యేసు కేవలం ప్రవక్తనా? దేవుడు కూడానా?
Sevakula Prasangaalu Telugu
యేసు కేవలం ప్రవక్త మాత్రమేనని ముస్లిం సహోదరులూ … దేవుని చేత మొట్టమొదట సృష్టింపబడిన వ్యక్తి మరియు దేవునికి ఒక విధానములో కుమారుడేగాని దేవుడు మాత్రం కాడని యెహోవా సాక్షులూ చెబుతున్నారు. అయితే యేసు ఎవరు?
1.) తోమా సాక్ష్యం.
(యోహాను సువార్త) 20:28,29
28.అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
20:28 తన ప్రజల తప్పులను దేవుడు మేలుగా మారుస్తాడు. తోమా సందేహం మూలంగా క్రీస్తు తనను తాను వెల్లడి చేసుకొన్నందువల్ల తోమా ఈ విధంగా తన నమ్మకాన్ని ప్రకటించిన ఈ ఉత్తమమైన మాటలు మనకు లభించాయి. తోమా యూదుడు. పాత ఒడంబడిక గ్రంథాన్ని అభ్యసించాడు. యేసుప్రభువు ఉపదేశాలను మూడేళ్ళపాటు విన్నాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడనీ ఇతర దేవుళ్ళెవరైనా ఒక వ్యక్తికి ఉండడం అన్ని పాపాల్లోకీ అతి హీనమైనదనీ అతనికి బాగా తెలుసు (మత్తయి 4:10; నిర్గమ 20:1-4; ద్వితీ 6:4-5; యెషయా 43:11; 44:6; 45:5 చూడండి). అతడు యేసును “నా ప్రభూ, నా దేవా” అన్నప్పుడు యేసు పాత ఒడంబడిక గ్రంథంలో వెల్లడైన సత్యయేక దేవుడు యెహోవా అవతారమని తన దృఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడన్న మాట. 1:1, 14, 18; 5:17-18; 8:24, 58; 10:30-33 చూడండి. లూకా 2:11; ఫిలిప్పీ 2:6 నోట్స్‌లో ఇతర రిఫరెన్సులు చూడండి.
29.యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
20:29 యేసుప్రభువు అతని మాటలకు అంగీకరించాడు. తాను ప్రభువనీ దేవుడనీ యేసుకు తెలిసి ఉండని పక్షంలో ఆయన ఇలా ఏమాత్రమూ అంగీకరించేవాడు కాదు. మానవమాత్రులు వారు మంచివారై న్యాయవంతులై ఉంటే ఇలా దేవునికే చెందవలసినవాటిని స్వీకరించరు (అపొ కా 14:13-15 పోల్చి చూడండి).
(నా దేవా, నా ప్రభువా! అన్నాడు తోమా. అప్పుడు యేసు – “తోమా, నేను దేవునిని కాదు. కేవలం ఒక ప్రవక్తనే” అని చెప్పొచ్చు కదా! చెప్పలేదు. ఎందుకూ? – ఆయన దేవుడని ఆయనకు తెలుసు. తెల్సిందాన్ని తెలియదు అంటామా? ఒకవేళ అన్నా అదీ తప్పేగా)
2.) పౌలు సాక్ష్యం.
(రోమీయులకు) 9:5
5.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
9:5 “పితరులు”– అంటే ఆ ప్రజల మూల పురుషులనూ నాయకులనూ – అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడే ఎన్నుకున్నాడు (11:28; ఆది 12:1-3; నిర్గమ 3:6). యేసుప్రభువు ఇస్రాయేల్ జాతిలో అబ్రాహాము, దావీదుల వంశంలో జన్మించాడు (మత్తయి 1:1).
వ 5లో యేసుప్రభువు దేవుడని స్పష్టంగా ప్రకటించడం కనిపిస్తూ ఉంది (ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో చూడండి).
