హైందవ మూలాలు ఇరాన్ దేశానివా?
Hindu origins are from Iran
మతం, భాష, సంస్కృతి, ధర్మపరమైన విషయాల్లో దక్షిణాసియా అంతటికీఇండియాయే గురువని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇరాన్, ఇండియా దేశాల మధ్య జనాభా వలసకు సంబంధించిన అతి ప్రాచీనమైన నంబంధ బాంధవ్యాలున్నాయన్నది వలసవాద కాలంలో జరిగిన చారిత్రక పరిశోధనల్లో తేలింది. జనాభా శాస్త్రం, పర్యావరణశాస్త్ర పరిశోధనల ఆధారంగా మాక్స్ ముల్లర్ లాంటి చరిత్రకారులు ‘ఆర్యులు దురాక్రమణ సిద్ధాంతం’ అనే పేరుతో తమ పరిశోధనలను ప్రచురించగా, ఆ తర్వాత సాగిన జన్యుసంబంధమైన, ఇతర శాస్త్రవిజ్ఞాన పరమైన పరిశోధనలు కూడా సరిగ్గా అవే ఫలితాలనిచ్చాయి. అంతకాలంగా చారిత్రక, జాతిపరమైన, సంస్కృతీపరమైన ఆధిక్యత పేరుతో, ఇండియాయే తమ సొంతదేశమంటూ తమకు తామే ప్రచారం చేసుకున్న హిందుత్వవాదుల వాదనలు, సిద్దాంతాలకు ఈ పరిశోధనలు, వాటి ఫలితాలు తూట్లు పొడిచి, వాటిని కొట్టిపారేశాయి.
ఇండియా ఎంతో భిన్నత్వం, వైవిధ్యం కలిగిన దేశం. కాని ఈ శాస్త్రవిజ్ఞాన పరిశోధనల ఫలితాలు ఇండియా వైవిధ్యపు సరిహద్దుల్ని ఇరాన్ దాకా విస్తరింపజేస్తున్నాయి. మధ్య యూరోప్, మెసొపొటేమియా ప్రాంతపు వేట సంస్కృతి కలిగిన ప్రజలు, ఇరాన్ వ్యవసాయదారులు, అక్కడి మైదానాలకు చెందిన పశువుల కాపరుల్లాంటి ప్రజలతోనే ఆధునిక దక్షిణాసియా ప్రాంతం నిండి పోయిందని, ఈ వలస చాలా ప్రాచీనమైనదని రుజువు చేసే కనీసం రెండు పరిశోధనల ఫలితాలు ఇండియా వైవిధ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన ‘జన్యు చిత్రాన్ని’ గీస్తున్నాయి. ఆర్యుల వలసకు సంబంధించి జరిగిన జన్యుపరమైన, శాస్త్ర విజ్ఞానపరమైన పరిశోధనల ఫలితాలను ‘సెల్’, ‘సైన్స్’ అనే రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ పరిశోధనా పత్రికలు ప్రచురించాయి. పరిశోధనలు ఎంతో పారదర్శికంగా జరిగినా, వాటి ఫలితాలను ఎంతో ప్రతిష్టాత్మకమైన పత్రికలు ప్రచురించినా, ఇండియా శాస్త్రజ్ఞుల్లో, జర్నలిస్టుల్లోని ఒక వర్గం తమకున్న కారణాలను బట్టి మౌనముద్రను వహించడం చాలా అసౌకర్యంగా ఉండింది. నిజానికి ఈ వర్గం ఆరంభంలో కొంత నిరసన గళాన్ని వినిపించింది. కాని ఆ పరిశోధనల ఫలితాల్లోని ధ్రువీకరణ బలం, పారదర్శకతను బట్టి చివరికి వాళ్ళు మౌనం వహించక తప్పలేదు.
హైందవ సనాతన సంస్కృతిలోనే పుట్టినా, వాస్తవిక, నిశ్పాక్షిక, విశ్వసనీయ వార్తలకు పేరొందిన ‘ది హిందూ’ ఇంగ్లీష్ దినపత్రిక ఇటీవలే అంటే సెప్టెంబర్ 13, 2019న ‘ఇండియాకు ఆర్యుల వలసను ధృవీకరిస్తూ వెల్లడైన కొత్త రుజువులు’ అనే శీర్షికతో ఈ పరిశోధనలపైనే ఒక వార్తను ప్రముఖంగా ప్రచురించింది. మధ్యాసియా మైదాన ప్రాంతాలకు చెందిన ఆర్యులు అనే ప్రజలు దాదాపుగా 2000, 1500 %దీజ% మధ్యకాలంలో ఇండియాకు వచ్చి, తమతో పాటు ఇండియా ఉపఖండానికి ఇండో-యూరోపియన్ భాషల్ని తెచ్చారు’ అని ఆ వార్తకు రాసిన పరిచయ వాక్యాల్లో ది హిందూ దినపత్రిక పేర్కొంది. ది హిందూ వార్త ప్రకారం ఇరాన్ మైదాన ప్రాంతాల ప్రజల నుండి వారితోపాటు వారి ఇండో-యూరోపియన్ భాషలు 2000 BC తర్వాత ఇండియాకు వచ్చాయని శాస్త్రవిజ్ఞాన పత్రిక ‘సెల్’ ప్రచురించింది. ఆర్యులు 2000, 1500 BC మధ్య కాలంలో ఇండియాకు వలస వచ్చారన్న విషయమై ఎలాంటి వివాదమూ లేదని కూడా ‘సెల్’ పత్రిక స్పష్టం చేసిందని ది హిందూ ప్రచురించింది.
‘దక్షిణ, మధ్య ఆసియా దేశాల మధ్య జన్యు సంకరం’ అనే శీర్షికతో ఒక పరిశోధనా వ్యాసాన్ని ‘సెల్’ పత్రిక ప్రచురించిందని ఆ దినపత్రిక పేర్కొంది. మార్చి, 2018 లో ప్రచురమైన ఆ వ్యాసం ఇండియాలోనే కాదు, ప్రపంచమంతటా గొప్ప సంచలనం సృష్టించింది. పైగా ఆ పరిశోధనా పత్రికను ఎన్నో రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన 92 మంది ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కలిసి రాశారు. 2000. 1000 %దీజ% మధ్య కాలంలో ఆర్యులు పెద్ద ఎత్తున మధ్యాసియా మైదాన ప్రాంతాల నుండి ఇండియాకు వలన వచ్చారనడానికి స్పష్టమైన రుజువులున్నాయని, వారితోపాటే ఇండో-యూరోపియన్ భాషలు కూడా ఇండియాకు వచ్చాయని పరిశోధనల్లో రుజువైందని ఆ వ్యాసం పేర్కొంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండో-యూరోపియన్ భాష మాట్లాడుతూ తమను తాము ఆర్యులుగా పిలుచుకునే వారు ఇండియాకు వలస వచ్చారని పరిశోధనా వ్యాసం పేర్కొంది. అయితే ఇండియాలో హిందూత్వ వాదానికి మద్దతుదారులైన ఒక వర్గం సిద్ధాంతాన్ని తోసిపుచ్చింది. ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన శాస్త్రజ్ఞులు దాన్ని సమీక్షించడానికి ముందే హడావుడిగా ఆ పరిశోధనా పత్రాన్ని ఆన్లైన్ లో విడుదల చేశారని, అందువల్ల దాంట్లోని అంశాలకు విలువ లేదని వారు విమర్శించారు. హైందవం ఇండియాకు చెందినది, ఇండియా మూలాలు కలిగి ఉన్నదేనన్న ఎంతో ప్రాచీనమైన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి పశ్చిమ దేశాల్లో జరిగిన కుట్రలో భాగంగానే ఆ పరిశోధనా పత్రాన్ని ముందే విడుదల చేశారని వాళ్ళు ఆరోపించారు. ఆ పత్రాన్ని రాసిన 92 మంది శాస్త్రజ్ఞుల్లో ఇండియాకు చెందిన శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారన్న అంశానికి కూడా వాళ్ళసలు విలువే ఇవ్వలేదు. హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన వాగీష్ నరసింహన్, సీసీఎంబీ కో-డైరెక్టర్ అయిన కుమారస్వామి తంగరాజ్ ఇంకా మరి కొందరు ఇండియా శాస్త్రజ్ఞులు ఆ 92 మందిలో ఉన్నారు. ఇదిలా ఉ ండగా, ఆ పరిశోధనా పత్రాన్ని అనుభజ్ఞులైన శాస్త్రజ్ఞుల సమీక్షకు పంపగా, వాళ్లంతా క్షుణ్ణంగా సమీక్షించి పరిశోధనల్ని వాటి ఫలితాల్ని ధృవీకరించారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న అగ్రస్థాయి పరిశోధనా పత్రిక అయిన ‘సైన్స్’ ఈసారి దాన్ని ప్రచురించింది. ఈసారి 92 మంది శాస్త్రజ్ఞులకు మరో 25 మంది కొత్త వారు సహరచయితలుగా తోడై మొత్తం 117 మంది శాస్త్రజ్ఞులు దాన్ని ప్రచురించారు. ఈసారి దానికి ‘దక్షిణ మధ్య ఆసియా ప్రాంతాల్లో జనాభా ఆవిర్భావం’ అనే శీర్షికను పెట్టారు. మధ్యాసియా మైదాన ప్రాంతాల నుండి దక్షిణాసియాకు జనం వలసకు వచ్చినది వాస్తవమేనని ఆ పత్రిక ధృవీకరించింది. దక్షిణ ఆసియాకు అంటే ఇండియాకు చెందిన 523 మంది ప్రాచీన మానవుల జన్యు సమీకరణలను విశ్లేషిస్తే, వాటిలో ఆగ్నేయ ఆసియాకు చెందిన, ఇరాన్కు చెందిన వేటగాళ్లు జాతి తాలూకు అతి ప్రాచీనమైన జన్యువులు మిళితమై ఉన్నాయన్నది ఆ పరిశోధనా పత్రిక వెల్లడించిన సారాంశం.
మీ అందరికీ ఈ పాటికే అర్ధమైనట్టుగా, ఈ వ్యాసంలో నేను దినపత్రికల వార్తలనుండి, శాస్త్ర విజ్ఞాన పత్రికల నుండి సేకరించిన అంశాలనే ప్రస్తావించాను. హైందవం ఆర్యుల మతమని, ఆర్యలు ఇరాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన ప్రజలని అవన్నీ స్పష్టం చేస్తున్నాయి. హైందవం ఇండియా మతమేనంటూ హిందూత్వశక్తులు ఇంతకాలంగా చేస్తూ వచ్చిన వాదనలకు శాస్త్రవిజ్ఞాన ప్రాతిపదిక ఏ మాత్రం లేదు. అవన్నీ కేవలం కొన్ని స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఉద్దేశించిన ఊహాజనిత కథనాల్ని ఇపుడు రుజువైంది.
66 పుస్తకాల వివరణ .. Click Here