సౌలు ఓటమి నేర్పే పాఠాలు – Biblical Parables Telugu

Written by biblesamacharam.com

Published on:

సౌలు ఓటమి నేర్పే పాఠాలు.

Biblical Parables Telugu

 ఇశ్రాయేలీయులకు మొదటి రాజైన సౌలు యొక్క ఓటమి గూర్చి మనం పరిశోధించినచో కొన్ని సంగతులు నేర్చుకోగలుగుతాం. సౌలు ఫిలిష్తీయులతో పోరాడినప్పుడు ఓటమిని పొందుటకు చాలా కారణాలు ఉన్నాయి. వానిలో కొన్నిటిని చూద్దాం. విశ్వాస జీవితయాత్ర ఏ విధంగా సాగిపోవలెనో మనం తెలుసుకుంటాం. విశ్వాసి ఎప్పుడైన రెండు తలంపుల మధ్య తడబడకూడదు. అలా అయితే అపజయం అవమానం తప్పదు!

  సౌలు ఓటమికి మొదటి కారణం ఏమిటంటే – అవిశ్వాసము! 

 సముద్రపు ఇసుక రేణువులు వలెనున్న ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఓడిస్తారనే భయం, దానితోపాటు దేవుడు సహాయం చేయలేడనే అవిశ్వాసము తోడైంది. సమూయేలు అతణ్ణి ప్రశ్నించినప్పుడు – జనులు నా యొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచితిని అంటున్నాడు సౌలు (1సమూయేలు 13:11). 

 సౌలు తన సొంత ఆలోచనను బట్టి ముందుకు సాగిపోయాడు. దానిని బట్టి సౌలుకు ఓటమి ఎదురైంది. తన కుమారుడైన యోనాతాను విశ్వాస మూలముగా నడిచాడు గనుక అతడు విజయాన్ని పొందాడు. సౌలు దేవునివైపు చూడటానికి బదులు శత్రువు యొక్క రథములు గుఱ్ఱములవైపు చూశాడు. గిల్గాలులో సమూయేలు చెప్పిన మాటలు “శత్రువుకు  భయపడవద్దు. దేవునికి మాత్రమే భయపడి ఆయనను భయభక్తులతో సేవించుము” అనే మాటలు మరిచాడు. సమూయేలు ప్రార్థించగా ఆకాశం వర్షించింది అనే సంగతి కూడ మరిచాడు.  Biblical Parables Telugu

 రెండవకారణం ఏమిటంటే – అసహనం! 

 సమూయేలు రాక కొరకు వేచియుండలేక పోవుటను బట్టి సౌలు ఓటమి నెదుర్కొనవలసి వచ్చినది. విశ్వాసమూ మరియు సహనము రెండును కలిసి పనిచేయాలి, కలిసి పయనించాలి. 

 బైబిలు చెబుతోంది – “విశ్వసించువాడు కలవరపడడు” (యెషయా 28:16). విశ్వాసము మనలను పరిపూర్ణులునుగా చేస్తుంది. అవిశ్వాసము ద్వారా కలవరపాటూ, ఆ కలవరపాటు నుంచి ఓటమి సౌలుకు సంభవించింది. శోధనను జయించువారికి కిరీటాన్ని బహూకరిస్తానన్నాడు ప్రభువు. కానీ అవిధేయత వలన సౌలు కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. 

 సౌలు అపజయానికి మూడవ కారణం ఏమిటంటే తాను చేయకూడని దానిని చేసి పతనం అయ్యాడు. సమూయేలు సకాలానికి రాలేదని నిందిస్తూ తనకి తోచిన విధముగా బలులు నర్పించాడు. ఆ విధంగా బలినర్పించడం అతని పనికాదు, ఆ పని సమూయేలు చేయవలసి ఉన్నది. సమూయేలునే కాకుండా, యోనాతానును, ప్రజలను కూడా అతడు నిందించాడు. శత్రువుకు భయపడవద్దు, దేవునికి మాత్రమే భయపడాలి అని సమూయేలు చెబితే దానికి వ్యతిరేకంగా చేశాడు. చివరికి మంత్రగాళ్లను కూడా సంప్రదించే స్థితికి దిగజారిపోయాడు. అదే సౌలు పతనానికి దారితీసింది. సౌలు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటి? ప్రథమంగా మనం దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఆయన చిత్తానికి లోబడాలి. విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. ఇవి, మనం అనుదిన విశ్వాస జీవితంలో అభ్యాసం చేయవలసిన ఆధ్యాత్మిక నీతి సూత్రాలు!  Biblical Parables Telugu

 ప్రియ దేవుని బిడ్డలారా! ద్విమనస్కుల హృదయాలలో దేవునికి చోటుండదు. ఆయన వాక్యానికి కూడా స్థానం ఉండదు. అన్ని విషయాలలో అస్థిరుడై యుంటాడు. తాను ఏం చెబుతాడో, ఏం ఆలోచిస్తాడో అతనికే తెలియదు. అన్నిటిలో తడబాటు, ప్రతీదానిలో తొందరపాటు కలిగి యుంటాడు.  Biblical Parables Telugu

 ప్రియ విశ్వాసీ, విశ్వాస జీవితం పరచిన పూలపాన్పు కాదు – కఠిన పరీక్షలతో ముందుకు సాగిపోయే పరలోక యాత్ర అది! 


 బైబిల్ ప్రశ్నలు – సమాధానాలు .. click here 

Leave a comment