ఆయనను కరుణించమని చెప్పు – Sevakula Prasangaalu Telugu -biblesamacharam

Written by biblesamacharam.com

Published on:

అంశం :ఆయనను కరుణించమని చెప్పు.

Sevakula Prasangaalu Telugu -biblesamacharam

మూలవాక్యము : ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. “నన్ను కరుణింపుము”

 (కీర్తనల గ్రంథము) 86:3

3.ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము

86:3 దేవుడతని ప్రార్థన ఎందుకు వినాలో మరో కారణం అతడు అలసిపోకుండా చాలించుకోకుండా, నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నాడు. ప్రార్థనలో విసుగు చెందకుండా ఉండడం, ప్రార్థన చేయడం మానకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో యేసు బోధించాడు – లూకా 11:5-8; 18:1-8.

86:3 A కీర్తన 57:1; 88:9; B కీర్తన 4:1; 25:5; 55:17; 56:1; లూకా 2:37; ఎఫెసు 6:18; C లూకా 11:8-13; 18:7

I.) కరుణించమని ఎందుకు అడగాలి?

   1. ఆయన మాట ఇచ్చియున్నాడు గనుక.

 (కీర్తనల గ్రంథము) 119:58

58.కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.

119:58 వ 41; 34:4; ద్వితీ 4:29; 1 దిన 16:11.

119:58 A కీర్తన 119:41; B కీర్తన 119:10; హీబ్రూ 10:22; C 1 రాజులు 13:6; యోబు 11:19; కీర్తన 4:6; 27:8; 51:1-3; 56:4, 10; 86:1-3; 119:65, 76, 170; 138:2; హోషేయ 7:14; మత్తయి 24:35

IIఎప్పుడు ఆయన కరుణ అవసరం?

 1.) కృషించియున్నప్పుడు.

 (కీర్తనల గ్రంథము) 6:2

2.యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము

6:2-6 దావీదు మనస్సులోను దేహంలోను కూడా ఎంతో బాధననుభవిస్తున్నాడు. అతడు అధికంగా జబ్బుపడ్డాడు. తన చావు సమీపించిందేమోనని భయపడుతున్నాడు (వ 5). తన న్యాయవర్తనను బట్టి కాక దేవుని కృపను బట్టే దయ చూపాలని అర్థిస్తున్నాడు (వ 4).

6:2 A కీర్తన 30:2; 31:10; హోషేయ 6:1; B యిర్మీయా 17:14; మత్తయి 4:24; C ఆది 20:17; నిర్గమ 15:26; సంఖ్యా 12:13; ద్వితీ 32:39; యోబు 5:18; 19:21; 33:19-21; కీర్తన 22:14; 32:3; 38:3, 7; 41:3-4; 51:8; 103:13-17

2.) ఇరుకున పడియున్నప్పుడు.

 (కీర్తనల గ్రంథము) 31:9

9.యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.

31:9  దావీదు గొప్ప శోకంలో, కష్టంలో, అపాయంలో ఉన్నాడు. యోబు, యిర్మీయా తమ కష్టకాలాలలో పలికిన మాటల్లాగే ఉన్నాయి ఇప్పుడు దావీదు పలుకులు (యోబు 3:24; 19:13-14; 30:15; యిర్మీయా 6:25). తన దీనావస్థకు కనీసం కొంతవరకైనా తన దోషం, పాపమే కారణం అని దావీదు గుర్తించి ఒప్పుకుంటున్నాడు (10 వ). పాపం మానవకోటి అంతటికీ పక్కలో బల్లెం. ముఖ్యంగా పవిత్రుల పాలిట అది బహు దుఃఖకరమైనది.

31:9 A కీర్తన 6:7; B కీర్తన 73:26; 88:9; C యోబు 17:7; 33:19-22; కీర్తన 6:1-2; 22:14-15; 38:1-10; 44:25; 66:14; 73:14; 88:3-5; 102:3-5; 107:10; విలాప 4:17; 5:17

3.) స్వస్థత లేనప్పుడు.

 (కీర్తనల గ్రంథము) 41:4

4.యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.

41:4 పాపరోగం శారీరక రోగం కంటే ఎంతో అపాయకరం. అది ఆత్మను నీరసపరస్తుంది. దాని నివారణ ఎన్నో రెట్లు కష్టం. శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో తనను బాగు చేయగల ఒకే ఒక వ్యక్తివైపుకు దావీదు తిరుగుతున్నాడు.

ఉదా : 1. ఇద్దరు గ్రుడ్డివారు.

 (మత్తయి సువార్త) 20:30

30.ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.

20:30 A మత్తయి 21:9, 14; 22:42; మార్కు 10:46; B కీర్తన 146:8; యెషయా 29:18; 35:5-6; 42:16, 18; 59:10; 61:1-2; మత్తయి 9:27-31; 12:22-23; 15:22; లూకా 4:18; 7:21; యోహాను 9:1-12; అపొ కా 2:30; రోమ్ 1:3-4

2.) బర్తమయి.

 (మార్కు సువార్త) 10:46,47

46.వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.

10:46  మత్తయి 20:29-34. ఈ సందర్భంలో ఇద్దరు గుడ్డివాళ్ళు చూపు పొందారని మత్తయి చెప్పాడు. మార్కు అయితే ప్రత్యేకంగా ఒకణ్ణి గురించి చెప్తున్నాడు (15:1-2 పోల్చి చూడండి).

10:46 A మత్తయి 20:29-34; లూకా 18:35—19:1; B యోహాను 9:8; C లూకా 16:22; D లూకా 16:20; E అపొ కా 3:2-3

47.ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.

4.) మనుష్యులు అపాయంలో ఉన్నప్పుడు.

 (కీర్తనల గ్రంథము) 56:1

1.దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు.

56:శీర్షిక – 1 సమూ 21:10-15లో వర్ణించబడిన రీతిగా దావీదు మొదటి సారి గాతు వెళ్ళినప్పుడు అతను ఈ కీర్తన రాసి ఉండవచ్చు. ఫిలిష్తీయవాళ్ళు దావీదును బంధించారు అని స్పష్టంగా రాసిలేదు గాని 1 సమూ 21:13 ధోరణి చూస్తే అలా జరిగిందని ఊహించవచ్చు. పైగా – 1 సమూ 22:1లో అతను తప్పించుకుపోయాడని రాసి ఉంది. ఏది ఏమైనా దావీదు పాలిట అది ప్రమాదకరమైన కాలం. సౌలు, అతని సైన్యం ఒక వైపు, ఇస్రాయేల్‌వారి శత్రువులైన ఫిలిష్తీయవారు మరో వైపు అతనికి హాని చెయ్యజూశారు.

5.) హృదయం బద్దలైనప్పుడు.

 (కీర్తనల గ్రంథము) 69:20

20.నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.

69:20 యేసుప్రభువు పగిలిన హృదయంతో దిక్కులేని వాడై హేళనలకు, నిందలకు గురై చనిపోయాడు. దీన్ని చూచి కొందరు చలించిపోయారు కానీ జాలి ఎవరికుంది? ఆయన కోసం స్నేహ పూర్వకంగా ఒక్క కన్నీటి బొట్టును ఎవరు కార్చారు?

III. వెంటనే కనికరం (కరుణ) పొందుతావు

1.) కుష్టువ్యాధిగ్రస్తుని ముట్టెను.

 (మార్కు సువార్త) 1:41

41.ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.

2.) విధవరాలు కుమారుని బ్రతికించెను.

 (లూకా సువార్త) 7:13

13.ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

7:13 A కీర్తన 86:15; 103:13; యెషయా 63:9; యిర్మీయా 31:20; హీబ్రూ 4:15; B న్యాయాధి 10:16; కీర్తన 86:5; యిర్మీయా 31:15-16; విలాప 3:32-33; లూకా 8:52; C మార్కు 8:2; లూకా 17:5; 24:34; యోహాను 11:2, 33-35; 20:15; హీబ్రూ 2:17; D లూకా 7:19; 10:1; 13:15; యోహాను 20:13; E లూకా 22:61; 1 కొరింతు 7:30; 1 తెస్స 4:13

నీవు చచ్చిన తరువాత కనికరించబడవు (కరుణ చూపబడదు)

1.) ధనవంతుడు – లాజరు.

 (లూకా సువార్త) 16:24

24.తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను.

16:24 ఎవరిమీదా జాలి చూపనివాడు ఇప్పుడు జాలి చూపమని అడుగుతున్నాడు. అయితే అతనికేమీ కరుణ లభించలేదు. (మత్తయి 5:7; 7:2; కీర్తన 18:25-26; గలతీ 6:7). మరణం తరువాత ధనికుడు, లాజరు, అబ్రాహాము కూడా స్పృహలోనే ఉన్న సంగతి గమనించండి. ఏమి జరుగుతున్నదో వారికి బాగా తెలుసు. మరణం తరువాత ఆత్మ నిద్రపోదు. శరీరం మాత్రమే రాలిపోతుంది.

16:24 A మత్తయి 25:41; యోహాను 4:10, 14; ప్రకటన 7:16-17; 22:1; B లూకా 3:8; 16:30; యాకోబు 2:13; 3:6; ప్రకటన 20:15; C యెషయా 66:24; జెకర్యా 14:12; మార్కు 9:43-49; ప్రకటన 14:10-11; D 1 సమూ 28:16; యెషయా 27:11; 41:17-18; 65:13-14; మత్తయి 3:9; 5:22; యోహాను 7:37; 8:33-39, 53-56; రోమ్ 4:12; 9:7-8; 2 తెస్స 1:8; ప్రకటన 19:20

ముగింపు : ఆయన కరుణకు పాత్రుడవు కమ్ము. 


Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “ఆయనను కరుణించమని చెప్పు – Sevakula Prasangaalu Telugu -biblesamacharam”

Leave a comment

error: restricted