Parikshalu – Sevakula Prasangaalu – పరీక్షలు – పరిశుద్దులు

Written by biblesamacharam.com

Published on:

పరీక్షలు – పరిశుద్దులు

Parikshalu – Sevakula Prasangaalu

1.) ఆస్తి విషయమై పరీక్ష – అబ్రాహాము.

 (ఆదికాండము) 14:22,23

22.అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొన

14:22-24 దైవభక్తి లేని వారి దగ్గర్నుంచి ఏదైనా పుచ్చుకునేందుకు అబ్రాహాము గంబీరంగా నిరాకరించాడు. బిలాము ఇందుకు వ్యతిరేకం (2 పేతురు 2:15). నాటినుండి అనేకమంది తమకు ఆ ధనం ఎక్కడినుంచి వస్తుందో, దాన్ని సంపాదించుకునే మార్గం ఎలాంటిదో చూడకుండా ధనాన్నీ ఆస్తుల్నీ ఆశిస్తున్నారు. జాగ్రత్త!

14:22 A దాని 12:7; B నిర్గమ 6:8; ద్వితీ 32:40; కీర్తన 24:1; 83:18; ప్రకటన 10:5-6; C ఆది 14:19-20; 17:1; 21:23-31, 33; న్యాయాధి 11:35; యెషయా 57:15; దాని 4:34; హగ్గయి 2:8

23.నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతు డును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.

2.) అధికారము విషయమై పరీక్ష-మోషే.

 (హెబ్రీయులకు) 11:24,25

24.మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,

ప్రతిదానికీ ఉన్న సరైన విలువను గుర్తించేందుకు నమ్మకం తోడ్పడుతుంది. రాబోయే కాలంలో కలుగనున్న అదృశ్యమైనవి ఇప్పుడు లోకం ఇస్తున్న వాటన్నిటికంటే మరెంతో విలువ గలవన్న నిశ్చయాన్ని నమ్మకం కలిగిస్తుంది. ఫిలిప్పీ 3:7-8 పోల్చి చూడండి. నమ్మకానికీ పరిత్యాగానికీ ఉన్న సంబంధానికి మోషే ఉదాహరణ. 10:34; లూకా 14:33; 18:28-30; మత్తయి 4:18-22; 10:37-39; 16:24-28 చూడండి. నిజమైన నమ్మకం క్రీస్తుకోసం దేన్నయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అలా చేయడానికి మనసు లేనివారు తమకు నమ్మకం ఉందని చెప్పుకున్నప్పటికీ, వారి నమ్మకం వాస్తవమైనదని ఇతరులు అనుకున్నప్పటికీ వారిలో బైబిలు సంబంధమైన నిజ విశ్వాసం లేదు. అలాగైతే మోషే, పౌలువంటివారి మార్గాన్ని త్రోసిపుచ్చి, క్రీస్తు కోసం బాధలు పడేందుకు నిరాకరించి, ఈ లోక సుఖభోగాలు లేక సంపదలు, లేక అధికారాల వెంట పరుగులెత్తేవారిని ఏమనాలి? ఈ గొప్ప సత్యాన్ని వారు నేర్చుకోవసిన అవసరత ఎంతైనా ఉంది – ఈ లోకం ధనధాన్యాల కన్నా క్రీస్తు కోసమైన నింద మేలు (వ 26; 13:13; అపొ కా 5:41; 1 పేతురు 4:12-16).

11:24-26 నిర్గమ 2:11-13; అపొ కా 7:23-26. నలభై ఏళ్ళ ప్రాయంలో మోషే ఈజిప్టా, లేక దేవుడా అన్న నిర్ణయం చేసుకున్నాడు. ఈజిప్ట్‌ను ఎన్నుకుంటే లోక సంబంధమైన అధికారం, వైభవం, సుఖం ఉంటాయి. దేవుణ్ణి ఎన్నుకుంటే అదంతా విడిచిపెట్టి అక్కడి బానిసలుగా ఉంటున్న దేవుని ప్రజలతోబాటు కష్టాలు అనుభవించాలి. మోషే దేవుణ్ణి ఎన్నుకుని మిగతావాటిని వదిలేశాడు. అతనికి నమ్మకం ఉంది కాబట్టే ఇలా చేయగలిగాడు.

25.అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

3. భక్తిలో పరీక్ష- యోబు.

 (యోబు గ్రంథము) 1:22

22.ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

1:22 యోబుకు కలిగిన నష్టం కంటే అతి తక్కువ నష్టం వచ్చినా దేవుడు తమకు అన్యాయం చేశాడని బుద్ధిమాలి ఆలోచించేవారు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు?

4.) భోజనంలో పరీక్ష – దానియేలు స్నేహితులు.

 (దానియేలు) 1:8

8.రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా

1:8 ఈ ఆహారం, ద్రాక్షమద్యం అపవిత్ర పరచేవని దానియేలు ఎందువల్ల భావించాడంటే వాటిని విగ్రహాలకు ముందుగా అర్పించి తీసుకువచ్చారు. అంతేగాక బబులోనువారు ఇస్రాయేల్‌కు దేవుడిచ్చిన చట్టాల ప్రకారం ఆ మాంసాన్ని సిద్ధం చేసేవారు కాదు (లేవీ 11:4-20; ద్వితీ 12:23-24). దానియేలు కుర్రాడు, మాతృభూమికి దూరంగా ఉన్నవాడు. దేవునికి కోపం తెప్పించడమా? రాజుకు కోపం తెప్పించడమా? ఈ సమస్య అతనికి ఎదురైంది. ఏమైతేనేం రాజుకే కోపం కలిగితే కలగనియ్యి అని అచంచలమైన ధైర్యంతో నిర్ణయించుకున్నాడు. శారీరికమైన సౌకర్యాలు, భద్రత కంటే అతనికి పవిత్రతే ముఖ్యం. క్రైస్తవులు ఒక్కోసారి ఇతరులు కోపం తెచ్చుకుంటారేమోననీ, లేక తమ స్థానానికీ భద్రతకూ భంగం కలుగుతుందేమోననీ పాపం చెయ్యడానికి సిద్ధపడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వారి జీవితాలకు మార్గదర్శిగా ఉండేది దేవుని పట్ల భయభక్తులు కాదు.

1:8 A లేవీ 11:45-47; ద్వితీ 32:38; కీర్తన 119:106, 115; 141:4; యెహె 4:13-14; దాని 1:5; హోషేయ 9:3-4; అపొ కా 11:23; రోమ్ 14:15-17; 1 కొరింతు 7:37; 8:7-10; 10:18-21; 2 కొరింతు 9:7; B అపొ కా 10:14-16; 1 కొరింతు 10:28-31; C రూతు 1:17-18; 1 రాజులు 5:5; కీర్తన 106:28

5.) పాపముతో పరీక్ష – యోసేపు.

 (ఆదికాండము) 39:9,10,11,12

9.నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

10.దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.

11.అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.

12.అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

6.) ప్రభువు పనికిచ్చుటలో పరీక్ష – చిన్నపిల్లవాడు.

 (యోహాను సువార్త) 6:9

9.ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

6:9 A 2 రాజులు 4:42-44; మత్తయి 14:17; మార్కు 6:38; లూకా 9:13; B 2 రాజులు 7:1; కీర్తన 78:19; 81:16; 147:14; మత్తయి 16:9; మార్కు 8:19; 2 కొరింతు 8:9; C ద్వితీ 8:8; 32:14; 1 రాజులు 4:28; కీర్తన 78:41; యెహె 27:17; యోహాను 6:7; 11:21, 32; ప్రకటన 6:6

7.) సాక్ష్యమిచ్చుటలో పరీక్ష – పౌలు.

 (అపొస్తలుల కార్యములు) 21:13

13.పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.

21:13 A అపొ కా 20:24; ఫిలిప్పీ 1:20-21; 2:17; B అపొ కా 5:41; 20:37; రోమ్ 8:35-37; 2 కొరింతు 4:10-17; కొలస్సయి 1:24; 2 తిమోతి 2:4-6; 4:6; 2 పేతురు 1:14; ప్రకటన 3:10; 12:11; C అపొ కా 9:16; 1 కొరింతు 15:31; 2 కొరింతు 11:23-27; ఫిలిప్పీ 2:26; 2 తిమోతి 1:4; D 1 సమూ 15:14; యెషయా 3:15; యెహె 18:2; యోనా 1:6


All Pdf……..Download

2 thoughts on “Parikshalu – Sevakula Prasangaalu – పరీక్షలు – పరిశుద్దులు”

  1. 🙏 praise the lord 🙏
    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు నేను ఒక సంఘంలో విశ్వాసిగా ఉంటూ చిన్న చిన్న పనులు పరిచర్య చేసుకుంటూ నా ప్రభువు లో ఇలా జీవిస్తూ ఉన్నాను 🙏

    Reply

Leave a comment