(తీతుకు) 2:13
13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
2:13 “దివ్యమైన ఆశాభావం”– ఆశాభావం మీద నోట్స్ రోమ్ 5:2; 8:24-25. క్రీస్తే మన ఆశాభావం (కొలస్సయి 1:27; 1 తిమోతి 1:1). విశ్వాసులుగా మనం కోరేవాటన్నిటికి ఆయనే నెరవేర్పుగా ఉంటాడు. కృపద్వారా పాపవిముక్తి లభించినవారికి ఆయన రాకడ ఆశీర్వాదకరం, ఆనందకరం అవుతుంది.
“మన గొప్ప దేవుడు…క్రీస్తు”– ఈ అనువాదం ఇక్కడ ఉన్న గ్రీకు భాషతోనూ కొత్త ఒడంబడిక గ్రంథంలోని క్రీస్తును గురించిన ఉపదేశాలతోనూ ఏకీభవిస్తుంది. ఫిలిప్పీ 2:6 నోట్లో రిఫరెన్సులు చూడండి. పాత ఒడంబడిక గ్రంథంలో యెహోవాదేవుడు రక్షకుడు (యెషయా 49:26; 60:16). క్రొత్త ఒడంబడిక గ్రంథంలో యేసుప్రభువు రక్షకుడు. ఇద్దరు రక్షకులు మనకు లేరు. యేసు యెహోవా దేవుని అవతారం. లూకా 2:11 నోట్ చూడండి.
(ఈ మధ్య ముస్లిం సోదరులు పౌలుగారే యేసు దేవుడు కాడని చెప్పాడు అని చెప్తున్నారు. మరి పౌలేమో యేసును సర్వాధికారియైన దేవుడూ అంటున్నాడు. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? పౌలుగారిది స్వయం ఖండనా? చెప్పేవారిది స్వయం ఖండనా? ఆలోచించండి)
III. పాప పరిహారం కొరకు రక్తం చిందించువాడు దేవుడే గనుక యేసు దేవుడు!
(అపొస్తలుల కార్యములు) 20:28
28.దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
20:28 అక్కడి సంఘనాయకులు పవిత్రాత్మవల్ల నాయకులయ్యారని గమనించండి. ఏ సంఘంలోనయినా బాధ్యతలను సరిగా నెరవేర్చగలవారు ఇలాంటివారే. నాయకులు క్రీస్తు గొర్రెలకు నిజమైన కాపరులుగా ఉండాలి (యోహాను 21:16; ఎఫెసు 4:11; 1 పేతురు 5:2-4). వారిని నాయకులుగా చేసినది పవిత్రాత్మ కాకపోతే వారు నిజమైన కాపరులుగా ఉండడం అసాధ్యం. ఈ వచనంలో యేసును దేవుడు అంటున్నాడు పౌలు. శాశ్వతుడు, తండ్రి అయిన దేవునికి రక్తం అంటూ లేదు. సంఘాన్ని సంపాదించుకొన్న రక్తం యేసుది. యేసు రక్తం దేవుని సొంత రక్తం. యేసు దేవుడన్నమాట. క్రీస్తు దేవత్వాన్ని గురించి ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి.
(దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమూ… అంటున్నాడు. అంటే, యేసు రక్తం దేవుని స్వంత రక్తం అన్నమాట. అప్పుడు యేసు దేవుడేనని అర్థం కావట్లేదూ?)
4.) యెషయా సాక్ష్యం.
(యెషయా గ్రంథము) 9:6
6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
9:6 “కలిగాడు”– యెషయా రాసిన కాలం తరువాత కొన్ని వందల సంవత్సరాలకు ఈ వచనం నెరవేరింది. దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ ఆ రాబోయే సంఘటన అంతకుముందు జరిగినట్టు రాశాడన్నమాట. బానిసత్వమనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో, ఎవరు నిజమైన శాంతిని తెస్తారో గలలీ ప్రాంతాల్లో ప్రకాశించనున్న గొప్ప కాంతి ఎవరో ఆయనను ఈ వచనంలో చూడగలం. యేసుప్రభువు మానవత్వం, దేవత్వం రెండూ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయన మహా బలిష్ఠుడైన దేవుడు. అయినప్పటికీ చిన్న బాబుగా జన్మించాడు. యెషయా 7:14 పోల్చి చూడండి. ఆ పిల్లవాడు పెరిగి యూదుల రాజుగా, ప్రపంచానికే రారాజుగా ఉండడానికి పెరిగాడు (యిర్మీయా 23:5; మత్తయి 2:2; 27:11; 28:18; ప్రకటన 19:16).
“ఆశ్చర్యకరుడు”– యేసుప్రభువు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు, తన గుణాల్లో ఆశ్చర్యకరుడు, కన్యకు జన్మించడంలో ఆశ్చర్యకరుడు, ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో ఆశ్చర్యకరుడు, పాపులకోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు, ఆయన మరణంనుంచి సజీవంగా లేవడంలో, పరలోకానికి ఆరోహణంలో ఆశ్చర్యకరుడు, అన్ని విధాలుగా, ఎప్పటికీ ఆశ్చర్యకరుడు.
(యెషయా ప్రవక్త బలవంతుడైన దేవుడు అంటూ పాతనిబంధన భక్తులను యేసువైపుకు తిప్పుతున్నాడు. ఇది తప్పించుకోలేని సాక్ష్యం)
5.) యోహాను సాక్ష్యం.
(మొదటి యోహాను) 5:20
20.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
“ఆ సత్య స్వరూపిలో”– యోహాను 17:21-23; 1 కొరింతు 12:12-13; ఎఫెసు 1:3-4. ఇక్కడ “నిజమైన దేవుడు” అంటే క్రీస్తు అని అర్థం. ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో రిఫరెన్సులు చూడండి. ఆయనే శాశ్వత జీవం కూడా (వ 11; యోహాను 11:25; 14:6). ఆయనే శాశ్వత జీవం అని ఒక్క దేవుణ్ణి గురించి మాత్రమే బైబిలు అనడం సాధ్యం.
(నిజమైన దేవుడు, నిత్యజీవము అంటున్నాడు యోహాను)
6.) తండ్రి సాక్ష్యం.
(హెబ్రీయులకు) 1:7,8,9,10,11,12
7.తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
8.గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
9.నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
10.మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
11.ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
12.ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
(స్వయానా తండ్రి తన కుమారుని గూర్చి – “దేవా” అంటున్నాడు. అంతేకాదు – “ప్రభువా” అని పిలుస్తున్నాడు. తండ్రి సాక్ష్యమును కాదూ, లేదూ అంటారా ఎవరైనా? తప్పు కదూ?!)
VII. యేసు తనను గూర్చి తాను ఇచ్చిన సాక్ష్యం.
(మత్తయి సువార్త) 4:6,7,8,9,10,11
6.నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
7.అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
8.మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
9.నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
10.యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
11.అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. లూకా 4:7-12)
(పై వచనాలలో సైతాను క్రీస్తును శోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు సైతానుతో నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు – ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించాలనీ – ద్వితీ 6:13,16 వచనములను తనకే అన్వయించు కున్నాడు. శోధించేది సైతాను – శోధింపబడేది క్రీస్తు. నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు అని క్రీస్తు అన్నాడు. ఇప్పుడు చెప్పండి – క్రీస్తు ఎవరు? దేవుడే!) యోహాను 10:30,33లో – నీవు మనుష్యుడివై యుండి దేవుడని చెప్పుచున్నావు అని యూదులు అన్నారు. అంటే అంతకు ముందు తాను వారితో దేవుడనని చెప్పుకున్నాడని అర్థం కావట్లేదా?
All Pdf………..Download