అడుగుదానికంటే ఊహించువాటికంటే…
Bible Upamanaalu Telugu 8
చైనా దేశములో చాలాకాలం క్రితం చెర్రి పండ్లు అమ్ముకునే ఒక దయగలిగిన మనుష్యుడు ఉండేవాడు. ఒక చిన్న బాలుడు ఆ చెర్రి పండ్లు చూసి మక్కువ పడ్డాడు. చేతిలో డబ్బుల్లేవు. ఆ పిల్లవాని హృదయాలోచన గమనించిన చెర్రి పండ్లవాడూ -“బాబూనీకు చెర్రి పండ్లు కావాలా?” అంటూ అడిగాడు.
“అవున”ని తలూపాడు. ఆ దయగల పండ్లవాడు – “నీ చేతులు చాపు” అన్నాడు. ఆ చిన్నవాడు తన చేతులను వెనకాలనే పెట్టుకున్నాడు. “నీ చేతులు చాపు నాయనా” అన్నాడు. ఆ ఆ పండ్లవాడు మరల చిన్నవాడు తన చేతులను వెనకాలనే బిగదీసుకుని పట్టుకున్నాడు.
ఆ పండ్లవాడే చివరికీ, ఆ పిల్లవాని చేతులు తీసుకొని వాని గుప్పిలి విప్పి, వాని చేతులనిండా చెర్రిపండ్లు నింపేసాడు.
ఇదంతా గమనిస్తున్న ఆ పిల్లవాని తల్లి – “ఆయన నీ చేతులు చాపు అన్నప్పుడు నీవెందుకు చాపలేదు” అని అడిగింది.
అప్పుడా పిల్లవాడు – “ఎందుకంటే, ఆయన చేతులు పెద్దవి. నా చేతులు చిన్నవి. నేను తీసుకుంటే ఒకటో, రెండో తీసుకుంటాను. ఆయనే ఇస్తే చాలా వస్తాయి కదా మమ్మీ!” అన్నాడు.
అవును, మన దేవుడు కూడా మనకు సమృద్ధిగానే ఇస్తాడు. ఆయన చేతులు, ఆ పండ్లవాని చేతులకన్నా ఎన్నో రెట్లు పెద్దవి! ఆయన అడుగువాటికంటే, ఊహించువాటికంటే అత్యధికముగా ఇయ్యగలిగిన దేవుడు! Bible Upamanaalu Telugu 8
హన్నా దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరములో – నాకు ఒక మగబిడ్డను దయచేయుము అంటూ ప్రార్థించింది. సంవత్సరముల ఆవేదన తన మనస్సులో గూడుకట్టుకుంది. తన హృదయమును కుమ్మరించింది. తనకు మగబిడ్డను దయచేయుము అంటూ మిక్కిలి బతిమాలుకుంది. అయితే దేవుడు ఆమె జీవితంలో ఏం జరిగించాడు?…
“యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్ళను ఇద్దరు కుమార్తెలను కనెను” అంటూ 1 సమూయేలు 2వ అధ్యాయం 21వ వచనం చెబుతోంది. తను దేవుణ్ణి అడిగింది ఒకరిని, కాని దేవుడు ఆమెకు ఇచ్చింది ఆరుగురిని! Bible Upamanaalu Telugu 8
ఆయనవి ఎంతైన పెద్ద చేతులు కదా!
ఒకసారి ప్రభువు ఒక ఇంటిలో జనసమూహాలకు బోధించు చున్నాడు. జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒకన్ని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. ప్రభువు అందరినీ బాగుచేస్తున్నాడు, వానిని కూడా బాగు చేయగలడు అనే నమ్మకంతో తీసికొని వచ్చారు. వారికి వాడు బాగుపడితే అంతే చాలు! ప్రభువు వానితో “కుమారుడా, ధైర్యముగా ఉండుము. నీ పాపములు క్షమింపబడియున్నవి” అన్నాడు.
ఈ లోకములో ఒక వ్యక్తి కోరదగిన అత్యంత గొప్ప భాగ్యము ఏమిటో మీకు తెలుసా? పాప క్షమాపణ! అదే అన్నిటిలో మిక్కిలి ఘనమైనది! శ్రేష్టమైనది! దానికి మించి మరొకటి ఏదియులేదు.
అతడు బాగుపడితే చాలూ అనుకుని తీసికొని వచ్చిన వారి యెదుట, వానితో”కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి” అన్నాడు ప్రభువు.
వాళ్ల ఉద్దేశ్యంలో అతడు బాగుపడితే చాలు! అంతే! కాని ప్రభువు – వాడు బాగుపడడం మాత్రమే చాలదు, పాపక్షమాపణ కూడా అతడు పొందుకోవాలి. ఇదీ ప్రభువు వాని యెడల కలిగిన ఉద్దేశ్యం! అందరియొక్క ఆలోచన పరిధి దాటిపోయింది – ప్రభువు ఆలోచన.
