ఫ్లోరెన్స్ నైటింగేల్ | జీవిత చరిత్ర | Florence Nightingale | Missionary Life History

Written by biblesamacharam.com

Published on:

ఫ్లోరెన్స్ నైటింగేల్ (1820-1910) 

Florence Nightingale

 “ద లేడీ విత్ ద లేంప్” అని పేరొందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సభ్యత గల యువతి, సంపన్న మహిళ! విక్టోరియా మహారాణి వలన ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పథకాన్ని పొందిన ఏకైక స్త్రీ! 1820లో ఇంగ్లాండ్ దేశములోని ఫ్లోరెన్స్ పట్టణములో విలియం నైటింగేల్, ఫాన్ని స్మిత్ దంపతులకు జన్మించెను. 

 పదహారేళ్ళ వయస్సులో జాకబ్ అబ్బట్ గారు రచించిన “ది కార్నర్ స్టోన్” అనే పుస్తకం ద్వారా తాను నూతన జన్మ అనుభవమును పొందెను. తన వయస్సులోని యువతులు చిత్రలేఖనం, నవలా రచన, సంగీతం లాంటి కళలను సాధకం చేస్తూ ఉంటే; ఈమె దృష్టి రోగులను పరామర్శించుటలో లీనమైయుండేది!  Florence Nightingale

 ఆ కాలంలో ‘నర్స్’ వృత్తి అతినీచం! చిల్లరగా తిరిగే స్త్రీలు, త్రాగుబోతులు, ఏ ‘ వృత్తికిని అర్హులు కానివారు నర్స్ వృత్తిలో చేరేవారు! వారు రోగుల పట్ల ఏ మాత్రం దయా కనికరములు చూపేవారు కాదు. అశుభ్రతతో, చీకటితో కూడిన గదులలో వ్యాధిగ్రస్థుల నుంచినప్పుడు; ఆ అశుభ్రత ద్వారా అనేకులు మరణించేవారు! 

 ఇటువంటివారి సేవను ఒక సంపన్న యువతి, సభ్యత గల మహిళ చేపట్టడం సమాజాన్ని, సాంప్రదాయాన్ని ధిక్కరించడమే అవుతుంది! గాని అచంచలమైన దీక్షతో, మూర్తీభవించిన సేవా దృష్టితో క్రమబద్ధమైన తన ప్రవర్తనతో నైటింగేల్ జయించగలిగినది! అవివాహితగా ఉండి, నర్స్ రోగుల పరిచర్యలో తన జీవితం గడపాలని ఉద్దేశించింది. కారణం, ఆమె క్రీస్తును నమ్మెను. గనుక క్రీస్తు ప్రేమ ఆమెను పరిచర్య చేయుటకు బలవంతము చేసెను. 

[quick_download_button title=”Download” color_bg=”#EB3913″ open_new_window=”true” wait=30 msg=”Please wait 30 seconds” url_external=”https://biblesamacharam.com/wp-content/uploads/2024/06/ఫ్లోరెన్స్-నైటింగేల్-1820-1910.pdf”]

 తాను రక్షించబడిన తరువాత 1937వ సంవత్సరములో ఫిబ్రవరి 7న “నన్ను సేవించుట కొరకు నిన్ను ఎన్నుకొంటిని” అన్న దేవుని పిలుపును తన ప్రార్థన ద్వారా తెలుసుకొనెను. ఆ రోజు నుండి తాను దేవుని సేవ చేయుట ప్రారంభించెను. 

 1854వ సంవత్సరమునందు క్రిమియన్ యుద్ధంలో సరియైన వైద్య పరిచర్య లేక టర్కీలోని స్కూటేరి సైనిక వైద్యశాలలో వేలాదిమంది బ్రిటిష్ సైనికులు మరణిస్తుండగా, ఆ క్షతగాత్రుల మధ్య పనిచేయుటకు బయలుదేరినది. అచట గాయపడిన వారిలో మూడవ వంతు, వారి గాయాలకు కట్లు లేవు. ఆ గాయములను ఎలుకలు కొరికిన కారణమున అవి విషపూరితమైనవి. 

 వ్యాధిగ్రస్థులకు చాలినంత ఆహారము లేదు, మంచినీళ్ళు లేవు. పాకీ దొడ్డికి, స్నానాల గదికి తేడాయే లేదు. వైద్యశాలలో ఉండవలసిన సామాగ్రి లేదు. నల్లులు, చీమలు, దోమలు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నవి. ఈలాటి పరిస్థితుల మధ్య ప్రశాంతమైన ఓర్పుతో, వెనుకంజ వేయని ధ్యేయముతో, ఎంతో ఆత్మస్థైర్యముతో ముందుకు సాగి; సైనికులకు సేవ చేస్తూ, గడ్డకట్టే చలిలో దేశం కొరకు ప్రాణాలర్పిస్తున్న సైనికుల అచంచల దీక్ష ముందు తన కష్టం ఎన్నదగినది కాదని; వారికి క్రీస్తు నామములో సేవ చేసిన ధన్యురాలు నైటింగేల్. Florence Nightingale

 1859వ సంవత్సరములో లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో  మొట్టమొదటి ‘స్కూల్ ఆఫ్ నర్సింగ్’ను స్థాపించెను. 

 ఈమె సేవ ద్వారా అంతకు ముందు 100కి 60 మంది మరణిస్తున్న వైద్యశాలలో 20 శాతం మంది మాత్రమే మరణించేవారు. ప్రేమ, దయ, కనికరం, ఓర్పు, సేవ అనే సుగుణాలకు ప్రతిరూపం ఫ్లోరెన్స్ నైటింగేల్ యేసుక్రీస్తు సౌశీల్యాన్ని తన జీవితం ద్వారా ఈ క్షతగాత్రులకు అందజేసి, తన ఆరోగ్యాన్ని పాడుచేసుకొన్న వీరవనిత! తాను కాలిపోతూ, అంధకారంలో వెలుగు రేఖలు వెదజల్లింది. క్రీస్తు ప్రేమను చూపించింది! 

 “అందుకు నీతిమంతులు – ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీ కాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహ మిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుట యైనను, చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు-మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను” (మత్తయి 25:37-40). Florence Nightingale

 ఈమె భారత దేశ సంక్షేమం కోసం, ఆర్మీ వ్యవస్థ కోసం, వైద్యశాలల కోసం 200 కంటే మించిన పుస్తకాలను వ్రాసెను. భారతదేశంలోని మద్రాసు పట్టణంలోని జనరల్ హాస్పిటల్ ఈమె ద్వారా రూపించబడినదే! 


Pdf Files Download చేసుకోండి …..Click Here

Leave a comment