అంశం: మొదటిగా
Pastors Telugu Messages Pdf
మూలవాక్యము : ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనముప్రేమించుచున్నాము.
(మొదటి యోహాను) 4:19
19.ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
4:19 వ 10. నిజమైన ప్రేమ ఏమిటో దేవుడు మనకు చూపించాడు. తన ప్రేమ ద్వారా మనల్ని తన పిల్లలుగా చేసుకుని దాన్ని మనలో ఉంచాడు. రోమ్ 5:5 పోల్చి చూడండి.
4:19 లూకా 7:47; యోహాను 3:16; 15:16; 2 కొరింతు 5:14-15; గలతీ 5:22; ఎఫెసు 2:3-5; తీతు 3:3-5; 1 యోహాను 4:10
1.) మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుట.
(మత్తయి సువార్త) 6:33
33.కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
6:33 క్రీస్తు శిష్యులు ధనాన్ని, శరీర అవసరాలను, ఈ భూమిపై ఉన్న దేనినీ గాక దేవుణ్ణే తమ యజమానిగా ఎన్నుకున్నవారు. వారు ఆయన పైనా, ఆయన మహిమ పైనా తమ దృష్టి నిలుపుకోవాలి (వ 22-24). వారు సరైనవాటికే ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని రాజ్యం, ఆయన నీతిన్యాయాల గురించే వారు ముఖ్యంగా పాటుపడుతూ ఉండాలి. తమ అవసరాల కంటే పైవాటిని గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దేవుని రాజ్యం కోసం వెతకడం అంటే క్రీస్తు శిష్యులు అందులో ప్రవేశించాలని చూడడం కాదు. ఎందుకంటే వారు ఇప్పటికే అందులో ప్రవేశించారు. దేవుని రాజ్యానికి మేలు, మహిమ కలిగేలా చూడడం, దాని ప్రభావాన్నీ, తమలోను, ఇతరుల్లోను దేవుని పరిపాలననూ మరింతగా కోరి వెతకడం అని దీని అర్థం. రోమ్ 2:7 పోల్చి చూడండి. దేవుని నీతిన్యాయాల కోసం వెతకడం అంటే ఏమిటి? నిర్దోషులుగా తీర్చబడేందుకు ఆశించడం కాదు, ఎందుకంటే విశ్వాసులు ఇంతకు ముందే నిర్దోషులుగా తీర్చబడ్డారు (రోమ్ 5:1). దీని అర్థం దేవుడు న్యాయవంతుడై ఉన్నట్టుగానే వ్యక్తిగత జీవితంలో న్యాయంగా ప్రవర్తించడానికి చూడడం. ఆయన మాత్రమే మనలో కలిగించగలిగే సరైన జీవిత విధానం కలిగి ఉండాలని చూడడం (5:6 నోట్ చూడండి). అన్నిటిలోనూ దేవునికే ప్రథమ స్థానం ఇచ్చినవారు, దేవుడే తమ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడనీ తమ అవసరాలన్నీ తీరుస్తున్నాడనీ తెలుసుకుంటారు (ఫిలిప్పీ 4:19).
2.) మొదట నీ కంటిలోనున్న దూలమును తీసికొనుము.
(మత్తయి సువార్త) 7:5
5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
7:5 A కీర్తన 51:9-13; మత్తయి 23:13-28; లూకా 6:42; B లూకా 13:15; C మత్తయి 22:18; లూకా 4:23; D లూకా 12:56; అపొ కా 19:15
3.మొదట సమాధానపడాలి.
(మత్తయి సువార్త) 5:25
25.నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
5:25-26 దేవుని ప్రజలు ఇతరులతో సమాధానంగా జీవించవలసిన మరో విధానం ఇది. డబ్బు, ఆస్తి విషయాల్లో విరోధానికీ, పోట్లాటలకూ వారి జీవితంలో తావుండకూడదు (వ 44,45). దేవుని ప్రజలు తమపై కోర్టు కేసు వేయదలుచుకున్న వారితో ఒప్పందానికి రావాలని యేసు ఆదేశిస్తున్నాడు. దానికి వారు లోబడకపోతే అనేక ఇక్కట్లకు వారు గురయ్యేలా దేవుడు చేస్తాడు. 1 కొరింతు 6:1-8 పోల్చి చూడండి.
