ప్రభువా నన్ను పరిశోధించుము
Sevakula Prasangaalu Telugu
ఎంత గొప్ప డాక్టరైనా పరీక్ష చేయకుండా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వలేడు. పరీక్ష చేస్తే ఏయే లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో వైద్యులకు అర్థమవుతోంది. ఆధ్యాత్మికంగా మనమెలా ఉన్నామో మనకు మనమే స్వీయ పరీక్ష చేసుకోవాలి.
1.) హెచ్చించుకొనే మనస్సు నీకున్నదా?
(లూకా సువార్త) 18:10,11,12
10.ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
11.పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
12.వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.
(అభివృద్ధి, జయము, ఉన్నతస్థితి కల్గినప్పుడు ఆయనను మహిమపర్చాలి. అంతేగాని వాటిని బట్టి గర్విస్తే ఉన్నది పోతుంది – దాచుకున్నది పోతుంది. లూసీఫర్, నెబుకద్నెజరు, హామానులు గర్వించి చెడిపోయారు)
2.) పొగడ్తలపై ఆశ నీలో ఉన్నదా?
(గలతీయులకు) 1:10
10.ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
1:10 మనుషులకు ఏమి వినాలని ఉంటుందని పౌలు ఉద్దేశమో దాన్నే అతడు ఉపదేశిస్తున్నాడని పౌలు శత్రువులు అతనిపై నేరం మోపారా? వ 6-9 బట్టి అది నిజం కాదనీ, దీనికి వ్యతిరేకమే నిజమనీ వారికి అర్థమై ఉండాలి. దేవుడు వెల్లడి చేసిన సత్యాన్నే పౌలు ఎప్పుడూ ఉపదేశించాడు. ఎవరికైనా నొప్పి కలుగు తుందేమోనని దేన్నీ దాచిపెట్టలేదు (అపొ కా 20:20, 26, 27). అతని ఉపదేశానికి సంబంధించినంత వరకు క్రీస్తును తప్ప వేరెవరినీ సంతోషపెట్టేందుకు అతడు ప్రయత్నించలేదు. మనుషులకు నచ్చినా నచ్చకపోయినా క్రీస్తు సందేశాన్ని పూర్తిగా ఉపదేశించడానికి సిద్ధపడకపోతే ఎవరూ ఆయనకు నిజ సేవకులు కాలేరని అతనికి తెలుసు. కాబట్టి అతడు దేవుని కొరకు సత్యాన్ని బోధించడానికి వెనుకాడలేదు. కానీ ఇతర విషయాల్లో మాత్రం మనుషులను క్రీస్తుకోసం సంపాదించేందుకూ, వారు క్రీస్తులో ఎదిగేలా సహాయం చేసేందుకూ అతడు మనుషులను సంతోషపెట్టడానికి సిద్ధమే. రోమ్ 15:1-3; 1 కొరింతు 9:19-23; 10:33. ఈ రెండు విషయాల్లోనూ మనం పౌలును అనుసరించాలి.
(పొగడ్త వేరు – ప్రశంస వేరు. కాకి నోట్లోని జున్నుగడ్డ నక్క నోట్లో ఎలా పడింది? నక్క పొగడ్త వల్లనే! పొగడ్తల కోసం ఆశించవద్దు)
III. భయం, పిరికితనం నీలో వున్నాయా?
(దేవుని కొరకు ఇతరుల ముందు సాక్షిగా నిలబడలేక పోతున్నారా? ఎవరో ఏదో అనుకుంటారు – ఏమో చేస్తారు అని భయపడ్తున్నారా? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం గల ఆత్మ నీయలేదు.
(రెండవ తిమోతికి) 1:7
7.దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు.
1:7 “పిరికితనం”– దీన్ని బట్టి చూస్తే తిమోతి తనకున్న ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని ఉపయోగించే ధైర్యం చాలక దాన్ని అణగారిపోవాలన్న దుష్ట ప్రేరేపణకు గురి అయ్యాడని కనిపిస్తున్నది. దేవుడిచ్చిన ఉచిత కృపవరాలనూ సామర్థ్యాలనూ ఉపయోగించడానికి ధైర్యం కావాలి (అపొ కా 4:29; ఎఫెసు 6:19). క్రీస్తు సేవకు అత్యవసరమైన ఇంకో మూడు విషయాల గురించి పౌలు చెప్తున్నాడు. వీటిని మనకు ఇచ్చేది దేవుని ఆత్మ. దేవుడు తన సేవకోసం మనలను పిలిచినప్పుడు తన సేవకు మనలను సమర్థులను కూడా చేస్తాడు (2 కొరింతు 3:5-6).
4.) అసూయ నీలో వున్నదా?
(అసూయ మనిషిలోని కనిపించని కేన్సర్ లాంటిది. ఇతరులు వర్థిల్లినప్పుడు నీవెలా ఫీల్ అవుతున్నావు? ప్రతి దానికి ఇతరులతో పోల్చుకొని బాధపడ్తున్నావా? మత్సరం ఎముకలకు కుళ్లు అంటుంది వాక్యం.
(సామెతలు) 14:30
30.సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
5.) తొందరపాటుతనం నీలో వున్నదా?
(ఆరాటం, ఆతృత, తొందర నిన్ను గందరగోళానికి గురి చేస్తాయి. నిజమైన విశ్వాసి కలవరపడడు. తొందరపడి నోరు తెరువడు. త్వరగా కోప్పడడు
(మొదటి రాజులు) 21:4
4.నా పిత్రార్జితమును నీ కియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.
(మార్కు సువార్త) 10:22
22.అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను.
(లూకా సువార్త) 10:41,42
41.అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే(అనేక ప్రాచీన ప్రతులలో-అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరము)
42.మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
6.) స్వంత చిత్తం నీలో ఉన్నదా?
(సమ్సోను పతనానికి మొదటి మెట్టు – చివరి మెట్టు ఏమిటో మీకు తెలుసా? – “నా యిష్టం!” నీ ముందున్న మార్గము నీకు మంచిగానే తోచవచ్చు. కాని దాని క్లైమాక్స్ ఎలా ఉంటుందో నీవెరుగుదువా?
(సామెతలు) 14:12
12.ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
పరిశోధన లేని భక్తి పాచిపట్టి పోతోంది. నీ విశ్వాస ఎదుగుదలకు దేవుడు పెట్టే పరీక్షలూ నీ ఆత్మీయ పరిణతికి ఒకవైపు ఐతే – నేనెలా వున్నాను? నా భక్తి జీవితం నిజంగా వాక్యానుసారమేనా? అని నీకు నీవే పరీక్షించుకోవటం నీ పరిణతికి మరోవైపు!!
All Pdf……Download