Sevakula Prasangaalu Telugu – ఏ చూపు నీది

Written by biblesamacharam.com

Published on:

ఏ చూపు నీది

 

మూలవాక్యము : సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి  విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన “యేసు వైపు చూచుచూ”

 (హెబ్రీయులకు) 12:2

2.మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు(మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

1.) ఇశ్రాయేలీయుల చూపు.

 (సంఖ్యాకాండము) 21:9

9.కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

21:9 A 2 రాజులు 18:4; యోహాను 3:14-15; B యోహాను 6:40; హీబ్రూ 12:2; C యెషయా 45:22; జెకర్యా 12:10; యోహాను 1:29; 12:32; రోమ్ 1:17; 5:20-21; 8:3; 2 కొరింతు 5:21; 1 యోహాను 3:8

2.) జక్కయ్య చూపు.

 (లూకా సువార్త) 19:5

5.యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా

19:5 జక్కయ్య ఎక్కడున్నాడో ప్రభువుకు తెలుసు. అతణ్ణి ఇంతకు ముందెన్నడూ కలుసుకోనప్పటికీ అతణ్ణి గురించి అంతా తెలుసు (యోహాను 1:48-50; 2:24-25 మొ।। చూడండి). జక్కయ్య పాపంలో దారితప్పాడనీ, సత్యానికీ సుముఖంగానే ఉన్నాడనీ తెలుసు. తన పరిచర్య ఉద్ధేశమేమిటో కూడా యేసుప్రభువుకు తెలుసు (వ 10). జక్కయ్య ఇంటికి వెళ్ళాలని యేసులో ప్రేరణ కలిగింది. అది దైవప్రేమ మూలమైన ప్రేరణ. యోహాను 4:4 చూడండి. 2 కొరింతు 5:14 పోల్చి చూడండి.

3.) సిలువపై దొంగ చూపు.

 (లూకా సువార్త) 23:41,42,43

41.మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి

42.ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యములోనికి(కొన్ని ప్రాచీన ప్రతులలో-నీ రాజ్యముతో అని పాఠాంతరము) వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.

23:42 ఈ నేరస్థుడి హృదయంలో యేసుప్రభువుపై నమ్మకం ఉదయించింది. ఇది అసాధారణమైన నమ్మకం. ఇక్కడ నేరస్థుడుగా సిలువ శిక్ష అనుభవిస్తున్న ఈ వ్యక్తి ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడని, దేవుడాయనకు ఒక రాజ్యం ఇచ్చాడని అతడు గ్రహించాడు. క్రీస్తు మరణం ఆయన అంతం కాదనీ తన రాజ్యాధికారానికి ఆయన వస్తాడనీ అతనికి తెలిసింది. తాను దోషి, నేరస్థుడూ అయినప్పటికీ యేసు తనపై కరుణ చూపగలడనీ, చూపుతాడనీ అతడు నమ్మాడు.

43.అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.

23:43 “పరమానంద నివాసం”– 16:22 నోట్ చూడండి. దీన్ని పరదైసు అని కొందరు అంటారు. ఈ నేరస్థుడి విషయాన్ని గమనిస్తే ఒక వ్యక్తి పాపవిముక్తి పాందడానికి అతడు చేయవలసినదంతా మనకు అర్థం అవుతుంది. బాప్తిసం గాని, సంఘ సంబంధమైన సంస్కారాలు, ఆచారాలు గాని, ఏ విధమైన సత్కార్యాలు గాని ఏమీ లేకుండానే అతడు పాపవిముక్తి పొందాడు. వెనువెంటనే పాపవిముక్తి పొంది తాను చనిపోయిన రోజునే పరమానంద నివాసం చేరుకున్నాడు. గానీ ఏదో ఆత్మలను శుద్ధి చేసే లోకం (పర్గటోరి) కాదు. విమోచన కోసం అతడు ఎదురు చూడనవసరం లేదు. అతడు మరి కొంత కాలం జీవించి ఉంటే గనుక తప్పకుండా బాప్తిసం పొందేవాడే, మంచి పనులు చేసేవాడే అనుకోవచ్చు. అయితే అవేమీ లేకుండా ఇతడు పాపవిముక్తి పొందడం చూస్తుంటే పాపవిముక్తికి ఇవి అవసరం కాదని అర్థమౌతున్నది. అదంతా పశ్చాత్తాపం, నమ్మకాల మూలంగా కేవలం దేవుని కృపవల్లే జరిగింది. ఎఫెసు 2:8-9; తీతు 3:3-7. కేవలం క్రీస్తు తానే స్వయంగా మానవులకు దేవుని కృప లభించే మార్గం.

4.) యేసు వైపు చూచిన పేతురు.

 (మత్తయి సువార్త) 14:29

29.ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెనుగాని

14:29 ఇలా నీటిపై నడవగలగడం పేతురు శక్తివల్ల కాదు. మనుషులు తమంతట తాము చెయ్యలేని అనేక పనులను యేసు వారిచేత చేయించగలడు. 2 కొరింతు 3:5 పోల్చి చూడండి.

5.) లోతు భార్య చూపు.

 (ఆదికాండము) 19:26

26.అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.

6.) విషపు చూపు.

 (మొదటి సమూయేలు) 18:9

9.కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను.

7.) మోహపు చూపు.

 (మత్తయి సువార్త) 5:28

28.నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

8.) ఓర చూపు.

 (కీర్తనల గ్రంథము) 68:16

16.శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.

9.) అహంకార చూపు.

 (సామెతలు) 6:17

17.అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

10.) జాలిగల చూపు.

 (లూకా సువార్త) 22:61

61.అందుకు పేతురుఓయీ, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.

నీ చూపు ఎట్లున్నది?


All Pdf…………Download

Leave a comment