5:25 A 1 రాజులు 22:26-27; యోబు 22:21; సామెత 6:1-5; 25:8; యెషయా 55:6-7; లూకా 12:58-59; 13:24-25; 14:31-32; హీబ్రూ 3:7, 13; 12:17; B ఆది 32:3-8; 33:3-11; కీర్తన 32:6; 2 కొరింతు 6:2; C ఆది 32:13-22; 1 సమూ 25:17-3
4.) మొదట ఆయన మనలను ప్రేమించెను.
(మొదటి యోహాను) 4:19
19.ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
4:19 వ 10. నిజమైన ప్రేమ ఏమిటో దేవుడు మనకు చూపించాడు. తన ప్రేమ ద్వారా మనల్ని తన పిల్లలుగా చేసుకుని దాన్ని మనలో ఉంచాడు. రోమ్ 5:5 పోల్చి చూడండి.
5.) మొదటి క్రియలు.
(ప్రకటన గ్రంథము) 2:5
5.నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
“పశ్చాత్తాపపడి”– వ 16,22; 3:3, 19. యేసు ఈ మాట చెప్పడంతో ఈ లోకంలో తన సేవను ఆరంభించాడు (మత్తయి 4:17). తన ప్రజలకు తాను ఇప్పుడు చేస్తున్న సేవలో ఆ మాట చెపుతూ సాగుతున్నాడు. కోల్పోయిన మొదటి ప్రేమ మళ్ళీ కలగడం సాధ్యమేనని ఈ మాట మనకు ప్రోత్సాహకరంగా ఉండాలి. పశ్చాత్తాపపడాలన్న క్రీస్తు ఆజ్ఞకు లోబడని ఒక సంఘానికి గానీ ఒక వ్యక్తికి గానీ దేవుని తీర్పు తప్పదు. ప్రేమ నీరసించిపోవడం మొదలైతే సంఘంలో దేవుని విలువైనవన్నీ దానితో పాటు పోవడం మొదలవుతాయని మనం గ్రహించాలి.
6.) మొదటి ప్రేమ.
(ప్రకటన గ్రంథము) 2:4
4.అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.
2:4 “అభ్యంతరం”– కొన్ని విధాలుగా ఈ సంఘం ఆదర్శ సంఘం. చాలా సేవ చేసేది. సహనం చూపేది. చెడ్డవాళ్ళ గురించి, చెడ్డ సిద్ధాంతాల గురించి జాగ్రత్త వహించేది. అయినా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంలో వారు తప్పిపోయారు – ప్రేమ. 1 కొరింతు 13:1-3, 13; మత్తయి 22:37-40 చూడండి. వారికి ప్రేమ బొత్తిగా లేదని ప్రభువు చెప్పలేదు. వారు సంఘంగా ఏర్పడినప్పుడు వారికి ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు వారికున్న ప్రేమ తక్కువగా ఉన్నదని చెపుతున్నాడు. ఎఫెసు 3:16-19లో పౌలు వారికి రాసిన విషయానికి వారు దూరమయ్యారని కనిపిస్తున్నది.
7.) మొదట స్థిరమనస్సు.
(రెండవ కొరింథీయులకు) 8:12
12.మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
8:12 A మార్కు 12:42-44; లూకా 21:1-4; 2 కొరింతు 9:7; B నిర్గమ 25:2; 35:5, 21-22, 29; C లూకా 12:47-48; 16:10; 1 పేతురు 4:10; D 1 దిన 29:3-18; 2 దిన 6:8; సామెత 19:22; మార్కు 14:7-8; లూకా 7:44-46
8.) మొదట నీవు నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను.
(మార్కు సువార్త) 12:30
30.నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
(మత్తయి సువార్త) 22:38
38.ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf Pastors Telugu Messages Pdf
బైబిల్ ప్రశ్నలు – జవాబులు .. click here