Pastor Telugu Messages-సఫలపరచే దేవుడు-Christian Telugu Messages 1

Written by biblesamacharam.com

Published on:

సఫలపరచే దేవుడు. 

Pastor Telugu Messages

   సఫలత అనేది హృదయమును తృప్తి పరుస్తుంది. కోరిక సఫలమైతే ప్రాణం తెప్పరిల్లుతుంది. సఫలపరచే దేవుడు మనతో నుండగా దుఃఖం, కన్నీరు కమనీయమైన విందులు అవుతాయి. దేవుడు ఏమేమి సఫలపరుచునో చూద్దాం… 

1.) నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు – కీర్తన 20:4

(తన చిత్తంలో నున్నవారి యొక్క ఆలోచనలు ఆయన సఫలం చేయును. దేవుని ఆలోచన మన ఆలోచనైతే ఎంత బావుణ్ణు) 

 (కీర్తనల గ్రంథము) 20:4

4.నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.

20:4 A కీర్తన 21:2; 37:4; 145:19; సామెత 11:23; మత్తయి 21:22; యోహాను 16:23; రోమ్ 8:27-28; 1 యోహాను 5:14-15; B యోహాను 11:42

2.) నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు – కీర్తన 20:5

(పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోయేవారు సఫలపరచబడే ప్రార్థనలు చేయటానికి ఆత్మచే ప్రేరణ నొందుతారు – నీ ప్రార్థనలు ఎలా వున్నాయి?) 

 (కీర్తనల గ్రంథము) 20:5

5.యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

20:5 A నిర్గమ 17:15; 1 సమూ 1:17; కీర్తన 60:4; B కీర్తన 9:14; యెషయా 25:9; 61:10; మీకా 4:5; లూకా 1:47; C కీర్తన 13:5; 35:9; 118:15; యెషయా 12:1-3; హబక్కూకు 3:18; D కీర్తన 19:4

3. నీ ప్రయత్నములను సఫలపరుస్తాడు – నెహెమ్యా 2:20 

(దేవుని పేరిట మనం ఒక మంచి కార్యమును చేయుటకై పూనుకొనినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా మన ప్రయత్నాలు సఫలం చేస్తాడు. ఆయన మహిమ కొరకు నీవేమి చేస్తావో ఇప్పుడే నిర్ణయించుకో) Pastor Telugu Messages

 (నెహెమ్యా) 2:20

20.అందుకు నేనుఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.

2:20 A ఎజ్రా 4:3; నెహెమ్యా 2:4; అపొ కా 8:21; B కీర్తన 20:5; 35:27; ప్రసంగి 7:18; యెషయా 56:5; జెకర్యా 6:14; అపొ కా 10:31; C కీర్తన 51:18; D నిర్గమ 28:29; సంఖ్యా 10:10; 2 దిన 26:5; ఎస్తేరు 4:11; కీర్తన 122:6; అపొ కా 10:4; E లేవీ 2:2; కీర్తన 102:13-14

4. నీ ఉద్దేశ్యములు సఫలపరుస్తాడు – సామెతలు 16:3

(మన ఉద్దేశ్యములు సఫలం కావాలంటే మన భారములన్నిటిని ఆయనపై వేయడం నేర్చుకోవాలి. ఆయనపై మన భారములను మోపవలెనంటే – ఆయన్ను విశ్వసించాలి) Pastor Telugu Messages

 (సామెతలు) 16:3

3.నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.

16:3 యోబు 5:8; 22:28; కీర్తన 37:4-5; 55:22; సామెత 3:6; యెషయా 7:5-7; మత్తయి 6:25-34; లూకా 12:22; ఫిలిప్పీ 4:6; 1 పేతురు 5:7

5.) నీ మనోభీష్టమును సఫలపరుస్తాడు – కీర్తన 21:2

(మనోభీష్టము అంటే మనో వాంఛ. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని బైబిలు చెప్తోంది. నీ మనసులోని కోరికను నీవు చెప్పకముందే దానిని ఆయన తెలుసుకొని నెరవేరుస్తాడు – ఎంతమంచి దేవుడు!) Pastor Telugu Messages

 (కీర్తనల గ్రంథము) 21:2

2.అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. (సెలా.)

21:2 A కీర్తన 20:4-5; 37:4; హీబ్రూ 7:25; B కీర్తన 2:8-9; 92:11; C యెషయా 49:6-12

6.) నీ పనులన్నింటిని సఫలపరుస్తాడు – యెషయా 26:12

(మన పనులు ఎప్పుడు సఫలమవుతాయి? ఆయన మన పక్షమున నిలబడినప్పుడు! ఆయన మన పక్షాన నిలబడాలంటే మనం ఆయనతో సమాధానం కల్గి యుండాలి. ఒక వ్యక్తి దేవునితో యే పరిస్థితిలో సమాధానం కోల్పోతాడు? అవిధేయత ఉన్నప్పుడు; దేవునికి లోబడుటయే నీ పనులు సఫలం కావటానికి రాజమార్గం!) 

 (యెషయా గ్రంథము) 26:12

12.యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.

26:12-19 వ 1లో ఉన్న ఆ రాబోయే కాలంలోఉండే యూదుల పక్షంగా మాట్లాడుతున్నాడు యెషయా.

7. నీ కార్యమును సఫలపరుస్తాడు – ఆది 24:12, 56 

(ఎలీయాజరు యొక్క ప్రయాణం దేవుడు సఫలం చేశాడు. త్రోవలో నుండగానే జవాబు రిబ్కా రూపంలో ఆయన యొద్దకు వచ్చింది. ప్రార్థనా పూర్వకంగా నుండువారికి మార్గంలో వుండగానే కార్యాలు సఫలమగుతాయి) 

నీ పనులలో, నీ ప్రయత్నములలో, నీ కార్యములలో సఫలీకృతుడవు కావాలను కుంటున్నావా? సఫలం చేసే దేవునితో సాఫీగా నడువు!! 

 (ఆదికాండము) 24:12,56

12.నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము.Pastor Telugu Messages

56.అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు.Pastor Telugu Messages


ఇక్కడ క్లిక్ చేసి ప్రసంగ శాస్త్రం నేర్చుకోండి.. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted