Timothy Exemplary features Bible Telugu – తిమోతిలో లక్షణాలు 

Written by biblesamacharam.com

Published on:

 తిమోతిలో మాదిరికరమైన లక్షణాలు 

Timothy Exemplary features Bible Telugu

నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు…”  (2 తిమోతి 1:3-5). 

  అపొ. పౌలు గారు తిమోతిని జ్ఞాపకము చేసికొనెను. సాధారణంగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకొంటాము. అవి మంచి విషయాలు కావచ్చు, చెడ్డ విషయాలు కావచ్చు. ఐతే పౌలు గారు తిమోతిని ఎందుకు జ్ఞాపకము చేసుకొన్నారు అని చూసినట్లయితే తిమోతి యౌవనస్థుడై యుండి తన యౌవన జీవితంలో దేవునియందు భయము కలిగినవాడు. ఆయన కుటుంబము గూర్చి పరిశీలిస్తే తల్లి పేరు యునీకే (యూదురాలు), తండ్రి గ్రీసు దేశస్థుడు. 

యూదులు చాలా భక్తి గలవారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు. దైవ భయం వారిలో ఉంటుంది. తండ్రిని గూర్చి వ్రాయబడలేదు గాని తల్లి మాత్రం చాలా యోగ్యురాలు. తిమోతిని గూర్చి బైబిల్ చక్కగా చెబుతుంది. “అతడు లుస్త్రలోను, ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు”(అ.పొ. 16:1-2), మేము మంచివారము అని మనం చెప్పుకోవడం కాదు గాని యితరులు మనలను గూర్చి చెప్పుకోవాలి. వారు ఎవరైన కావచ్చు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు. మంచి పేరు అనగా మంచి సాక్ష్యం. ఉదాహరణకు కొంతమందికి మంచి పేరు ఉంటుంది గాని… ఆ పేరుకు తగిన జీవితం ఉండదు. చాలామంది వారి ముసలి తనమందు మంచిపేరుకు ప్రయాసపడతారు కానీ యౌవనంలో కూడా మంచి పేరు యుండాలి అని బైబిల్ సెలవిస్తుంది. “నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము” (1తిమోతి 4:11-12). 

                   తిమోతిలో ఉన్న మాదిరికరమైన లక్షణాలు 

1.) తిమోతి కన్నీరు కార్చువాడు

 2 తిమోతి 1:3-5 లో “నీ కన్నీళ్లను తలచుకొని…..” అని పౌలు వ్రాస్తున్నాడు. తిమోతి బట్టలు, గృహం, తిండి కొరకు కన్నీళ్లు కార్చలేదు గాని పౌలు గారు చెరసాలలో వుండడం చూచి ఎడ్చాడు. 

 తిమోతి కన్నీటితో ప్రార్థన చేసాడు. కన్నీళ్ళు రావాలంటే మెత్తని హృదయం ఉండాలి. బైబిల్లో దావీదు గారు అంటారు విరిగి నలిగిన మనస్సే దేవుని కిష్టమైన బలి. God wants a broken Heart దేవుని సన్నిధిలో మనం విరిగిపోవాలి. సుంకరి పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేసాడు. కొంతమంది పరీక్ష కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు. నిజంగా నీలో సుంకరి ప్రార్థన ఉందా? పాపాలను క్షమించుమని వేడుకొనుచున్నావా? Timothy Exemplary features Bible Telugu

 దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు పశ్చాత్తాప పడాలి, అంగలార్చాలి అని బైబిల్ చెబుతుంది. కీర్తన 56:8 లో “నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి”. నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో ఉన్నాయా? మన ప్రభువు ఎంత గొప్పవాడు అంటే ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఉదా:- అన్నామణి స్కాట్లాండ్ దేశంలో పుట్టింది. తండ్రికి ఏడుగురు పిల్లలు వారందరూ ఆడపిల్లలే. అందులో పెద్ద కుమార్తె అన్నామణి. ఆమెకు కోపం ఎక్కువ స్కూల్కు చదువుకు పంపితే మొదట రోజునే టీచర్ను కొట్టింది. ఆమె తండ్రి చదువు వద్దు అని పనిలో పెడితే ఇంటి యజమానిని కొట్టింది. కాని ఆ యజమానురాలు ప్రభువును నమ్ముకొనిన స్త్రీ గనుక అన్నామణిని ఏమీ అనక ఆమెను ప్రేమించుట వలన అన్నమణి దేవుని ప్రేమ ఇది అని తెలుసుకొని ప్రభువు కొరకు జీవించింది. తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో ఉన్నట్టుగా ఒక వ్యక్తి తన డబుల్ కాట్ మంచాన్ని తగులబెట్టాడు. చివరికి రెండు చాపలను కొనుక్కొన్నాడు. బైబిల్లో కోపపడుడి గాని పాపం చేయకుడి అని వ్రాయబడింది. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా చూస్తాము. బిల్లీగ్రహం గారు ఇలా అన్నారు “పాపం ప్రార్థన చేయకుండా చేస్తుంది గాని ప్రార్థన పాపం చేయకుండా చేస్తుంది”. 

2.) తిమోతి ప్రియమైన కుమారుడు

 “ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది” (2 తిమోతి 1:1). ప్రియము అంటే ఇష్టం అని అర్థం. మనం గమనించినట్లయితే పౌలుగారు తిమోతికి ఆత్మీయ తండ్రి. తిమోతిని పౌలు గారు నా కుమారుడా అని సంభోదించెను. మనలో కూడా కుమారత్వం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను”    (యోహా 1:12). 

 నీ జీవితములో కుమారత్వం ఉందా? దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలువబడుతున్నావా? పక్షవాయువు కలిగిన వానిని చూసి యేసు ప్రభువు వారు కుమారుడా! నీ పాపములు క్షమింపబడియున్నవి అని అన్నారు. ఆలాగునే 12 సం॥రాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీని చూచి కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని ప్రభువు ఆమెతో అనెను. ఉదా: – ఒక ప్రాంతంలో ఒక జమిందార్కు పిల్లలు లేకపోవుట చేత ఒక కాళ్ళు లేనివాడిని పెంచారు. వ్యవసాయ పనుల వ్యవహారాలలో సహాయంగా ఉండేవాడు. అతడిని పెళ్ళి చేసారు. అయితే కొంతకాలమైన తర్వాత జమిందారు, అతని భార్య చనిపోయారు. దాని తెలుసుకున్న బంధువులు ఆస్తి కొరకు కోర్టుకి వెళ్ళారు. పెంచుకొన్న వ్యక్తికి అడాప్షన్ సర్టిఫికెట్ లేకపోవుట వలన అతడు జమిందార్ గారు నన్ను పెంచారని చెప్పినా వారు వినలేదు. ఆ ఆస్తి మీద అతడికి అధికారం ఇవ్వలేదు. Timothy Exemplary features Bible Telugu

 మనం ప్రభువును పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తాము. కాని దేవుడు నిజంగా నీ తండ్రిగా ఉన్నాడా? క్రైస్తవులలో చాలామంది మందిరములో దేవదూతలుగా, ఇంటికి వెళ్ళిన తరువాత దెయ్యాలుగా ఉంటారు. 

3.) తిమోతి నిష్కపటమైన విశ్వాసము కలవాడు

 2 తిమోతి 1:3-5 వాక్యంలో మనం తిమోతిని గూర్చి వ్రాయబడిన మరో ఆధ్యాత్మిక విషయం ప్రస్థావించబడింది. “నీ ముందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని….” తిమోతి నిష్కపటమైన విశ్వాసము కలవాడు. యవ్వనకాలంలో ఉన్న తిమోతిలో ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం. నిష్కపటమైన వాటిలో ఉదాహరణకు పావురాన్ని తీసుకుంటే ఆ పక్షిలో కపటం లేదు అనగా చేదు లేదు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని బైబిల్లో వ్రాయబడింది. 

 తిమోతిలో ఉన్న విశ్వాసము ఎవరి నుండి వచ్చింది? “ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యూనీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నది” (2 తిమోతి 1:5). అవ్వ అనగా అమ్మమ్మ. సాధారణంగా చెప్పాలంటే అమ్మమ్మ లేదా నాన్నమ్మ చూపించే గారం వలన పిల్లలు పాడవుతారు. వారికి ముఖ్యంగా భక్తిని నేర్పాలి. నేటి తల్లిదండ్రులు పిల్లలకు సరియైన మాదిరి చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రుల మంచి మాదిరి వలన పిల్లలు ప్రయోజకులవుతారు. ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవ జ్వాలలతో రగిలించిన జాన్వెస్లీ గారి తల్లి సూసన్న వెస్లీ, తండ్రి చార్లెస్ వెస్లీ వారి పిల్లలను దైవభక్తిలో పెంచారు. వారికి మొత్తం 19 మంది కుమారులు. తల్లిదండ్రులతో మొత్తం 21 మంది. దేవుడే వారిని పోషించాడు. ఎందుకంటే వారి జీవితంలో ప్రార్థన పూర్వకమైన పరిస్థితుల వలన వారు ఆశీర్వదించబడ్డారు. Timothy Exemplary features Bible Telugu

 దేవుని వాక్యం చెప్పుచున్న మాట ఏమిటంటే “మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి…( మత్త 6:33). చాలామంది జీవితాల్లో చిల్లు సంచిలో వేసినట్లు డబ్బులు పోతున్నాయి. దేవునికి ఇయ్యవలసిన సమయం ఇవ్వనందువలనే ఈ పరిస్థితులు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక సద్వినియోగం చేసికొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి (ఎఫెసీ 5:15). 

 తిమోతి తన యౌవనంలో ఉన్నప్పుడు నిష్కపటమైన విశ్వాసము కలిగి సువార్త సేవలో పౌలుగారితో తిరిగాడు. రోమా పట్టణంలో పౌలుగారు ఉంటే ప్రార్థన చేశాడు. ఆసియా అంతటా తిరిగి సువార్త ప్రకటించాడు. నీ యౌవనంలో ఆయన కాడిని మోస్తే నీ వృద్ధాప్యంలో అది నిన్ను మోయును. దేవుడు పేతురుతో “నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అని అడిగితే ప్రభువా అది నీకే తెలియును అని జవాబు ఇచ్చాడు. సీమోను నీవు నన్ను ప్రేమించినట్లయితే నా గొట్టెలను మేపుము అని ప్రభువు పేతురుతో మాట్లాడాడు. దేవుని కొరకు మనము/నీవు ఏమి చేస్తున్నావు?  Timothy Exemplary features Bible Telugu

 యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఈ లోకానికి మానవునిగా వచ్చి తన ప్రాణం పెట్టాడు. కొంతైనా ఆయన కొరకు మనం చేయాలి. నీవు ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఫ్రాన్స్ దేశంలో పారీస్ నగరంలో ఒక పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంకు ఇక యౌవనస్థుడు వెళ్లాడు. అతడు అందులో ఒక క్రాస్ ను చూచి అలా కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు. ఇంతకు ఎందుకు అతడు కన్నీరు కారుస్తున్నాడు అంటే ఆ క్రాస్పైన ఇలా వ్రాయబడి ఉంది “నేను నీ కొరకు నా ప్రాణమును ఇచ్చాను నీవు నా కొరకు ఏమి ఇచ్చావు?” ఆ మాట నిజంగా అతనిని కదిలించింది. ఆ తరువాత అతడు మార్పునొంది తన ఆస్తిని అమ్మి ఆర్గనైజేషన్కు ఇచ్చాడు. ఒక మిషనరీగా సేవ చేశాడు.  Timothy Exemplary features Bible Telugu


All Pdf…………Download

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted