ఘనురాలైన షూనేమీయురాలు
Sevakula Prasangaalu Telugu
దైవభక్తి గలిగిన దైవజనుణ్ణి చేర్చుకొన్నది గనుకనే ఘనురాలని పిలువబడింది. ఈ ఘనత తనకు తానే వహించుకొనలేదు గాని దేవుడే ఆమెను ఘనురాలిగా ఎంచాడు. ఎలీషా ప్రవక్తకు ఆమె సిద్ధపరచినవి, ఏవనగా…
1.) గది.
(రెండవ రాజులు) 4:8,9,10
8.ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
4:8 “గొప్ప స్త్రీ” – హీబ్రూ పదాన్ని బట్టి ఈ “గొప్ప” అనే పదాన్ని ఏ విధంగానైనా – వయసులో, రూపంలో, పేరుప్రతిష్ఠల్లో, ధనంలో, వంశంలో గొప్పదని – అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బహుశా ధనికురాలు అనుకోవచ్చు. అయితే ఆమె లక్షణాలలోని గొప్పతనం ఈ తరువాతి వచనాలలో బయటపడుతున్నది. ఆమె దేవుని సేవకులకు సహాయ పడాలనుకుంది (వ 8-10), ఆత్మ సంబంధమైన వివేకం, వివేచన గలది (వ 9), వినయ స్వభావం గలది, దేన్నైనా బలవంతంగా అడిగి పొందాలనుకునేది కాదు (వ 13), ఆమె నమ్మకం గొప్పది (వ 22-37).
9.కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.
10.కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
(యేసుకు మనం స్థలమియ్యాలి యాయీరు తన ఇంటిలో ప్రభువుకి స్థలమిస్తే, చచ్చిన చిన్నది చటుక్కున లేచింది. మత్తయి 9:24; ప్రభువా! నీవు ఇక్కడ ఉన్నట్లైతే మా తమ్ముడు చావకపోవును అన్నది మార్త – యోహాను 11:21; నీవు లేవు గనుకనే లాజరు చనిపోయాడు యేసు బాబూ అంటోంది. ఆయనక్కడ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది)
2.) మంచం 2 రాజులు 4:8-10
(మంచం అనగా సహవాసము! ఎవరితో మన సహవాసము? – “దేవునితో!” నీతో సహవాసం చేసేందుకు ఆయన ఇష్టపడుచున్నాడు. అబ్రాహామును దేవుడు “నా స్నేహితుడు” అన్నాడు స్నేహితుడు సహవాసమును ఇష్టపడతాడు
(రెండవ దినవృత్తాంతములు) 20:7
7.నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
(యాకోబు) 2:23
23.కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.
2:23 ఆది 15:6; రోమ్ 4:3 చూడండి. అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోవడానికి అనేక సంవత్సరాల ముందు ఈ సంఘటన జరిగిందని యాకోబుకూ ఈ లేఖ చదివేవారికీ కూడా తెలుసు. నమ్మకం ద్వారా దేవుడు అప్పటికే అబ్రాహామును నిర్దోషిగా ఎంచాడు. కానీ అబ్రాహాము నమ్మకం సజీవమైనది. అతడు ఇస్సాకును అర్పించినప్పుడు అది సజీవమైనదని తనను తాను నిరూపించుకుంది. అబ్రాహాము ఇస్సాకును అర్పించకముందే అలా అర్పించడం అతని నమ్మకంలో అంతర్భాగంగా ఉన్నదని కూడా చెప్పవచ్చు.
(నిర్గమకాండము) 33:11
11.మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.
33:11 సంఖ్యా 12:8; ద్వితీ 34:10. దేవుడు మానవ రూపంలోనో దేవదూత రూపంలోనో బహుశా మోషేకు కనిపించి ఉండవచ్చు (ఆది 18:1-2).
3.బల్ల – 2రాజులు 4:8-10
(బల్ల అంటే దేవుని ప్రజలతో సహవాసం. ఒంటిరామచిలుక లాగ ఒక్కడివే ఉంటే సరిపోదు. ఆత్మీయులతో సహవాసం చేసి బలపడాలి. పౌలు మరియు సీలలూ వారిదో సహవాసం; బర్నబా మరియు పౌలు ఇది యొక సహవాసం)
4) పీఠ – 2రాజులు 4:8 – 10
(సువార్త కొరకు సిద్ధమనస్సు కల్గియుండాలి. బలిపీఠం, న్యాయపీఠం ఉన్నట్లే, సువార్త పీఠం కూడా ఒకటి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటింపక పోతే నాకు శ్రమ అన్నాడు పౌలు వార్తలలో గొప్ప వార్త – శుభవార్త)
5.) దీప స్థంభము – 2 రాజు 4:8-10
(నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని లేఖనంలో ఉంది – ఇది నిత్యము వెలుగుతూ ఉండాలి. కాబట్టి నూనె కావాలి. ఆ నూనె పరిశుద్ధాత్మ అభిషేకం! పరిచర్యలో గాని, ఉద్యోగంలో గాని నిన్ను నన్ను బలపర్చేది ఈ అభిషేకమే)
20:27 1 కొరింతు 2:11. మనిషిలోని ఆత్మ దేవుని దీపంలాంటిది. ఆయన మనుషుల్ని పరిశోధించడానికి, వారు తమలో జరుగుతున్న వాటిని గుర్తించేలా చేయడానికీ దాన్ని ఉపయోగిస్తాడు.
27.నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
ఈ షూనేమీయురాలు తన భర్తతో ఎలీషాను గూర్చి – భక్తిగల దైవజనుడని నేనెరుగుదును అంటోంది. ఆమె సూక్ష్మమైన వివేచన కల్గిన స్త్రీ అన్నమాట. ఆధ్యాత్మిక విషయాల్లో భర్త కంటే ఫాస్ట్ ఉంది. అయితేనేమి ఆమెను గూర్చి సర్వం ఎరిగిన భర్త, కామ్ గా లోబడ్డాడు. అణకువ కల్గిన భార్య భర్తకు ఒక వరం. భక్తి కల్గిన భార్య భర్తకు భరోసా. విధేయత కల్గిన భార్య విజయానికి నాంది. ఓ స్త్రీ నీవెలా ఉన్నావు?