బైబిల్ వెలుగులో పరిణామ సిద్ధాంతం
Human Evaluation Theory Telugu Bible
“పరిణామ సిద్ధాంతా”న్ని గూర్చి దాదాపుగా తెలియని వ్యక్తులు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో! ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది – చార్లెస్ డార్విన్!
ఈ పరిణామ సిద్ధాంతమును “Theory of Evolution” అంటారు. మనిషి అనేక దశలగుండా మార్పు చెందుతూ ఈ “రూపానికి” వచ్చాడు అని చెబుతారు. “పురాతన కాలములోనున్న జీవులు క్రమమైన మార్పులు చెంది నేటికి ఉన్నత ప్రాణులుగా ఏర్పడ్డాయి” అని చెప్పేదే – “పరిణామవాదము”
భూలోకంలో ఈ పరిణామ వాదము అనేకమందిచేత అంగీకరింపబడి, ఆమోదింపబడుతూ ఉంది. నాలుగు ముక్కలు సైన్స్ తెలిసిన ప్రతివాడునూ “దేవుని ఆస్తిక్యాన్ని” ప్రశ్నిస్తున్నాడు. మానవుడు ఫలాని ఫలాని జీవి నుంచి వచ్చాడని ఏదో ఏదో తమకు తోచింది చెబుతున్నారు.
వాస్తవానికి భూమ్మీద ఉన్న కోతుల్లో ఉరాంగ్, ఉటాంగ్, చింపాంజీ, హాంగ్కాంగ్, గొరిల్లా, కొండముచ్చు మరియు మామూలు కోతులూ ఎన్నో రకాలు ఉన్నాయి. కాని, ఏ జాతికి చెందిన కోతులూ ఆ జాతికి చెందిన పిల్లలనే పుట్టిస్తూ ఉన్నాయి. కనీసం తోకగల కోతులకైనా తోకలేని కోతులు జన్మించడం లేదు. నాడూ నేడూ మార్పు చెందుతూ ఉన్న తోక కప్పలూ, గొంగళి పురుగులుగా ఉండి గూడుకట్టుకుని సీతాకోక చిలుకలుగా మార్పు చెందడం… పురుగుగా నుండి తర్వాత తుమ్మెదగా మారేదాన్ని మనం ఎప్పట్నించో చూస్తూవున్నాం.
అయితే, బల్లి గుడ్డు నుంచి తొండపుట్టటం, బాతుగుడ్డు నుంచి కోడిపిల్ల పుట్టడం, గాడిదకు గుఱ్ఱం పిల్ల పుట్టటం, గేదెకు ఆవుదూడ పుట్టటం మనం ఎప్పుడైనా చూసామా? వేలాది సంవత్సరాల మానవ చరిత్రలో ఎక్కడనైన యీలాంటిది జరిగిందా? లేదు! ఆధారం లేదు!
శాస్త్రీయ పరిజ్ఞానం అంటే ఏమిటి? “శాస్త్రీయ పరిజ్ఞానం అంటే అది వాస్తవాల పరిశీలన” అంటూ నిర్వచించాడు ఓ సైంటిస్టు.
ఊహావలయాకారములో ఇరుక్కోవటము, చిక్కుకుపోవటమూ శాస్త్రీయ పరిజ్ఞానం కిందికి రాదు! ఊహావలయాకారమూ అని మేము ఎందుకంటున్నామంటే – పరిణామవాదము అచ్చు “ఊహాకల్పిత”మే! ఎందుకంటే …?
- పరిణామ వాదము ఆదిలో పదార్థం ఎలా వచ్చిందో వివరించలేకపోయింది.
- పరిణామమును గురించే తప్ప, అది – జీవము (చైతన్యము)ను గూర్చివివరించలేకపోయింది.
- మానవుని మెదడు యింతటి వున్నత స్థాయికి ఎలా ఎదిగిందోవివరించలేకపోయింది.
- పరిణామ వాదం తప్పు అనిపించేలా, ప్రకృతిలో కొన్ని ఉదాహరణలుఉన్నవి.
- పరిణామవాదాన్ని ఋజువు చేసే కొన్ని “లింకులు” పరిణామవాదులకు యింకా లభ్యం కాలేదు.
- ప్రకృతిలో కొన్ని పరాన్న జీవులు కన్పిస్తూనే ఉన్నాయి.
- ఆదిమ జన్యుపదార్థమును గురించి వివరించలేకపోవటం
- ముఖ్యంగా – పరిణామవాద సిద్ధాంతం శాస్త్రీయ నిదర్శనములతో యింకా ఋజువు చేయబడలేదు.
- పరిణామవాదాన్ని నిక్కచ్చిగా నిరూపించటం సాధ్యం కాలేక పోయింది.
- వైరుధ్యాలకు అవకాశం కల్పిస్తూ, సహేతుకంగా కనిపించక పోవటమును బట్టి ఈ “ఎవల్యూషన్ థీరి” ఊహాజనితమేనని చెప్పుకోవచ్చు.
