14వ కీర్తన వివరణ – 14 Psalms Explanation In Telugu

Written by biblesamacharam.com

Updated on:

14వ కీర్తన 

14 Psalms Explanation In Telugu

 దావీదు రచించెను. ఈ కీర్తన ప్రాముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు తిరిగి రెండవమారు (కీర్తన 53) వ్రాయించెను. ఈ కీర్తనలో మానవుని భ్రష్టస్వభావం మరియు దోషం నొక్కి వక్కాణించబడెను. ముఖ్యంగా బుద్ధిహీనుల గుణగణములను ఈ కీర్తనలో వివరించడం జరిగింది. 

బాధలలో…. నిన్ను.

 (కీర్తనల గ్రంథము) 14:6

6.బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.

14:6-7 భ్రష్టమైపోయిన మానవత మధ్య న్యాయవంతుడైన దేవుడు తన పనిని కొనసాగిస్తూ తాను ఎన్నుకొన్న వారికి పాపవిముక్తిని కలిగిస్తున్నాడు. వారిని నిర్దోషులుగా తీర్చి ధన్యకరమైన స్థితిలోకి వారిని విమోచిస్తున్నాడు.

  • బాధలలో నీ పక్షమున నిలిచి ధైర్యపరచు దేవుడు నీకున్నాడని మరువకు. బైబిల్ చెప్పుచున్నది : 

1.) దేవుడు బాధపడువానిని తృణీకరించడు.

 (కీర్తనల గ్రంథము) 22:24

24.ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

22:24 దేవుణ్ణి స్తుతించి మహిమ కలిగించేందుకు ఇంతకన్నా మంచి కారణం ఏమి కావాలి! దేవుడు తన కుమారుని బాధలను త్రోసిపుచ్చక, విశ్వాసుల పాపాలకు రావలసిన శిక్ష తానే వాటిని అంగీకరించి ఆ బాధనుంచి ఆయన విముక్తుల్ని చేశాడు. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకోవడం తాత్కాలికమే. యేసు అగాధంలో నుంచి మొర్రపెడితే ఆయన విన్నాడు.

2.) దేవుడు బాధపడువానికి న్యాయము తీర్చును.

 (కీర్తనల గ్రంథము) 146:7

7.బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడిన వారిని విడుదలచేయును.

3.) దేవుడు మన బాధలను భరించెను.

 (యెషయా గ్రంథము) 53:4

4.నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

53:4 “భరించాడు”– మత్తయి 8:17లో దీని అర్థం ఇతరులను బాగుచేసే ఆయన సేవ అని తెలుస్తున్నది. అలాగైతే మన రోగాలను ఆయన బాగుచేశాడని రాసి ఉండాలి కదా. అంటే కేవలం బాగు చెయ్యడమే కాక మరింకేదో చేశాడని అర్థం కావచ్చు. వాటిని ఒక బరువులా ఆయన అనుభవించాడు. బాధపడుతున్నవారి నొప్పిని ఆయన కూడా చవి చూశాడు. మత్తయి 9:36 చూడండి. జాలి పడడమంటే బాధపడేవారి బాధను పంచుకోవడమని అర్థం. యేసు అనుభవించిన బాధలన్నీ మన ప్రతినిధిగా మనకు బదులుగా అనుభవించాడని గుర్తుంచుకుందాం. ఆయన మన స్థానంలో వాటిని భరించాడు (63:9 చూడండి. 2 కొరింతు 11:28-29లో పౌలు మాటలను పోల్చి చూడండి).

 (యెషయా గ్రంథము) 63:9

9.వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

63:9 బైబిల్లో వెల్లడైన దేవుని స్వభావం ఇదే. తనకేమీ పట్టనట్టు దూరంగా కఠిన మనస్కుడై ఆప్యాయత లేకుండా ఉండేవాడు కాడు దేవుడు. తన ప్రజలు అనుభవించే బాధ ఆయనకు కూడా బాధే. వారితో కలిసి వారిలో ఉండి ఆ బాధను ఆయన కూడా అనుభవిస్తాడు. కనికరం అనే పదానికి అర్థం ఎదుటివాని బాధను పంచుకోవడం. హీబ్రూ గ్రీకు బాషల్లో ఈ పదానికి ఉన్న అర్థం గంబీరమైనది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో మత్తయి 25:35-40; అపొ కా 9:4 చూడండి.

