Sevakula Prasangaalu Bible Telugu – సాష్టాంగపడండి 1

Written by biblesamacharam.com

Published on:

సాష్టాంగపడండి.

Sevakula Prasangaalu Bible Telugu

1.) యోబు-సాష్టాంగపడి నమస్కారము చేసెను.

 (యోబు గ్రంథము) 1:20

20.అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

1:20 ఈ వాక్యం, తరువాతి వాక్యంలో బైబిల్లోని ఉత్తమోత్తమమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబు పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబు విశ్వాసం అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సైతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదీ నిజమైనదీ అన్న విషయం నిరూపించబడింది. సైతాను ఊహించినట్టు దేవుణ్ణి దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం షెబావారిని గానీ కల్దీయవారిని గానీ సుడిగాలిని అగ్నిని గానీ చివరికి సైతానునూ కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశానో, మనుషుల దౌర్జన్యం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగాయని అతడు భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అన్నాడు. అంతటిలో దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు.

2.) దానియేలు-దేవుని యెదుట సాష్టాంగపడెను.

 (దానియేలు) 10:9

9.నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.

3.) బిలాము-దేవుని దూతను చూచి సాష్టాంగపడెను.

 (సంఖ్యాకాండము) 22:31

31.అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా 

4.) మోషే-దేవుని యెదుట సాగిలపడెను.

 (ద్వితీయోపదేశకాండము) 9:25

25.కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలు వది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవామిమ్మును నశింపజేసెదననగా

5.) జ్ఞానులు-యేసయ్య ఎదుట సాగిలపడి పూజించిరి.

 (మత్తయి సువార్త) 2:11

11.తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.

2:11 “ఇంట్లోకి”– యేసుప్రభువు తాను జన్మించిన పశువుల శాలలో ఇప్పుడు లేడు (లూకా 2:7). ఆయన జన్మించి చాలా నెలలు గడిచిపోయి ఉంటాయి.

“ఆరాధించారు”– దేవుడు క్రీస్తును ఆరాధించేందుకు ఈ మనుషుల్ని తీసుకురావడం మనకో సత్యాన్ని తెలియజేస్తున్నది. అదేమిటంటే క్రీస్తు దేవుడు. ఏకైక దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు (4:10 చూడండి). క్రీస్తు దేవుడని చూపించే ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి.

6.) యేసయ్య-గెత్సెమనే తోటలో సాగిలపడి ప్రార్థించెను.

 (మత్తయి సువార్త) 26:39

39.కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. 

26:39 ఇలా సాగిలపడడం గొప్ప మనోవేదనకూ, గండం గురించిన అనుభూతి, కంగారుకూ, సహాయం కోరి మనసుపెట్టే పొలి కేకకూ గుర్తు. హీబ్రూ 5:7 పోల్చి చూడండి. ఆయన ముందున్న భయానకమైన క్రూర అనుభవాలకు సూచన ఈ గిన్నె. మానవ పాపానికి వ్యతిరేకంగా చెలరేగే దేవుని ఆగ్రహమనే గిన్నెలోది ఆయన తాగబోతున్నాడు. దేవుడాయన్ను పాపంగా చేయబోతున్నాడు (వ 38; 2 కొరింతు 5:21). ఆయన వచ్చినది ఇందుకే (యోహాను 12:27; 18:11). అయితే ఇప్పుడు ఆ క్షణం దగ్గరైంది కాబట్టి అది ఇంత వికృతంగా బీకరంగా అనిపించి ఆయన పవిత్ర స్వభావం కంపరంతో దానినుంచి వైదొలగాలని చూస్తున్నది. మనుషులపట్ల దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు ఒకవేళ వేరొక మార్గమేదైనా చూడగలిగితే, తాను ఆ గిన్నెలోది తాగవలసిన అవసరం లేకపోతే అలా చెయ్యమని ప్రార్థించాడు. అయితే అలాంటిది సాధ్యం కాదు కాబట్టి తన ఆత్మ అంత వేదనలో ఉండి కూడా (లూకా 22:44) యేసు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. మనుషులంతా నేర్చుకోవలసిన ప్రార్థన యేసు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని మార్గమే, సంకల్పమే ఎప్పుడూ అతి శ్రేష్ఠమైనది. దాన్ని అంగీకరించడంవల్ల కొద్ది కాలం బాధ, నష్టం వాటిల్లినప్పటికీ, ఎక్కువ విధేయతతో అంగీకరించినవారే ఎక్కువ ధన్యులు.

26:39 A మత్తయి 20:22; 26:42; మార్కు 14:35-36; లూకా 22:41-42; యోహాను 5:30; 6:38; 11:41; 12:27-28; 14:31; 18:11; ఫిలిప్పీ 2:8; హీబ్రూ 5:7; B ఆది 17:3; సంఖ్యా 14:5; 16:22; 2 సమూ 15:26; యెహె 1:28; C 1 దిన 21:16; మత్తయి 24:24; మార్కు 13:22; అపొ కా 10:25; రోమ్ 15:1-3; ప్రకటన 19:10; D లూకా 17:16

7.) కుష్ఠురోగి-యేసును చూచి-సాగిలపడెను.

 (లూకా సువార్త) 5:12

12.ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడిప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.

5:12 A లూకా 17:12-13, 16; B కీర్తన 50:15; 91:15; మత్తయి 8:2-4, 8-9; 9:28; మార్కు 1:40-45; 9:22-24; హీబ్రూ 7:25; C ఆది 18:14; మత్తయి 26:6; D నిర్గమ 4:6; లేవీ 9:24; సంఖ్యా 12:10-12; ద్వితీ 24:8; యెహో 5:14; 1 రాజులు 18:39; 2 రాజులు 5:1; 1 దిన 21:16; E లేవీ 13:1-14; 2 రాజులు 7:3; 2 దిన 26:19-20; మార్కు 5:23

8.) యోహాను – చచ్చినవానివలె ఆయన పాదాలయొద్ద పడితిని.

 (ప్రకటన గ్రంథము) 1:17

17.నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను-భయపడకుము;

1:17 “ఆయన పాదాల దగ్గర”– మనమంతా ఉండవలసినది అక్కడే. యోహాను ఆయనను చూచిన విధంగా మనం చూస్తే అక్కడే ఉంటాం. యెహె 1:28 పోల్చి చూడండి.

9.) 24పెద్దలు–సింహాసనము యెదుట సాగిలపడిరి.

 (ప్రకటన గ్రంథము) 4:10

10.ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు

 (ప్రకటన గ్రంథము) 5:8

8.ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

5:8 “గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు”– వారాయనను ఆరాధించారన్నమాట. పరలోకంలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో యేసును ఆరాధించడం జరుగుతున్నది (హీబ్రూ 1:6 పోల్చి చూడండి). యేసు దేవుని అవతారం కాకపోతే, దేవత్వంలో పాల్గొనకపోతే ఇలా జరగడం అసాధ్యం. తనను మాత్రమే గాని మరి దేన్నీ, మరెవరినీ ఆరాధించకూడదని బైబిలు అంతట్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నిర్గమ 20:3-5; ద్వితీ 6:13; మత్తయి 4:10 చూడండి. ఈ లోకంలో ఉన్న చాలా మందికి ఇంకా తెలియని విషయం పరలోకంలో ఉన్నవారందరికీ తెలుసు – యోహాను 5:23లోని విషయం. క్రీస్తు దేవత్వాన్ని గురించిన ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి.

Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu


ప్రసంగ శాస్త్రం మేటీరియల్ కొరకు……..Click Here

Leave a comment