మీ పెదవులు ఎట్లున్నవి.
1.) ఉత్సహించు పెదవులు.
(కీర్తనల గ్రంథము) 63:5
5.క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
63:5 A కీర్తన 36:7-9; B కీర్తన 65:4; 104:34; C ఎజ్రా 3:11-13; కీర్తన 17:15; 43:4; 71:23; 118:14-15; 135:3; 149:1-3; పరమగీతం 1:4; యెషయా 25:6; ప్రకటన 19:5-7; D యిర్మీయా 31:4
2.) ఇచ్చకములాడు పెదవులు.
(కీర్తనల గ్రంథము) 12:2,3,4
2.అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
12:2 A కీర్తన 10:7; 41:6; యిర్మీయా 9:8; రోమ్ 16:18; B కీర్తన 5:9; 28:3; 144:8; యాకోబు 1:8; C కీర్తన 52:1-4; 55:21; 59:12; 62:4; 144:11; సామెత 20:19; 29:5; యిర్మీయా 9:2-6; యెహె 12:24; 1 తెస్స 2:5; D 1 దిన 12:33; కీర్తన 36:3-4; 38:12
3.యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
12:3 A సామెత 18:21; B కీర్తన 17:10; దాని 7:8; ప్రకటన 13:5; C నిర్గమ 15:9; 1 సమూ 2:3; 17:43-44; 2 రాజులు 19:23-24; కీర్తన 73:8-9; యెహె 28:2, 9; 29:3; దాని 4:30-31; 7:25; మలాకీ 3:13; 2 పేతురు 2:18; D యోబు 32:22; యెషయా 10:10; యూదా 16
4.మా నాలుకలచేత మేము సాధించెదము మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు.
12:4 “మాకు యజమాని ఎవడు?”– ఈ విధంగా తమ మీద దేవుని ప్రభుత్వాన్నీ పరిపాలననూ తృణీకరించడమే వారి చెడు ప్రవర్తనకు మూలం. దేవుని పాలనకు తల ఒగ్గనివారు సైతాను, పాపం వశంలో ఉంటారు (యోహాను 8:34; ఎఫెసు 2:2; 2 పేతురు 2:10, 19). వారు తమ సృష్టికర్తను పట్టించుకోలేదు. మా పెదవులు మావే అన్నారు. నిజం చెప్పాలంటే మన స్వంతం అనేది ఏదీ లేదు. మనం దేవుని సొత్తు, ఆయన సృష్టించిన జీవులం.
3.) నీతిమంతుని పెదవులు.
(సామెతలు) 10:32
32.నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
10:32 A సామెత 2:12; 11:11; 12:6, 18; 15:28; 18:6-8; B సామెత 15:2; ప్రసంగి 12:10; C ప్రసంగి 10:12; దాని 4:27; తీతు 2:8
4.) కపటమైన పెదవులు.
(సామెతలు) 17:1
1.రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
5.) అబద్దమాడు పెదవులు.
(సామెతలు) 12:22
22.అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
12:22 “అసహ్యం”– 6:16-17. సత్యస్వరూపి అయిన దేవుడు అబద్ధాలకంటే ఎక్కువగా దేన్నీ ద్వేషించడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మీ హృదయ పలకపై రాసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ అంతరంగంలో సత్యాన్ని నాటుకోండి (కీర్తన 51:6). హృదయ పూర్వకంగా సత్యాన్ని పలకండి (కీర్తన 15:2; ఎఫెసు 4:15).
6.) జ్ఞానుల పెదవులు.
(సామెతలు) 15:7
7.జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
15:7 A మత్తయి 12:34; B కీర్తన 37:30; 45:2; 51:13-15; 71:15-18; 78:2-6; 119:13; సామెత 10:20-21; ప్రసంగి 12:9-10; పరమగీతం 4:11; మత్తయి 10:27; 28:18-20; మార్కు 16:15; అపొ కా 18:9-10; రోమ్ 10:14-17; 15:18-21; ఎఫెసు 4:29; 2 తిమోతి 2:2; యాకోబు 3:6
7.) నీతి గల పెదవులు.
(సామెతలు) 16:13
13.నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.
8.) బుద్ధిహీనుని పెదవులు.
(సామెతలు) 18:6
6.బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
(సామెతలు) 19:1
1.బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.
19:1 28:6; 16:8; 15:16. మచ్చ లేని ప్రవర్తనకు శాశ్వతమైన ప్రతిఫలం ఉంటుంది. ఈ లోకానికి చెందిన ప్రతిదీ తాత్కాలికమే.
9.) తెలివినుచ్చరించు పెదవులు.
(సామెతలు) 20:15
15.బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.
20:15 A సామెత 3:15; 16:24; 25:12; B యోబు 28:12-19; సామెత 8:11; 10:20-21; 15:7, 23; 16:16, 21; ప్రసంగి 12:9-11; రోమ్ 10:14-15; ఎఫెసు 4:29
10.) యదార్థమైన మాటలు పలుకు పెదవులు.
(సామెతలు) 23:16
16.నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
All Pdf……….Download