4.) నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను.

 (యోబు గ్రంథము) 9:28

28.నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను

5.) అధికబాధలు కలుగజేయుచు వచ్చిరి.

 (కీర్తనల గ్రంథము) 129:1

1.ఇశ్రాయేలు ఇట్లనును నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి

129:1 128వ కీర్తనను బట్టి దేవుని భయభక్తులంటే తప్పనిసరిగా సౌభాగ్యవంతమైన జీవితం ఉంటుందనీ, కష్టాలేమీ ఉండవనీ కొందరికి పొరపాటు అభిప్రాయం కలగవచ్చు. ఇలాంటి అభిప్రాయాన్ని ఈ కీర్తన సవరిస్తున్నది. దేవుని ప్రజలను బాధలు తరచుగా వేధిస్తాయని ఇస్రాయేల్ చరిత్ర నేర్పుతుంది. “నా యువత నుంచీ” అంటే ఇస్రాయేల్‌వారు సంఖ్యలో విస్తరిస్తూ జాతిగా అవుతున్న కాలంలో ఈజిప్ట్‌లో వారు అనుభవించిన కష్టాల గురించీ (నిర్గమ 1 అధ్యాయం), వారి చరిత్ర అంతటిలో పొరుగు రాజ్యాలవల్ల కలిగిన కష్టాల గురించీ చెప్పిన మాట.

బాధలలో…. 

1.) దేవుడు నీకు ఆశ్రయముగా ఉండును.

 (కీర్తనల గ్రంథము) 14:6

6.బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.

14:6-7 భ్రష్టమైపోయిన మానవత మధ్య న్యాయవంతుడైన దేవుడు తన పనిని కొనసాగిస్తూ తాను ఎన్నుకొన్న వారికి పాపవిముక్తిని కలిగిస్తున్నాడు. వారిని నిర్దోషులుగా తీర్చి ధన్యకరమైన స్థితిలోకి వారిని విమోచిస్తున్నాడు.

ఎ. యెహోవా నా ఆశ్రయము.

 (కీర్తనల గ్రంథము) 28:7

7.యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

28:7 “డాలు”– 3:3; 5:12; 18:35; 32:7, 10; 33:20; ఆది 15:1. దేవుడెన్నుకున్న వారి పైకి ఆయన అనుమతించినవి తప్ప మరేవి బయటనుంచి రావడానికి వీల్లేదు. వారి విషయంలో తన సంకల్పం కాని వాటన్నిటినుంచి ఆయన వారిని సంరక్షిస్తాడు. సైతానునుంచీ దుర్మార్గులనుంచీ ఆయనే వారికి ఆశ్రయం. నమ్మకముంచే హృదయానికి ఇది ఎంత సంతోషం!

బి. నా ఆశ్రయము నాయందే వున్నది.

 (కీర్తనల గ్రంథము) 62:7

7.నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.

సి. గాలివాన తగులకుండ ఆశ్రయముగా వుంటివి.

 (యెషయా గ్రంథము) 25:3

3.భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

డి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము.

 (యిర్మీయా) 17:17

17.ఆప త్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.

2.) దేవుడు నీ ఆశ నెరవేర్చును.

 (కీర్తనల గ్రంథము) 9:18

18.దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు.

ఎ. నీ ఆశ భంగము కానేరదు.

 (సామెతలు) 24:14

14.నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.

బి. భక్తిహీనుల ఆశభంగమైపోవును.

 (కీర్తనల గ్రంథము) 12:8

8.నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

సి. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

 (కీర్తనల గ్రంథము) 143:6

6.నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది.

143:6-7 కేవలం బాధలనుంచి విముక్తి పొందడం కంటే దావీదు దేవుని కోసమే అర్రులు చాచాడు. దేవుని సహవాసం లేకపోతే అతనికి దారి తప్పి తిరుగుతున్నట్టూ, దుఃఖ సాగరంలో మునిగిపోయినట్టూ అనిపించింది (42:1-2; 63:1; 84:2).

డి. ఆశగల ప్రాణము తృప్తిపరచుదును.

 (కీర్తనల గ్రంథము) 107:9

9.ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.

3.) దేవుడు నీకు నెమ్మదినిచ్చును.

 (కీర్తనల గ్రంథము) 119:50

50.నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

119:50 కొందరికి బాధలుండవు, ఆదరణ ఉంటుంది. కొందరికి ఆదరణ ఉండదు, బాధలుంటాయి. విశ్వాసులకైతే మొత్తంమీద రెండూ ఉంటాయి. బాధకాలంలో విశ్వాసులకు ఆదరణ దేవుని వాగ్దానాలే. ఏ కష్టమూ కూడా పూర్తిగా తుడిచి పెట్టెయ్యలేని సజీవమైన ఆశాభావాన్ని అవి ఇస్తాయి.

ఎ. నెమ్మది కలుగజేసియున్నాడు.

 (యెహొషువ) 22:4

4.ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకు డైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి.

బి. తన జనులకు నెమ్మది కలుగజేసిన దేవుడు.

 (మొదటి రాజులు) 8:56

56.ఎట్లనగా-తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు

8:56 యెహో 21:45; 23:14-15; 1 దిన 22:18. దేవుని వాగ్దానం ఏదీ ఎప్పుడూ తప్పదు – తీతు 1:2.

సి. అపుడు మీకు నెమ్మది కలుగును.

 (యిర్మీయా) 6:16

16.యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.

6:16 “పాత త్రోవలు”– 18:15; ద్వితీ 32:17. సృష్టికర్త అయిన దేవుణ్ణి నిజంగా ఆరాధించే పద్ధతి బైబిల్లో రాసిపెట్టి ఉంది. అది అన్నిటికంటే సనాతనమైనది. అది మొదటి మానవులూ, మనందరి పూర్వీకులూ అయిన ఆదాము హవల కాలంలోనే వాడుకలోకి వచ్చింది. అదీ “మంచి” మార్గం, విశ్రాంతి పథం (మత్తయి 11:29), విగ్రహాలకు తావులేని మార్గం, విశ్వాస మార్గం, పవిత్ర మార్గం.

డి. నా ప్రాకారములలో నెమ్మది.

 (కీర్తనల గ్రంథము) 122:7

7.నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.

4.) దేవుడు నిన్ను విడిపించును.

 (కీర్తనల గ్రంథము) 72:12

12.దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.

72:12-14 లోకులంతా యేసుకు కానుకలు తెచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ను సేవించే కారణాలలో ఒకటి ఏమిటో ఇక్కడ రాసి ఉంది. ఆయన స్వభావం ఎంతగానో ఉత్తమమైనది. ఆయన చర్యలు కరుణాభరితమైనవి. ఈ కాలంలో కొందరు నాయకులు, పాలకులు అప్పుడప్పుడు పేదలనూ అక్కరలో ఉన్నవారినీ ఆదుకునే విషయం మాట్లాడుతూ ఉంటారు గానీ వారిలో ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారు? యేసుప్రభువైతే దీన్ని మాటలతో పోనియ్యడు. పేదల పక్షంగా నిలబడి వారిని విడిపిస్తాడు. భూమిపైనుంచి పేదరికాన్ని సమూలంగా తుడిచివేస్తాడు. పేదలను అణగదొక్కేవారిని తుదముట్టిస్తాడు.

 (యెషయా గ్రంథము) 41:17

17.దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

ఎ. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును.

 (యోబు గ్రంథము) 5:9

9.ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

5:9-16 మనుషుల పట్ల దేవుని వ్యవహారాలను ఎలీఫజు చిత్రిస్తున్నాడు. తద్వారా యోబు దేవునివైపు తిరిగి కరుణించమని ప్రార్థిస్తాడని ఎలీఫజు ఆశ. ఇక్కడ దేవుని గురించి చాలా ఉన్నతమైన భావాలను వెలిబుచ్చుతున్నాడు – దేవుడు అద్భుతాలు చేసేవాడు కాబట్టి యోబు కోల్పోయిన ఆస్తిపాస్తులన్నిటినీ అద్భుతమైన రీతిలో తిరిగి సమకూర్చగలడు – 9 వ; తన సృష్టి పట్ల దయగల సర్వాధికారి (వ 10); మనుషుల వ్యవహారాల్లో న్యాయం జరిగిస్తాడు. యుక్తిపరులైన దుర్మార్గులను శిక్షించి వారిచేత పీడించబడేవారిని విడిపిస్తాడు (11-16). 13వ వచనంలో కొంత భాగాన్ని పౌలు 1 కొరింతు 3:19లో ఎత్తిరాశాడు.

బి. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును.