అడుగువాటికంటేను, ఊహించువాటికంటేను అత్యధికముగా చేయడానికే ఆయన ఇష్టపడతాడు!
సొలొమోను అతి పిన్నవయసు గలవాడై ఇశ్రాయేలీయులను ఏలుచున్నప్పుడు, గిబియోనులో దేవుడతనికి ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగు” అని సెలవిచ్చినప్పుడు, “ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చశక్తిగల వాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము” అంటూ దేవుణ్ణి దీనముగా సొలొమోను బతిమాలుకున్నాడు. Bible Upamanaalu Telugu 8
అందుకు దేవుడు సొలొమోనుతో యేమన్నాడు? లేఖనంలో యిలాగు రాయబడి వున్నది -“నీవు ఈ ప్రకారము యోచించుకొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను” అంటూ సెలవిచ్చాడు దేవుడు.
సొలొమోను తెలివినీ జ్ఞానమును మాత్రమే అడిగాడు. కానీ దేవుడు ఐశ్వర్యమును సొమ్మును, ఘనతను బోనస్ ప్రకటించాడు. కొత్త నిబంధనలో మరొక సంగతి చూద్దాం.
జక్కయ్య ప్రభువును చూడాలి అని మాత్రమే ఆశపడ్డాడు. “అతడు యేసు ఎవరోయని చూడగోరెను” అని కోరినట్లుగా వాక్యములో రాయబడి ఉన్నది. పొట్టివాడు కాబట్టి జనులు గుంపుకూడి యుండుట వలన చూల్లేకపోయాడు. ప్రయత్నం ఫలించనందున జక్కయ్య జంకలేదు. రోడ్డుపై పరుగులు తీసాడు. పక్కనే ఉన్న చెట్టెక్కాడు. కింద జరుగుతున్నది పైనుంచి విహంగ వీక్షణం చేస్తున్నాడు.
యేసు ఆ మార్గములో వచ్చి కన్నులెత్తి చూచి – “జక్కయ్యా త్వరగా దిగుము” అంటూ మాట్లాడారు. “కిందినుంచి నన్ను చూల్లేక పైనించి చూస్తున్నావా? దిగు!” అంటూ…”నేడు నేను నీ యింట నుండవలసి యున్నది” అని యేసుప్రభువు జక్కయ్యతో చెప్పారు. Bible Upamanaalu Telugu 8
యేసు తన యింటికి వస్తాడని జక్కయ్య ఊహలలోనే లేదు. జక్కయ్య యేసును చూచి తృప్తిపడదామనుకున్నాడు. కాని యేసు తన యింటికే వెళ్లాలని సంకల్పించుకున్నాడు. జక్కయ్య తలంపులకంటే, యేసయ్య తలంపులు ఆకాశమంత ఎత్తుగా నున్నవి. ఊహించని హఠాత్పరిణామమిది! జక్కయ్య నిశ్చేష్టుడైయుంటాడు! ఆ ఆశ్చర్యంలో జక్కయ్య ఏమి మాట్లాడి యుంటాడు?! వారిద్దరి మధ్య ఏ విధమైన చర్చ జరిగియుంటుంది! ఏ సంగతి హాట్ టాపిక్ గా మారియుంటుంది!
ఏమో మనకు తెలీదు! పావన మూర్తి పాదాలచెంత నిలువబడి, కృతజ్ఞతా బాష్ప బిందువులు తన చెక్కిళ్లపై జాలువారుతుండగా – “ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును” అంటూ ఒప్పుకోలు చేస్తున్నాడు.
నిన్నటి దినం ఇదే సమయానికి కుళ్లి కంపు కొడ్తున్న జీవితం అతనిది… కానీ యివాళ ఓ కొత్త మార్పు! కొత్త జీవితం! గడచిన 24 గంటల్లో ఏం జరిగింది అతనిలో? లాఠీ దెబ్బలు తట్టుకోలేక ఈ ఒప్పుకోలు చేస్తున్నాడా జక్కయ్య? లేదు. మరయితే ఏం జరిగింది?
యేసు అతని ఇంటిలోకి, అతని ఒంటిలోకి వచ్చాడు! అదీ జరిగిన విషయం!
జక్కయ్య ఊహించింది ఎంత? అతనిలో ప్రభువు జరిగించిందెంత? ఆశ్చర్యం కలుగుతోంది కదూ!
దేవుడు మనకు ఏదైన ఇవ్వాలన్నా, చెయ్యాలన్నా, మన చిన్ని మెదడు ఆలోచించగలిగిన పరిమితులు దాటి ఆయన చేస్తాడు! వింటున్నారా?
బైబిల్ ప్రశ్నలు – జవాబులు కొరకు.. click here
[raju_digital_services_download_button timer=”10″ link=”https://example.com/download.zip” button_text=”Download Now” button_color=”#0073aa” hover_color=”#005177″]