యరొబాము యొక్క వంకర బతుకు |Pastors Messages In Telugu 3

Written by biblesamacharam.com

Published on:

అంశం : యరొబాము యొక్క వంకర బతుకు!

Pastors Messages In Telugu

      సొలొమోను ఉద్యోగస్తులలో యరొబాము ఒకడు. పనిలో శ్రద్ధ గలవాడు. రాజు గమనించి వాని పదవిని పెద్ద చేసాడు. తిన్న యింటి వాసాలు లెక్కబెట్టినట్టు రాజు మీదనే తిరుగుబాటు చేసాడు. దేవుని పుణ్యాన 10 గోత్రాలకు రాజయ్యి, ఏం చేశాడో… చూడండి!

I.ఇశ్రాయేలీయులను తప్పుమార్గంనకు పురికొల్పాడు.

(మొదటి రాజులు) 12:28,29

28.ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;

12:28 నిర్గమ 32:4-8; 2 రాజులు 10:29; 17:16; హోషేయ 8:4-7; నిర్గమ 20:3-6, 23. వారు జెరుసలంకు వెళ్ళే అవసరం లేకుండా వారి స్వంతానికి ఏదో ఒక రకమైన ఆరాధన ఆచారాన్ని చూపించాడు.Pastors Messages In Telugu

12:28 A నిర్గమ 32:4, 8; 2 రాజులు 10:29; 17:16; B 2 దిన 11:15; హోషేయ 8:4-7; C నిర్గమ 1:10; 20:4; ద్వితీ 4:14-18; 1 రాజులు 12:8-9; యెషయా 30:1, 10; హోషేయ 10:5-6; 2 పేతురు 2:19

29.ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.

12:29 “బేతేల్”– ఇది ఎఫ్రాయిం, బెన్‌యామీను ప్రాంతాల సరిహద్దులో జెరుసలంకు 20 కి.మీ. ఉత్తరాన ఉంది.

12:29 A ఆది 28:19; B ఆది 12:8; 14:14; 35:1; ద్వితీ 34:1; న్యాయాధి 18:27-31; 20:1; 2 రాజులు 10:29; యిర్మీయా 8:16; హోషేయ 4:15; ఆమోసు 8:14

   (దేవుడు ప్రజలందరిని యెరూషలేముకు వెళ్లి ఆరాధించమని చెబితే, యరొబాము బేతేలులోను, దానులోను రెండు బంగారు దూడలు చేయించి, మీరు యెరూషలేము ఏం వెళ్తారులే… దూరమూ, భారమూ అంటూ బంగారు దూడలకు సాగిలపడేటట్టు చేశాడు)

2. ఉన్నత స్థలాలపై దేవతా మందిరాలను కట్టించాడు.

(మొదటి రాజులు) 12:31

31.మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.

“లేవీగోత్రికులు”– నిర్గమ 29:9; 40:15; సంఖ్యా 3:9-10; 18:1-7. తన అధికారానికి అంటిపెట్టుకొని ఉండాలన్న నిశ్చయంలో యరొబాం తాను దేవుని శాసనాలెన్నిటిని మీరుతున్నాడో, దేవుని ప్రజలకు ఎంత హాని కలిగిస్తున్నాడో లెక్కచెయ్యలేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి విధానానికి ఫలితం నాశనం తప్ప వేరే ఏముంటుంది?Pastors Messages In Telugu

12:31 A 1 రాజులు 13:32-33; 2 రాజులు 17:32; 2 దిన 11:14-15; 13:9; B సంఖ్యా 3:10; C ద్వితీ 24:15; 1 రాజులు 13:24; యెహె 16:25; 44:6-8; హోషేయ 12:11

    (మందసం, కరుణాపీఠం, దేవుని సన్నిధి అంటూ లేని స్థలాలను ఎంపిక చేసి, ఆరాధన స్థలాలుగా చేసేశాడు. పొగరు తలకెక్కితే తిక్క తిక్కపనులు యిలాగే చేస్తారు మనుషులూ!)

III. సామాన్యులను యాజకులుగా నియమించాడు –

(మొదటి రాజులు) 12:31

31.మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.

(యాజక ధర్మం జరిగించుటకు దేవుడు లేవీయులను ఏర్పరచుకున్నాడు. యరొబాము వారిని తొలగించి సాధారణ పౌరులను నియమించాడు. అర్హత లేనివాడు పూజారి అయ్యాడు. పిలుపు లేకుండా పాస్టర్ గా పనిచేస్తే పుటుక్కున ఏదో ఒకరోజు ఆగిపోతారు. అడ్రస్ గల్లంతు అవుతుంది)

4. దేవుని నియమాన్ని ఇష్టానుసారంగా మార్చేశాడు-

 (మొదటి రాజులు) 12:32,33

32.మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.

12:32 “నిర్ణయించాడు”– లేవీ 23:33-34; సంఖ్యా 29:12. యరొబాం ఆరాధనా స్థలాలలో, యాజి వ్యవస్థ, అర్పణలు, పండుగలు మొదలైన వాటన్నిటితో కూడిన ఒక క్రొత్త మతాన్ని ఉనికిలోకి తెస్తున్నాడు. అయితే ఇదంతా దేవునికి అసహ్యం (14:9-11). ఎందుకంటే అది ఆయన శాసనాలకు విరుద్ధమైనది. యరొబాం ఇస్రాయేల్‌ను పూర్తిగా చెడు దారి పట్టించాడు. ఇతడి చర్యలు ఇస్రాయేల్ వారి చరిత్ర అంతటిపైనా దుష్ ప్రభావాన్ని చూపించాయి. దీని తరువాత ఇస్రాయేల్‌ను పాపంలోకి నడిపించిన యరొబాం దుర్మార్గత గురించి బైబిలు తరచుగా గుర్తు చేస్తూ వచ్చింది (15:30, 34; 16:2, 19, 26, 31; 22:52; 2 రాజులు 3:3; 10:29 మొ।।). పాత ఒడంబడికలో యరొబాం పాపాలు 20 కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించడం కనిపిస్తున్నది – ఒక్క మనిషి గురించి ఇన్ని సార్లు ఇలా పేర్కొనడమంటే సామాన్యం కాదు.

12:32 A 1 రాజులు 8:2, 5; ఆమోసు 7:10-13; B సంఖ్యా 29:12-40; యెహె 43:8; మత్తయి 15:8-9; C లేవీ 23:33-44

33.ఈ ప్రకారము అతడు యోచించినదానిని బట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను.

12:33 A సంఖ్యా 15:39; 1 రాజులు 13:1; B 1 సమూ 13:12; 2 దిన 26:6; కీర్తన 106:39; యెషయా 29:13; మత్తయి 15:6; మార్కు 7:13

(7వ మాసం 15వ దినమున జరుగవలసిన పర్ణశాలల ఉత్సవమును 8వ మాసం 15వ దినమున జరుప నిర్ణయించాడు. దేవుని నిబంధనలనే మార్చేశాడు. తన వాక్యంలో సున్నగాని, పొల్లుగాని తీసెయ్యొద్దు, కలుపవద్దు అన్నాడు దేవుడు!)

5.) యాజకులర్పించే బలులను యరొబాము అర్పించాడు. 

 (మొదటి రాజులు) 12:33

33.ఈ ప్రకారము అతడు యోచించినదానిని బట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను.

 (మొదటి రాజులు) 13:1

1.అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగాPastors Messages In Telugu

13:1 “ధూపం వేయడానికి”– 12:32. 1 సమూ 13:8-14 పోల్చిచూడండి. తన మతం దేవునికి అసహ్యం అయిందని యరొబాంకు అంతగా తెలియదు. దాన్ని ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు.

(యాజకులు ధూపం వేసి, బలులు అర్పించాలి. అయితే యరొబాము కాని పనిచేసాడు. గాడిద చేసే పని కుక్క చేస్తే ఏమవుతుంది?)Pastors Messages In Telugu

      విగ్రహారాధన గల కుటుంబం నుంచి అబ్రాహాము పిలువబడి బుద్ధిగా బదికాడు. విగ్రహారాధనే లేని జాతి నుంచి వచ్చిన యరొబాము విగ్రహారాధన చేసి పతనం అయ్యాడు. యరొబాము పాపము, ఇశ్రాయేలీయుల నాశనానికి దారితీసింది. మన జీవితం ఎదుటివారికి ఏమి నేర్పిస్తుంది? ఏమి ఇస్తుంది? మనం ఆలోచిద్దాం!


 మిషనరీ జీవిత చరిత్రల కోసం క్లిక్ చేయండి.. click here 

3 thoughts on “యరొబాము యొక్క వంకర బతుకు |Pastors Messages In Telugu 3”

  1. చాలా చక్కగా యరొబాము గురించి వివరించారు. చాలా వందనాలు సార్ 🙏🙏

    Reply
    • అన్నా ప్రైస్ ది లార్డ్
      మీరు యరొబాము జీవితం గురించి చాలా చక్కగా వివరించారు, ఈ ఆత్మీయ పాఠాలు చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయి

      Reply

Leave a comment