8 వ రోజునే సున్నతి ఎందుకు
Bible Question Answers Telugu
పరిశుద్ధ గ్రంథములో “రక్తము”ను గూర్చి అనేక చోట్ల చాలా సంగతులు రాయబడ్డాయి. “దాని రక్తము దాని ప్రాణమునకాధారము” అంటూ లేవీయకాండము 17వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది. ఇంక లేవీయకాండము 17:11,13; ద్వితీ. 12:23, ఆది 9:4 కూడా ఇదే సంగతిని సమర్ధిస్తున్నాయి.
“రక్తము దాని ప్రాణమునకాధారము” అంటూ మోషే క్రీ.పూ. 15 వందల సంవత్సరముల క్రిందట రాసాడు.
రక్తము శరీరంలో చాలా విధములైన పనులు చేస్తోంది. అది శరీరంలోని ప్రతి కణమునకు నీటిని, పోషకములను సరఫరా చేస్తుంది. ఊపిరితిత్తుల నుంచి ప్రతి అవయవమునకు ప్రాణవాయువును సరఫరా చేస్తుంది. అది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంది. శరీరంలో ప్రతి కణంలోని మాలిన్యములన్నీటిని శుద్ధి చేస్తుంది.
మన భౌతిక జీవనం కొరకు రక్త ప్రసరణ అతి ప్రాముఖ్యమైనది! క్రీ.శ. 1616వ సంవత్సరములో – విలియం హార్వే అనునతడు శరీరంలో రక్త ప్రసరణ జరుగునని చెప్పాడు. అతడీమాట చెప్పకముందు ప్రజలకు ఈ సంగతి అంతకు ముందు తెలియదు.
రక్తం శరీరం నుంచి బయటకు పోతే, ఆ వ్యక్తి బ్రతుకడు, ఈ విషయం మనకు తెలుసు. 18వ శతాబ్దం వరకు రక్తం దేహం నుంచి విసర్జింపబడుతున్నప్పటికీ వైద్య పరంగా అంతగా పట్టించుకొనేవారు కాదు. 1803వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ రక్త విసర్జన వలన చనిపోయాడు.
అధిక రక్తస్రావం ఒక వ్యక్తికి జరిగితే, ఆ వ్యక్తికి ప్రాణాపాయం సంభవిస్తోంది.
ఆదికాండములో దేవుడు అబ్రాహాముతో సున్నతి నిబంధన గూర్చి సెలవిచ్చాడు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను… అంటూ నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా “మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను” అంటూ సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చాడు (ఆది. 17:7,8,10).
గోప్యాంగ చర్మమున సున్నతి పొందాలి. దేవునికిని అబ్రాహామున కును మధ్య జరిగిన నిబంధనకు సూచన – ఆ సున్నతి కార్యం!
అయితే ఈ సున్నతి కార్యక్రమం ఎప్పుడు జరుగవలెనో కూడా దేవుడు స్పష్టముగా సెలవిచ్చాడు. “ఎనిమిది దినముల వయస్సుగలవాడు ఈ సున్నతి పొందాలి” అన్నాడు దేవుడు (ఆది. 17:12). ఒకరోజు ముందుగాని, ఒకరోజు వెనుకగాని సున్నతి పొందితే నష్టమేంటి? ఖచ్చితంగా 8వ దినముననే ఆ సున్నతి కార్యక్రమం జరగాలా?
అవును, దేవుడు 8వ దినముననే సున్నతి జరగాలి అని ఖండితంగా చెప్పేశాడు. దేవుడు ఏది చెప్పినా దానికి ఒక కారణం ఉంటుంది. ఎటువంటి రీజన్ లేకుండా ఏమాట ఆయన రిలీజ్ చేయడు.
1920 వ సంవత్సరములో డెన్మార్కుకు చెందిన వైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు హెన్రిక్ మ్ అనునతడు రక్తము గడ్డకట్టించే విటమిన్ “కె”ను కనుక్కున్నాడు. (“కె” అను అక్షరం జర్మన్ భాషలో మొదటిది). ముందు అతడు కోడిపిల్లల మీద ప్రయోగం చేశాడు.
విటమిన్ “కె” గనుక లోపించితే, ఆ కోడిపిల్లలలో రక్తం కారిపోతున్నట్లు మిక్కిలి రక్తస్రావం జరుగుతున్నట్లు అతడు గమనించాడు.
“ప్రోత్రోంబిన్” అను పదార్థము రక్తములో తయారగుటకు విటమిన్ “3” అవసరమవుతుంది. అది రక్తం కారకుండా గడ్డకట్టిస్తుంది.
ప్రతి శిశువుకు 5వ రోజు నుండి 8వ రోజు లోపు విటమిన్ “3” తయారవుతుంది. ఇక 8వ రోజు అయితే “ప్రోత్రోంబిన్” 110 శాతం తయారవుతుంది.
ఒక శిశువు యొక్క జీవితకాలమంతటిలో రక్తం గడ్డ కట్టించే ప్రోత్రోంబిన్ శాతం ఆ రోజు అత్యధికముగా యుంటుంది. ఇంక మరెప్పుడూ అలా ఉండదు.
కొత్తగా జన్మించిన శిశువులకు 2వ రోజు నుండి 5వ రోజు వరకు ఏ చిన్న గాయమైన అధిక రక్తస్రావం అవుతుంది. రక్తం గడ్డకట్టుటకు వీలు కలిగించే ప్రోత్రోంబిన్ లేనందున ఆ శిశువు చనిపోతాడు.
మరి, గోప్యాంగ చర్మమున సున్నతి జరగవలెనంటే – శస్త్ర చికిత్స చేయాలి గదా! 8వ రోజు ప్రోత్రోంబిన్ పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి, అధిక రక్తస్రావం జరగకుండా విశ్వ విజ్ఞానియైన మన దేవుడు 8వ రోజుననే సున్నతి చేయమని అబ్రాహాముకు సెలవిచ్చాడు.
బైబిలు గ్రంథం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, వైజ్ఞానిక గ్రంథం కూడాను! అందులోని ప్రతి మాట అమోఘం! అందుకుంటే పొందుకుంటావు ఆ మోక్షమును!
రక్తమే ప్రాణం, ఆ ప్రాణమే మనకు జీవం!
జీవాధిపతి రుధిరము మన పాప ఋణం తీర్చిన…
క్రయధనం!
ప్రసంగ శాస్త్రం కొరకు.. click here