ప్రార్థన ఏన్ని విధాలు|5 Different Types of Prayer in the Bible|

 ప్రార్థన ఏన్ని విధాలు.

5 Different Types of Prayer in the Bible|

1.) మోకాళ్ళ ప్రార్థన.

(దానియేలు) 6:10

10.ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.

6:10 దానియేలు తలుపులు మూసుకొని రహస్య ప్రార్థన చేయడం ఆరంభించలేదు. దేవునిపట్ల తనకున్న నమ్మకత్వం వల్లా, ప్రమాదం ఎదురైనప్పుడు అతనిలో కనిపించే ధైర్యం విషయంలో దానియేలు ఆనాటి వారికే గాక, అతని తరువాత తరాలన్నిటికీ గొప్ప మార్గదర్శి. ఒక పని చేయడం సరి అని అతడు అనుకొంటే అందువల్ల కలిగే ఫలితాలను లెక్క చెయ్యకుండా చేసేవాడు.

6:10 A కీర్తన 34:1; 55:17; 95:6; అపొ కా 5:29; ఫిలిప్పీ 4:6; 1 తెస్స 5:17-18; B 1 రాజులు 8:44, 54; కీర్తన 5:7; దాని 6:13; అపొ కా 9:40; హీబ్రూ 13:15; C 1 రాజులు 8:48-50; యోనా 2:4; అపొ కా 10:9; D 1 రాజులు 8:38; E 2 దిన 6:13, 38; ఎజ్రా 9:5; నెహెమ్యా 6:11; కీర్తన 11:1-2; 86:3; మత్తయి 10:28-33; లూకా 12:4-9; 14:26; 22:41; అపొ కా 2:1-2, 15; 3:1; 4:17-19, 29; 5:20, 40-42; 7:60; 20:24, 36; 21:5; ఎఫెసు 3:14; ఫిలిప్పీ 1:14, 20; కొలస్సయి 3:17; హీబ్రూ 4:16; ప్రకటన 2:10, 13

2.) కూర్చుండి ప్రార్థించుట.

(నెహెమ్యా) 1:4

4.ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

1:4 ఎజ్రా 9:3; 10:1, 6; యిర్మీయా 9:1; 13:17; 14:17; లూకా 19:41; అపొ కా 20:19. దేవుని వాక్కుపట్ల ఎవరికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందో వారు ఎక్కువ విలపిస్తారు.

1:4 A దాని 9:3; B ఎజ్రా 10:1; నెహెమ్యా 2:4; కీర్తన 137:1; C కీర్తన 69:9-10; D 1 సమూ 4:17-22; ఎజ్రా 5:11-12; కీర్తన 102:13-14; దాని 2:18; యోనా 1:9; జెఫన్యా 3:18; రోమ్ 12:15; E ఎజ్రా 9:3

3.) చేతులెత్తి ప్రార్థించుట.

(మొదటి తిమోతికి) 2:8

8.కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

“పవిత్రమైన చేతులు”– కీర్తన 26:6; యెషయా 1:15; యాకోబు 4:8 పోల్చి చూడండి. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అనుకుంటే మనం ఏ విధమైన పాపాన్నీ అంటిపెట్టుకొని ఉండకూడదు. అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం అనేది దేవుణ్ణి అవమానించడమే.

2:8 A కీర్తన 63:4; 134:2; B లూకా 24:50; యాకోబు 4:8; C యెషయా 1:15; యిర్మీయా 7:9-10; మత్తయి 6:14-15; యోహాను 4:21, 23-24; అపొ కా 21:5; 1 తిమోతి 5:14; తీతు 3:8; హీబ్రూ 10:22; D యెషయా 58:7-11; విలాప 3:55-56; యోనా 2:1-2; మలాకీ 1:9-11; మత్తయి 5:22-24, 44; 21:21; మార్కు 11:23-25; లూకా 23:34, 42-43; అపొ కా 7:60; 10:2, 4, 31; 1 కొరింతు 7:7; యాకోబు 1:6-8; 1 పేతురు 3:7; 1 యోహాను 3:20-22; E 1 రాజులు 3:11; 2 దిన 33:11-12; యోబు 16:17; కీర్తన 24:4; 26:6; 35:13; 66:18; 130:1-2; సామెత 15:8; 21:27; మత్తయి 6:12

4.) నిలువబడి ప్రార్థించుట.

(నెహెమ్యా) 9:1,2,3

1.ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీ యులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.

2.ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి,తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి.

3.మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి,ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.

5.) సాష్టాంగపడి ప్రార్థించుట.

(ఎజ్రా) 10:1

1.ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట… సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా

10:1 A కీర్తన 119:136; దాని 9:20; B 1 రాజులు 8:30; రోమ్ 9:2; 1 యోహాను 1:8-10; C 2 దిన 20:9; నెహెమ్యా 8:9; 10:28; దాని 9:3-4; జెకర్యా 12:10; లూకా 19:41; D లేవీ 26:40-41; 1 రాజులు 9:3; కీర్తన 32:5; యిర్మీయా 9:1; 13:17; హోషేయ 14:2; యోవేలు 2:16-18; E ద్వితీ 31:12; న్యాయాధి 2:4-5; 2 దిన 20:13; అపొ కా 10:30; 21:5


వ్యాఖ్యాన శాస్త్రం subjcet నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. click here

2 thoughts on “ప్రార్థన ఏన్ని విధాలు|5 Different Types of Prayer in the Bible|”

Leave a comment

error: dont try to copy others subjcet.