సువార్త పరిచర్య | What Is Evangelism In Telugu | 1

Written by biblesamacharam.com

Updated on:

సువార్త పరిచర్య.

ఉపోద్ఘాతం:What Is Evangelism In Telugu

      ప్రస్తుత ప్రపంచ  8 billion on November 15, 2022  వీరిలో కనీసం 200 కోట్ల ప్రజలు క్రీస్తుయేసును గూర్చి ఎన్నడూ విని యుండలేదు. ప్రపంచ జనాభాలో 15.15% అంటే 90 కోట్లకు పైగా ప్రజలు మన దేశంలో నివసించుచున్నారు. వీరిలో కేవలం 4% ( 3 కోట్ల 60 లక్షలు) మాత్రమే క్రైస్తవులు (అన్ని మత శాఖల వారు ఇందులోనే యున్నారు). ఇక మన రాష్ట్రానికి వస్తే, జనాభా షుమారు కోట్లు కాగా క్రైస్తవుల సంఖ్య 25 లక్షలు. బహు కొద్ది మందే గదా! 

       ప్రభువైన యేసు తన పనిని ఆరంభించి దాదాపు 2000 సం॥లు అయినప్పటికీ ఇంకనూ అనేక ప్రజలు, జాతులలోనికి సువార్త చొచ్చుకొని వెళ్ళలేదు. ఆయన మనకు ఒక కర్తవ్యాన్ని (Task) ఇచ్చాడు. ప్రపంచమందలి ప్రతి తరములోని ప్రతి వ్యక్తికీ శుభ సందేశమును అందించడమే ఆ కర్తవ్యము (మార్కు 16:15; మత్తయి 28:19). 

సువార్త పరిచర్య ప్రతి వ్యక్తి (పాస్టర్లు, సువార్తకులు మాత్రమే కాదు), ప్రతి స్థలంలో (కేవలం ఆలయాలు లేక విశ్వాసుల గృహాల దగ్గరే కాదు), ప్రతి సమయంలో        (ఏదో కొద్ది నియమిత గంటలు, సంవత్సరములోని కొన్ని వారాలు లేక రోజుల్లో గాక), నిరంతరము చేయవలసియున్నదని యేసు ప్రభువు తన జీవితం, బోధల ద్వారా ఓ చక్కని ఆదర్శమును లేక మాదిరిని చూపించాడు. 

సువార్త ఆరంభ కాలంలో శిష్యులు ఆనాటి నాగరికతా ప్రపంచమంతటా సువార్త గంట మ్రోగించారు (అ.కా. 17:6), కొన్ని ప్రాంతాల్ని సువార్తమయం చేసారు (అ.కా. 19:10; 1థెస్స 1:8). ఇదంతయూ మనం ఈ రోజుల్లో తప్పక కావాలని కోరుకొనే లేక ఉపయోగించే ప్రచార సాధనాలు, ప్రయాణ సౌలభ్యాలు, కంప్యూటర్లు, ముద్రణాలయాలు, లిఖిత రూపంలో నున్న క్రొత్త నిబంధన గ్రంథం, నిర్మితమైన ఆలయాలు, వివిధ రకాల కార్యక్రమాలు ఇతరత్రా మరెన్నో లేకయే చేసారు. ఈ రీతిలో చేయుటకు గల కారణములు : 

  1. వారు పనిని చిత్త శుద్ధితో చేసారు.
  2. వారు పరిశుధ్ధాత్మ శక్తితో నింపబడ్డారు. 
  3. యేసు ప్రభుని మాదిరిని (Pattern) అనుసరించారు. 
  4. సువార్త నంగీకరించిన వారు వెంటనే సువార్తను చాటారు. 

       నేటి మన ప్రపంచం నాశనమునకు పరుగు లిడుచున్నది. ఎక్కడ చూచినా పాపం తాండవమాడుచున్నది. లక్షల కొలది ప్రజలు నరకపుటంచున ఉన్నారు. దైవభీతి లేక ప్రజలు ఘోరకృత్యములకు పాల్పడుచున్నారు. ప్రభువు తిరిగి వచ్చు వేళ ఆసన్న మగుచున్నది. సువార్త ప్రకటన ద్వారా నశించుచున్న ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించవలసిన అవసరత మునుపెన్నటి కంటే ఎంతో ఎక్కువగా ఉన్నది. మనం త్వరపడాలి. > సగలున్నంత వరకు పని (యోహాను 9:4). దట్టమైన మేఘాలు అలుము కొంటున్నాయి. ఆలస్యం చేస్తే పజ్జేయగల అవకాశాలు మృగ్యమైపోతాయి. మేల్కొందాం! పట్టుదలతో ప్రార్ధిద్దాం! ఆత్మ శక్తి గల వారమై పనికి నడుము కడుదాం! ఆత్మల పంటను ప్రభువు కొఱకు సమకూరుద్దాం!. 

సువార్త అంటే ఏమిటి? 

“యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుత్థాన, ఆరోహణ, మరియు అవరోహణములను గూర్చిన వార్తే సువార్త.” 

సువార్త పరిచర్య అంటే ఏమిటి? 

A.) నిర్వచనము :-

  1. “ప్రజలు తమ పాపముల విషయములో పశ్చాత్తాపము నొంది, విశ్వసించి రక్షణ పొందునట్లుగా వారిని క్రీస్తు నొద్దకు నడిపింపవలెనను ఆకాంక్షతో, ఆసక్తితో      సువార్తను ప్రకటించుటయే సువార్త పరిచర్య.” 
  2. “మండెడి హృదయముతో (లేక) ఆత్మ భారముతో సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట, వినువరులను క్రీస్తు శిష్యులనుగా చేయునుద్దేశ్యముతో ప్రకటించుట మరియు బోధించుటయే సువార్త పరిచర్య.” 

B.) పరిభాష (Terminology) :-

  • క్రొత్త నిబంధనలో సువార్త పరిచర్యకు సంబంధించి వాడబడిన గ్రీకు పదములు : 
  1. Evanggelizo (ఎవాంగిలిడ్జో)-ప్రకటించుట,(to announce, to declare, to preach) మార్కు 1:15; అపొ. 13:32;   లూకా 4:18. ఈ పదం నుండే ‘సువార్తికుడు’ అను మాట వచ్చెను (అపో. 21:8). 
  2. Kerusso (కెరుస్సో) – వర్తమానము నందించు, ప్రచురము చేయు,(to be a herald, to proclaim) మత్తయి 3:1, 4:23. 

      ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుచూ పల్లెలేమి, పట్టణాలేమి ప్రతి ప్రాంతములోను రాజు తనకు అప్పగించిన వర్తమానమును ప్రజలకు తెలియ జేయు వార్తాహరుని దృశ్యమును మనకు చూపును.

3) Didasko (డిడాస్కో) – బోధించుట లేక వివరించుట, (to give instruction, to teach). మత్తయి 4:23; 9:35. ప్రజలందరికి అర్థమయ్యే సామాన్యమైన భాషలో, సులభ పద్దతులలో గొప్ప ఆత్మీయ సత్యాలను యేసు ప్రభువు బోధించాడు. 

4) Martus ( మార్టూస్) – (Bear witiess); సాక్ష్యమిచ్చుట. యోహాను 1:7,19; 3:11,32,33;5:31,32,34,36; హెబ్రీ 12:1. సాక్ష్యము అనగా ఋజువు పర్చుట. “మీరు నాకు సాక్ష్యులై యుందురు.” మరో మాటలో చెప్పాలంటే, “క్రైస్తవ్యము సత్యమైనది లేక వాస్తవమైనది అనుటకు మీరే నా ఋజువులు” అని క్రీస్తు తన శిష్యగణము నుద్దేశించి అన్నాడు. తను చూచిన, విన్న లేదా ఎరిగిన వాటిని రూఢి పర్చువాడే సాక్షి. ఈ పదం నుండే “Martyr” (హతసాక్షి) వచ్చింది.

5) Mathetes (మథేటేస్) శిష్యుడు, శిష్యత్వము, (to make disciple). మత్తయి 28:19, ఒక వ్యక్తిని అభ్యసించువాని గాను, విద్యార్థిగాను ఎంచి లేదా చేసి, అతనికి ఉపదేశించుటయే శిష్యత్వము. శిష్యుడు కేవలం విద్యార్ధిగా మాత్రమే గాక అవలంబించువాడై యుండవలెను. గనుక శిష్యులు వారి బోధకుని అనుసరించువారు. యోహాను 8:31; 15:8. 


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “సువార్త పరిచర్య | What Is Evangelism In Telugu | 1”

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted