Pastors messages Pdf Telugu – మిర్యాము యొక్కస్థితి 1

Written by biblesamacharam.com

Published on:

మిర్యాము యొక్కస్థితి 

Pastors messages Pdf Telugu

మూలవాక్యము : మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా “మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి”.

 (ద్వితీయోపదేశకాండము) 24:9

9.మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి.

24:9 సంఖ్యా 12:10. ఇక్కడ రాసివున్న వ్యాధి కొన్ని సార్లు దేవుడు విధించే శిక్షగా వస్తుంది (2 రాజులు 5:25-27).

24:9 A సంఖ్యా 12:10-15; B 1 కొరింతు 10:11; C 1 కొరింతు 10:6; D సంఖ్యా 5:2; 2 రాజులు 7:3; 2 దిన 26:20-21; లూకా 17:32

1.) మిర్యాము మోషే సహోదరీ.

(సంఖ్యాకాండము) 26:59

59.కహాతు అమ్రా మును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.

2.) మోషే మీద విరోధంగా మాట్లాడిన మిర్యాము.

(సంఖ్యాకాండము) 12:1

1.మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.

12:1 మోషే మొదటి భార్య మిద్యాను జాతికి చెందిన సిప్పోరా (నిర్గమ 2:15-16, 21; 2:1). ఈ వచనాన్ని బట్టి ఆమె మరణించిందనీ మోషే మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడనీ కనిపిస్తున్నది. ఈ సారి ఇతియోపియా ప్రాంతానికి చెందిన స్త్రీని చేసుకున్నాడు. మోషేను నిరసిస్తూ మాట్లాడడానికి ఇదే అదనుగా భావించారు అతని అన్న, అక్క. అయితే 2వ వచనం ప్రకారం వారికి మోషేకు లొంగి ఉండడం ఇష్టం లేనట్టూ, అతని నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నట్టూ స్పష్టమౌతున్నది. దేవుడు వారికిచ్చిన పదవులతో వారు తృప్తిపడి ఊరుకోలేదు. ఇది భయంకరమైన పాపం (సంఖ్యా 16:9-11 నోట్‌). తన సంఘంలో దేవుడు మనకు ఏ స్థానం ఇచ్చాడో దాన్ని అంగీకరించడం మనం నేర్చుకోవాలి. దెబ్బలాటలూ, పదవులకోసం, పేరుప్రతిష్ఠలకోసం ప్రాకులాటలూ ఇది క్రీస్తు నేర్పిన మార్గం కాదు (కీర్తన 75:6-7; మత్తయి 20:25-28; 23:11-12; లూకా 17:10). మనం ప్రాకులాడవలసినది ఉన్నత పదవులకోసం కాదు గాని దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలోనే నమ్మకంగా ఆసక్తితో పని చెయ్యడం కోసమే. 16:1-2 నోట్.

3.) తన్ను తాను హెచ్చించుకొన్నది.

(సంఖ్యాకాండము) 12:2

2.వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా.

12:2 A సంఖ్యా 11:1; 16:3; 2 రాజులు 19:4; యెషయా 37:4; యెహె 35:12-13; B సంఖ్యా 11:29; 2 సమూ 11:27; మీకా 6:4; రోమ్ 12:3, 10; ఫిలిప్పీ 2:3, 14; 1 పేతురు 5:5; C ఆది 29:33; నిర్గమ 4:30; 5:1; 7:10; 15:20-21; కీర్తన 94:7-9; సామెత 13:10

(లూకా సువార్త) 14:11

11.తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

14:11 పై సంగతిలోని ఆధ్యాత్మిక పాఠాన్ని యేసుప్రభువు చెప్తున్నాడు. మనుషులను దిగజార్చేదీ, హెచ్చించేదీ దేవుడే. వారి గుణశీలాలు, మనస్తత్వం ఆధారంగా చేసుకుని ఆయన అలా చేస్తాడు – 11:43; 18:14; 20:46; సామెత 3:34; 25:6-7; మత్తయి 18:4; 23:12; యాకోబు 4:10; 1 పేతురు

4.) గర్వపు మాటలు పలికిన మిర్యాము.

(సంఖ్యాకాండము) 12:2

2.వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా

5.) శాపము పొందిన మిర్యాము.

(సంఖ్యాకాండము) 12:10

10.మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.

12:10 ద్వితీ 24:9; లేవీ 13:1-2, 47; 14:34 నోట్ అహరోనుకు శిక్ష వచ్చినట్టు కనిపించడం లేదు. బహుశా దీనికంతటికి మూలకారణం మిర్యాం అయివుండవచ్చు. ఒకవేళ అహరోనుకు వచ్చిన శిక్ష తన సోదరిని అలాంటి స్థితిలో చూడవలసి రావడం, అందుకు తాను కూడా కొంతవరకు బాధ్యుడినన్న ఆవేదన కావచ్చు.

6.) ఉమ్మివేయబడిన స్థితిలో ఉన్న మిర్యాము.

(సంఖ్యాకాండము) 12:14

14.అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.

12:14 పాపక్షమాపణ దొరికినా, ఆ పాప ఫలితాలను కొంతవరకు భరించవలసి రావడం న్యాయమే. 14:22-23 నోట్.

7.) పాళెము వెలుపల విడవడిన మిర్యాము.

(సంఖ్యాకాండము) 12:15

15.కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.

8.) మిర్యాము మరణం.

(సంఖ్యాకాండము) 20:1

1.మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమా జము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.

20:1 A నిర్గమ 15:20; సంఖ్యా 13:21; 33:36; B సంఖ్యా 12:1; 26:59; 27:14; C నిర్గమ 2:4, 7; సంఖ్యా 12:10, 15; 20:16; ద్వితీ 1:22-23; 2:14; 32:51; కీర్తన 29:8; మీకా 6:4

Pastors messages Pdf Telugu Pastors messages Pdf Telugu Pastors messages Pdf Telugu Pastors messages Pdf Telugu 


మిషనరీ జీవిత చరిత్రలు కొరకు ….click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted