వంశావళి పురుషుని పేరుతోనే ఎందుకు|bible question answers in telugu2

Written by biblesamacharam.com

Updated on:

వంశావళి పురుషుని పేరుతోనే ఎందుకుంటుంది?

bible question answers in telugu2

       పరిశుద్ధ గ్రంథంలో వంశావళుల చరిత్ర అనేక సందర్భాలలో మనకు తారసపడుతోంది. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనంలో “ఆదాము నూటముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని…” అంటూ రాయబడింది. అటువలె ఆదాము కుమారుడైన “షేతు నూట అయిదేండ్లు బ్రతికి ఎనోషును కనెను” అంటూ 6వ వచనంలో రాయబడింది. 

      ఆదికాండము 16వ అధ్యాయం 15,16 వచనములలో – తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్లవాడు” అంటూ లేఖనం తెలియజేస్తుంది. 

“హాగరు అబ్రామునకు కుమారుని కనెను” అట! “హాగరు కనిన తన కుమారుడు” అంటూ చెప్పబడింది. 

     హాగరు కనిన కుమారుడు అబ్రామునకు సొత్తు అన్నట్టు – హాగరు అబ్రాము‘నకు’ కుమారుని కనెను అంటూ లేఖనం వక్కాణిస్తోంది. అలాగే “హాగరు కనిన తన కుమారుడు” అంటే ఏమిటి? హాగరు కనిన ఇష్మాయేలు, అబ్రామునకు కుమారుడు! అంటే, తన కుమారుడు అన్నమాట. “తన” అంటే అబ్రాము అని అర్థం. ఇష్మాయేలుకు మూలము అబ్రామే కదా! 

    ఇష్మాయేలూ, ఇష్మాయేలుగా పుట్టుటకు అబ్రాము మూలము. అబ్రాము నుంచి ఉద్భవించినవాడు ఇష్మాయేలు. అందుకే ఇష్మాయేలు అబ్రామునకు – తన కుమారుడు అయ్యాడు. 

     పై కారణాన్ని బట్టి వంశావళులను గూర్చి బైబిలులో చెప్పబడినప్పుడు, స్త్రీ పేరు మీదకాకుండా, పురుషుల వంశావళితో రాయబడింది. వంశావళికి మూలము పురుషుడే గనుక పురుషుని పేరుతోనే వంశావళి చెప్పుట న్యాయబద్ధమైంది. 

     ఎవరైన మనలను మన ఇంటిపేరు అడిగితే, మన అమ్మగారి (తల్లి) ఇంటిపేరు చెప్పము గాని మన తండ్రిగారి యింటిపేరునే చెబుతాం. ఎందుకంటే, మనం మనముగా ఉన్నామంటే… మనకు మూలం మన తండ్రే. అందుకనే, రికార్డులలో మన సర్నేమ్ రాసేటప్పుడు తండ్రికి చెందిన ఇంటిపేరునే వాడతాం. 

ఈ సత్యాన్ని సైన్స్ వెలుగులో ఒకమారు పరిశీలన చేద్దాం, రండి! 

bible question answers in telugu2

     పురుష బీజకణము, స్త్రీ బీజకణము కలవడం వలన సంతానోత్పత్తి జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం! మొదట ఒక జీవకణము, రెండు బీజకణములుగా విభాగింప బడుతోంది. దీనిని “మియొసిస్” అని అంటారు ఒక్కొక్క జీవకణములో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇదిరెండుగా విభాగింపబడినప్పుడు అందుగల పదార్ధమంతయు రెండు సమభాగములుగా మారిపోతాయి. కాబట్టి, 46 క్రోమోజోములు సరి సమానముగా 23,23 గా విడిపోయి ఒక్కొక్క బీజకణములో 23 మాత్రము ఉంటాయి. 

అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, పురుషుల జీవకణములలో నున్న 46 లో 23Y క్రోమోజోములు, 23X క్రోమోజోములు ఉంటాయి. 

స్త్రీ బీజకణములో కూడ ఉన్న మొత్తము క్రోమోజోములు 46; అయితే స్త్రీ యొక్క బీజకణములు రెండును 23X క్రోమోజోములు కలిగియుంటాయి. 

రెండు బీజకణముల సంయోగము వలన మరల 46 క్రోమోజోములు గల ఒక జీవకణము ఉత్పత్తి అవుతోంది. ఇది స్త్రీయొక్క గర్భములో రూపురేఖలు దిద్దుకొని బిడ్డ తయారవుతుంది. ఇక్కడ మనం మరొక సంగతి గమనించాలి. పురుష బీజకణము 23Y క్రోమోజోములు గలది మరియు స్త్రీ  బీజకణము 23X క్రోమోజోములు గలది కలిసిన యెడల మగ బిడ్డ తయారవుతుంది. 

అంటే పురుషునిలోని Y క్రోమోజోములు; స్త్రీలోని X క్రోమోజోములు కలిస్తే మగపిల్లవాడు పుడతాడు అన్నమాట. గుర్తుంచుకోండి! XY కలిస్తే మగబిడ్డ పుడతాడు. విషయం మీకు విపులంగా అర్థం కావటానికీ సంగతి పునరావృతం చేస్తూ చెబుతున్నాం. స్త్రీయందు 46 క్రోమోజోములు కూడ X క్రోమోజోములే గనుక, ఆమె ఎప్పుడైనా X క్రోమోజోములు మాత్రమే విడుదల చేస్తుంది. 

పురుషునియందున్న జీవకణములోని 46లో 23X క్రోమోజోములు; 23Y క్రోమోజోములు ఉండును గనుక, కొన్నిసార్లు X క్రోమోజోములను, మరికొన్నిసార్లు Y క్రోమోజోములను పురుషుడు విడుదల చేస్తాడు. 

Y క్రోమోజోములను విడుదల చేస్తే మగబిడ్డ; X క్రోమోజోములను విడుదల చేస్తే ఆడబిడ్డ పుడతారు. కావున మగబిడ్డ జన్మించుటకు గాని, ఆడపిల్ల జన్మించుటకు గాని స్త్రీ కారణము కాదు, పురుషుడే అందుకు కారణం! తాను విడుదల చేసిన X లేదా Y ని బట్టి ఎవరు పుట్టాలో ఆధారపడి యుంటుంది. 

చాలామంది ఆడపిల్లలను ఒక తల్లి కన్నదంటే లోకులు ఆమెను నిందిస్తారు. అలా నిందించడం సబబు కాదు. ఆ మాటకొస్తే నిందింపబడ వలసినవాడు పురుషుడే. ఎందుకంటే అతడు తనలోని Y క్రోమోజోములను, స్త్రీలోని X క్రోమోజోములతో విలీనం చెయ్యొచ్చు గదా! అప్పుడు మగబిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ మాటకు వస్తే, తను Y క్రోమోజోములను విడుదల చేయాలన్నా X క్రోమోజోములను విడుదల చెయ్యాలన్నా అదికూడ తన ఆధీనంలో లేదు. 

అది దేవుని ఆధీనములోను, దేవుని సంకల్పములోను దాగియున్నది! కాబట్టి అతనినీ నిందించటానికి వీలులేదు. 

     ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ సందేశములో సారాంశం ఏమిటంటే, మగబిడ్డయైనను, ఆడబిడ్డయైనను పుట్టుటకు పురుషుడే కారణం! అంటే పురుషునిలోని X Y క్రోమోజోములే కారణం! కాబట్టి అబ్రాముకు పుట్టిన కుమారుడు తన కుమారుడు అయ్యాడు. ఆ కారణాన్ని బట్టే వంశావళి పురుషుల ఇంటిపేరుతో రికార్డు చేయబడుతుంది. 

అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను కనెను. యూదా పెరెసును కనెను…. అంటూ రాయబడిన వంశావళి నూటికి నూరుపాళ్ళు సత్యమే! 

సృష్టికర్త లేకుండా సృష్టిలేదు! 

సృష్టి లేకపోతే, శాస్త్రమూ లేదు! 

శాస్త్రానికి మూలం సృష్టి! 

సృష్టికి మూలం దేవుడు! 

ధన్యులు కండి ఆ దేవుణ్ణి నమ్మి!  రచయిత : david paul gaaru. 

All Rights Credits Reserved To Respective Oweners

bible question answers in telugu2


క్రీస్తు జీవిత చరిత్ర నేర్చుకోవడానికి… క్లిక్ హియర్ 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted