జిముల్లర్ స్థాపించిన అనాథ ఆశ్రమములను, దేవుని మీద విశ్వాసముతో చేయుచున్న ఆయన సేవను చూచి “శక్తిచేతనైనను, బలముచేతనైనను గాక, నా ఆత్మచేతనే ఇది జరుగును” అను మాటలయందు విశ్వాసముంచి 1889 లో విధవరాండ్రకు, జీవితంలో కాలుజారి దగాపడిన స్త్రీల కొరకు ‘శారదా సదన్’ను స్థాపించెను. పూనా దగ్గరలో ఉన్న కెడ్గామ్ అనే ప్రాంతములో అంధులకు, అనాథలకు, విధవరాండ్రకు, పతనమైన స్త్రీలకు సువార్తను బోధిస్తూ, విద్య నేర్పించి వారికొక ఉపాధి కల్పిస్తూ “ముక్తిమిషన్” స్థాపించి వారిని శారీరకముగానే కాక, ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తూ రక్షణలోనికి నడిపించెను. సామాజికంగా త్రోసివేయబడిన పతితలైన స్త్రీలకు తల్లిగా, స్నేహితురాలిగా, గురువుగా ఉంటూ; వారిని ఆదరిస్తూ, సలహాలిస్తూ మంచి శిక్షణను, ఆధ్యాత్మిక బోధను యిచ్చుచుండెను. ఆమె ప్రేమను, సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో క్రీస్తును చూడగలిగిరి. పండిత రమాబాయి ఎద్దుల బండిలో పరిసర గ్రామాలకు వెళ్ళుచు, అనేకులకు క్రీస్తు సందేశాన్ని యివ్వటమే గాక; పేదలను ఆదరించి, పరామర్శించేది!
హిందూ దేవాలయములలో దేవదాసీలుగా మగ్గిపోతున్న వారిని విడిపించి, చేరదీసి, ఆదరించేది! అట్టివారికి చేతి పనులను నేర్పి, వారిని వారే పోషించు కొనునట్లు చేసేది! అట్టివారిలో అనేకులు నర్సులుగా, టీచర్లుగా, గృహిణులుగా మారి సమాజములో గౌరవనీయమైన జీవితములు గడుపునట్లు చేసెడిది! విరామము లేకుండా ఆయా సభలలో వాక్యోపదేశము చేస్తూ, రాత్రింబగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతూ ప్రభువు కొరకు ఎంత చేసినా చాలదు అంటుండేది! ఆమెకు ఒక బైబిలు, కొన్ని వస్త్రములు తప్ప మరేమియు లేవు. అయినను ప్రభువు ఐశ్వర్యవంతుడని, ఆయన ధనాగారము సదా నిండియుండునని, తన బిడ్డలకు అవసరమైన వాటినన్నింటిని ఆయన పంపగలడని విశ్వసించి విశ్వాసముతో జయము పొందెను.
ఈమె భాషాంతరీక వీరులలో ప్రథమ స్త్రీ. ఈమె చేసిన గొప్ప పని బైబిలు గ్రంథమును మరాఠి భాషలోనికి తర్జుమా చేయుట! దానికై దాదాపు తన జీవిత కాలమంతయు ఖర్చు పెట్టెను. ఇందుకై హెబ్రీ, గ్రీకు భాషలను నేర్చుకొనెను. ప్రతి దినం ఉదయం 4 గంటల కంటే ముందుగా లేచి ధ్యానము, ప్రార్ధన, తర్జుమా మున్నగు కార్యముల యందు మునిగి యుండెడిది. ఈమె శక్తి సామర్థ్యములకు రహస్యము వాక్యధ్యానము, ప్రార్థనలే! ఆశ్రమములో ఉన్నవారికి క్రీస్తును గూర్చి ప్రకటింపక మునుపు వారికొరకు మహావేదనతో ప్రార్ధన చేయు చుండెడిది. ఈమె కల్వరి ప్రేమతో నిండి యుండెడిది. ఒకసారి ఈమె చేసిన శక్తిగల ప్రసంగమును బట్టి విక్టోరియారాణి కదలింపబడెను.
ఈమె ఆశ్రమములో 300 మందిని పోషించు భారము 1500 మందికి పెరిగెను. వీరందరికి భోజన, వస్త్రపానాదులను ఏర్పాటు చేయుటయే కాక వారిని క్రీస్తు కొరకు తర్ఫీదు చేయుచుండెను. రమాభాయి విశ్వాసము విషయంలో పలు విధములుగా పరీక్షింపబడెను. క్రీస్తుకొరకు శ్రమననుభవించి, విశ్వాసముతో జయించి, చివరిగా 1922 ఏప్రిల్లో తన 64వ యేట పండిత రమాబాయి ప్రభువు నొద్దకు వెళ్ళిపోయినది.
రమాభాయి మనస్సు, దృష్టి మనుష్యుల మీదను, మిషనెరీల మీదను కాక; ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉండుటవలన ఈమె తాను స్థాపించిన రక్షణాశ్రమమును దిగ్విజయముగా కొనసాగించెను. ఇప్పటికి 82 సంవత్సరముల క్రిందట ఈమె లోకమును విడిచినను, ఈమె స్థాపించిన ఆశ్రమం ఇంకనూ అనేకమందికి ఆశ్రయ స్థానముగా నున్నది. ఆమె మరాఠీ భాషలో వ్రాసిన అనేక క్రైస్తవ భక్తి గీతాలు ఈనాటికీ వాడుకలో ఉన్నవి. ఆమెలో ఉండిన ప్రేమ, భారము, విజ్ఞాపన, ప్రార్థన, వేదన నేడు మనకు మాదిరిగాయున్నవి. మనము కూడా విశ్వాసంతో క్రీస్తు కొరకు గొప్ప కార్యములు చేయుదమా?
All Pdf…. Download