 (కీర్తనల గ్రంథము) 25:15

15.నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.

సి. అతని విడిపించి అతని గొప్ప చేసెదను.

 (కీర్తనల గ్రంథము) 91:15

15.అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను

డి. నిన్ను విడిపించెదను నీవు నన్ను.

 (కీర్తనల గ్రంథము) 50:15

15.ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.

50:15 కీర్తన 91:15; 107:6, 13. కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యంతో ప్రార్థించేవారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబులు ఆయన్ను వారింకా కీర్తించడానికి కారణాలౌతాయి. కానీ దేవుడు మనిషి నుంచి తనకు రావలసిన స్తుతి ఘనతల విషయంలో ప్రాకులాడుతున్నాడా? ఏమాత్రం కాదు. కీర్తన 33:13 నోట్ చూడండి.

5.) దేవుడు నీకు జయమిచ్చును.

 (న్యాయాధిపతులు) 6:9

9.ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.

ఎ. సర్వోన్నతమైన స్థలములలో జయము.

 (మార్కు సువార్త) 11:10

10.ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము(మూలభాషలో-హోసన్నా) అని కేకలు వేయుచుండిరి.

11:10 దేవుడు దావీదుకు, దావీదు సంతానానికి రాజ్యాన్ని శాశ్వతంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. 2 సమూ 7:11-14; మత్తయి 1:1; లూకా 1:32, 69 చూడండి.

బి. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి.

 (మొదటి కొరింథీయులకు) 15:57

57.అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

15:57 “విజయం”– పాపంమీదా, మరణంమీదా, మనకు శాశ్వతమైన హాని కలిగించే వాటన్నిటిమీదా (రోమ్ 8:37; 2 కొరింతు 2:14; 1 యోహాను 5:4). విశ్వాసులపై మరణానికి, పాపానికి విజయం ఉండదు. ఎందుకంటే వాటిపై క్రీస్తు గెలిచాడు. ఆ గెలుపును వారికీ పంచి ఇచ్చాడు. దీనంతటికీ రుజువు క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేవడమే.

సి. నీవే రాజులకు విజయము దయచేయుదువు.

 (కీర్తనల గ్రంథము) 14:7

7.సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.

డి. శత్రువులమీద అతనికి జయము.

 (రెండవ సమూయేలు) 7:1

1.యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజుతన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి

ఉదా : 

ఇశ్రాయేలు ప్రజలు-వారి బాధనుండి దేవుడు విడిపించెను.

 (నిర్గమకాండము) 3:7

7.మరియు యెహోవా యిట్లనెనునేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.

యోబు – బాధలలో దేవుడు తోడైయుండును.

 (యోబు గ్రంథము) 2:7

7.కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.

2:7 సైతానుకు అదను చిక్కితే మనుషులను బాధించడానికి తనకు చేతనైనదంతా చేస్తాడు. ఒంటిమీద ఒక్క కురుపే ఎంతో బాధకరంగా ఉంటుంది. అలాంటప్పుడు మంట, దురద, యాతన పెట్టే పుండ్లు శరీరమంతటా లేవడం ఎంత దుర్భరమో భయంకరమో ఊహించుకోండి. ఈ రోగంవల్ల యోబు అనుభవించిన యాతన ఈ గ్రంథంలోని అనేక వచనాల ద్వారా అర్థమౌతున్నది (2:8; 3:24; 6:10; 7:4-5; 13:28; 16:8, 17; 17:1; 19:20; 30:17, 30).

 (యోబు గ్రంథము) 5:19

19.ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

5:19-26లీఫజు అంటున్నాడు, యోబు గనుక దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తే దేవుడు అతణ్ణి కష్టాలనుండి తప్పిస్తాడు (వ 19,20), అతని ఆస్తిని తిరిగి సమకూరుస్తాడు (వ 22-24), అతను పోగొట్టుకున్న సంతతికి బదులుగా మరింతమంది పిల్లలను ఇస్తాడు (వ 26), అతనికి తిరిగి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు (వ 18,26).

కనాను స్త్రీ కుమార్తె – బాధలో యేసు స్వస్థత.

 (మత్తయి సువార్త) 15:21,22,23,24,25,26,27,28

21.యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా,

22.ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

23.అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా

24.ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను

25.అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.

26.అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా

27.ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.

28.అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.

నోట్ : బాధలలో భయపడకు!

Leave a comment