రెండువందల మిలియన్ల సంవత్సరాల క్రితం జీవి పుట్టినట్టు డార్విన్ ఊహిస్తే … ఆయన కుమారుడు యాభై ఏడు మిలియన్ల సంవత్సరాల క్రితం జీవి జన్మించిందని రాశాడు. అంతా ఊహజనితమే!
పరిణామవాదమే నిజమైతే, జీవం (చైతన్యం) కాకతాళీయంగా, ఆకస్మికంగా కాలగతిలో ఏర్పడి ఉండాలి.
“హేతువాదం” అనే మాసపత్రికలో శ్రీ రావిపూడి వెంకటాద్రి గారు యిలా రాశారు – “కొన్ని వందల యేళ్లు, కొన్ని వేలమంది శాస్త్రజ్ఞులచేత అప్రశ్నితంగా ఆమోదింపబడుతూ వచ్చిన సిద్ధాంతాలూ ఒక్క శాస్త్రజ్ఞుడి ప్రశ్నకు తట్టుకోలేక తలక్రిందులైన సందర్భాలు ఎన్నో వున్నాయి. అందువల్ల శాస్త్రం మారుతూ వుంటుందని అర్థమవుతుంది. సత్యం దాని ఔచిత్యానికి గీటురాయి … సైన్స్ లక్ష్యము సత్యమే” అన్నారు. సత్యాన్వేషకులందరు హర్షించదగిన మాట వారు చెప్పారు.
“పరిణామవాదము”ను గూర్చి కొందరు శాస్త్రజ్ఞులు ఏమన్నారో వినండి ….
- భూగర్భ శాస్త్రవేత్తయయిన ప్రొఫెసర్. జార్జ్ మెక్డీ గారు – “పరిణామవాదము ఒక బలప్రదమైన మూఢనమ్మకము. ఆధారములు లేనప్పుడు కూడా నమ్ముటే మూఢనమ్మకమనబడుచున్నది. పరిణామవాద సిద్ధాంతమంతయు వట్టిగాలి” అన్నాడు.
- కెనడా భూగర్భ శాస్త్రజ్ఞుడు సర్. విలియం డాసన్ గారు – “మానవోత్పత్తిని గురించిన ఈ సిద్ధాంతము కేవలం యొక మితవాదమూ! దానికి ఋజువు శూన్యం” అని అన్నాడు.
- భౌతిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత శ్రీ రాబర్టు మిల్లిడన్ గారు యీలాగు అన్నాడు.“పాపం, మన శాస్త్రవేత్తలు పరిణామ సిద్ధాంతమును ఋజువు చేయుటకై అవస్థలు పడుచున్నారు. కాని, అది ఎప్పటికినీ సాధ్యము కాదు” అని పరిణామవాదాన్ని కొట్టిపారేసాడు.
- ఎర్రింగర్ పట్టణ జంతు శాస్త్రవేత్త డాక్టర్. ప్లైజ్చామన్ చెప్పిందేమంటే – “డార్విన్ సిద్ధాంతమును బలపర్చుటకు ప్రకృతిలో ఆధారమొకటైననూ లేదు. ఇది విజ్ఞానశాస్త్ర ఫలితమునూ కాదు. కాని, వాస్తవముగా ఊహాఫలితమే” నంటూ మానవుడు అణువునుంచి పరిణామము చెందెను అనెడి డార్విన్ వితండవాదమును ఖండించాడు.
- అమెరికా నేషనల్ వస్తు ప్రదర్శనశాల జీవశాస్త్రవేత్తయు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ క్లార్ గారు – “చార్లెస్ డార్విన్, లా మార్కుల పరిణామవాద సిద్ధాంతాలు శుద్ధ తప్పు” అన్నాడు.
- డాక్టర్ ఐన్స్టీన్ బ్రిటిష్ మ్యూజియమ్ అణువిచ్ఛేదన కర్త యిలా అన్నాడు – “పరిణామవాది చెప్పే పది మాటల్లో తొమ్మిది మాటలు కేవలం బుద్ధిహీనమైనవి. వారు చెప్పేదాన్ని వట్టి బూటకమని ఈ మ్యూజియమ్ చూపగలం” అన్నాడు.
- విలియం జెన్నింగ్స్ గారు అమెరికా దేశంలో డార్విన్ పరిణామ వాద సిద్ధాంత మూలసూత్రాలను తిరస్కరించి, దేవుని గ్రంథంలోని మాటలను ప్రబోధించి, లక్షలాది యువకులలో సత్యచైతన్యాన్ని కలుగజేసాడు. 20 సంవత్సరాల పాటూ అనేక కళాశాలలను దర్శించి విద్యార్థులకు డార్విన్ పరిణామ వాదంలోనున్న తప్పులను విశదపరచి, వేలాది మందిని సత్యంలోకి తరలించాడు. విద్యార్థులు డార్విన్ తత్వాన్ని అర్థం చేసుకుని, తమ మనస్సు మార్చుకుని ఆయన్ని అభినందించారు.
క్రీ.శ. 1920 వ సంవత్సరం జనవరిలో – “కింగ్స్ బిజినెస్” పత్రిక సంపాదకుడు – “కీత్ బ్రూక్స్” గారు డార్విన్ తన అంత్యదశలో ఆఖరి మాటలు” అనే శీర్షికపై కొన్ని రహస్యాలు ప్రచురించాడు. డార్విన్ తన జీవితాంత దశలో నిత్యజీవాన్ని (రక్షణ) పొందవలసిన అవసరతను గుర్తించి – “నేను ఏదో నాకు తోచిన సూత్రాలనూ (సృష్టికి సంబంధించినవి), భావాలనూ ప్రచురిస్తే, ప్రజలు వాటిని సిద్ధాంతాలుగా చేసుకున్నారు. ప్రజల్ని పోగుచేసి, యేసుక్రీస్తును గూర్చి వారికి బోధించండి” అని తెలియజేసాడు.
- అసలు, ఎవరీ డార్విన్? అనే ప్రశ్న మనకు కలుగక మానదు.
చార్లెస్ డార్విన్ క్రైస్తవ విశ్వాసంలో చాలా నిష్ఠగలవాడు. దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగి, యేసుక్రీస్తు యొక్క సేవకుడు (Pas- tor) కాగోరి కేంబ్రిడ్జి వేదాంత కళాశాలలో 3 సంవత్సరములు వేదాంత విద్యను అభ్యసించాడు.
అయితే, సరైన టీచింగ్ లేక, పరిణామ సిద్ధాంతము వైపు మొగ్గుచూపి, దానియందే నమ్మిక అధికమయ్యి, క్రైస్తవ్యమును గూర్చిన నమ్మిక క్రమేణా తగ్గిపోవనారంభించింది.
అతని వృద్ధాప్యమందు, అతని యొక్క ఆఖరి దినములలో “లేడిహోప్” అనే నర్సు ఆయనకు పరిచారము చేసింది. ఆమె చెప్పిన మాటలు … ఆమె నోటి మాటలతోనే…
చార్లెస్ డార్విన్ గారిని పరామర్శించమని నన్ను కోరిరి. ఆయనను నేను కల్సుకొనిన సమయంలో తన చేతిలో ఎప్పుడూ తను చదువుచున్న బైబిలు ఉన్నది. ఆయనకు తల దిండ్లు దన్నుగ పెట్టిరి.
“ఏమి చదువుతున్నారు?” అని అడిగితిని. అది “రాజగ్రంథమూ” అన్నారు. దుఃఖము ఆయన ముఖములో కనిపించింది. చేతులు వణకుతూ ఉన్నాయ్. వేదనతో ఆయన నాతో యీలాగు చెప్పారు “నేను యవ్వనస్థుడనైయుంటిని. నిర్ధిష్టమైన ఆలోచనలు లేకుండా ఉన్నాను. ప్రతి విషయమును గూర్చి ఆశ్చర్యపడుచూ సందేహాలూ అభిప్రాయాలూ వెలుబుచ్చితిని. ప్రజలు వాటిని వేగముగా స్వీకరించటం జరిగింది. అదే వేగముతో అవి విస్తరించటం నాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది” అని చెప్పి కొంత సేపు ఆగి – “వేసవి కాలములో విశ్రాంతి తీసికొను గృహం నాకు ఒకటి కలదు. అక్కడ మీరు మాట్లాడాలి. మీరు బైబిలు చదువుతారని నాకు తెలుసు. రేపు మధ్యాహ్నం పనివారూ, అద్దెకు ఉన్నవారూ, యిరుగు పొరుగు వారు సమావేశమవుతారు. వారితో మాట్లాడ్తారా?” అని అడిగాడు. అందుకు నేను – “ఏమి మాట్లాడాలి?” అని అడిగాను.
అప్పుడాయన – “యేసుక్రీస్తు గూర్చి, ఆయన ఇచ్చు రక్షణ గూర్చి” మాట్లాడాలి అన్నారు. “అది, వారికి చాలా మంచిదిగదా! వారితో కలిసి కొన్ని కీర్తనలు కూడ పాడండి” అని నాతో అన్నారు.
అప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. ఆ ముఖ తేజస్సు మరువజాలను. యింకా ఆయన నాతో మాట్లాడుచూ “మీరు మధ్యాహ్నము మూడు గంటలకు జరిపే మీటింగును ఈ కిటికీ ద్వారా వీక్షిస్తూ మీరు పాడే పాటలలో పాలుపొందుతాను” అంటూ ముగించాడు.
ఎట్టకేలకు డార్విన్ “బైబిలు సృష్టి కథనము”ను అంగీకరించాడు. ఈ విషయం ఎంత మందికి తెలుసు? చరిత్రనూ ఆధారాలను పరిశోధిస్తే విషయం అవగతం అవుతుంది.
రైట్!!
ప్రియులారా! పరిణామవాదము రాంగ్ ! బైబిలు సృష్టి కథనమే
నిజమైన హేతువాదం తుట్టతుదకు దేవుని వద్దకు నడిపిస్తుంది! దేవుడు అన్నమాటే వద్దు అనుకుంటే కోతిదగ్గరకు తీసుకెళ్తుంది!! ఇంతకు మనం నమ్మేది హేతువాదమా? కోతివాదమా??
All Pdf……Download